
బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్‌రామ్
ఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్
అమలాపురం టౌన్: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వైఎస్సార్ సీపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గడియారం స్తంభం సెంటరులో శనివారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తొలుత జగ్జీవన్‌రామ్ చిత్ర పటానికి ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, మాదగ నాయకులు నివాళులర్పించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన నీతి నిజాయితీగా పనిచేయడమే కాకుండా 30 ఏళ్లు కేంద్ర మంత్రిగా, 50 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ఆయనకు భారత రత్న ఇవ్వాలని, అమలాపురంలో ఆ మహనీయుని కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ పేర్కొన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్ గోపాల్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, దళిత ఐక్య వేదిక జిల్లా చైర్మన్ డీబీ లోక్, కన్వీనర్ జంగా బాబూరావు, మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మడికి శ్రీరాములు, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, పార్టీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా, దండోరా నాయకుడు యార్లగడ్డ రవీంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు చిట్టూరి పెదబాబు, బంగారు గోవింద్, కట్టోజు సన్నయ్యదాసు, నాగారపు వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ నాయకులు చిక్కాల రవిశంకర్, సాగిరాజు సాయిరాజు, తదితరులు పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళుర్పించారు.
సమానత్వం కోసం కృషి చేసిన
మహనీయుడు : జేసీ నిషాంతి
అమలాపురం రూరల్: దళితుల ఆశాజ్యోతిగా, అణగారిన వర్గాల అభ్యుదయం, హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జేసీ టి.నిశాంతి పిలుపు నిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లో జగ్జీవన్‌రామ్ జయంతిని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. డీఆర్‌ఓ రాజకుమారి మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం, వారి పట్ల వివక్షను నిర్మూలించేందుకు పోరాడిన మహనీయుడు అని అన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ జిల్లా సాధికాతర అధికారిణి ఎం.జ్యోతిలక్ష్మీదేవి, మున్సిపల్ కమిషనర్ కేవీవీఆర్ రాజు, ఎల్‌డీఎం కేశవ వర్మ, డీఎంఅండ్ హెచ్‌ఓ ఎం.దుర్గారావు దొర, డీటీఓ రామనాథం, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి హరిశేషు, కలెక్టరేట్ ఏవో కె కాశీ విశ్వేశ్వరరావు ఎస్‌డీసీ కృష్ణమూర్తి జిల్లా గృహ నిర్మాణ సంస్థ అధికారి నరసింహారావు, వికాస జిల్లా మేనేజర్ జి.రమేష్ దళిత నేత జంగా బాబూరావు, వసతి గృహ సంక్షేమ అధికారులు కలెక్టరేట్ ఉద్యోగులు,విద్యార్థులు పాల్గొన్నారు.