
ఫోక్సో తరహా చట్టాల ద్వారా మహిళల సంరక్షణ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామవారి దేవస్థానం సీనియర్ ఉప ప్రధాన అర్చకుడు చిట్టెం వీవీఎస్‌ఎస్ హరగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ శ్రీవిశ్వావసు ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు. విజయవాడలో ఆదివారం రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉగాది పురస్కారాన్ని అందజేశారు.
ఫోక్సో తరహా చట్టాల ద్వారా మహిళల సంరక్షణ
కోరుకొండ: ఫోక్సో, తదితర చట్టాల ద్వారా మహిళలకు సంరక్షణ జరుగుతోందని, దాన్ని మహిళలు వినియోగించుకోవాలని రాజమహేంద్రవరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.జగదీశ్వరి అన్నారు. స్థానిక హైస్కూల్‌లో ఆదివారం చట్టాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి బాలికలు ఎవరి ప్రలోభాలకు లొంగకూడదని, లైంగిక వేధింపులకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి
కాకినాడ సిటీ: వలంటీర్ల రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదివారం ధర్నా నిర్వహించారు. వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.10 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం గత సంవత్సరం ఇదే ఉగాది రోజున తీపి కబురు చెబుతున్నామని చెప్పి వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.5 వేలు కాదు, రూ. 10 వేలు వేతనం ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చారని ఆందోళనకారులు వివరించారు. కానీ నేడు ఆ హామీని మరిచి వలంటీర్లను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తొమ్మిది నెలల నుంచి వలంటీర్లను గాల్లో పెట్టి వారికి బకాయి వేతనం చెల్లించకుండా ఇంటికి పంపించేశారన్నారు. తక్షణమే వలంటీర్ల బకాయి వేతనాలు చెల్లించి వారిని విధుల్లోకి తీసుకుని రూ.10 వేలు వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా నా ఆడపడుచులకు రూ.5 వేలు ఏమి సరిపోతాయని, రూ.10 వేలు ఇస్తామన్నారని, ఇప్పుడు పది నెలలుగా ఆడపడుచులకు ఇచ్చిన హామీని మరచి పాలన సాగిస్తున్నారన్నారు. వలంటీర్లు యూనియన్ నాయకులు వరుణ్, రమేష్, అజయ్, మధుబాబు, లక్ష్మీ, సుభద్ర, శ్రావణి, పరమేశ్వరి, సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ పాల్గొన్నారు.