Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP Leader Perni Nani Takes On AP Govt For Liquor Sales1
‘తోలు తీస్తా, తాట తీస్తా అంటాడు.. ఊళ్లో మాత్రం ఉండడు’

తాడేపల్లి: ఏపీలోని కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు మంచి నీళ్లకు అల్లాడిపోతుంటే మరొకవైపు మద్యం మాత్రం ఏరులై పారుతోందని మాజీ మంత్రి , వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని విమర్శించారు. 10 నెలల కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నా, మద్యం మాత్రం విచ్చలవిడిగా సరఫరా అవుతుందని మండిపడ్డారు. ఈరోజు(సోమవారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి పేర్ని నాని మాట్లాడుతూ.. ‘ వైఎస్సార్ సీపీ దిగిపోయే నాటికి గోదాంల్లో ఉన్న మద్యాన్ని టీడీపీ ప్రభుత్వం అమ్మింది. గోదాంల్లో ఉన్న మద్యాన్ని ఎందుకు టెస్టులు చేయించలేదు. వైఎస్సార్ సీపీ హయాంలో మద్యంపై ఆరోపణలు చేసిన మీరు ఆ డిస్టరీలను ఎందుకు రద్దు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటైనా డిస్టలరీను రద్దు చేసిందా?’ అని ప్రశ్నించారు పేర్ని నాని. ఇంకా ఆయన ఏమన్నారంటే..వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో.. ‘లెల్ట్‌’ పెట్టుకో..‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే వైఎస్సార్ సీపీకి చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు. కేరళ, బెంగళూరు మద్యం ఏపీలో ఎందుకు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మద్యం పాలసీ రెడ్ బుక్ రూల్ ప్రకారమే నడుస్తోందా?. వేలం పాట పట్టుకో.. ఎమ్మెల్యే డబ్బు కొట్టుకో.. బెల్ట్ పెట్టుకో అన్నట్లే ఉంది ఏపీలో పాలన. సూపర్ సిక్స్ హామీల అమలు లేదు కానీ.. మద్యం మాత్రం యధేచ్ఛగా సరఫరా అవుతుంది. బెల్ట్ షాపులుంటే తోలుతీస్తానన్న సీఎం.. మద్యం ఆఖరికి బడ్డీ కొట్టుల్లో దొరుకుతున్నా మాట్లాడటం లేదు ఎందుకు?. శుక్రవారం మధ్యాహ్నం డిఫ్యాక్ట్ సీఎం(లోకేష్ ఉద్దేశిస్తూ) ఏపీలో ఉండడు’ అని విమర్శించారు. కొన్నిసార్లు అపరిచితుడు.. మరొకసారి దశావాతారాలుపవన్ కళ్యాణ్ ని చూస్తే అపరిచితుడిలా కనిపిస్తాడు.. కొన్నిసార్లు దశావతారాల్లో కనిపిస్తాడు.తోలు తీస్తా.. తాట తీస్తా అంటాడు. ఊళ్లో మాత్రం ఉండడు.. సమీక్షలు రాడు.. క్యాబినెట్ మీటింగ్ లకు రాడు. కుప్పం, మంగళగిరి, పిఠాపురం నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఈ మూడు నియోజవర్గాల్లో మద్యం విచ్చలవిడిగా దొరకుతోంది. బడ్డీ కొట్టులోని ఫ్రిజ్ లో మద్యం ఉంటుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చురాష్ట్రాన్ని పొడిచేస్తామంటారు.. ఈ ముగ్గురు.. కానీ వీళ్ల నియోజకవర్గాల్లోని మద్యం ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి’ అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.ఆ ఐదేళ్లు చంద్రబాబు, పవన్‌లు విషం వైఎస్సార్‌సీపీ హయాంలో వరుసగా ఐదేళ్లు మదం పాలసీపై చంద్రబాబు, పవన్‌ విషంకక్కారు. చంద్రబాబు,పవన్,లోకేష్ బూటకపు ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేశారు. గడచిన 10 నెలలుగా అదే మద్యాన్ని గ్రామాల్లో ఏరులైపారిస్తున్నారు, గ్రామాల్లో పచ్చచొక్కాలు మద్యాన్ని పాడికుండలా మార్చుకున్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్తీమద్యాన్ని అమ్ముతోందని విషపు ప్రచారం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం నిల్వలను ఈ ప్రభుత్వం రాగానే అమ్ముకుంది. కల్తీమద్యం అయినప్పుడు మీరెందుకు అమ్ముకున్నారు’ అని నిలదీశారు.ఇది కూడా తిరుపతి లడ్డూ కల్తీ మాదిరి తప్పుడు ప్రచారమేనాలడ్డూలో పంది కొవ్వు కలిపారని చేసిన తప్పుడు ప్రచారం లాంటిదేనా?, అధికారంలోకి రాగానే ఆస్తులు ధ్వంసం చేశారు... తగలబెట్టారు...దాడులు చేశారుమద్యం కల్తీదోకాదో ఎందుకు టెస్ట్ లు చేయించలేదని ప్రశ్నిస్తున్నా. ఒక్క డిస్టిలరీ మీదైనా చర్య తీసుకున్నారా ?, రాష్ట్రంలోని 20 డిస్టిలరీలు గతంలో చంద్రబాబు తెచ్చినవే. జగన్‌ హయాంలో ఒక్క డిస్టిలరీ కూడా తీసుకురాలేదు. కూటమి ప్రభుత్వం రాగానే డిస్ట్రిబ్యూటర్లు ఎందుకు మారారుకేరళ ,బెంగుళూరు మద్యమే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు 1500 ఇస్తామన్నారు. చంద్రబాబు మొదటి సంతకానికే దిక్కులేదు. చెప్పిన మాట అమలుకాకపోతే చొక్కాపట్టుకోమన్నాడు డిఫ్యాక్టర్ సీఎం. చొక్కాపట్టుకుందామంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచే కనిపించడుఇంకో ఆయన కాలర్ లేని చొక్కాలేసుకుని కనిపించకుండా పోతాడు. సీఎం ,సీఎం కొడుకు..డిఫ్యాక్టర్ సీఎం కనిపించకపోతే వార్తలు రాయడానికి ఈనాడు,జ్యోతికి చేతులు రావా.. ఈ రాష్ట్రానికి లోకేష్ నాయుడు అనధికార ముఖ్యమంత్రి కుప్పం,పిఠాపురం,మంగళగిరిలో మద్యం ఏరులై పారుతోందిప్రతీ బడ్డీ కొట్టులో మద్యం దొరుకుతోంది. ఏపీలో టార్గెట్లు పెట్టి మరీ మద్యం అమ్ముతున్నారు. ప్రభుత్వం నిర్ధేశించినదానికంటే 30% శాతం అధికంగా అమ్మాలనేదే ఏపీలో మద్యం పాలసీ’ అని మండిపడ్డారు.

AP Police Restrictions On YS Jagan Rapathadu Tour2
రాప్తాడుకు వైఎస్‌ జగన్‌.. పోలీసుల ఆంక్షలు!

సాక్షి, అనంతపురం: ఏపీలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అనంతపురం పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మంగళవారం రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి వెళ్లనున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన వైఎస్సార్‌సీపీ నేత కురుబ లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్‌ పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. చెన్నేకొత్తపల్లిలో హెలిప్యాడ్‌ ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కుంటిమద్ది-పాపిరెడ్డిపల్లి వద్ద హెలిప్యాడ్‌కు అనుమతి ఇచ్చారు. అలాగే, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావద్దని పోలీసులు హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు పోలీసులు ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.ఇది కూడా చదవండి: రెడ్‌బుక్‌ రాజ్యాంగం.. ఏపీకి గుడ్‌బై!

Virat Kohli Eyes Huge T20 Record Ahead Of MI VS RCB IPL 2025 Match3
IPL 2025, MI VS RCB: భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 7) మరో ఆసక్తికర మ్యాచ్‌ జరుగనుంది. ఫైవ్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ ముంబై ఇండియన్స్‌ తమ సొంత మైదానంలో (వాంఖడే స్టేడియంలో) ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఎన్నడూ లేనంత పటిష్టంగా కనిపిస్తుండగా.. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్‌ కాస్త ఢీలాగా కనిపిస్తుంది. అయితే నేటి మ్యాచ్‌లో ముంబైకి కూడా జోష్‌ రావచ్చు. ఈ మ్యాచ్‌తో వారి తరుపుముక్క జస్ప్రీత్‌ బుమ్రా బరిలోకి దిగనున్నాడు. గాయం కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న బుమ్రా ఆ​ర్సీబీ మ్యాచ్‌తోనే పునరాగమనం చేయనున్నాడు. నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ మరో శుభవార్త కూడా ఉంది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ కూడా నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. బుమ్రా, రోహిత్‌ చేరికతో ముంబై ఇండియన్స్‌లో కొత్త జోష్‌ వచ్చింది. ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి మూడింట ఓడింది. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి, కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది.ముంబైదే పైచేయిహెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీపై ముంబైదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. ముంబై 19, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.భారీ రికార్డుపై కన్నేసిన కోహ్లిముంబైతో ఇవాళ జరుగబోయే మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. నేటి మ్యాచ్‌లో విరాట్‌ మరో 17 పరుగులు చేస్తే టీ20ల్లో 13000 పరుగుల మైలురాయిని తాకుతాడు. ప్రస్తుతం విరాట్‌ ఖాతాలో 12983 పరుగులు (385 ఇన్నింగ్స్‌ల్లో 41.47 సగటున) ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. విరాట్‌ టీ20ల్లో 13000 పరుగులు పూర్తి చేస్తే ఈ ఘనత సాధించిన ఐదో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. టీ20ల్లో క్రిస్‌ గేల్‌ (455 ఇన్నింగ్స్‌ల్లో 14562 పరుగులు), అలెక్స్‌ హేల్స్‌ (490 ఇన్నింగ్స్‌ల్లో 13610), షోయబ్‌ మాలిక్‌ (514 ఇన్నింగ్స్‌ల్లో 13557), కీరన్‌ పోలార్డ్‌ (617 ఇన్నింగ్స్‌ల్లో 13537) మాత్రమే విరాట్‌ కంటే అత్యధిక పరుగులు చేశారు.ప్రస్తుత సీజన్‌లో విరాట్‌ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ (59 నాటౌట్‌) చేసిన అతను.. సీఎస్‌కేపై (31) పర్వాలేదనిపించి, గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో (7) విఫలమయ్యాడు. కేకేఆర్‌ మ్యాచ్‌లో విరాట్‌ ఆర్సీబీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. విరాట్‌ ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. విరాట్‌ ఐపీఎల్‌లో 247 ఇన్నింగ్స్‌లు ఆడి 8101 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 56 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.తుది జట్లు (అంచనా)..ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ, విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), నమన్ ధీర్, రాజ్ బవా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, విఘ్నేష్ పుత్తూర్ఆర్సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్, సుయాష్ శర్మ

Supreme Court Key Orders Pass AP Police In Mithun Reddy Case4
సుప్రీంకోర్టులో మిథున్‌ రెడ్డికి ఊరట.. పోలీసులకు నోటీసులు

సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో భాగంగా తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది.మద్యం అమ్మకాలపై సీఐడీ కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ధర్మాసనం ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేబీ. పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్ విచారణ జరిపింది. ఈ క్రమంలో మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, తదుపరి విచారణ వరకు మిథున్‌ రెడ్డిని అరెస్ట్‌ చేయవద్దని ఆదేశించింది. ఇదే సమయంలో, మద్యం అమ్మకాల విషయంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక, పిటిషన్‌పై మిథున్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.ఇదిలా ఉండగా, అంతకుముందు.. మద్యం విధానంపై దర్యాప్తు తొలిదశలోనే ఉందని ఏపీ సీఐడీ.. ఇటీవలే హైకోర్టుకు చెప్పిన విషయం తెలిసిందే. ఈ ​వ్యవహారానికి సంబంధించి ఎంపీ మిథున్‌ రెడ్డిని నిందితుడిగా తాము పేర్కొనలేదని కోర్టుకు ఏపీ సీఐడీ తెలిపింది. దీంతో, మిథున్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఇది జరిగిన మరుసటి రోజునే ఏపీ సీఐడీ బృందాలు ఢిల్లీకి చేరుకున్నాయి. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నాయి. దీంతో, మిథున్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఇక, మద్యం వ్యవహారంలో ఆది నుంచీ ఏపీ సీఐడీ పోలీసుల తీరు వివాదాస్పదంగానే ఉంది. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాజకీయ వేధింపులు, కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వ్యక్తులను బెదిరించి సీఐడీ తప్పుడు వాంగ్మూలాలు తీసుకుంది. తప్పుడు వాంగ్మూలాల్లో తమకు కావాల్సిన వారి పేర్లను చెప్పించారు సీఐడీ అధికారులు. ఈ క్రమంలో తప్పుడు వాంగ్మూలాల ఆధారంగా వారి అరెస్టుకు ముందడుగులు వేస్తున్నారు. అలాగే, తప్పుడు వాంగ్మూలాల్లో పేర్కొన్న వ్యక్తుల ఇళ్లలో సీఐడీ సోదాలు చేసింది. నిన్న హైదరాబాద్‌లో పలువురి ఇళ్లల్లో సోదాలు కొనసాగాయి. ఈ సోదాల సందర్భంగా ఇళ్లల్లో ఉన్న మహిళలను బెదిరింపులకు గురిచేసినట్టు సమాచారం. పోలీస్‌ స్టేషన్లకు రప్పిస్తామంటూ మహిళలకు వార్నింగ్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Saudi Arabia Impose Visa Ban 2025 Includes India5
Saudi Arabia: 14 దేశాలకు వీసాల జారీ నిలిపివేత.. జాబితాలో భారత్‌

రియాద్: హజ్‌ యాత్ర సమీపిస్తున్న తరుణంలో సౌదీ అరేబియా ప్రభుత్వం(Kingdom of Saudi Arabia) (KSA) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే హజ్ యాత్రకు ముందుగానే 14 దేశాల పౌరులకు వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిషేధం ఉమ్రా, బిజినెస్‌, కుటుంబ సందర్శన తదితర వీసాలపై జూన్ మధ్యకాలం వరకు అంటే హజ్ సమయం ముగిసే వరకు అమలులో ఉండనుంది. హజ్ యాత్ర(Hajj pilgrimage) సమయంలో రద్దీని నియంత్రించేందుకు, సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ చేసేందుకు వచ్చేవారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకున్నదని సౌదీ అధికారులు తెలిపారు. గత ఏడాది హజ్ సమయంలో తీవ్రమైన వేడి వాతావరణం, రిజిస్ట్రర్డ్‌ కాని యాత్రికుల కారణంగా తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే వీసా నిబంధనలను మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సౌదీ అరేబియా సవరించిన నిబంధనల ప్రకారం ఈ ఏడాది ఉమ్రా వీసా(Umrah Visa) కోసం కేటాయించిన గడువు 2025, ఏప్రిల్ 13తో ముగియనుంది. అలాగే హజ్ ముగిసే వరకు కొత్త ఉమ్రా వీసాలు జారీ చేయరు. ఈ నిషేధం కారణంగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో సహా పలు దేశాల నుంచి సౌదీ వెళ్దాలనుకునేవారికి నిరాశ ఎదురయ్యింది.వీసాలు నిషేధించిన దేశాలివే..1. భారత్2. బంగ్లాదేశ్3. పాకిస్తాన్4. అల్జీరియా5. ఈజిప్ట్6. ఇథియోపియా7. ఇండోనేషియా8. ఇరాక్9. జోర్డాన్10. మొరాకో11. నైజీరియా12. సుడాన్13. ట్యూనిషియా14. యెమెన్నిషేధం వెనుక కారణాలివే..సౌదీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం హజ్ సమయంలో భద్రత కల్పించేందుకు, రద్దీని నియంత్రించేందుకు సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. 2024లో హజ్‌యాత్రలో పాల్గొన్న 1,200 మందికి పైగా యాత్రికులు వివిధ కారణాలతో మృతిచెందారు. రిజస్టర్డ్‌కాని యాత్రికుల కారణంగా హజ్‌లో తీవ్రమైన రద్దీ ఏర్పడిందని సౌదీ అరేబియా అధికారులు భావిస్తున్నారు. దీనిని నివారించేందుకే వివిధ రకాల వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, హజ్ యాత్ర కోసం ప్రత్యేకంగా నమోదైన యాత్రికులకు ఈ నిషేధం వర్తించదు. దౌత్య వీసాలు, నివాస అనుమతులు, హజ్-నిర్దిష్ట వీసాలు యథావిధిగా కొనసాగుతాయి.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాలపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్‌ షా

Students Miss JEE Main Exam Due to Pawan Kalyan Convoy Traffic Snarl6
JEE Mains: విద్యార్థుల్ని పరీక్షకు దూరం చేసిన డిప్యూటీ సీఎం పవన్‌

విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కారణంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్‌ డిజిటల్‌ జేఈ విద్యార్థులకు పవన్‌ కాన్వాయ్‌ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.పెందుర్తిలో జేఈఈ మెయిన్స్‌ ఎగ్జామ్‌ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్‌ కాన్వాయ్‌ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్‌ వస్తున్నారని పోలీస్‌ అధికారులు ట్రాఫిక్‌ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.పవన్‌ కళ్యాణ్‌ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్‌ సెంటర్‌ ఉంది. పవన్‌ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్‌ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్‌ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

KSR Comments On Land Issues In AP And Telangana7
రేవంత్‌ విషయంలో ఒక న్యాయం.. చంద్రబాబుకు మరొకటా?

హైదరాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు స్పందించిన తీరు అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతుండగానే సుప్రీంకోర్టు ధర్మాసనం చెట్ల నరికివేత విషయంలో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగు వందల ఎకరాల్లో పచ్చదనంపై గొడ్డలివేటు పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పర్యావరణ వేత్తలు, కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థలు ఏపీలో సుమారు 33 వేల ఎకరాలలో ఏటా మూడేసి పంటలు పండే పచ్చటి భూములను బీడులుగా మార్చి పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నా స్పందించకపోవడం ఆశ్చర్యంగానే ఉంది.దేశ ప్రధానితోపాటు, న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాలలో పని చేసిన వారిలో కొందరు కూడా అమరావతి పేరుతో సాగుతున్న పర్యావరణ విధ్వంసానికి సహకరించే విధంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. రాష్ట్రాన్ని బట్టి, నేతలను బట్టి, పార్టీలను బట్టి వ్యవస్థలు స్పందిస్తున్నాయా అన్న సందేహం రావడానికి ఇలాంటి ఘట్టాలు ఆస్కారం ఇస్తుంటాయి. కంచ గచ్చిబౌలి భూముల మీద స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనమే, పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా అసంతృప్తి తెలిపింది. ఈ రెండు ఉదంతాలకు సంబంధం ఉందో, లేదో తెలియదు. అయితే, రేవంత్ చేసిన తప్పిదం వల్ల దాని ప్రభావం న్యాయ వ్యవస్థపై పడి ఉండవచ్చా అన్నది కొందరి డౌటు. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఈ స్థాయిలో ఇలాంటి కేసులు తనంతట తానే తీసుకున్నట్లు కనిపించలేదు. అన్ని కేసుల్లోనూ కింది కోర్టుల్లో విచారణ జరుగుతుండగా ఇలా స్పందిస్తుందా? అన్నది కొందరి ప్రశ్న.తెలంగాణ ప్రభుత్వం తొందరపాటు, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధుల నిరసనలు, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల విమర్శల హోరు, కేంద్ర ప్రభుత్వం జోక్యం, తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యంపై విచారణ, స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి రావడం వంటి పరిణామాలను విశ్లేషించుకుంటే అన్ని వ్యవస్థలలో ఉన్న మంచితోపాటు లోపాలు కూడా కనిపిస్తాయని చెప్పాలి. కంచ గచ్చిబౌలిలోని ఈ 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చింది. దాంతో రేవంత్ సర్కార్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని అమ్మడమో, లేక లీజు పద్దతిపై ఆయా సంస్థలకు కేటాయించడమో, ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడమో చేయాలని తలపెట్టి ఆ దిశగా పావులు కదిపింది.అయితే, ఇక్కడే రేవంత్ అనుభవరాహిత్యం వల్ల దెబ్బతిన్నారు. నిజంగానే ఆయన అక్కడ అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉండాలి. దానికి ముందు ఈ భూమిని అధీనంలోకి తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలను పసికట్టి ఉండాలి. అది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భాగమా? కాదా? ఎవరికి భూములపై హక్కులు ఉన్నాయన్న దానిపై న్యాయపరంగా అభిప్రాయం తీసుకుని ఉండాల్సింది. ఆ తర్వాత తదుపరి చర్యలకు వెళ్లి ఉంటే ఎలా ఉండేదో గాని, అలా కాకుండా, వేగంగా సెలవు దినాలలో పెద్ద సంఖ్యలో జేసీబీలను పంపించి చెట్లు కొట్టి, నేల చదును చేయించడంతో వివాదానికి అవకాశం ఇచ్చినట్లయింది. ఈ భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. కొందరైతే ఇంకా ఎక్కువే వస్తుందని అంటారు. దీంతో ప్రభుత్వ కష్టాలు తీరుతాయని ఆశించి ఉండవచ్చు. సుమారు రెండు దశాబ్దాల పాటు కోర్టులలో ప్రభుత్వమే ఈ భూమిపై పోరాడింది కనుక తమవే అన్న అభిప్రాయం వచ్చినప్పటికీ భవిష్యత్ పరిణామాలపై ఒక అంచనాకు రావడంలో విఫలమైందని అనిపిస్తుంది.1975లో రాష్ట్ర ప్రభుత్వమే 2300 ఎకరాలు కేటాయించినా, సెంట్రల్ యూనివర్శిటీకి అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయలేదు. అయినా వారు వాడుకున్న భూమి పోను మిగిలినది ప్రభుత్వ అధీనంలోనే ఉందట. 2003లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమిని ‘ఐఎమ్‌జీ భారత’ అకాడమి అనే ప్రైవేటు సంస్థకు కేటాయించింది. ఆ సంస్థకు భూమిని బదలాయించే నిమిత్తం 2004 ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం 534 ఎకరాల భూమిని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి బదలాయించారు. ఈ మేరకు రికార్డులు ఉన్నాయని మీడియా కథనం. అందులో యూనివర్శిటీ రిజిస్ట్రార్ సంతకం కూడా ఉండడం గమనార్హం. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఆపద్ధర్మ సీఎం హోదాలో ఈ భూమిని ఇలా బదలాయించినా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఏ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు రాలేదు. పైగా ఈ భూమిలో 400 ఎకరాలు పొందిన ప్రైవేటు సంస్థ రెండు దశాబ్దాలుగా ఆ భూమి తనదే అంటూ కోర్టులలో వ్యాజ్యాలు సాగించినా ఏ వ్యవస్థ సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించదు.ఇక, 2006లో ఆనాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ భూమి విషయాన్ని పరిశీలించి ఇది ప్రైవేటు వ్యక్తులకు లాభం చేసేందుకే చంద్రబాబు సర్కార్ కేటాయించిందని అభిప్రాయపడి దానిని రద్దు చేసింది. అయినా కోర్టులో అది ప్రభుత్వ భూమి అని ఇంతకాలం పోరాడాల్సి వచ్చింది. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఐఎంజీ సంస్థ ఏవైనా నిర్మాణాలు చేపట్టి ఉంటే ఏమై ఉండేది అన్న ప్రశ్నకు జవాబు దొరకదు. అప్పుడు కూడా ఈ భూమిలో చెట్లు ఉన్నాయి కదా!. అలాంటి ఖాళీ భూమిలోనే కదా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. అప్పుడు పర్యావరణ సమస్యలు రావా? ఇక్కడ రేవంత్ సర్కార్ కరెక్ట్ గా చేసిందా? లేదా? అన్నది చర్చ కాదు. కానీ, పరిణామాలన్నిటిని విశ్లేషించినప్పుడు ఇలాంటి సందేహాలు వస్తాయి కదా!. సుప్రీంకోర్టు ఈ భూమి ప్రభుత్వానిదే అని తేల్చిన తర్వాత ఈ భూమిని అభివృద్ది చేయడం కోసం మౌలిక వసతుల కల్పన సంస్థకు అప్పగించింది. ఈ పనులు చేయడం కోసం ఇదే భూమిని తాకట్టు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ ద్వారా పదివేల కోట్ల అప్పు కూడా తీసుకుందట. మార్కెట్‌లో బాండ్లు, వివిధ బ్యాంకులు, ఆర్ధిక సంస్థల ద్వారా ఈ రుణాలు సేకరించి, వడ్డీ కట్టడం కూడా ఆరంభమైందని కథనం.ఈ భూమిని యూనివర్శిటీకే ఇవ్వాలని, అక్కడ ప్రహరి గోడ కట్టించడం వల్లే వృక్షాలు పెరిగాయని చెబుతూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగడం, తదుపరి విపక్షాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎంటర్ అవ్వడంతో అది పెద్ద దుమారంగా మారింది. ఈలోగా కేంద్రం కూడా స్పందించి ఈ భూమిపై నివేదికను కోరింది. తెలంగాణ హైకోర్టు కూడా విచారణ చేపట్టి నోటీసులు జారీ చేసింది. ఇంతలో సుమోటోగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నివేదిక తెప్పించుకుని చెట్లు కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు ఆపాలని ఆదేశించింది. దీంతో విద్యార్దులు తామే గెలిచామని సంబరాలు చేసుకుంటే, రేవంత్ సర్కార్‌కు పెద్ద షాక్ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై ఇప్పుడు మంత్రుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు. కాగా అక్కడ పర్యావరణ అనుకూల పార్కు ఏర్పాటు చేస్తామని, యూనివర్శిటీ కూడా అదే భూమిలో ఉంది కనుక దానిని ఫ్యూచర్ సిటీకి తరలిస్తామని కొత్త కండీషన్ పెట్టడం విశేషం. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ద్వారా కల్పిత వీడియోలు సృష్టించారని తెలంగాణ సర్కార్ ఇప్పుడు వాపోతున్నా పెద్దగా ఫలితం ఉంటుందా అన్నది సందేహం.కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని రేవంత్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. సీఎంకు సంయమనం పాటించడం తెలియదా అని ప్రశ్నించింది. రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన రోజునే ఆయన అనవసర వివాదంలో చిక్కుకున్నారని అనుభవజ్ఞులు అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థను సవాల్ చేసేలా ఆయన మాట్లాడడం వారికి ఎలా నచ్చుతుంది. గతంలో ఫిరాయింపులపై కోర్టులు గట్టి చర్యలు తీసుకోలేదన్నది ఆయన అభిప్రాయం కావచ్చు. అయినప్పటికీ శాసనసభలో అలా మాట్లాడి దెబ్బతిన్నారు. ఆ క్రమంలో ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం గందరగోళంగా మారింది. విశేషం ఏమిటంటే యూనివర్శిటీకి చెందిన భూములలో కొంత భాగం ఆక్రమణలకు గురైందని చెబుతున్నారు. తన అధీనంలో ఉన్న భూములను ఏం చేయాలన్నది నిజానికి ప్రభుత్వ అభీష్టం ప్రకారం జరగాలి. అయితే స్థానిక ప్రజలు పర్యావరణ వేత్తలు, యూనివర్శిటీ విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు చేసి ఉండవచ్చు. అవేవి జరగలేదు. దానిని సహజంగానే విపక్షాలు తమకు అనుకూలంగా మలచుకుంటాయి.ప్రభుత్వ ఆస్తులు, భూములు అమ్మడం కొత్త కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల కారణం చూపి అమ్ముతున్నారు. తెలంగాణలో గత కేసీఆర్‌ ప్రభుత్వం కూడా పలు చోట్ల భూములను అమ్మి వేల కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడేమో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ తాము అధికారంలోకి వస్తే ఈ భూములను యూనివర్శిటీకి అప్పగిస్తామని చెబుతున్నారు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ సర్కార్ భూముల అమ్మకాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇప్పుడు ఆయన అదే బాటలో ఉన్నారు. ఇదంతా ఒక గేమ్‌గా మారింది. ప్రతిపక్షంలో ఉంటే ఒకరకం, అధికారంలోకి వస్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారు.ఇక ఏపీ సంగతి కూడా చూస్తే ఆశ్చర్యంగానే ఉంటుంది. కృష్ణానది పక్కన 33 వేల ఎకరాల మూడు పంటలు పండే భూమిని సేకరించి రాజధాని కడుతున్నారు. అది పర్యావరణానికి నష్టమని పలువురు చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అక్కడ భూమి స్వభావ రీత్యా మామూలు వ్యయం కన్నా ఒకటిన్నర రెట్ల అధికంగా నిర్మాణ ఖర్చు అవుతుందట. రిషికొండపై జగన్ ప్రభుత్వం మంచి భవనాలు నిర్మిస్తే, ప్యాలెస్‌లని ప్రచారం చేసిన తెలుగుదేశం, జనసేన నేతలు ఇప్పుడు అమరావతిలో అంతకన్నా పెద్ద ప్యాలెస్‌లు నిర్మించాలని తలపెట్టారు. వాటికి మాత్రం ఐకాన్ భవనాలని, అదని, ఇదని బిల్డప్ ఇస్తున్నారు. చంద్రబాబు స్వయంగా కృష్ణా నది తీరాన నదీ చెంత సీఆర్‌జెడ్‌ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఒక భవనంలో నిర్మిస్తున్నా ఏ వ్యవస్థ ఆయన జోలికి వెళ్లలేకపోయింది.రిషికొండపై అంతా కలిపి 400 కోట్లతో భవనాలు నిర్మిస్తే తప్పట. అదే అమరావతిలో ఏభై వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ ప్యాలెస్‌లు నిర్మిస్తే రైటట. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యవస్థలే లేవా?. రాజధాని కోసం ఎంత భూమి అవసరమో అంత తీసుకోవచ్చు. అలా కాకుండా మహానగరం నిర్మిస్తామంటూ శివరామకృష్ణన్ నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఇలా చేస్తుంటే ఏమనాలి?. తెలంగాణకు ఒక న్యాయం, ఏపీకి ఒక న్యాయం ఉంటుందా?. ఇదంతా మన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో సహా వివిధ వ్యవస్థలలో ఉన్న లోపమా?.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Do You Know About Shubman Gill Networth Cars and More8
ఖరీదైన కార్లు.. విలాసవంతమైన భవనం: శుభ్‌మన్ గిల్ సంపద ఎంతో తెలుసా?

మనిషి దేన్నైనా సాధించాలని బలంగా అనుకుని ముందుకు సాగితే.. తప్పకుండా సక్సెస్ సాధ్యమవుతుందని ఎంతోమంది చెప్పారు. ఉదాహరణలుగా కూడా నిలిచారు. ఈ కోవకు చెందిన వారిలో ఒకరు టీమ్ ఇండియాకు ఓపెనర్ 'శుభ్‌మన్ గిల్' (Shubman Gill). సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన గిల్.. కోట్లు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఈ కథనంలో శుభ్‌మన్ ఆస్తి ఎంత? ఎలాంటి వాహనాలను వినియోగిస్తున్నారు, ఏ కంపనీలకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు, అనే వివరాలు తెలుసుకుందాం.శుభ్‌మన్ గిల్ అంటే టీమిండియా క్రికెటర్ మాత్రమే కాదు యూత్ ఐకాన్ కూడా. రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి నేడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. ఇతను మొత్తం సంపద విలువ రూ. 32 కోట్ల కంటే ఎక్కువే అని తెలుస్తోంది. ఇతని వద్ద రూ. 89 లక్షల ఖరీదైన ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, రూ. 14.16 లక్షల ఖరీదైన మహీంద్రా థార్ ఉన్నాయి.మహీంద్రా థార్ కారును ఆనంద్ మహీంద్రా గిఫ్ట్‌గా ఇచ్చారు. 2021 టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన సమయంలో ఆనంద్ మహీంద్రా ఆరుగురు ఆటగాళ్లకు మహీంద్రా థార్ గిఫ్ట్ ఇచ్చారు. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గిల్ ఏడాదికి రూ. 5 కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ఆమె ఇచ్చిన సలహా.. గూగుల్ సీఈఓను చేసింది: ఎవరీ అంజలి?శుభ్‌మన్ గిల్‌ అనేక బ్రాండ్లకు అంబాసిడ‌ర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో CEAT, Nike, Dior, Fiama, Gilette వంటి బ్రాండ్స్ ఉన్నాయి. వీటి ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారు. కాగా ఈయనకు పంజాబ్‌లో ఒక విలాసవంతమైన భవనం కూడా ఉంది.

Peddi First Shot Glimpse Hindi Out Now And Glimpse 24 hrs Record Views9
'పెద్ది' సిక్సర్‌తో.. పుష్ప2, దేవర రికార్డ్స్‌ గల్లంతు

మెగా హీరో రామ్‌ చరణ్ కొట్టిన సిక్సర్‌తో ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్‌ అన్నీ గల్లంతు అయ్యాయి. తాజాగా విడుదలైన 'పెద్ది' గ్లింప్స్‌కు షోషల్‌మీడియా షేక్‌ అయిపోయింది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీకపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుంది. ఫస్ట్‌ షాట్‌తోనే సినీ అభిమానులను రామ్‌చరణ్‌ ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాల గ్లింప్స్‌కు వచ్చిన వ్యూస్‌ విషయంలో దేవర (26.17 మిలియన్లు) టాప్‌లో ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా గ్లింప్స్‌ ఆ రికార్డ్‌ను దాటేసింది. 24గంటల్లోనే ఏకంగా 30.6 మిలియన్ల వ్యూస్‌తో దుమ్మురేపింది. ఇప్పటి వరకు టాలీవుడ్‌లో ఉన్న అన్ని సినిమాల గ్లింప్స్‌ రికార్డ్స్‌ను పెద్ది దాటేసింది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. తప్పకుండా పెద్ది సినిమాతో భారీ హిట్‌ కొడుతున్నామని వారు పోస్ట్‌లు షేర్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో పెద్ది గ్లింప్స్‌ టాప్‌-1లో ఉంటే.. ఇండియాలో టాక్సిక్‌ (36 మిలియన్లు)తో టాప్‌-1లో ఉంది.'పెద్ది' హిందీ గ్లింప్స్‌ విడుదల.. డబ్బింగ్‌ ఎవరంటే..?పెద్ది సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా హిందీ గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హందీ వర్షన్‌లో తన పాత్రకు డబ్బింగ్‌ స్వయంగా చెప్పుకున్నారు. ఈ గ్లింప్స్‌ నుంచి ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది.టాలీవుడ్‌ టాప్‌ (గ్లింప్స్‌) చిత్రాలుపెద్ది (30.6 మిలియన్లు)దేవర (28.7 మిలియన్లు)పుష్ప2 (27.11 మిలియన్లు)ఓజీ (27 మిలియన్లు)కల్కి (23.16 మిలియన్లు)గుంటూరు కారం (21.12 మిలియన్లు)ది ప్యారడైజ్‌ (17.12 మిలియన్లు)

Rat named Ronin breaks world record10
Rat Ronin: వరల్డ్‌ రికార్డ్‌ సృష్టించిన ఎలుక.. దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన హీరో

ఓ మూషికం సరికొత్త రికార్డ్‌లను సృష్టించింది. బాంబుల నుంచి ఓ దేశాన్ని కాపాడ‌డంలో పాత రికార్డ్‌ల‌న్నీ తిర‌గ రాసింది. దీంతో ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా బాంబులు గుర్తించిన ఎలుకల జాబితాలో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డ్ కెక్కింది. కాంబోడియా దేశానికి చెందిన భూముల్లో ఉన్న బాంబులను గుర్తించడమే ఎలుక రోనిన్ ప‌ని. తాజాగా రోనిన్ బాంబుల వేట‌లో ప్రపంచంలోనే తొలిసారి వందకు పైగా ల్యాండ్‌మైన్లు, ఇతర యుద్ధ అవశేషాలను గుర్తించిన ఎలుకగా కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది.అఫ్రికన్ జెయింట్ పౌచ్‌డ్ రాట్ రోనిన్ 2021 నుండి ఇప్పటివరకు భూమిలో దాచిన 109 బాంబులు, 15 పేలని బాంబులను గుర్తించిన‌ట్లు జంతువులకు శిక్షణ ఇచ్చే ఏపోపో అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. తద్వారా రోనిన్ ఇప్పుడు ఎలుకలలో అత్యధిక మైన్లు గుర్తించిన రికార్డును సొంతం చేసుకుందని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా, కాంబోడియా ప్రజల ప్రాణాల్ని కాపాడడంలో రొనిన్‌ బాధ్యతలు అత్యద్భుతమని కొనియాడింది. ఎలుక రోనిన్‌ గురించి పలు ఆసక్తిర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల వయస్సున్న రోనిన్‌ మంచి పనిమంతుడు. అందరితో స్నేహంగా ఉండటమే కాదు..శాంతంగా ఉంటాడట. రోనిన్ విజయానికి కారణం ఏకాగ్రత, ఒత్తిడిలో ఎలాంటి ఆందోళన చెందకుండా ఎదురవుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో సిద్ధహస్తుడు. అంతేకాదు, రోనిన్‌ తెలివితేటలు, సహజమైన ఆసక్తి నిత్యం చురుగ్గా ఉంచేందుకు దోహదం చేస్తున్నాయి. అందుకే కాబోలు భూమిలో బాంబులు గుర్తించడం రోనిన్‌కు ఒక ఆటలా ఉంటుంది’ అని ఏపోపో ప్రతినిధి లిల్లీ షాలోమ్ అన్నారు.రోనిన్‌ సంరక్షణ చూసుకునే ఫానీ మాట్లాడుతూ.. ‘రోనిన్ విజయాలు ఎలుకల అసాధారణ సామర్థ్యానికి నిదర్శనం. రోనిన్‌ను కేవలం బాంబుల్ని నిర్విర్యం చేసే ఎలుక అని అనుకోం. మేం అతన్నిఫ్రెండ్‌గా, సహచరుడిగా భావిస్తాం’ అని అన్నారు.ఏపోపో సంస్థ దాదాపు ముప్పై సంవత్సరాలుగా భూమిలోని బాంబులను గుర్తించేందుకు ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. రోనిన్,అతని సహచరులు ప్రతి రోజూ మైన్లు ఉండే ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తారు. మైన్లు ఉన్నాయన్న అనుమానం ఉన్న ప్రదేశాల్లో వాటిని విడిచిపెడతారు. ఎలుక తమ అసాధారణమైన ప్రతిభతో మైన్లు ఉన్న ప్రదేశంపై ఉన్న మట్టిని కొరుకుతాయి. అలా ఓ నిర్ధిష్ట వయస్సు వచ్చిన తర్వాత విధుల నుంచి పదవీ విరమణ చేస్తాయి.కాంబోడియాలో ఇరవై ఏళ్లపాటు అంతర్యుద్ధాలు జరిగాయి. చివరికి యుద్ధాలు 1998లో ముగిశాయి. అయినప్పటికీ ఇంకా ప్రపంచంలో అత్యధికంగా ల్యాండ్‌ మైన్‌లు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ 40 లక్షల నుంచి 60 లక్షల మధ్యలో కాంబోడియా భూముల్లో ల్యాండ్‌ మైన్లతో పాటు ఇంకా పేలని పేలుడు పదార్ధాలు ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అలాగే ఈ దేశంలో సగటున 40వేల మందికి పైగా ఈ ల్యాండ్‌ మైన్ల వల్ల కాళ్లను పోగొట్టుకున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. రోనిన్‌కు ముందు మగా‌వా అనే ఎలుకనే అత్యధిక బాంబులు గుర్తించాడు. మగా‌వా 2021లో పదవీ విరమణ చేసినప్పటికీ, అయిదేళ్ల కాలంలో 71 మైన్లు, 38 పేలని బాంబులను గుర్తించాడు. అతడికి సేవల గుర్తింపుగా పీడీఎస్‌ఏ అనే జంతు సంక్షేమ సంస్థ నుండి సాహస వీరుడి పతాకాన్ని అందుకున్నాడు. 2022 జనవరిలో వృద్ధాప్యంతో మగవా మరణించాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement