మూడోసారి అంతరిక్షంలోకి సునీత | Indian-Origin Astronaut Sunita Williams Blasts Off To Space Aboard Boeing Starliner | Sakshi
Sakshi News home page

మూడోసారి అంతరిక్షంలోకి సునీత

Published Thu, Jun 6 2024 4:54 AM | Last Updated on Thu, Jun 6 2024 5:59 AM

Indian-Origin Astronaut Sunita Williams Blasts Off To Space Aboard Boeing Starliner

హూస్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌(61)తో కలిసి బోయింగ్‌ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. 

స్టార్‌లైన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్‌ విల్‌మోర్‌ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్‌ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్‌మోర్‌ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. 

సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్‌ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్‌ లిఫ్టింగ్‌ మెషీన్‌ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి బోస్టన్‌ మారథాన్‌ పూర్తిచేశారు. 

అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్టు మిషన్‌ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. 

ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్‌ సిద్ధమైంది. బోయింగ్‌ కంపెనీ డెవలప్‌ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్‌ కావడం విశేషం. ఎలాన్‌ మస్క్‌ స్థాపించిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్‌ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్‌ సంస్థగా బోయింగ్‌ కంపెనీ రికార్డు సృష్టించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement