అమలాపురం రూరల్: ప్రతి అధికారి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంపై పూర్తి అవగాహన పెంపొందించుకొని ప్రజా సమస్యలను నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్వో రాజకుమారి, డీఆర్‌డీఏ పీడీ సాయినాథ్ జయచంద్ర గాంధీ, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్ ఎస్టీసీ కృష్ణమూర్తి 300 అర్జీలను సేకరించారు.
గడువులోగా అర్జీలను పరిష్కరించాలి
అమలాపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ బి.కృష్ణారావు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖీ మాట్లాడారు. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, ఇతర సమస్యలపై 25 అర్జీలు స్వీకరించామని ఎస్పీ తెలిపారు.
మద్యం షాపు తొలగించాలంటూ ఆందోళన
అమలాపురం రూరల్ : అంబాజీపేట మండలం మాచవరం వేంకటేశ్వర కాలనీ కుసుమేవారిపేట, చినకుసుమేవారి పేట, అంబేడ్కర్ నగర్‌లకు ఆనుకుని ఉన్న మద్యం షాపును తక్షణమే తొలగించాలని సోమవారం కలెక్టరేట్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళలరే రక్షణ లేనివిధంగా ఏర్పాటు చేసిన మద్యం షాపుని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎటువంటి పంచాయతీ అనుమతులు తీసుకోకుండా అంబాజీపేట నుంచి ఇక్కడికి షాపును షిఫ్ట్ చేశారని అన్నారు.
ఒక పక్క స్కూలు, ఇరువైపులా గ్రామాల్లో ఉన్న ప్రజలకు, మహిళలకు ఇబ్బందిగా ఉన్న స్థలంలో మద్యం షాపు ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. ఎకై ్సజ్ డీఎస్పీ గ్రామానికి 150 మీటర్లు దూరంలో మద్యం షాపు ఏర్పాటు చేశారు, మీకేంటి అభ్యంతరం అనడం దారుణమని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎకై ్సజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాయింట్ కలెక్టర్‌కు మహిళలు వినతి పత్రం అందించారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి.దుర్గాప్రసాద్ ఎం.బలరాం టి.నాగ వరలక్ష్మి, నాయకులు పచ్చిమాల శివ, ఆ గ్రామాలకు చెందిన కుసుమ నాగమణి, అయితాబత్తుల శాంతికుమారి, గోగి రాజేష్ పి.ప్రసాద్ పాల్గొన్నారు.
శ్రీనూకాంబిక ఆలయ
అభివృద్ధికి విరాళం
ఆలమూరు: మండలంలోని చింతలూరులో వేంచేసియున్న శ్రీనూకాంబికా అమ్మవారి ఆలయ అభివృద్ధికి గుమ్మిలేరుకు చెందిన వ్యాపారవేత్త ముత్యాల వీర భాస్కరరావు, కృష్ణవేణి దంపతులు సోమవారం రూ.1,01,116 అందజేశారు. గాలి గోపురం నిర్మాణానికి ఈ విరాళం ఇచ్చారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఉండవల్లి వీర్రాజు చౌదరి, ఉత్సవ కమిటీ చైర్మన్ గన్ని వెంకట్రావు (అబ్బు)కు నగదు రూపంలో ఆలయ ఆవరణలో అందజేశారు. దాత కుటుంబ సభ్యులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. విరాళం సమర్పించిన దంపతులకు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
న్యూస్‌రీల్
ప్రజా సమస్యలకు పరిష్కారం
ప్రజా సమస్యలకు పరిష్కారం