Sunita Williams
-
అంతరిక్షం నుంచి ‘అద్భుత’ భారతం: సునీతా విలియమ్స్
‘అంతరిక్షం నుండి భారతదేశం ఎలా ఉంది?’ ఈ ప్రశ్నకు నాడు భారత వ్యోమగామి రాకేష్ శర్మ(Indian astronaut Rakesh Sharma) ప్రముఖ కవి ముహమ్మద్ ఇక్బాల్ రాసిన ‘సారే జహాన్ సే అచ్చా’ అంటూ సమాధానం చెప్పారు. నాలుగు దశాబ్దాల తర్వాత ఇదే ప్రశ్నకు భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ సమాధానమిచ్చారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి అద్భుతమైన హిమాలయాలను చూసిన సంగతిని ఆమె గుర్తుచేసుకున్నారు.286 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత సునీతను.. భారతదేశం అంతరిక్షం నుండి ఎలా కనిపించింది? అని అడిగినప్పుడు ఆమె ‘అద్భుతం.. అత్యద్భుతం’ అనే సమాధానం ఇచ్చారు. ‘భారతదేశం అద్భుతమైనది. మేము హిమాలయాల(Himalayas) మీదుగా వెళ్లిన ప్రతిసారీ అద్భుత దృశ్యాలను చూశాం’ అని సునీతా విలియమ్స్ అన్నారు. తన భారతీయ మూలాల గురించి తరచూ మాట్లాడే అమెరికా వ్యోమగామి సునీత అంతరిక్షం నుంచి భారత్‌కు సంబంధించిన ప్రకృతి దృశ్యాలను చూసి మంత్రముగ్ధురాలయ్యారు.పశ్చిమాన ఉన్న నౌకాదళాల నుండి ఉత్తరాన మెరుస్తున్న హిమాలయాల వరకు అంతా అద్భుతంగా కనిపించింది. తూర్పు నుండి గుజరాత్ మీదుగా ముంబైకి వెళ్ళినప్పుడు అద్భుత దృశ్యం కనిపించింది. భారతదేశం అంతటా రాత్రిపూట లైట్ల నెట్వర్క్ అమోఘంగా ఉంది. పగటిపూట కనిపించిన హిమాలయాల సౌందర్యం భారతదేశానికే తలమానికంగా నిలిచింది. భారత అంతరిక్ష విమానయాన కార్యక్రమానికి సహాయం చేస్తారా? అని ఆమెను అడిగినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు భారతదేశానికి వస్తాను. మా అనుభవాలను అక్కడివారితో పంచుకుంటాను. భారత్ ఒక గొప్ప దేశం. అద్భుతమైన ప్రజాస్వామ్యం(Democracy) ఇక్కడుంది. భారత్ అంతరిక్షయానంలో ముందడుగు వేస్తోంది. దానిలో భాగం కావడానికి, వారికి సహాయం చేయడం తనకు ఇషమేనని ఆమె సమాధానం చెప్పారు.భారతదేశంలో జన్మించిన విలియమ్స్ తన తండ్రి పూర్వీకుల ప్రాంతానికి రావాలని అనుకుంటోంది. తన సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను కూడా భారత్‌కు తీసుకురావాలని భావిస్తోంది. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్‌లో ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్ష నౌక సిబ్బంది లేకుండా తిరిగి వచ్చింది. దీంతో ఈ ఇద్దరు వ్యోమగాములు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. వారు చివరికి మొన్న మార్చి 19న స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో భూమికి తిరిగి వచ్చారు.ఇది కూడా చదవండి: మరుభూమిగా మయన్మార్.. దారుణమైన పరిస్థితులు -
Sunita Williams: మళ్లీ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా?
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఆరోగ్యంగానే ఉన్నారు. దాదాపు 9 నెలల అనంతరం మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమ్మీదకు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇన్నాళ్లపాటు పరిశీలనలో ఉన్న వీళ్లు తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఐఎస్ఎస్ అనుభవాలతో పాటు.. వాళ్లు అక్కడ ఉన్న సమయంలో భూమ్మీద జరిగిన చర్చలు, ఆందోళనలు, విమర్శలు తదితర అంశాలపైనా స్పందించారు. అవకాశం వస్తే మళ్లీ బోయింగ్ స్టార్ లైనర్( Boeing Starliner) స్పేస్‌క్రాఫ్ట్‌లో ఐఎస్ఎస్కు వెళ్తారా? అని ఫాక్స్ న్యూస్ జరిపిన ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు అవుననే సమాధానం ఇచ్చారు. అది చాలా సామర్థ్యం గల వాహకనౌక అని భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams) అన్నారు. అయితే స్టార్ లైనర్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో స్టార్‌లైనర్‌లో ఏర్పడ్డ సమస్యలను పరిష్కస్తామని పేర్కొన్నారు.నిర్లక్ష్యం వల్లే ఇరుక్కుపోయారనే విమర్శలకూ ఇద్దరూ స్పందించారు. తామెప్పుడు అలా భావించలేదని అన్నారు. ఈ విషయంలో ఎవరినీ తప్పుబట్టే ఉద్దేశమూ తమకు లేదని అన్నారు. అనుకున్న ప్రకారం తాము భూమ్మీదకు రాలేకపోయామని.. ఒకరకంగా ఇరుక్కుపోయామనే భావించాల్సి ఉంటుందని, మరోరకంగా అక్కడ ఉండాల్సి వచ్చిందని.. అయినప్పటికీ తాము తీసుకున్న కఠోర శిక్షణ ఆ పరిస్థితులను తట్టుకోగలిగే సామర్థ్యం ఇచ్చిందని ఇద్దరూ అన్నారు. తమ మిషన్ విజయవంతం కావడంలో నాసా కృషిని, తాను సాధారణ స్థితికి రావడానికి సాయం చేసిన శిక్షకులకు సునీత ధన్యవాదాలు తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్(Elon Musk)లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తీసుకున్న శిక్షణ వల్లే.. ఐఎస్ఎస్కు తీసుకెళ్లడం, అక్కడి పరిస్థితులకు తగ్గట్లుగా గడపడం, తిరిగి భూమిపైకి రావడంలో, అలాగే పునరావాసం, కొత్త సవాళ్లకు సిద్ధకావడానికి ఎంతో సహాయం చేశాయన్నారు. భూమిపైకి వచ్చాక ఇప్పటికే తాను మూడు మైళ్లు పరుగెత్తానని సునీత అన్నారు. ఐఎస్ఎస్లో ఉన్న సమయంలో తమ టాస్క్‌ల్లో భాగంగా ఎన్నో సైన్స్ ప్రయోగాలు చేపట్టామని, శిక్షణ పొందామని విల్మోర్ పేర్కొన్నారు.ఇక ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు తన ఆరోగ్యం గురించి చాలా మంది ఆందోళనకు గురైన విషయం తనకు తెలుసని సునీతా విలియమ్స్ అన్నారు. అయితే తాము ఒక పెద్ద టీమ్ ప్రయత్నంలో భాగమై ఉన్నట్లు తెలిపారు. విల్మోర్ మాట్లాడుతూ.. మానవ అంతరిక్ష యానం దేశాలను ఒక్కతాటిపైకి తెస్తుందని అన్నారు. ఇక స్టార్‌లైనర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు, హీలియం లీకేజీల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్న నాసా, బోయింగ్ టీమ్స్ నిబద్ధతను ఆయన కొనియాడారు. తమకు నాసాపై ఎంతో నమ్మకముందన్నారు. తాము సురక్షితంగా భూమిపైకి చేరడంలో నాసా నిబద్ధతకు సంబంధించి ఇదొక మైలురాయిగా వారు అభివర్ణించారు.Astronauts Butch Wilmore & Sunita Williams express their views, carefully, with deliberate wording. Positive rather than negative or unhelpful.#ButchWilmore #SunitaWilliams #Trump https://t.co/qTYEdAbUMN— I can see Ireland from here. Gerry (@gtp_58) March 31, 2025సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు ఇదే ప్రెస్మీట్లో పాల్గొన్న మరో వ్యోమగామి, క్రూ-9 కమాండర్ నిక్ హేగ్ మాట్లాడుతూ.. మిషన్ చుట్టూ రాజకీయం నడిచిందన్న వాదనను తోసిపుచ్చారు. గతేడాది జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం.. వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు 286 రోజులపాటు అక్కడే చిక్కుకుపోయారు. ఇక వ్యోమగాములు లేకుండానే స్టార్‌లైనర్ కొన్నిరోజులకు భూమిపైకి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోయారు. అనేక ప్రయత్నాల అనంతరం.. ఈ ఏడాది మార్చిలో స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్‌లో వారు ఐఎస్ఎస్ నుంచి సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు సైతం వాహకనౌకలో వచ్చారు. దీంతో హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు వీళ్లను తరలించి పరిశీలనలో ఉంచారు. అనంతరం.. 12 రోజుల అనంతరం తొలిసారి ఇప్పుడు బయటి ప్రపంచం ముందుకు వచ్చారు. -
మరిన్ని ప్రయోగాలకు మార్గదర్శనం!
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మళ్లీ భూమ్మీదకు చేరారు. చాలామంది సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లో ఇరుక్కుపోయారని అన్నారు. ఈ వర్ణన అంత సరైంది కాదు. ఐఎస్ఎస్లో దీర్ఘకాలం ఉండటం ఇదే మొదటిసారి కాదు. సుమారు పాతికేళ్లుగా మనుగడలో ఉన్న ఐఎస్ఎస్లో నిత్యం యూఎస్, రష్యా, యూరప్, జపాన్ వ్యోమగాములు ఉంటూనే ఉన్నారు. ఒక్కొక్కరి కాలావధి వేర్వేరుగా ఉండవచ్చు. కనీసం 4 నుంచి 8 మంది వ్యోమగాములు జీవశాస్త్ర, బయోమెడికల్, మొక్కలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ వచ్చారు. గత వారం కొద్ది కాలమైనా సరే... దాదాపు 11 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్లో గడిపారు. పరిశోధనలు చేయడంతోపాటు ఉపగ్రహాలను ప్రయోగించడం, ఐఎస్ఎస్ నిర్వహణ పనులు చేశారు వీరందరూ! స్పేస్ వాక్స్ ద్వారా ఐఎస్ఎస్ వెలుపల ఉండే రోబో చేతుల మర మ్మతులు కూడా ఉన్నాయి ఈ పనుల్లో! వ్యోమగాములు నిత్యం ఐఎస్ఎస్లో ఉంటారు కాబట్టి వారికి ఆహారం, ఇతర సరుకుల రవాణా ఎప్పటికప్పుడు జరిగింది. అంతరిక్ష కేంద్రంలో సునీత, విల్మోర్లు 286 రోజుల పాటు ఉండటం చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ... కొత్త కాదు. ఫ్రాంక్ రూబియో విషయాన్నే తీసుకుంటే... 2023 సెప్టెంబరులో ఆయన 371 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి రికార్డు సష్టించారు. ఈ క్రమంలో ఆయన 2022లో మార్క్ వెండే హే 355 రోజుల రికార్డును బద్దలు కొట్టారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ కాస్మోనాట్ల రికార్డులతో పోలిస్తే ఇవి తక్కువ. సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘మిర్’ అంతరిక్ష కేంద్రమే... కాలక్రమంలో ఇతర దేశాల భాగస్వామ్యంతో ఐఎస్‌ఎస్‌గా రూపాంతరం చెందిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. భౌతిక శాస్త్రవేత్త, కాస్మోనాట్... వలేరీ పోల్యాకోవ్ 1994–95లో ఎకాయెకిన సుమారు 437 రోజులపాటు మిర్ స్టేషన్లో గడిపారు. ప్రస్తుతం చైనా సిద్ధం చేసిన అంతరిక్ష కేంద్రం టియాన్ గాంగ్‌లో ముగ్గురు వ్యోమగాములు 139 రోజులుగా ఉంటు న్నారు. వీరిలో కాయ్ షూజీకి అంతరిక్షంలో 320 రోజులు గడిపిన అనుభవం ఉంది. లక్ష్యాల్లో ఒకటి అదే...అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి– దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడిపితే మనకేం అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎక్కువ కాలం అక్కడ గడిపినప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయన్న విషయం మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారమే. 1970లలో శాల్యూట్, స్కైల్యాబ్లతో ప్రయోగాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ అంశాలకు సంబంధించి బోలెడంత సమాచారం సేకరించారు. బయో మెడికల్ సమాచా రాన్ని సేకరించడమే లక్ష్యంగా పలు పరిశోధనలు జరిగాయి. ఉదాహరణకు ప్రస్తుత అంతరిక్ష యాత్రలో విల్మోర్ సైక్లింగ్, రోయింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలను కలిపి చేయగల ఒక పరికరాన్ని ఐఎస్ఎస్లో ఏర్పాటు చేయడానికి సాయ పడ్డారు. ఎక్కువ సమయం ఇక్కడ గడపాల్సిన వ్యోమ గాములు ఈ పరికరం ద్వారా వ్యాయామాలు చేస్తే కండ రాలు, ఎముకలు మరీ గుల్లబారకుండా ఉంటాయి. గుండెకూ మేలవుతుంది. గుండె కొట్టుకునే వేగం, శ్వాస, రక్త పోటు వంటి... గుండె–రక్తనాళాలకు సంబంధించిన డేటాను సేకరించడానికీ, ఉష్ణోగ్రతలను వ్యోమగాములు వేసుకునే దుస్తుల్లో ఉంచిన సెన్సార్ల ద్వారా రాబట్టేందుకూ ఉద్దేశించిన ప్రయోగం కూడా జరిగింది. భవిష్యత్తులో మనిషి జాబిల్లిపై, అంగారకుడిపై నివసించాల్సి వస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారి పరమావధిగా ఉండనుంది. 1970, 1980లలో సోవియట్ యూనియన్ , అమెరికన్ల అంతరిక్ష కేంద్రాల అనుభవం తరువాత ఇది చాలా ఖరీదైన వ్యవహారమని వారికి అర్థమైంది. ఈ కారణంగానే ఐఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణ రెండింటినీ అంతర్జాతీయ స్థాయికి చేర్చి పలు దేశాలు పాల్గొనేలా చేశారు. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ, రాస్కోమాస్లు ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. ఆయా ఏజెన్సీలు అందించిన పరిక రాల నిర్వహణ బాధ్యత వారిదే. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అరవై ప్రయోగాల ద్వారా ఐఎస్ ఎస్‌ను 21 దేశాలకు చెందిన 260 మంది వ్యోమగాములు సందర్శించారు. భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా త్వరలోనే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. ఐఎస్ఎస్ 2030 వరకూ పని చేయనుంది. చైనా ఇప్పటికే ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా... 2035 నాటికి ఒక కేంద్ర నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మొదలైన అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఆలోచన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు! అంతరిక్ష ప్రయోగాల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే ప్రయోగాలు జరగనున్నాయి. స్పేస్ ఎక్స్, బోయింగ్ వంటివి సరుకు రవాణా కోసం ప్రత్యే కమైన నౌకలను సిద్ధం చేయనున్నాయి. నాసాతో కలిసి పని చేస్తున్న ఈ రెండు సంస్థలూ ఐఎస్ఎస్ నిర్వహణతోపాటు జాబిల్లి, అంగారకుడిపైకి చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిన నేపథ్యంలో బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నాసా అధ్యక్షుడు అయ్యే పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాల్లో మరింత ఎక్కు వగా పాల్గొనే అవకాశాలున్నాయి. వీరందరూ సునీత, విల్మోర్ల అనుభవం నుంచి లబ్ధి పొందనున్నారు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
గొప్ప మనసు చాటుకున్న డోనాల్డ్ ట్రంప్
-
సునీతకు ట్రంప్ సొంత డబ్బు ఇస్తానని ఎందుకు ప్రకటించారు?
వాషింగ్టన్: అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయి.. ఎట్టకేలకు నాసా-స్పేస్ఎక్స్ ప్రయోగం ద్వారా తిరిగి భూమ్మీదకు రాగలిగారు బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌లు. బైడెన్ హయాంలో వాళ్లను వెనక్కి రప్పించడంలో నాసా విఫలం కాగా.. ఆ పనిని తాము చేశామంటూ ట్రంప్ ప్రభుత్వం గర్వంగా ప్రకటించుకుంది. అయితే వాళ్లకు చెల్లించాల్సిన జీతభత్యాలపై విమర్శలు రావడంతో స్వయంగా అమెరికా అధ్యక్షుడే స్పందించాల్సి వచ్చింది.వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్లు అంతరిక్షంలో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు గడిపారని.. అందుకుగానూ వాళ్లకు జీతభత్యాలేవీ అందలేదని పాత్రికేయులు తాజాగా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఆయన.. అవసరమైతే తన సొంత డబ్బును వాళ్లకు చెల్లిస్తానంటూ ప్రకటించారు. ఈ క్రమంలోనే వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయపడిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్‌కు కృతజ్ఞతలు తెలిపారు.నాసా ఎంత జీతం ఇస్తోందంటే.. నాసా ఉద్యోగులు ఫెడరల్ ఉద్యోగుల కిందకు వస్తారు. శాలరీలు, అలవెన్స్‌లు.. ఇలాంటి వాటి విషయంలో వ్యోమగాములు భూమ్మీద విధుల్లో ఉన్నప్పుడు, అలాగే అంతరిక్ష ప్రయోగాల టైంలో నాసా ఒకేలా చూస్తుంది. ఈ లెక్కన ఐఎస్ఎస్లో సునీత, విల్మోర్లకు ఒకే తరహా జీతాలు ఉంటాయి. అదనంగా వాళ్లకు చెల్లించేది ఏదైనా ఉంటే.. అది డెయిలీ స్టైఫండ్ కొంత మాత్రమేనని(రోజుకి 4 డాలర్లు.. మన కరెన్సీలో రూ.347) మాత్రమేనని నాసా వ్యోమగామి ఒకరు వెల్లడించారు. కాబట్టి.. 287 రోజులు అంతరిక్షంలో గడిపిన సునీతా విలియమ్స్‌కు శాలరీ ప్రత్యేకంగా నాసా ఏమీ చెల్లించదు. కాకుంటే.. ఇరువురికి డెయిలీ స్టైఫండ్ కింద 1,148 డాలర్లు(లక్ష రూపాయలు) చెల్లిస్తారంతే.ఇప్పుడు వాళ్లకు వచ్చేది ఎంతంటే..అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(NASA)లో బచ్ విల్మోర్, సునీతా విలియమ్స్‌లు జీఎస్(General Schedule)-15 పే గ్రేడ్ ఉద్యోగులుగా ఉన్నారు. నాసాలో అత్యధిక జీతం అందుకునే ఉద్యోగులు ఈ గ్రేడ్ కిందకే వస్తారు. వీళ్లకు ఏడాదికి 1,25,133 - $1,62,672 డాలర్ల జీతం (మన కరెన్సీలో Rs 1.08 కోట్ల నుంచి Rs 1.41 కోట్ల దాకా) ఉంటుంది. ఈ 9 నెలలు ఐఎస్ఎస్లో గడిపినందుకు రూ.81 లక్షల నుంచి రూ.కోటి 5 లక్షల దాకా ఇద్దరికీ అందుతుంది. అది డెయిలీ స్టైఫండ్ కలిపి చూస్తే రూ.82 లక్షల నుంచి రూ.కోటి 6 లక్షల దాకా ఉండొచ్చు. అయితే..నాసా డ్యూటీ అవర్స్ 8 గంటలు మాత్రమే. కానీ, అనివార్య పరిస్థితుల్లో ఐఎస్ఎస్లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్లు అదనపు పని గంటలు చేయాల్సి వచ్చింది. అయితే ఫెడరల్ ఉద్యోగుల మార్గదర్శకాల ప్రకారం.. వాళ్లకు ఆ అదనపు పని గంటలకుగానూ ఎలాంటి జీతం చెల్లించడానికి వీల్లేదు. దీనిపై విమర్శలు రావడం మొదలైంది. అందుకే ట్రంప్ ఆ సమయాన్ని ఓవర్ టైం కింద చెల్లిస్తానని ఇప్పుడు ప్రకటించారు.కిందటి ఏడాది జూన్‌లో నాసా మిషన్ కింద సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి వెళ్లారు. సాంకేతిక సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి రాగా.. నాసా క్రూ 10 మిషన్ ప్రయోగం ద్వారా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయోగంలో భాగంగా.. మార్చి 19వ తేదీ తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ వాళ్లతో పాటు మరో ఇద్దరు వ్యోమగాములను కూడా సేఫ్‌గా భూమ్మీదకు తీసుకొచ్చింది. -
సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ తరువాత వీరు భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్‌మీద వెళ్లి తొమ్మినెలలపాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్ వ్యాఖ్యానించారు. అయితే వారిని భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇపుడు వాళ్లకి గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని సూచించారు.అయితే వారి భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యాయామానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి వారి కండరాలు, చలనంపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్. అంతేకాదు సునీత, విల్మోర్ మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది! -
Sunita Williams: సునీతా విలియమ్స్ ప్రయాణాన్ని గుర్తుచేసే మిథిలా పెయింటింగ్
పట్నా: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) తొమ్మిది నెలల తరువాత అంతరిక్షం నుంచి భూమికి తిరిగివచ్చారు. ఈ నేపధ్యంలో ఆమె అంతరిక్ష ప్రయాణాన్ని వర్ణిస్తూ బీహార్‌లోని సమస్తీపూర్‌కు చెందిన కుందన్ కుమార్ రాయ్ అద్భుత రీతిలో మిథిలా పెయింటింగ్ రూపొందించారు.కుందన్ కుమార్ రాయ్(Kundan Kumar Roy) మిథిలా పెయింటింగ్‌లను తీర్చిదిదద్డంలో ఎంతో పేరు గడించారు. ఆయన తాజాగా రూపొందించిన పెయింటింగ్‌లో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులు కూడా ఉన్నారు. వారంతా ఒక చేప లోపల ఉన్నట్లు కుందన్ రాయ్ చిత్రీకరించారు. సునీతా విలియమ్స్ గౌరవార్థం రూపొందించిన ఈ పెయింటింగ్ కారణంగా కుందన్ రాయ్ మరోమారు వార్తల్లో నిలిచారు. టోక్యో ఒలింపిక్ సమయంలో కుందర్ రాయ్ రూపొందించిన భారతీయ క్రీడాకారుల చిత్రాలు ఎంతో ఆదరణ పొందాయి.కుందర్ రాయ్ కలర్ బ్లైండ్నెస్ బాధితుడు. అయితే అతని కళాభిరుచికి ఈ లోపం అతనికి అడ్డుకాలేదు. సాధారణంగా మిథిలా పెయింటింగ్‌లో నలుపు, తెలుపు రంగులనే వినియోగిస్తుంటారు. అయితే కుందన్ రాయ్ ఇతర వర్ణాలను కూడా వినియోగిస్తూ ఎన్నో అద్భుత చిత్రాలను రూపొందించారు. ఈయన రూపొందిన చిత్రాలు పలు ప్రదర్శనల్లో ప్రదర్శితమయ్యాయి. తాజాగా ఆయన రూపొందించిన సునీతా విలియమ్స్ పెయింటింగ్ అందరి అభినందనలను అందుకుంటోంది.ఇది కూడా చదవండి: Rajasthan: కారుపై డంపర్ బోల్తా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి -
సునీతా స్పేస్ ప్రయాణం.. బైడెన్ భారీ కుట్ర?
-
నిరీక్షణ ఫలించిన క్షణం...
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు ‘రాశి చక్రగతులలో/రాత్రిందివాల పరిణామాలలో/ బ్రహ్మాండ గోళాల పరిభ్రమణాలలో/ కల్పాంతాలకు పూర్వం కదలిక పొందిన/ పరమాణువు సంకల్పంలో...’ ప్రభ వించిన మానవుడు మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. కేవలం ఎనిమిది రోజులని భావించింది కాస్తా 286 రోజులపాటు అంతరిక్షంలో ఉండిపోక తప్పని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, వారిని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళిన మరో ఇద్దరూ నిర్దేశించిన సమయానికల్లా క్షేమంగా, సురక్షితంగా భూమ్మీదకు చేరుకోవడం సంక్లిష్టమైన సవాళ్లపై విజ్ఞాన శాస్త్రం సాధించిన అపూర్వ విజయం. మెక్సికో జలసంధి కెరటాల్లో వారిని తీసుకొచ్చిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూ్యల్ తేలియాడుతుండగా డాల్ఫిన్ల గుంపు దాని చుట్టూ వలయాకారంలో స్వాగతిస్తున్నట్టు తిరుగాడటం ఆహ్లాదాన్ని పంచింది. మంగళవారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)ను వీడి దాదాపు 16 గంటలు ప్రయాణించి భారత కాలమానం ప్రకారం తెల్లారు జామున 3.30కి చేరు కున్నారు. అంతరిక్షానికి రాకపోకలు సాగించటం, అక్కడున్నన్నాళ్లూ నిరంతర పరిశోధనల్లో నిమ గ్నులు కావటం ఒక అనుపమానమైన, అసాధారణమైన విన్యాసం. ఎంతో ఏకాగ్రత, మరెంతో ఆత్మ విశ్వాసమూ, ఓరిమి ఉంటే తప్ప ఆ పరిశోధనలు పరిపూర్తి చేయటం కష్టం. ఎంతో ఇరుకైన ఒక చిన్న స్థలాన్ని మిగిలిన వారితో పంచుకోక తప్పక పోవటం సామాన్య విషయం కాదు. నిరుడు జూన్ 5న అంతరిక్షయానం ప్రారంభం కాగా, ఆ మరునాడు అక్కడికి చేరుకుని ఐఎస్ఎస్లో ఈ వ్యోమ గాములు పని ప్రారంభించారు. సునీత ఇప్పటికే మూడుసార్లు అంతరిక్షయానం చేయటంతో పాటు ఒక దఫా ఐఎస్ఎస్ కమాండర్గానూ వ్యవహరించారు. సునీత, బుచ్ అంతరిక్షంలో చిక్కుకుపోయా రనటాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అంగీకరించటం లేదు. వారిని సురక్షితంగా దించేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూశామంటున్నది. వారికున్నంత ఆత్మవిశ్వాసం సాధారణ ప్రజలకుండదు. అందుకే సునీత రాక కోసం మానవాళి మొత్తం ఆదుర్దా ప్రదర్శించింది. అంతరిక్షయానం ఎనిమిది రోజులే అనుకుని వెళ్లి తొమ్మిది నెలలు ఉండక తప్పక పోవటమంటే అది వారి మానసిక స్థితిని మాత్రమే కాదు... శారీరక స్థితిగతులనూ ప్రభావితం చేస్తుంది. కేవలం ఎనిమిది రోజులకోసమైతే వారు సాధారణ వ్యాయామంతో సరిపెట్టుకోవచ్చు. అసలు చేయక పోయినా ఫరవాలేదంటారు. కానీ ఇంత సుదీర్ఘకాలం అక్కడ కొనసాగాలంటే మాత్రం శరీ రాన్ని బాగా కష్టపెట్టాలి. సుదీర్ఘ వ్యాయామం తప్పదు. గుండె, రక్తనాళాలూ సక్రమంగా పని చేయ టానికి అవి అవసరం. ఈ వ్యాయామాలు సహజంగానే కష్టంతో కూడుకున్నవి గనుక అందుకు వారిని మానసికంగా సంసిద్ధుల్ని చేయటంతోపాటు వారి దినచర్యలో అవసరమైన మార్పులు చేయాల్సి వస్తుంది. వారికి అందాల్సిన ప్యాకేజ్డ్ ఆహారం వివిధ రకాల రుచులతో సిద్ధంగానే ఉన్నా నచ్చింది తినడానికి లేదు. నిర్ణీత కొలతలో వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్నిటిని తట్టుకుంటూ, నిర్దిష్టమైన సమయాల్లో వ్యాయామాలు చేస్తూ పరిశోధనలు సాగించటం, అందులో వెల్లడైన అంశా లపై పరస్పరం చర్చించుకుని నిర్ధారణలకు రావటం అంతరిక్ష యాత్రికులకు తప్పనిసరి. ఇంతవరకూ మూడు దఫాలు అంతరిక్ష యాత్రకు వెళ్లిన సునీత మొత్తం 62 గంటల 6 నిమి షాలు స్పేస్ వాక్ చేశారంటే... ఆ రకంగా ఆమె మహిళా అంతరిక్ష యాత్రికుల్లో అగ్రస్థానాన్నీ, మొత్తం వ్యోమగాముల్లో నాలుగో స్థానాన్నీ పొందారంటే... అది సునీత దృఢసంకల్పానికి అద్దం పడుతుంది. ఈ అంతరిక్ష యానంలో భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో 900 గంటలపాటు ఆమె వివిధ రకాలైన 150 పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. ఈ తొమ్మిది నెలల్లో ఆమె పరిశోధనలు సాగించిన ఐఎస్ఎస్... భూకక్ష్యలో 4,576 సార్లు తిరగ్గా ఆ నిడివి 19 కోట్ల 40 లక్షల కిలోమీటర్లు! అబ్బురపరిచే విషయమిది. అవకాశం లభిస్తే స్త్రీలు అందరినీ మించుతారనడానికి సునీత ప్రతీక.ఈ అంతరిక్ష యాత్రలైనా, అంతరిక్ష నౌకల అన్వేషణలైనా... వాటి అంతిమ సారాంశం ఏక గ్రహజీవిగా ఉన్న మనిషిని బహు గ్రహజీవిగా మార్చటం. అంతరిక్షంలో సాగించే పరిశోధనలు భవి ష్యత్తులో మనుషులందరూ సునాయాసంగా గ్రహాంతర యానాలు చేయటానికి, అక్కడి పరిస్థితు లకు తట్టుకోవటానికీ తోడ్పడతాయి. ఈ యాత్రలు మున్ముందు మనుషుల్ని పోలిన గ్రహాంతర జీవులతో మనల్ని అనుసంధానించవచ్చు. 1906లో హెచ్‌జీ వెల్స్ రచించిన ‘వార్ ఆఫ్ ది వర్ల్›్డ్స’ నవల ఊహించినట్టు ఆ గ్రహాంతర జీవులు మనపైకి దండయాత్రకొచ్చే ప్రమాదమూ లేకపోలేదు.విశ్వం గురించిన మన జ్ఞానం పరిధి రోజురోజుకూ విస్తరిస్తోంది. కోట్లాది కాంతి సంవత్సరాల దూరంలో సైతం లెక్కలేనన్ని పాలపుంతలున్నాయని, భూమిని పోలిన గ్రహాల ఆచూకీ తెలిసిందని శాస్త్రవేత్తలు చెబుతుంటే ఎంతో విస్మయం కలుగుతుంది. రెక్కలు కట్టుకుని పైపైకి వెళ్లేకొద్దీ మన భూమి సూది మొన మోపినంత పరిమాణంలో కనిపిస్తుంది. అక్కడి నుంచి చూస్తే మనం కృత్రిమంగా ఏర్పర్చుకున్న సరిహద్దులు, ఆర్థిక సామాజిక తారతమ్యాలు కనబడవు. విషాదమేమంటే... ఎదిగినకొద్దీ విశాలం కావాల్సిన చూపు కాస్తా మూఢ విశ్వాసాల్లో, మూర్ఖత్వపు మలుపుల్లో సంకు చితమవుతోంది. నలుగురు వ్యోమగాములు సగర్వంగా భూమ్మీదకు తిరుగు పయనమైన రోజే 400 మంది అమాయక పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ బాంబుదాడుల్లో కన్నుమూశారంటే అది మనుషుల్లోని రాక్షసత్వాన్ని చాటుతుంది. ఇలాంటి విషాదాలకు తావులేని కాలం ఆగమిస్తే తప్ప ఈ విజయాలు మనకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలగజేయలేవు. -
సునీతను నడిపించిన హీరో!
-
Sunita Williams: ఆ తొమ్మిది నెలలు ఎలాంటి ఆహారం తీసుకున్నారంటే..?
తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో దాదాపు 288 రోజులు గడిపారు. నాసా ఎప్పటికప్పుడూ వారి బాగోగులను ట్రాక్ చేస్తూనే ఉంది. ఇరువురు తగినంత పోషకాహారాం తీసుకుంటున్నారా..? లేదా అనేది అత్యంత ముఖ్యం. ఈ విషయంలో నాసా తగిన జాగ్రత్తలు తీసుకోవడమే గాక వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను వెల్లడించేది కూడా. నిజానికి ఆ సున్నా గురుత్వాకర్షణలో వ్యోమగాములు ఆహారం తీసుకోవడంలో చాలా సవాళ్లు ఉంటాయి. మరీ వాటిని సునీతా విలియమ్స్, ఆమెతోపాటు చిక్కుకుపోయిన బుచ్ విల్మోర్ ఎలా అధిగమించారు. ఎలాంటి డైట్ తీసుకునేవారు తదితరాల గురించి తెలుసుకుందామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా, బుచ్ విల్మోర్ ప్రత్యేక డైట్‌ని ఫాలో అయ్యేవారు. ప్రత్యేక పద్ధతిలో నిల్వ చేసిన ఆహారాన్ని (Self-Sable Menu) తీసుకునేవారు. నివేదికల ప్రకారం.. సునీతా పిజ్జా, రోస్ట్ చికెన్, రొయ్యలు, కాక్టెయిల్స్ వంటి కంఫర్ట్ ఫుడ్స్ తీసుకునేవారు. అవన్నీ నాసా స్పేస్ ఫుడ్ సిస్టమ్స్ లాబొరేటరీలో ప్రత్యేకంగా తయారు చేసిన వంటకాలు. పాడవ్వకుండా నిల్వ ఉండే ఈ ఆహారాన్ని ఫుడ్ వార్మర్ ఉపయోగించి వేడిచేసుకుని ఆస్వాదిస్తే చాలు.ఎంత పరిమాణంలో తీసుకుంటారంటే..వ్యోమగామి రోజువారీగా 3.8 పౌండ్ల పౌండ్ల మేర ఆహారం తీసుకునేలా కేర్ తీసుకుంటారు. దీన్ని ఆయా వ్యక్తుల పోషకాల పరిమితి మేర నిర్ణయిస్తారు నాసా అధికారులు. అయితే విలియమ్స్ ఆ పరిమితి పరిధిలోనే తగినంత ఆహారం తీసుకునేలా కేర్ తీసుకున్నారు. అయితే ఆ వ్యోమగాములు ఎనిమిది రోజులు ఉండటానికి వెళ్లి సుదీర్ఘకాలం చిక్కుకుపోవాల్సి రావడంతో మొదటలో తాజా పండ్లు, తాజా ఆహారం తీసుకున్నారు. మూడు నెలలు తర్వాత మాత్రం డ్రై కూరగాయాలు, పండ్లపై ఆధారపడక తప్పలేదు. ఇక బ్రేక్‌ఫాస్ట్‌లో పొడిపాలతో కూడిన తృణధాన్యాలను తీసుకునేవారు. ఇక ప్రోటీన్ల పరంగా మాత్రం వండేసిన ట్యూనా, మాంసం ఉంటాయి. అంతరిక్షంలో భూమ్మీద ముందే వండేసిన వంటకాలనే పాడవ్వకుండా ఉండేలా తయారు చేసుకుని తీసుకువెళ్తారు. అక్కడ జస్ట్ వేడి చేసుకుని తింటే సరిపోతుంది. ఇక అక్కడ ఉన్నంత కాలం వ్యోమగాములు దాదాపు 530-గాలన్ల మంచినీటి ట్యాంక్‌ని ఉపయోగించినట్లు సమాచారం.సుదీర్ఘకాల అంతరిక్ష ప్రయాణంలో తెలుసుకున్నవి..విలియమ్స తన మిషన్‌లో భాగంగా అత్యాధునిక ఆహారం గురించి పరిశోధన చేశారు. ముఖ్యంగా అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు తాజా పోషకాలతో కూడిన ఆహారం తీసుకునేలా మంచి బ్యాక్టీరియాను ఉపయోగించి మొక్కల పెంపకం, వ్యవసాయం వంటివి ఎలా చెయ్యొచ్చు. అక్కడ ఉండే తగినంత మేర నీటితోనే కూరగాయలు, పువ్వుల మొక్కలు ఎలా పెంచొచ్చు వంటి వాటి గురించి సమగ్ర పరిశోధన చేశారు. అంతేగాదు ఆ మైక్రోగ్రావిటీలో "ఔట్రెడ్జియస్" రోమైన్ లెట్యూస్ - అనే ఒక రకమైన ఎర్ర లెట్యూస్ మొక్కను పెంచడం వంటివి చేశారు కూడా. అడ్వాన్స్డ్ ప్లాంట్ హాబిటాట్ కార్యకలాపాలతో సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణాలకు మార్గం సుగమం చేయడమే గాక వ్యోమగాములకు ఉపకరించే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయగలిగే ఓ కొత్త ఆశను రేకెత్తించారు.(చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ..) -
సునీతా విలియమ్స్, విల్మోర్ కు వైఎస్ జగన్ అభినందనలు
-
సునీత విలియమ్స్ ఐకాన్ మోదీ ప్రశంసలు
-
Sunita Williams: సునీతకు మరో గండం!
-
వెండితెరపై సునీత విలియమ్స్ బయోపిక్?
సునీతా విలియమ్స్ (Sunita Williams).. ఈ పేరు ఇప్పుడు యావత్ ప్రపంచం మొత్తం మారోమోగిపోతోంది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలల పాటు అంతతరిక్షంలోనే గడిపి మంగళవారం(భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 2.41 గంటలకు) స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో భూమి మీదకు వచ్చింది. సునీత క్షేమంగా రావాలంటూ యావత్ ప్రపంచం కోరుకుంది. ఆమె క్షేమంగా భూమి మీదకు చేరుకుందనే వార్త తెలియగానే సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?)ఆమె చేసిన సేవలను, సాహసాలను కొనియాడుతూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతుందట. ఆమె చేసిన సాహోసోపేతమైన యాత్రలను వెండితెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నయట. ఇప్పటికే బాలీవుడ్‌కి చెందిన పలువురు దర్శక నిర్మాతలు సునీత లైఫ్ జర్నీని కథగా మలిచే పనిలో పడ్డారట. బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ సునీతా విలియమ్స్ బయోపిక్ గురించి చర్చలు జరుగుతున్నాయట. సునీత విలియమ్స్ జీవితంలోని స్ఫూర్తిదాయక అంశాలు, ఆమె శిక్షణ, నాసాలో చేరడం, అంతరిక్షంలో 322 రోజులు గడపడం, మరియు భూమికి సురక్షితంగా తిరిగి రావడం.. ఈ అంశాలతో భారీ బడ్జెట్లో ఓ సినిమా చేసేందుకు బాలీవుడ్‌కి చెందిన బడా డెరెక్టర్ ఆసక్తి చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్‌తో సునీతకు సంబంధం ఉండడంతో ఆమె బయోపిక్‌ని ఇక్కడ కచ్చితంగా ఆదరిస్తారని సదరు దర్శకుడు బలంగా నమ్ముతున్నాడట. మరి సునీతా బయోపిక్ వచ్చేది హాలీవుడ్ లోనా? లేదా బాలీవుడ్లోనా? చూడాలి. -
సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!
భారత సంతతికి చెందిన నాసా(Nasa) వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) తొమ్మిది నెలల తరువాత ఎట్టకేలకు సురక్షితంగా భూమి మీదకి చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా ఫ్లోరిడా తీరంలో మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్‌తో కలిసి ల్యాండ్ అయ్యారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు కూడా అమితానందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీతా సమీప బంధువు ఫల్గుణి పాండ్యా ఎన్డీటీవీతో మాట్లాడుతూ తన సంతోషాన్ని ప్రకటించారు అంతేకాదు ఖచ్చితమైన తేదీ తెలియదు కానీ త్వరలో భారతదేశంలో సునీతా పర్యటిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని గుజరాత్‌లోని ఆమె తండ్రి దీపక్ పాండ్యాకు పూర్వీకుల ఇల్లు ఉందని గుర్తు చేశారు. 286 రోజుల అంతరిక్షయానం తర్వాత నాసా వ్యోమగామి ఇంటికి తిరిగి రావడం గురించి ఆమె మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి ఆమె తిరిగి వస్తుందని తెలుసు. తన మాతృదేశం, భారతీయుల ప్రేమను పొందుతుందని కూడా తనకు తెలుసన్నారు.కలిసి సెలవులకు రావాలని కూడా ప్లాన్ చేస్తున్నాం, కుటుంబ సభ్యులతో గడబబోతున్నామని చెబతూ త్వరలో ఇండియాను సందర్శిస్తామని ఫల్గుణి ధృవీకరించారు. సునీత విలియమ్స్ మళ్ళీ అంతరిక్షంలోకి వెళ్తారా లేదా అంగారకుడిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి అవుతారా అని అడిగినప్పుడు, అది ఆమె ఇష్టం అన్నారు. వ్యోమగామిగా తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ది బెస్ట్‌గా పనిచేస్తుందని,"ఆమె మనందరికీ రోల్ మోడల్" ఆమె ప్రశంసించారు. సెప్టెంబర్ 19న అంతరిక్షంలో ఆమె 59వ పుట్టినరోజును జరుపుకున్నారనీ, ఈసందర్భంగా భారతీయ స్వీట్ కాజు కట్లిని పంపినట్లు కూడా ఆమె చెప్పారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళాను అంతరిక్షంనుంచి వీక్షించినట్టు కూడా చెప్పారన్నారు.సునీతా విలియమ్స్ అంతరిక్ష కేంద్రంలో సమోసాలు తీసుకెళ్లిన తొలి వ్యోమగామి కాబట్టి, ఆమె కోసం 'సమోసా పార్టీ' ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానని కూడా చమత్కరించడం విశేషం. గత ఏడాది జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ వెళ్లారు. రౌండ్‌ట్రిప్‌గా భావించారు. అయితే, అంతరిక్ష నౌక ప్రొపల్షన్ సమస్యలను నేపథ్యంలో అది వెనక్కి తిరిగి వచ్చేసింది. చివరకు ఇద్దరు వ్యోమగాములను NASA-SpaceX Crew-9 మిషన్ ద్వారా భూమికి చేరిన సంగతి తెలిసిందే. -
Sunita William పూర్వీకుల ఇల్లు ఇదే! వైరల్ వీడియో
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో (మార్చి 19 ఉదయం) అంతరిక్షం నుండి తిరిగి రావడం ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంతోషాన్ని నింపింది. నిజంగా దివి నుంచి భువికి వచ్చిన దేవతలా స్పేస్ఎక్స్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి, చిరునవ్వులు చిందించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈనేపథ్యంలోనే ఆమె పూర్వీకులు, ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినది అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా, గుజరాత్‌లోని ఝులసన్ గ్రామానికి చెందినవారు. ఇక్కడే ఆమె పూర్వీకుల ఇల్లు (Ancestral Home) ఉంది. తొమ్మిది నెలల ఉత్కంఠ తరువాత ఆమె సురక్షితంగా భూమికి తిరిగి రావడంతో ఆ గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఆమె రాకను ప్రత్యక్షంగా చూడటానికి గ్రామం మొత్తం ఒక ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన టీవీల ముందు గుమిగూడి సునీతను చూడగానే ఆనందంతో కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో విశేషంగా నిలిచింది. View this post on Instagram A post shared by India Today (@indiatoday) ఇది సునీత తండ్రి దీపక్ పాండ్య పూర్వీకులకు సంబంధించిన ఇల్లుగా భావిస్తున్నారు. ఇండియా టుడే షేర్ చేసిన వీడియో ప్రకారం, సునీత పూర్వీకుల ఇల్లు ఇప్పటికీ ఉంది. అయితే, ఎత్తైన ఈ ఇంటికి చాలా కాలంగా ఇల్లు లాక్ చేయబడి ఉండటం వల్ల కొంచెం పాతబడినట్టుగా కనిపిస్తోంది. అక్కడక్కడా పగుళ్లు కూడా ఉన్నాయి. అయితే సునీతకు భారతదేశంతో ఉన్న అనుబంధానికి నిదర్శనం. 1958లో ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లడంతో ఇంటికి సరైన నిర్వహణలేకుండా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ అది దృఢంగానే కనిపిస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునీత విలియమ్స్‌ను భారత్ రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆమె, సొంత గ్రామానికి వస్తారా? పూర్వీకుల ఇంటిని సందర్శిస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.సమోసా పార్టీసునీతా విలియమ్స్ వదిన, ఫల్గుణి పాండ్యా ఈ క్షణాన్ని 'అద్భుతం'గా అభివర్ణించారు. త్వరలో ఆమె కుటుంబం త్వరలో భారతదేశాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా తమ పూర్వీకుల గ్రామం ఝులసన్తో బలమైన సంబంధాన్ని ఆమె గుర్తు చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సమోసా తిన్న మొదటి వ్యక్తి సునీత కాబట్టి, ఆమె సురక్షితంగా తిరిగి రావడాన్ని పండుగలా జరుపుకునేందుకు కుటుంబం సమోసా పార్టీ ఇస్తుందని కూడా ఆమె చమత్కరించారు. చదవండి: సునీతా త్వరలో ఇండియాకు వస్తారు.. సమోసా పార్టీ కూడా!తొమ్మిది నెలలు అంతరిక్షంలోనేఒక వారం రోజుల మిషన్‌మీద రోదసిలోకి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకు పోయారు. తొమ్మిది నెలల తర్వాత, వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి భూమికి తిరిగి వచ్చారు. అచంచలమైన ధైర్య సాహసాలు, అకుంఠిత దీక్ష, అంకితభావంతో సునీతా విలియమ్స్ ఒక రోల్‌మోడల్‌గా నిలిచారు.చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు? -
సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) 9 నెలల 14 రోజులపాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. సుదీర్ఘకాలం తరువాత ఆమె భూమికి చేరుకోవడంతో ప్రపంచమంతా ఆమెను అభినందిస్తోంది. అచ్చం ఇదే ఉదంతాన్ని పోలిన ఆంగ్ల సినిమా ‘ది మార్టిన్’ 2015లో విడుదలయ్యింది.ఈ సినిమాలో హీరో అంతరిక్ష ప్రయాణానికి వెళ్లి వ్యోమనౌక(Spaceship)లోని సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోతాడు. దీని తర్వాత కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రం ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం మంచి వసూళ్లను కూడా రాబట్టింది. దర్శకుడు రాడ్లీ స్కాట్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ కావడంతో పాటు పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా- 2016 ఆస్కార్ అవార్డులలో ఏడుకుపైగా టైటిళ్లను దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా నామినేషన్లను అందుకుంది. 40కి పైగా అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా కథను డ్రూ గార్ఫీల్డ్, ఆండీ వీర్ రూపొందించారు. మాట్ డామన్, జెస్సికా చస్టెయిన్, క్రిస్టీన్ వింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.‘ది మార్టిన్’(The Martian) సినిమా కథ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రను పోలివుంటుంది. ఈ సినిమా కథలో మార్క్ వాట్నీ అనే వ్యోమగామి తన సిబ్బందితో కలిసి అంతరిక్ష మార్స్ మిషన్‌కు వెళతాడు. అయితే మార్గం మధ్యలో అనుకోని పరిస్థితుల్లో సిబ్బంది నుంచి వేరయిపోతాడు. తరువాత మార్క్ వాట్నీ ఒక గ్రహంపైకి అడుగుపెడతారు. ఈ నేపధ్యంలో మార్క్ వాట్నీ చనిపోయాడని నాసా భావిస్తుంది. అయితే ఆ గ్రహం మీద ఉన్న మార్క్ వాట్నీ తన మనుగడ కోసం అన్నిరకాలుగా ప్రయత్నిస్తాడు. ఇలా కొంతకాలం గడిచాక మార్క్ భూమిపైకి దిగడంలో విజయం సాధిస్తాడు. ఈ సినిమా.. ప్రేక్షకులకు అంతరిక్ష ప్రయాణ అనుభూతినిస్తుంది. అంతరిక్ష ప్రపంచంలో సినిమాటిక్ టూర్ చేయాలనుకున్నవారు ఈ సినిమాను చూడవచ్చు.ఇది కూడా చదవండి: Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్ అయ్యింది: ప్రధాని మోదీ -
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
సునీతా విలియమ్స్‌కు స్పేస్ సెంటరే కుటుంబం అంటారు ఆమె ఫ్యామిలీ మెంబర్స్. ఆమెకు ఏది ఇష్టమో తమకు అదే ఇష్టం అని చెబుతారు. తండ్రి దీపక్ పాండ్యా, తల్లి ఉర్సులిన్ బోనీ పాండ్యా (Ursuline Bonnie Zalokar) వారి ముగ్గురు సంతానంలో సునీత చిన్నది. అన్నయ్య జె.థామస్‌తో పాటు అక్క దీనా ఆనంద్ ఉన్నారు. అమెరికాలోనే జన్మించిన సునీత చదువు అంతా అక్కడే సాగింది. చదువు పూర్తయ్యాక తండ్రి దీపక్ పాండ్యా (Deepak Pandya) సూచనలతో అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యారు.నేవీలో పనిచేస్తున్న సమయంలోనే మైఖేల్ జె.విలియమ్స్ (Michael J. Williams)తో పరిచయం స్నేహంగా మారింది. వివాహ బంధంతో ఒక్కటై 20 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. టెక్సాస్‌లోని హ్యూస్టన్ శివారులో నివసిస్తున్నారు. ఈ జంటకు పిల్లలు లేరు. ఒక అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఉందని చెప్పే సునీతకు పెంపుడు కుక్క గార్బీ అంటే చాలా ఇష్టం. గార్బీతో ఉన్న ఫొటోలను సునీత తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. 2006లో మొదటిసారి తనతో పాటు భగవద్గీతను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది. 2012లో ఓం సింబల్ తీసుకెళ్లినట్టు చెప్పిన సునీత గణేష్ విగ్రహాన్ని ఎప్పుడూ తనకు తోడుగా తీసుకెళుతుందట. సునీత విశ్వాసాలకు విలియమ్స్ మద్దతు ఇస్తాడు. తల్లి బోనీ పాండ్యా కూతురి గురించి వివరిస్తూ.. ‘ఆమె సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటంపై మాకు ఎలాంటి ఆందోళన లేదు. విధి నిర్వహణలో భాగంగా కష్టపడి పనిచేస్తుంది. కూతురి నుండి చాలా కాలం దూరంగా ఉండటం మొదట్లో కష్టమయ్యేది. కానీ, ఇప్పుడు అది అలవాటయ్యింది. తను తనకు ఇష్టమైనది చేస్తోంది. అలాంటప్పుడు నేను బాధపడటం అంటూ ఉండదు. తన ప్రయత్నాల్లో తను ఉన్నందుకు సంతోషంగా ఉంది. నేను ప్రత్యేకించి ఆమెకు ఎటువంటి సలహాలు ఇవ్వను. ఎందుకంటే, ఏం చేయాలో తనకే బాగా తెలుసు. అంతా సవ్యంగానే జరుగుతుంది’ అని ధీమాను వ్యక్తం చేస్తారు ఆమె తల్లి బోనీ పాండ్యా.బాల్యం నుంచి ధైర్యం ఎక్కువసునీతా విలియమ్స్ (Sunita Williams) తిరిగి భూమి పైకి వస్తున్న వార్త గురించి యావత్ ప్రపంచం స్పందన ఒకటే... ‘చాలా సంతోషంగా ఉంది’ అయితే ఇండియాలోని ఆమె కజిన్ మాత్రం ‘భయంగా ఉంది’ అంటున్నాడు. ‘వీలైనంత త్వరగా ఆమె భూమి మీదికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకో నాకు భయంగా ఉంది. ఆమె చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అంటున్నాడు దినేష్ రావత్.సుదీర్ఘమైన ప్రయాణం తరువాత భూమికి తిరిగి వస్తున్న సునీతా విలియమ్స్ ఆ తర్వాత విపరీతమైన శారీరక మార్పులను ఎదుర్కొనే అవకాశం ఉందనే ఆందోళన నేపథ్యంలో ఆయన ‘భయం’ అనే మాట వాడాడు. సునీతా విలియమ్స్ బాల్యాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘సునీత చిన్నప్పుడు మా దగ్గరికి వచ్చింది. నేను ఆమెను ఒంటె సవారీలకు తీసుకువెళ్లేవాడిని. సవారీ అయిపోయిన తరువాత కూడా దిగేది కాదు! సోమనాథ్ తీర్థయాత్రలతో పాటు దేశంలోని వివిధప్రాంతాలకు వెళ్లాం. సునీతకు చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆమె తరచుగా నా చెయ్యి పట్టుకునేది. ఎందుకు ఇలా? అని అడిగితే నాన్నలా అనిపిస్తావు అని చెప్పింది’ అంటూ ఆ జ్ఞాపకాల్లోకి వెళ్లాడు దినేష్ రావత్.మా తరానికి స్ఫూర్తిప్రదాతనేను స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచి సునీతా విలియమ్స్ గురించి చదువుతూ పెరిగాను. సైంటిస్ట్ (Scientist) కావాలనుకునే మహిళల సంఖ్య తక్కువగా ఉన్న రోజుల్లో కల్పనాచావ్లా భారతీయ మహిళల్లో కొత్త ఆలోచన రేకెత్తించారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చేసిన పరిశోధనలు స్ఫూర్తినిచ్చాయి. మనదేశంలో అంతరిక్షం, పరిశోధన రంగాలను కెరీర్ ఆప్షన్స్‌గా ఎంచుకునే యంగ్ జనరేషన్ తయారైంది. మా తరం అలా తయారైనదే.సైంటిస్ట్‌గా సునీతా విలియమ్స్ ఒక రోల్‌మోడల్. అకుంఠిత దీక్ష, అంకితభావంతో పని చేయడం, అంతరిక్ష పరిశోధనల ద్వారా కొత్త విషయాలను ఎక్స్ప్లోర్ చేయడంలో ఆమెకున్న ఆసక్తి, వాటిని ఛేదించడానికి చూపించే చొరవ అమోఘం. స్టెమ్ ఫీల్డ్‌లో భవిష్యత్తు తరాలు ఆమె అడుగుజాడల్లో నడుస్తాయి. మగవాళ్ల ఆధిపత్యం కొనసాగుతున్న రంగంలో మహిళ కూడా విజయవంతంగా రాణించగలరని సునీతా విలియమ్స్ తన పరిశోధనల ద్వారా నిరూపించారు. – శరణ్య. కె. సైంటిస్ట్, బయోటెక్నాలజీ -
మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి గర్విస్తున్నాం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అభినందనలు తెలిపారు. సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్కు కూడా అభినందనలు తెలియజేశారు. మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి మేము గర్విస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు.సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్లు.. ఎట్టకేలకు మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు వచ్చారు #sunitawilliamsreturn. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రధాని మోదీ సైతం వెల్‌కమ్‌బ్యాక్ సునీత అంటూ అభినందనలు తెలియజేశారు. -
భూమి మీదకు రాగానే.. స్విమ్మింగ్ పూల్‌లోనే ఎక్కువ సమయం ఎందుకు?
స్పేస్ ట్రావెల్ టాస్క్ ముందు పురుషులకే పరిమితమై దాన్ని ‘మ్యాన్ మిషన్’గా వ్యవహరించేవాళ్లు. కానీ ఆస్ట్రనాట్స్కిచ్చే ట్రైనింగ్‌లో ఆడ, మగ అనే తేడా ఉండదు. ఇద్దరూ ఒకేరకమైన శక్తితో ఉంటారు. ఇంకా చెప్పాలంటే శారీరకంగా, మానసికంగా పురుషుల కన్నా స్త్రీలే బెటర్. అందుకే ఇప్పుడు దాన్ని ‘హ్యుమన్ మిషన్’ పేరుతో జెండర్ న్యూట్రల్ (Gender Neutral) చేశారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్‌గా ఉన్న వాళ్లనే స్పేస్‌కి సెలెక్ట్ చేసుకుంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ దగ్గర్నుంచి అక్కడ పరిస్థితి, అనుకోని అవాంతరాలను ఎదుర్కోవడం వరకు ట్రైనింగ్ చాలా టఫ్‌గా ఉంటుంది.ఆస్ట్రనాట్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. అందుకే ఒకవేళ మిషన్ ఫెయిలైతే స్పేస్ షిప్ (Space Ship) నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా శిక్షణ ఇస్తారు. ఇదీ వాళ్ల మానసిక, శారీరక దారుఢ్యం మీదే ఆధారపడి ఉంటుంది. వీటన్నిటిలో సునీతా విలియమ్స్ (Sunita Williams) పర్ఫెక్ట్. కాబట్టే స్పేస్ స్టేషన్‌కి వెళ్లారు. అయితే ఎనిమిది రోజులు మాత్రమే ఉంటామనే మైండ్‌సెట్‌తో వెళ్లిన వాళ్లు తొమ్మిది నెలలు ఉండిపోవాల్సి వచ్చింది. అలా స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్‌ను నాసా వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తునే ఉన్నారు.ఆహారం దగ్గర్నుంచి వాళ్ల అవసరాలన్నీ కనిపెట్టుకున్నారు. ఫిజికల్ ఫిట్నెస్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకే వాళ్లక్కడ క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేశారు. వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకునేందుకు కావల్సిన సౌకర్యాలన్నీ స్పేస్ స్టేషన్లో ఉన్నాయి. నాసా డాక్టర్స్ సలహాలు, సూచనల మేరకు వాళ్లు తమ హెల్త్ కండిషన్స్‌ను చెక్ చేసుకుంటూ ఉన్నారు. మూడు నెలలకోసారి ఫుడ్, మెడిసిన్స్‌ను స్పేస్ స్టేషన్‌కి పంపారు. వాళ్ల మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనోస్థైర్యం కోల్పోకుండా చూసుకున్నారు.స్విమ్మింగ్ పూల్... లిక్విడ్ ఫుడ్తొమ్మిది నెలలు భారరహిత స్థితికి అలవాటు పడిన వాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా భూమి మీది వాతావరణంలో ఇమడ లేరు. ఎముకలు, కండరాలు బలహీనమైపోతాయి. ఫ్యాట్ కనీస స్థాయికి తగ్గిపోయుంటుంది. భూమి మీదకు రాగానే ముందు వాళ్లకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఎముకలు, కండరాల పటుత్వానికి మెడిసిన్స్ ఇస్తారు. ఇన్నాళ్లూ భారరహిత స్థితిలో ఉండటం వల్ల వాళ్లు నిలబడలేరు.. కూర్చోలేరు.. పడుకోలేరు. అలా ఫ్లోటింగ్ స్థితిలోనే ఉండిపోతారు.అందుకే వాళ్లకు బెల్ట్ లాంటిది పెట్టి.. కూర్చోబెడతారు. దాని సాయంతోనే పడుకోబెడతారు. నిలబడ్డానికీ అలాంటి సపోర్ట్‌నే ఏర్పాటు చేస్తారు. ఈ వాతావరణానికి వీలైనంత త్వరగా అలవాటుపడేందుకు ఎక్కువ సమయం వాళ్లను స్విమ్మింగ్ పూల్‌లో ఉంచుతారు. నీళ్లలో తేలుతూ స్పేస్‌లో ఉన్నట్టే ఉంటుంది కాబట్టి.. వాళ్లను వాళ్లు సంభాళించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. దాదాపు మూడు నెలల వరకు ఇలాంటి ప్రాసెసే ఉంటుంది. దాన్నుంచి వాళ్లు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తారు. ఆహారం విషయంలోనూ అంతే! కొన్నాళ్లపాటు స్పేస్‌లో తీసుకున్నట్టే సెమీ లిక్విడ్ ఫామ్‌లోనే ఫుడ్ ఇస్తారు. – డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, సీనియర్ సైంటిస్ట్, అసోసియేట్ డైరెక్టర్, రేంజ్ ఆపరేషన్, ఇస్రోభూమికి తిరిగి వచ్చిన తరువాత... రివర్స్!సునీతా విలియమ్స్‌కు ఇష్టమైన సినిమా... టామ్ క్రూజ్ ‘టాప్ గన్’. ‘టాప్ గన్’ కిక్‌తో జెట్లు నడపాలనుకుంది. హెలికాప్టర్ నడపాలనుకుంది. ‘టెస్ట్ పైలట్ స్కూల్’కు హాజరై, ఆస్ట్రోనాట్స్‌తో మాట్లాడిన తరువాత తన మీద తనకు నమ్మకం వచ్చింది. చదవండి: గురుత్వాకర్షణ లేని కురుల అందంఒకానొక సందర్భంలో అంతరిక్ష వాతావరణంలో ఉన్నవారిపై చోటు చేసుకునే ఆశ్చర్యాల గురించి ఇలా చెప్పింది... ‘అంతరిక్షంలో శారీరక మార్పులు ఆసక్తికరంగా ఉంటాయి. నా జుట్టు, గోర్లు వేగంగా పెరగడాన్ని గమనించాను. ముఖంపై కొన్ని మడతలు తాత్కాలికంగా తొలగిపోతాయి. వెన్నెముకకు సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే భూమికి తిరిగి వచ్చిన తరువాత ఈ మార్పులు రివర్స్ అవుతాయి. వెన్ను కొద్దిగా నొప్పిగా ఉంటుంది’ అని పేర్కొంది. -
Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్ అయ్యింది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ బుధవారం తెల్లవారుజామున భూమికి తిరిగి వచ్చారు. అంతరిక్ష నౌకలో లోపం కారణంగా, వారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి తిరిగివచ్చిన వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు స్వాగతం పలుకుతూ ‘భూమి ఇన్నాళ్లూ మిమ్మల్ని మిస్ అయ్యింది’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ(Prime Minister Modi).. తాను సునీతా విలియమ్స్‌తో పాటు ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఇలా రాశారు ‘స్వాగతం, #Crew9! భూమి మిమ్మల్ని మిస్ అయింది. ఇది సహనం, ధైర్యం, అపరిమిత మానవ స్ఫూర్తికి పరీక్ష. సునీతా విలియమ్స్, #Crew9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏమిటో మనకు మరోసారి చూపించారు. వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. అంతరిక్ష పరిశోధన అంటే మానవ సామర్థ్య సరిహద్దులను అధిగమించడం. కలలు కనే ధైర్యం.. ఆ కలలను నిజం చేసే ధైర్యం కలిగి ఉండటం. సునీతా విలియమ్స్ ఒక ట్రైల్బ్లేజర్(ఆవిష్కర్త).. తన కెరీర్ మొత్తంలో ఈ స్ఫూర్తిని ప్రదర్శించిన ఐకాన్. ఆమె సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరినీ చూసి చాలా గర్వపడుతున్నాను. ఖచ్చితత్వం, అభిరుచిని కలగలిస్తే.. సాంకేతికత పట్టుదలను కలబోస్తే ఏమి జరుగుతుందో ఆమె నిరూపించారు’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. Welcome back, #Crew9! The Earth missed you. Theirs has been a test of grit, courage and the boundless human spirit. Sunita Williams and the #Crew9 astronauts have once again shown us what perseverance truly means. Their unwavering determination in the face of the vast unknown… pic.twitter.com/FkgagekJ7C— Narendra Modi (@narendramodi) March 19, 2025సునీతా విలియమ్స్ భారత సంతతికి చెందిన వ్యోమగామి. ఆమెకు ఇది మూడవ అంతరిక్ష ప్రయాణం. సునీత ఇప్పటివరకు మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. సునీత 1965, సెప్టెంబర్ 19న ఒహియోలోని యూక్లిడ్లో జన్మించారు. అతని తండ్రి దీపక్ పాండ్య గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని ఝులసన్కు చెందినవారు. అత్యధికంగా అంతరిక్షంలో నడిచిన మహిళగా విలియమ్స్ రికార్డు సృష్టించారు. సునీతా విలియమ్స్ 2007,2013లలో భారతదేశాన్ని సందర్శించారు. 2008లో సునీతకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ సునీతా విలియమ్స్ కు ఒక లేఖ రాస్తూ, ఆమెను భారత పుత్రిక అని అభివర్ణించారు. ప్రధాని మోదీ సునీతను ఈ లేఖలో భారత్‌కు రావాలంటూ ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా -
ఇప్పుడే అసలు పరీక్ష వాట్ నెక్స్ట్ ?
-
Sunita Williams: నాటి సెల్ఫీని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ: వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమెకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సునీతా విలియమ్స్‌ను స్వాగతిస్తూ, గతంలో తాను సునీతా విలియమ్స్‌తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో పాటు ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర(Space travel)కు వెళ్లిన విలియమ్స్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో తలెత్తిన సాంకేతిక లోపాల కారణంగా తొమ్మిది నెలల పాటు జీరో గురుత్వాకర్షణ స్థితిలో ఉండవలసి వచ్చింది. ఇప్పుడు క్రూ-9 మిషన్ సాయంతో విలియమ్స్, విల్మోర్లు అట్లాంటిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగడం ద్వారా తమ అంతరిక్ష ప్రయాణాన్ని ముగించారు. When the SpaceX recue mission was launched, I recalled this chance encounter almost two years ago with @Astro_Suni in Washington. It was an enormous relief to see her and her colleagues’ successful splashdown back on earth a few hours ago. She is courage personified and… https://t.co/E64p9YX5t3— anand mahindra (@anandmahindra) March 19, 2025ఈ సందర్భంగా మహీంద్రా ఒక పోస్ట్‌లో సునీతా విలియమ్స్ ధైర్యానికి ప్రశంసలు కురిపిస్తూ.. ‘రెండేళ్ల క్రితం స్పేస్ ఎక్స్ రెస్క్యూ మిషన్(SpaceX rescue mission) ప్రారంభించినప్పుడు వాషింగ్టన్లో @Astro_Suniని కలుసుకున్నాను. కొన్ని గంటల క్రితం ఆమెతో పాటు ఆమె సహచరులు భూమిపైకి విజయవంతంగా తిరిగి వచ్చిన దృశ్యాన్ని చూడటంతో చాలా ఉపశమనం కలిగించింది. స్వాగతం.. సునీత’ అని రాశారు. ఆనంద్ మహీంద్రా 2023 జూలైలో వాషింగ్టన్లో సునీతతో తీసుకున్న సెల్ఫీని షేర్ చేశారు. ఈ ఫొటోలో ముఖేష్ అంబానీ, వృందా కపూర్, సునీతా విలియమ్స్‌తోపాటు ఆనంద్ మహీంద్రా ఉన్నారు.ఇది కూడా చదవండి: Sunita Williams: సునీతా విలియమ్స్‌ను స్వాగతించిన డాల్ఫిన్లు -
భూమికి చేరుకున్న సునీత.. పూర్వీకుల గ్రామంలో సంబరాలు
-
Sunita Williams: సునీతా విలియమ్స్‌ను స్వాగతించిన డాల్ఫిన్లు
వాషింగ్టన్: అమెరికన్ వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్లను సముద్రంలోని డాల్ఫిన్లు స్వాగతించాయి. దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చిన ఈ వ్యోమగాములను చూసి అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి డాల్ఫిన్ల ఆనందం కూడా తోడయ్యింది. పలు ఇబ్బందుల అనంతరం అంతరిక్ష నౌక చివరకు వ్యోమగాములతో పాటు ఫ్లోరిడా బీచ్‌లో దిగింది. There are a bunch of dolphins swimming around SpaceX's Dragon capsule. They want to say hi to the Astronauts too! lol pic.twitter.com/sE9bVhgIi1— Sawyer Merritt (@SawyerMerritt) March 18, 2025భారత కాలమానం ప్రకారం ఈ ల్యాండింగ్(Landing) బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఈ సమయంలో నాసా బృందం వ్యోమగాములను స్వాగతించడానికి చిన్నపాటి షిప్‌లతో సిద్ధమయ్యింది. ఈ సమయంలో సముద్రంలో అరుదైన దృశ్యం కనిపించింది. సునీతా విలియమ్స్ ఉన్న క్యాప్స్యూల్‌ను పలు డాల్ఫిన్లు చుట్టుముట్టాయి. డాల్ఫిన్ల గుంపు అంతరిక్ష నౌక చుట్టూ ఈదుతూ కనిపించింది. సునీతా విలియమ్స్‌తో పాటు ఆమె సహచరులను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువస్తున్నప్పుడు పలు డాల్ఫిన్లు క్యాప్సూల్ చుట్టూ గుమిగూడాయి.దీనికి సంబంధించిన వీడియోను నాసా సిబ్బంది సాయర్ మెరిట్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ చుట్టూ డాల్ఫిన్లు ఈదుతున్నాయి’ అని రాశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కాగా రికవరీ నౌక వ్యోమగాములను క్యాప్సూల్ నుండి బయటకు తీసుకువచ్చాక, వారిని 45 రోజుల పునరావాస కార్యక్రమం కోసం హ్యూస్టన్‌లోని ఒక కేంద్రానికి తరలించారు. -
సునీతా విల్లియమ్స్ హెల్త్ అప్డేట్స్
-
Sunita Williams: ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం’: వైట్‌హౌస్
వాషింగ్టన్ డీసీ: తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న వ్యోమగాములు(Astronauts) తిరిగి భూమికి చేరుకోవడంపై యునైటెడ్ స్టేట్స్‌లోని అధ్యక్షుని అధికారిక కార్యాలయం వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట ఇచ్చారని, దానిని నిలబెట్టుకున్నారని వైట్‌హౌస్ పేర్కొంది.అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా(American space agency NASA)కు చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడా తీరంలో దిగింది. తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను రక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్ హామీ ఇచ్చారని, వైట్ హౌస్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఒక వీడియో షేర్ చేస్తూ పేర్కొంది. ఈరోజు వారు సురక్షితంగా భూమిపైకి దిగారని, వ్యోమగాములను సురక్షితంగా ల్యాండ్ చేసినందుకు ఎలోన్ మస్క్, స్పేస్ఎక్స్, నాసాకు వైట్‌హౌస్ కృతజ్ఞతలు తెలిపింది. PROMISE MADE, PROMISE KEPT: President Trump pledged to rescue the astronauts stranded in space for nine months. Today, they safely splashed down in the Gulf of America, thanks to @ElonMusk, @SpaceX, and @NASA! pic.twitter.com/r01hVWAC8S— The White House (@WhiteHouse) March 18, 2025డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'(Truth Social)లో వ్యోమగాములు తిరిగి వచ్చిన క్షణాలను షేర్ చేశారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ సహాయంతో భూమికి తిరిగి వచ్చారు. ఎనిమిది రోజుల మిషన్ కోసం బయలుదేరిన సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఆమె సురక్షితంగా తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఇది కూడా చదవండి: Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా -
సునీతా జర్నీ ఎలా జరిగిందంటే!
-
క్షేమంగా భూమిపైకి తిరిగొచ్చిన సునీత విలియమ్స్ (ఫోటోలు)
-
సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ట్రంప్‌నకు మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని చేరుకున్న తర్వాత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా మస్క్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. గతంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాం. కానీ, రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిని చేరుకునేవారు అని అన్నారు. .@elonmusk reveals the Biden administration turned down his offer to get the stranded astronauts home sooner: 🚨“It was rejected for political reasons." 🚨 pic.twitter.com/hN4pPk3YN1— Trump War Room (@TrumpWarRoom) March 19, 2025ఇక, వారిద్దరూ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అక్కడు ఉండాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల పాటు అక్కడే ఉన్నారు. బైడెన్ ప్రభుత్వం వారిద్దరి పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది. కానీ, ట్రంప్ మాత్రం అలా చేయలేదు. ఈ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారిద్దరిని వీలైనంత తొందరగా సురక్షితంగా భూమికి తీసుకురావాలని మమ్మల్ని ఆదేశించారు. ఆయన కృషి వల్ల ఇది సాధ్యమైంది. ట్రంప్‌నకు కృతజ్ఞతలు. మిషన్ సక్సెస్ చేసిన నాసా, స్పేస్‌ఎక్స్‌లకు శుభాకాంక్షలు’ అని కామెంట్స్ చేశారు.The @POTUS has asked @SpaceX to bring home the 2 astronauts stranded on the @Space_Station as soon as possible. We will do so.Terrible that the Biden administration left them there so long.— Elon Musk (@elonmusk) January 28, 2025మరోవైపు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న నలుగురు సభ్యుల వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో స్పేస్ ఎక్స్ది అద్భుత పాత్ర అని నాసా కొనియాడింది.అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ..‘స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని చాటింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతపరంగా అమెరికా కోస్ట్‌గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అన్‌డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవసహిత అంతరిక్షయాత్రకు కొత్తబాట చూపాయి.Dolphins were in the gulf to welcome the NASA astronauts home after being rescued.Congratulations Elon for bringing back the Astronauts ! pic.twitter.com/bg8AN5FTOg— primalkey (@primalkey) March 18, 2025ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీతా విలియమ్స్ రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు. క్రూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్లో వ్యోమగాములు స్టెమ్‌సెల్స్ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారు. నలుగురు వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తం. ఐఎఎస్ఎస్ బయట కొన్ని నమూనాలను సునీత, విల్మోర్ సేకరించారు. భవిష్యత్తులో నాసా మరెన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతోంది’ అని తెలిపారు -
భారత్ కు రండి..! సునీతని ఆహ్వానించిన మోదీ
-
మీకు ఎవరూ సాటిలేరు.. సునీతా విలియమ్స్ రాకపై చిరు ట్వీట్
దాదాపు 9 నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్.. తిరిగి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీరికి స్వాగతం పలుకుతున్నారు. తాజాగా వీళ్లకు స్వాగతం పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు మరింత శక్తినివ్వాలి అని రాసుకొచ్చారు. 'సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కి స్వాగతం. ఇది చారిత్రక ఘట్టం. 8 రోజుల్లో తిరిగి రావాలని వెళ్లి 286 రోజుల తర్వాత భూమికి తిరిగొచ్చారు. ఈ క్రమంలో 4577 సార్లు భూమి చుట్టూ తిరిగారు. మీరు గొప్ప ధైర్యవంతులు'(ఇదీ చదవండి: చిరంజీవికి ముద్దు.. ఈ ఫొటో వెనక ఇంత కథ ఉందా?)'మీకు ఎవరూ సాటిలేరు. మీ (సునీతా విలియమ్స్) ప్రయాణం ఓ థ్రిల్లర్ అడ్వెంచర్ సినిమాలా అనిపిస్తోంది. ఇది గొప్ప సాహసం, నిజమైన బ్లాక్ బస్టర్' అని చిరంజీవి ట్విటర్ లో రాసుకొచ్చారు. బుధవారం తెల్లవారు జామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సునీతా, విల్మోర్ ఉన్న స్పేస్ ఎక్స్ క్యాప్సల్ ల్యాండ్ అయింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' పాటల ఫెయిల్యూర్.. తప్పు వాళ్లదే: తమన్) -
9 స్పేస్ వాక్స్.. 'ధీర సునీతా' రికార్డు
-
9 నెలల తరువాత భూమిపైకి.. రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ షాకింగ్ నిజాలు
-
Sunita Williams: భావోద్వేగంలో సునీతా సోదరి ఫల్గునీ పాండ్యా
న్యూఢిల్లీ: తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(NASA astronaut Sunita Williams) భూమికి తిరిగి వచ్చారు. ఆమె ఈరోజు (బుధవారం) తెల్లవారుజామున స్పేస్ఎక్స్ డ్రాగన్ నుండి దిగారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ బంధువు ఫల్గుణి పాండ్యా భావోద్వేగానికి లోనవుతూ, సునీతాకు సంబంధించిన పలు విషయాలు మీడియాకు తెలిపారు. సునీతా విలియమ్స్ ఎంతో భక్తితో గణేశుని విగ్రహాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్లారని, దానిని నిత్యం తనతో పాటే ఉంచుకున్నారని అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్న ఆమె వరుస సోదరి ఫల్గునీ పాండ్యా తెలిపారు. సునీతా విలియమ్స్ తిరిగి రావడం ఎంతో సంతోషంగా ఉన్నదని, ఈ వార్త తెలియగానే, తమ కుటుంబ సభ్యులంతా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు, హోమాలు చేయనున్నామని తెలిపారు. సునీతా ఎప్పుడు తిరిగి వస్తుందా అని తామంతా ఇంతకాలం ఎదురు చూశామని తెలిపారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో తేలియాడుతున్న గణేశ విగ్రహం ఫోలోను షేర్ చేశారని ఆమె తెలిపారు.సునీతా విలియమ్స్‌కు భారతీయ వంటకాలంటే(Indian cuisine) ఎంతో ఇష్టమని, మరీ ముఖ్యంగా సమోసా ఇష్టమని, ఆమె భూమికి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశాన్ని సందర్శించాలని అనుకుంటున్నారని తెలిపారు. 2007లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాము ఆయనను కలుసుకున్నామని, ఆ తర్వాత సునీత, ఆమె తండ్రి అమెరికాలో ప్రధాని మోదీని కలుసుకున్నారన్నారు. సునీత స్వస్థలం గుజరాత్ అని, ఆమె పూర్వీకుల గ్రామమైన ఝులసాన్‌లో సంబరాలు జరుగుతున్నాయన్నారు. తాను కుంభమేళా సమయంలో భారతదేశానికి వచ్చినప్పుడు ఆ వివరాలను తెలుసుకునేందుకు సునీత చాలా ఆసక్తి చూపారన్నారు. తాను ఆమెకు కుంభమేళా చిత్రాలను చూపించానని, అప్పుడు ఆమె తనకు అంతరిక్షం నుండి కుంభమేళా చిత్రాన్ని పంపారన్నారు. కుంభమేళాలో అది మరపురాని ఫోటో అని ఫల్గుణి పాండ్యా పేర్కొన్నారు. త్వరలోనే తాము సునీతాను కలుసుకుంటామని, సమోసా పార్టీ జరుపుదామని అంటున్నారామె.ఇది కూడా చదవండి: సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు -
మోదీ ఆహ్వానం.. భారత్‌కు సునీతా విలియమ్స్ రాక
ఢిల్లీ: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ రాకపై భారత ప్రధాని మోదీ స్పందించారు. సునీత సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని మోదీ అన్నారు. ఈ క్రమంలో సునీతా విలియమ్స్‌ను మోదీ భారత్‌కు ఆహ్వానించారు. ఈ మేరకు ఆమెకు రాసిన లేఖను ఢిల్లీలో తనను కలిసిన నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోకు అందించారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ లేఖలో..‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అద్వితీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది. ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుతున్నాను’ అంటూ సునీతకు లేఖ రాశారు. ఈ క్రమంలో మోదీ లేఖపై సునీతా విలియమ్స్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్బంగా ఆమె సోదరి ఫాల్గుని పాండ్యా మీడియాతో మాట్లాడుతూ.. సునీతా విలియమ్స్ తిరిగి భూమికి చేరుకోవడం ఆనందంగా ఉంది. త్వరలో భారత్‌లో పర్యటిస్తారు. మేమందరం కలిసి టూర్‌కు వెళ్లాలని కూడా ప్లాన్ చేస్తున్నాం. దానికి కొంచెం సమయం పడుతుంది. ఇదే సమయంలో సునీత మరోసారి అంతరిక్ష యాత్ర చేపడతారా? అని ప్రశ్నించగా.. అది ఆమె ఎంపిక అని చెప్పుకొచ్చారు. అనంతరం, మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.#SunitaWilliams & #ButchWilmore's HomecomingWe are very excited for her to come back. Although we never felt we were far away from her because we were constantly in communication with her...: Falguni Pandya, Sunita Williams' cousin, speaks to @MadhavGK@TheNewsHour AGENDA pic.twitter.com/LKBN9iFuRY— TIMES NOW (@TimesNow) March 18, 2025 -
సునీతా విలియమ్స్ స్వగ్రామంలో సంబరాలు
న్యూఢిల్లీ: దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో గడిపిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్(Astronaut Sunita Williams) సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఈ నేపధ్యంలో ఆమె స్వస్థలమైన గుజరాత్‌లోని ఝులసాన్‌లో ప్రజలు భగవంతునికి హారతులు అర్పిస్తూ, ప్రార్థనలు చేశారు. అలాగే సంబరాలు జరుపుకున్నారు.అంతరిక్షం నుంచి తిరిగి వచ్చిన వారిలో వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యన్ వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ ఉన్నారు. వ్యోమగాములంతా డ్రాగన్ క్యాప్సూల్(Dragon Capsule) నుండి బయటకు వచ్చారు. వెంటనే వైద్యులు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వ్యోమగాములు విజయవంతంగా తిరిగి వచ్చిన తరుణంలో భారతదేశంతో పాటు అమెరికాలో వేడుకల వాతావరణం నెలకొంది. సునీతా విలియమ్స్‌తో పాటు క్రూ-9 సభ్యుల ధైర్యసాహసాలు, విజయాల గురించి జనం చర్చించుకుంటున్నారు. #WATCH | Mehsana, Gujarat | People express joy and burst firecrackers in Jhulasan - the native village of NASA astronaut Sunita Williams after the successful Splashdown of SpaceX Dragon spacecraft carrying Crew-9 at Tallahassee, FloridaNASA's astronauts Sunita Williams and… pic.twitter.com/fKs9EVnPSf— ANI (@ANI) March 18, 2025డ్రాగన్ క్యాప్సూల్ నుండి బయటకు వచ్చిన మూడవ వ్యక్తి సునీతా విలియమ్స్. ఆమె బయటకు రాగానే అందరినీ చిరునవ్వుతో పలకరించారు. క్యాప్సూల్ నుండి వ్యోమగాములను బయటకు తీసుకువచ్చే ప్రక్రియ క్లిష్టంగా ఉంటుంది. క్యాప్సూల్ లోపల వ్యోమగాములంతా సీట్ బెల్టులతో కట్టి ఉంటారు. సునీతా విలియమ్స్‌తో పాటు ఇతర వ్యోమగాములను తీసుకువస్తున్న క్యాప్సూల్ భూ వాతావరణం(Earth's atmosphere)లోకి ప్రవేశించినప్పుడు, 3500 డిగ్రీల ఫారెన్‌హీట్ వేడి కారణంగా అది ఎర్రటి అగ్ని బంతిలా కనిపించింది. అయితే ఆ క్యాప్యూల్ లోనికి ఉష్ణోగ్రత ప్రవేశించకుండా దానిని తయారుచేస్తారు. క్యాప్సూల్ లోపల ఉష్ణోగ్రత దాని బయట ఉష్టోగ్రత కంటే చాలా తక్కువగా ఉంటుంది.ఇది కూడా చదవండి: భూమిపైకి క్షేమంగా సునీత.. -
భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, విల్మోర్
-
విజయకేతనం.. సునీత విలియమ్స్ వచ్చేసింది..
కేప్ కెనావెరాల్: సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు. స్పేస్ఎక్స్కు చెందిన క్రూ డ్రాగన్ ‘ఫ్రీడమ్’.. వారిని సురక్షితంగా వారిద్దరినీ భూమి మీదకు తీసుకొచ్చింది. సునీత, విల్మోర్లతోపాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు.Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu— NASA (@NASA) March 18, 2025 యాత్ర ఇలా కొనసాగింది.. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక తలుపు (హ్యాచ్) మూసివేత ప్రక్రియ జరిగింది.ఉదయం 10.15 గంటలకు క్రూ డ్రాగన్.. ఐఎస్ఎస్తో విడిపోవడం (అన్‌డాకింగ్) మొదలైంది.10.35 గంటలకు పూర్తిగా విడిపోయింది.భూమి దిశగా 17 గంటల ప్రయాణాన్ని మొదలుపెట్టింది.ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది. ఆ వెంటనే- భూమిపై ల్యాండింగ్ ప్రదేశం దిశగా కోసం క్రూ డ్రాగన్ ముందుభాగంలోని నాలుగు డ్రాకో ఇంజిన్ల ప్రజ్వలన మొదలైంది.ఏడున్నర నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది.2.17: స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ షురూ 2.18: లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్ పూర్తి2.35: కక్ష్య నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది. 2.51: కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ పూర్తయి.. స్పేస్‌క్రాఫ్ట్ కిందకు దిగడం ప్రారంభమైంది. 3.10: డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ భూవాతావరణంలోకి ప్రవేశించింది. 3:11అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో సిగ్నల్ కట్ అయిపోయింది. 3.21కి సిగ్నల్ కలిసింది. 3.26: భూమికి 5 కి.మీ. ఎత్తులో ఉండగా పారాచూట్లు తెరుచుకున్నాయి. 3.28: డ్రాగన్ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది.We're getting our first look at #Crew9 since their return to Earth! Recovery teams will now help the crew out of Dragon, a standard process for all crew members after returning from long-duration missions. pic.twitter.com/yD2KVUHSuq— NASA (@NASA) March 18, 2025రీ ఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్‌ను ఛేదిస్తూ కమాండర్ నిక్ హేగ్ మాట్లాడటంతో... కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. సాగర జలాలకు 18 వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోగ్‌చూట్లు విచ్చుకున్నాయి. ఆ సమయంలో వ్యోమనౌక వేగం గంటకు 560 కిలోమీటర్లు. డ్రోగ్‌చూట్లు సమర్థంగా పనిచేయడంతో క్రూడ్రాగన్ వేగం గణనీయంగా తగ్గిపోయింది. వ్యోమనౌక వేగం గంటకు 190 కిలోమీటర్లకు చేరుకోగానే.. సాగర జలాల నుంచి 6,500 అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి. The most beautiful footage you’ll see today! All four astronauts have safely returned to Earth. 🙌✨️🎉Welcome Sunita Williams after 286 days in space, completing 4,577 orbits around Earth! pic.twitter.com/JZeP1zMAL0— Megh Updates 🚨™ (@MeghUpdates) March 19, 2025 డ్రోగ్‌చూట్లు, పారాచూట్లు క్రూ డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లెం వేయడంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మార్మోగాయి. ఆపై ఫ్లోరిడాలోని తలహాసీ తీరంలో సముద్ర జలాల్లో వ్యోమనౌక నెమ్మదిగా దిగింది. నిమిషాల వ్యవధిలోనే స్పీడ్‌బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు. పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక.. వ్యోమనౌకను మేగన్ నౌకపైకి చేర్చారు. ఆపై- లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు. తొలుత కమాండర్ నిక్ హేగ్, ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్, సునీతా విలియమ్స్, విల్మోర్ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు. క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత.. ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు. Welcome back to Earth, Sunita Williams! 🌍 #sunitawilliamsreturn #SunitaWillams#spacexdragon #NASA #SunitaWilliams #NASA #sunitawilliamsreturn @NASA @Astro_Suni pic.twitter.com/6FhS3kAHFa— Vishalpotterofficial (@vishalpott60095) March 19, 2025Life of #Astronaut in #Space.#SunitaWilliams#SpacexDragon#ElonMuskCredit RocketTestOne pic.twitter.com/fRqMwGPsGb— Shailey Singh (@shaileysingh73) March 17, 2025 -
భూమికి క్షేమంగా చేరిన సునీత
-
భూమిపైకి క్షేమంగా సునీత..
సుమారు 9 నెలల నిరీక్షణ.. కోట్లాది మంది ప్రార్థనలు.. నాసా శాస్త్రవేత్తల అవిరళ కృషి.. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ తోడ్పాటు.. ఎట్టకేలకు భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములు భువికి తిరిగొచ్చారు.భూమిపైకి దిగాక మాడ్యూల్లో సునీత, ఇతర వ్యోమగాములు ఫ్లోరిడా సముద్రజలాల్లో దిగిన డ్రాగన్ మాడ్యూల్ 2.17: స్పేస్ క్రాఫ్ట్ భూమికి తిరిగొచ్చే ప్రక్రియ షురూ 2.18: లీకేజీలు ఉన్నాయా అనే చెకింగ్ పూర్తి2.35: కక్ష్య నుంచి విడిపడే ప్రక్రియ మొదలైంది. 2.51: కక్ష్య నుంచి విడివడే ప్రక్రియ పూర్తయి.. స్పేస్‌క్రాఫ్ట్ కిందకు దిగడం ప్రారంభమైంది. 3.10: డ్రాగన్ ఫ్రీడమ్ మాడ్యూల్ భూవాతావరణంలోకి ప్రవేశించింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో స్పేస్ ఎక్స్ గ్రౌండ్ స్టేషన్‌తో సిగ్నల్ కట్ అయింది. 3.21కి సిగ్నల్ కలిసింది. మాడ్యూల్‌ను నౌకలోకి ఎక్కిస్తున్న దృశ్యం 3.26: భూమికి 5 కి.మీ. ఎత్తులో ఉండగా పారాచూట్లు తెరుచుకున్నాయి. 3.28: డ్రాగన్ మాడ్యూల్ సురక్షితంగా సముద్రంలో దిగింది.3.55: మాడ్యూల్‌ను నౌకలో ఎక్కించారు. 4.23: మాడ్యూల్ నుంచి సునీతను బయటకు తీసుకొచ్చారు. వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారు. అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కోదివి నుంచి భూమికి సేఫ్‌గా అడుగు పెట్టిన సునీతా విలియమ్స్ఫ్లోరిడా తీరం సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకఅత్యంత ఉత్కంటగా సాగిన చివరి 7 నిమిషాలుఈ రోజు ఉ.3.27 గంటలకు భూమికి చేరిన సునీతాక్రూ డ్రాగన్ వ్యోమనౌక దగ్గరకు వచ్చిన నాసా శాస్త్రవేత్తలుక్రూ డ్రాగన్ సేఫ్ ల్యాండిగ్తో నాసా శాస్త్రవేత్తల సంబరాలుల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారుఅక్కడే వారికి కొన్ని రోజులు పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులుసుదీర్గకాలం స్పేస్‌లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలుఆరోగ్య సమస్యలను ఎప్పటకప్పుడు పరీక్షించనున్న వైద్యులుదీంతో తన మూడో అంతరిక్ష యాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్గతంలో 2006,2012లలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్ -
మానవ సంకల్ప విజయానికి ప్రతీక!
సైన్స్ చరిత్రను తిరగేస్తే యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణలు కోకొల్లలు కనిపిస్తాయి. ఎనిమిది రోజుల పర్యటన కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ తొమ్మిది నెలల సుదీర్ఘ కాలం అక్కడే గడపడమూ ఈ కోవకే చెందుతుంది. ఎందుకంటే... మనిషి యుగాలుగా ఆశిస్తున్న, ఆకాంక్షిస్తున్న గ్రహాంతరయానమనే స్వప్నాన్ని ఈ యాత్ర మరికొంత దగ్గర చేసింది మరి!సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి భూమిని చేరిన రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. అంత రిక్ష ప్రయోగాల్లో ఇదో చరిత్రాత్మక ఘట్టంగానే చూడాలి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో వాటిని సరిదిద్దే అవకాశం లేకపోవడంతో ఈ ఇద్దరు వ్యోమగా ములు మునుపెవ్వరూ గడపనంత అత్యధిక సమయాన్ని ఐఎస్ఎస్లో గడపాల్సి వచ్చింది. భూమికి 408 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూండే ఐఎస్ఎస్లో ఉండటం అంత ఆషా మాషీ వ్యవహారం కానేకాదు. అతి తక్కువ గురుత్వాకర్షణ శక్తి ఉంటుందిక్కడ. దీనివల్ల శరీరంలోని ద్రవాలన్నీ ఉండాల్సిన చోట కాకుండా... శరీరం పైభాగంలోకి చేరుతూంటాయి. ఇరవై నాలుగు గంటలకు ఒకసారి సూర్యోదయ, సుర్యాస్తమయాలను చూసే మనిషి... ఐఎస్ఎస్లో వీటిని పదహారు సార్లు చూడాల్సి వస్తుంది. ఇది కాస్తా వ్యోమగాముల నిద్రపై ప్రభావం చూపుతుంది. కంటినిండా కునుకు లేక... కుటుంబానికి దూరంగా... ఇరుకైన చిన్న గదిలో నెలలపాటు గడపడం ఎంత కష్టమో మనం ఊహించనైనా ఊహించ లేము. ఊపిరి తీసుకోవడం మొదలుకొని కాలకృత్యాలు తీర్చుకోవడం వరకూ ప్రతి ఒక్కటి మానసికంగానూ, భౌతికంగానూ సవాలే! ఇంతటి శ్రమకోర్చి మరీ వీరు భూమికి తిరిగి వస్తూండటమే ఈ అంతరిక్ష ప్రయో గాన్ని మిగిలిన వాటికంటే ప్రత్యేకమైందిగా మారుస్తోంది.తొమ్మిది నెలలు చేసిందేమిటి?గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఇద్దరూ ఐఎస్ఎస్కు ప్రయాణమైనప్పుడు వారి వద్ద ఎనిమిది రోజు లకు సరిపడా ప్రణాళికలైతే సిద్ధంగానే ఉన్నాయి. ఏ ఏ ప్రయోగాలు చేపట్టాలి. ఐఎస్ఎస్ నిర్వహణ తాలూకూ పనులు ఏమిటి? అన్నది వీరికి తెలుసు. కానీ అనూహ్యంగా వారి తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడింది. దీంతో వారికి ఎదురైన సరికొత్త సవాలు అంతకాలం ఏం చేయాలి? అన్నది. నాసా పరిశోధకుల సలహా సూచనల మేరకు వీరు ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారు 150 వరకూ పరిశోధనలు చేపట్టారు. జీవ వ్యవస్థలపై సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం, అంతరిక్షంలో మొక్కల పెంపకం, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు అంతరిక్షంలో ఎలా ప్రవర్తిస్తాయి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు... భవిష్యత్తులో మనిషి సుదీర్ఘకాలం పాటు అంతరిక్ష ప్రయాణాలు చేపట్టాల్సి వస్తే... అంతరిక్ష నౌకల్లో అగ్ని ప్రమాదాల్లాంటివి జరక్కుండా ఉండేందుకు... మంటలు ఎలా వ్యాపిస్తాయి? అన్న విషయంపై పరిశోధనలు నిర్వహించారు కూడా! దీంతో పాటే గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటం వల్ల శరీరంలోని కండరాలకు జరిగే నష్టాన్ని నివారించేందుకు యూరో పియన్ ఎన్ హాన్్సడ్ ఎక్స్‌ప్లోరేషన్ ఎక్సర్సైజ్ డివైజ్(ఈ4డీ)ని పరీక్షించారు. ఈ పరికరం సైక్లింగ్, రోయింగ్లతోపాటు రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ల ద్వారా వ్యోమగాముల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. అలాగే గ్రహాంతర ప్రయాణాలకు కీలకమైన నీటి పునర్వినియోగం, ప్రత్యేకమైన సూక్ష్మజీవుల ద్వారా మనిషికి అవసరమైన పోషకాల ఉత్పత్తి వంటి అంశాలపై కూడా ప్రయోగాలు చేశారు. సౌర కుటుంబం మొత్తమ్మీద మనిషి జీవించేందుకు జాబిల్లి తరువాత కొద్దోగొప్పో అనుకూలతలున్న గ్రహం అంగారకుడు. స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఇంకొన్నేళ్లలోనే మనిషిని అంగారకుడిపైకి చేరుస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్లు గత తొమ్మిది నెలలుగా చేసిన ప్రయోగాలకు, పరిశోధనలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. సుదీర్ఘకాలం పాటు అంతరిక్షంలో ఉండటం భౌతికంగా, మానసికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఈ తొమ్మిది నెలల ప్రయాణం తరువాత శాస్త్రవేత్తలకు కొంత స్పష్టత ఏర్పడి ఉంటుంది. దీని ఆధారంగా భవిష్యత్తులో అంగారక ప్రయాణం జరిగే అవకాశాలు లేకపోలేదు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన ఎముకలు పెళుసుబారుతాయి. కండరాలు, దృష్టి బలహీనపడతాయి. అలాంటప్పుడు ఏ రకమైన వ్యాయామాల ద్వారా నష్టాన్ని పరిమితం చేయవచ్చునన్నది సునీత, విల్మోర్ల పరిశోధనల ద్వారా తెలిసింది. అంతరిక్షంలో ఉండే విపరీతమైన రేడియోధార్మికత నుంచి వ్యోమ గాములను రక్షించుకునేందుకు కూడా వీరి ప్రయోగాలు సాయపడతాయి.వ్యోమగాముల త్యాగాల గురుతులు...ఎట్టకేలకు సునీత, విల్మోర్లు భూమిని చేరనున్నార న్నది అందరికీ సంతోషం కలిగించే వార్తే. కాకపోతే ఆ ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకూ ఉన్న సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి వాతావరణం నుంచి సాధారణ పరిస్థితులకు ఎలా అడ్జెస్ట్ అవుతారన్నది ఒక ప్రశ్న. ఇది మరోసారి వారి సహనాన్ని, దృఢ చిత్తాన్ని పరీక్షించనుంది. వ్యోమగాముల శ్రమ, వేదన లను గమనిస్తే మానవ కల్యాణం కోసం వారు ఇంత త్యాగం చేస్తున్నారా? అనిపించకమానదు. సునీత, విల్మోర్లు ఇద్దరూ 300కుపైగా రోజులు అంతరిక్షంలో గడపడం ఒక రికార్డే. అయితే ఇది వారి వ్యక్తిగత మైంది కాదు. మానవ సంకల్పానికి లభించిన విజయమని చెప్పాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా), స్పేస్–ఎక్స్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భాగస్వా ములైన సుమారు 15 దేశాల శాస్త్రవేత్తలు అందరి ఉమ్మడి విజయం. ‘చందమామ రావే... జాబిల్లి రావే’ అంటూ పాట లకే పరిమితమైన ఒక తరం మాదిరిగా కాకుండా... ‘గ్రహ రాశులను అధిగమించి, ఘనతారల పథము నుంచి... గగ నాంతర రోదసిలో గంధర్వ గోళగతులు దాటి’ అంటూ సాగే నవతరానికి స్ఫూర్తి కూడా!– గిళియార్ గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ జర్నలిస్ట్ -
భూమి మీదకు సునితా విలియమ్స్
భూమి మీదకు సునితా విలియమ్స్ -
గుడ్‌బై ఐఎస్ఎస్
కేప్ కెనవెరాల్: తొమ్మిది నెలలకు పైచిలుకు అంతరిక్షవాసానికి తెర పడింది. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో పాటు నాసాకు చెందిన మరో వ్యోమగామి బచ్ విల్మోర్ మంగళవారం స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భూమికి బయల్దేరారు. గత సెప్టెంబర్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు నిక్ హ్యూస్, అలెగ్జాండర్ గోర్బనోవ్ కూడా వారితో పాటు తిరిగొస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.30 తర్వాత వ్యోమనౌక ఐఎస్ఎస్ నుంచి విడివడింది. కాసేపటికి భూమివైపు 17 గంటల ప్రయాణం ప్రారంభించింది.వాతావరణం అనుకూలిస్తే బుధవారం తెల్లవారుజామున 2.41కి అది భూ కక్ష్యలోకి ప్రవేశించనుంది. ఆ క్రమంలో వాతావరణంతో రాపిడి వల్ల పుట్టుకొచ్చే విపరీతమైన వేడికి క్యాప్సూల్ మండిపోకుండా అందులోని హీట్‌షీల్డ్ రక్షణ కవచంగా నిలుస్తుంది. కాసేపటికి వ్యోమనౌకలోని నాలుగు ప్యారాచూట్లు తెరుచుకుని దాని వేగాన్ని బాగా తగ్గిస్తాయి. చివరికి క్యాప్సూల్ గంటకు కేవలం 5 కి.మీ. వేగంతో తెల్లవారుజాము 3.27 గంటలకు అమెరికాలో ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో దిగుతుంది. ఆ వెంటనే నలుగురు వ్యోమగాములను ఒక్కొక్కరుగా అందులోంచి బయటికి తీసుకొస్తారు. అనంతరం తదుపరి పరీక్షల నిమిత్తం నేరుగా నాసా కేంద్రానికి తీసుకెళ్తారు.సునీత బృందం తిరుగు ప్రయాణం సందర్భంగా ఐఎస్ఎస్లో భావోద్వేగపూరిత సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తిరుగు ప్రయాణంలో ఎదురయ్యే విపరీతమైన పీడనం, ఒత్తిళ్లను తట్టుకునేందుకు అనువైన స్పేస్ సూట్, హెల్మట్, బూట్లు తదితరాలు ధరించి వారంతా చివరిసారిగా ఐఎస్ఎస్లో కలియదిరిగారు. స్పేస్ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌకలో ఆదివారం ఐఎస్ఎస్కు చేరుకున్న వ్యోమగాములతో ఫొటోలు, సెల్పిలు దిగుతూ సందడి చేశారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.అనంతరం సునీత బృందానికి వారు వీడ్కోలు పలికారు. ‘‘మిమ్మల్ని ఎంతగానో మిస్సవుతాం. మీ ప్రయాణం అద్భుతంగా సాగాలి’’ అని నాసా ఆస్ట్రోనాట్ అన్నే మెక్‌క్లెయిన్ ఆకాంక్షించారు. సునీత తదితరులు తమ వస్తువులతో వ్యోమనౌకలోకి చేరుకోగానే దాని ద్వారాన్ని మూసేశారు. రెండు గంటలపాటు పూర్తిస్థాయి పరీక్షలు చేసి అంతా సరిగానే ఉందని నిర్ధారించారు. అనంతరం డ్రాగన్ భూమికేసి బయల్దేరింది. 2024 జూన్ 5న బోయింగ్ స్టార్‌లైనర్ తొలి మానవసహిత ప్రయోగంలో భాగంగా సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లారు. ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వీలుపడలేదు.మా హృదయాల్లో ఉన్నారు: మోదీ భారత్ రావాలంటూ సునీతకు లేఖసునీతా విలియమ్స్ సాధించిన విజయాల పట్ల 140 కోట్ల పై చిలుకు భారతీయులు ఎంతగానో గర్విస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2016లో అమెరికా పర్యటన సందర్భంగా సునీతను, ఆమె తండ్రి దివంగత దీపక్ పాండ్యాను కలిశానని గుర్తు చేసుకున్నారు. అనంతరం అమెరికా అధ్యక్షులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌లతో భేటీ అయినప్పుడు కూడా ఆమె క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు.‘‘మీరు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా మా అందరి హృదయాలకు ఎప్పుడూ అత్యంత సన్నిహితంగానే ఉంటారు. అతి త్వరలో మిమ్మల్ని భారత్‌లో చూసేందుకు ఆత్రుతగా ఉన్నాం. తిరిగి రాగానే భారత్‌కు రండి. అది్వతీయ విజయాలు సాధించిన మీవంటి ఆత్మియ పుత్రికకు ఆతిథ్యమిచ్చేందుకు దేశం ఎదురు చూస్తోంది’’ అంటూ సునీతకు లేఖ రాశారు. దీనిపై ఆమె సంతోషం వెలిబుచ్చారు. మోదీకి, భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.పూర్వీకుల గ్రామంలో ప్రార్థనలుమెహసానా: సునీత క్షేమంగా భూమికి తిరిగి రావాలంటూ గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో ఉన్న ఆమె గ్రామం ఝులాసన్లో అంతా ప్రార్థనలు చేశారు. పలువురు గ్రామస్తులు ఒక రోజు ముందునుంచి అఖండ జ్యోతులు వెలిగించారు. బుధవారం సునీత క్షేమంగా దిగేదాకా అవి వెలుగుతూనే ఉంటాయని ఆమెకు సోదరుని వరసయ్యే నవీన్ పాండ్యా వివరించారు. ‘‘ఆ తర్వాత భారీ ఎత్తున వేడుకలకు కూడా సర్వం సిద్ధమైంది.సునీత ఫొటోలు పట్టుకుని స్కూలు నుంచి ఆలయం దాకా ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. స్థానిక స్కూలు విద్యార్థులైతే 15 రోజులుగా ప్రార్థనలు చేస్తున్నారని ప్రిన్సిపల్ చెప్పారు. సునీత తండ్రి దీపక్ పాండ్యా 1957లో అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. 2006, 2013ల్లో సునీత ఝులాసన్ వచి్చవెళ్లినట్టు ఆమె బంధువులు గుర్తు చేసుకున్నారు. తనను మరోసారి ఆహా్వనిస్తామని చెప్పారు. -
గురుత్వాకర్షణ లేని కురుల అందం!
కొన్ని రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్... ‘మీ జుట్టు బాగుంది. అందంగా, దృఢంగా ఉంది. నేనేమీ జోక్ చేయడం లేదు. ఇది నిజం’ అని సునీతా విలియమ్స్ (Sunita Williams) జుట్టు గురించి ప్రశంసలతో ముంచెత్తాడు. జుట్టు అందం గురించి ప్రశంసలు వినడం సాధారణ విషయమే అయినా... అంతరిక్షంలో జుట్టును అందంగా, శుభ్రంగా కాపాడుకోవడం ఆషామాషీ విషయం కాదు! భూమిపై ఉన్న గురుత్వాకర్షణ శక్తి వల్ల తల స్నానం (Head Bath) చేయడం అనేది మనకసలు సమస్య కాదు. తలకు కాస్తంత షాంపు రుద్దుకొని షవర్ కింద నిలబడితే సరిపోతుంది.కాని అంతరిక్షంలో అలా కాదు. జుట్టు శుభ్రం చేసుకోవడం వ్యోమగాములకు కష్టమైన పని, దీనికి కారణం స్పేస్‌స్టేషన్‌లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం.నాసాకు చెందిన ఆస్ట్రోనాట్ కరెన్ నైబర్గ్ అంతరిక్షంలో జుట్టు ఎలా శుభ్రం చేసుకుంటారో ఒక వీడియోలో చూపించింది. ఈ జీరో గ్రావిటీ హెయిర్ వాషింగ్ ప్రాసెస్ ఆసక్తికరంగా ఉంది. ‘హెయిర్ వాష్ (Hair Wash) చేసుకోవడానికి నేను వీటిని ఉపయోగిస్తాను’ అంటూ గోరు వెచ్చని నీటి పాకెట్, షాంపూ బాటిల్, దువ్వెన, అద్దం, వైట్ టవల్ చూపించింది.మొదట నీళ్లను తలపై స్ప్రే చేసుకుంది. దువ్వెనతో తల వెంట్రుకలను పైకి దువ్వడం మొదలుపెట్టింది. వెంట్రుకలు కుదురుగా ఉండకుండా వివిధ దిశలలో ఎగురుతూనే ఉన్నాయి. ఆ తరువాత షాంపూ రాసుకుంది. మళ్లీ తల వెంట్రుకలను పైకి దువ్వింది. తరువాత టవల్‌తో తల క్లీన్ చేసుకుంది. మళ్లీ తలపై వాటర్ స్ప్రే చేసి దువ్వెనతో పైకి దువ్వింది, టవల్‌తో తుడుచుకుంది. ‘శుభ్రం చేసుకునేటప్పుడు జుట్టును సరిగ్గా పట్టుకోవడం కష్టమవుతుంది’ అంటుంది నైబర్గ్.నైబర్గ్ తన జుట్టును స్థిరమైన స్థితిలో ఉంచడానికి పడుతున్న కష్టం మనకు వీడియోలో కనిపిస్తుంది. దువ్వుతున్నప్పుడు ఆమె జుట్టు వివిధ దిశలలో ఎగురుతుంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్) లోపల ఎయిర్ ఫ్లో తలపై తేమను ఆవిరి చేయడానికి ఉపయోగపడుతుంది. బ్లో డ్రైయర్ల అవసరం ఉండదు. చాలాసార్లు వ్యోమగాములు హెల్మెట్ (Helmet) లేదా హెడ్గేర్లను ధరిస్తారు. ఇది నెత్తిమీద గాలి ప్రసరణ (ఎయిర్ సర్క్యులేషన్)ను బ్లాక్ చేస్తుంది. జుట్టును ఫ్రీగా వదిలేయడం వల్ల చల్లగా, సౌకర్యవంతంగా ఉంటుంది.చదవండి: సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలునిరంతరం బ్రష్ చేయడం వల్ల కూడా జుట్టును ముడి వేయాల్సిన అవసరం ఉండదు. భూమిమీద తల వెంట్రుకలు బుద్ధిగా మన మాట వింటాయి. అంతరిక్షంలో మాత్రం ‘నా ఇష్టం’ అన్నట్లుగా ఉంటాయి. అయితే వాటి ఇష్టం వ్యోమగాములకు కష్టం కాదు. చాలామంది మహిళా వ్యోమగాములు తమ జుట్టును ఫ్రీగా వదిలేయడాన్ని ఎంజాయ్ చేస్తారు. భూమిపై మాదిరిగా తల వెంట్రుకలు (Hair) ముఖంపై పడవు కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యమూ ఉండదు. -
వెల్కమ్ సునీత
వినోదం కోసం నిర్మించే ‘బిగ్‌బాస్’ షోను మనం ఫాలో అయినట్టుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత విలిమయ్స్ వార్తలు ఫాలో అయ్యామా? 60 ఏళ్ల వయసులో ఆమె ఏం చెప్పడానికి అంతరిక్షంలో పరిస్థితులను ధిక్కరించి చిర్నవ్వును నిలబెట్టుకుంది? ‘నీకేం రాదు ఊరుకో’ అని ఇకపై స్త్రీలతో ఎవరూ అనకూడదు. సైకిల్ నుంచి స్పేస్ స్టేషన్ వరకు వారు రిపేర్ చేయగలరు. వెల్కమ్ సునీతా. నీ విజయం మాకు గర్వకారణం... సునీత విలియమ్స్ అంతరిక్షాన్ని జయించి సగర్వంగా భూమిని తాకనున్న మహిళ.పదిరోజుల ముందు మహిళా దినోత్సవం చేసుకున్నాం కదా. ఆ దినం వస్తుంది అంటేనే నాకు భయం వేస్తుంది. మహిళకు పది, పదహారు చేతులు పెట్టి ఓ చేతిలో కంప్యూటర్, ఓ చేతిలో పెన్ను, పుస్తకం, ఓ చేతిలో చీపురు కట్ట, ఇంకో చేతిలో అట్లకాడ; ఆడాళ్ళు ఏ పనైనా చేసేస్తారు, చేసెయ్యాలి; కానీ ఎంత గొప్ప పనులు చేసినా డిఫాల్ట్‌గా అట్లకాడ లేదా పప్పు గరిట లేనిదే స్త్రీ శక్తికి పరిపూర్ణత రాదు అని సందేశం ఇస్తారు. ఈ తలతిక్క వేడుకల మధ్యలో సునీత విలియం జీవన ప్రయాణం, వ్యోమగామిగా ఆమె సాధించిన విజయాలు, అంతరిక్ష నడకలు, నాసాకి చేసిన కృషి గురించి గుర్తు చేసుకోవడం ఒక ఊరట. స్టెమ్ రంగాలలో మహిళల విజయాలకు స్ఫూర్తిమంతమైన వేడుక.1965లో అమెరికాలో పుట్టిన సునీత నేపథ్యం రీత్యా, తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కావడం భారతీయులకు ఆమెను దగ్గర చేసే అంశం కాగా సునీత విజయాలు తేదీలతో,ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రపంచ మహిళలంతా ఉత్సవాలు చేసుకోవలసిన సందర్భం. సునీత తొమ్మిదిసార్లు; అరవై గంటలకన్నా ఎక్కువ సమయం స్పేస్ వాక్ చేశారు. స్పేస్ వాక్ చేసిన మహిళలందరిలో ‘ఎక్కువ సమయం’ రికార్డ్ ఆమెదే.భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్, గుజరాత్ టెక్నలాజికల్ యునివర్సిటీ గౌరవ డాక్టరేట్, విశ్వ గుజరాత్ సొసైటీ వారి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశ్వప్రతిభ అవార్డుతో పాటు, రష్యా ప్రభుత్వం మెడల్ ఫర్ మెరిట్ ఇన్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్, అమెరికన్ డిఫెన్స్ సర్వీస్ సుపీరియర్ మెడల్ లాంటి లెక్కకు మిక్కిలి అవార్డులు ఆమె ఖాతాలో చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. సునీత నౌకాదళంలో డైవింగ్ ఆఫీసర్ గా పనిచేశారు. ఆమె 2770 కన్నా ఎక్కువ గంటలు విమానాలు నడిపారు. నాసాలో అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు. 2006–07లో ఖీ –116 మిషన్ ద్వారా మొదటిసారి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కి వెళ్లి అక్కడ 195 రోజులు గడిపారు. ఆ తర్వాత 2012లో ఎక్స్‌పెడిషన్ 32/33లో మరొకసారి అంతరిక్షం చేరుకుని, బోలెడు ప్రయోగాలు చేశారు. ఇంకా చాలా చాలా. గత జూన్ లో స్వల్పకాల మిషన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు కానీ, బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో లోపాలు తలెత్తడంతో అక్కడే దీర్ఘకాలం చిక్కుకుపోయినా మొక్కవోని ధైర్యం ప్రదర్శించి భూమికి వెనుతిరిగారు.ఐ కమాండర్ సునీత న్యూస్ విన్నప్పుడు నాకు అనేక విషయాలు ఆలోచనకు వచ్చాయి. మానవ జాతికి పనికి వచ్చే పరిశోధనల కోసం ఆస్ట్రోనాట్స్ అంతరిక్షానికి వెళతారు. అదే క్రమంలో సునీత స్పేస్‌స్టేషన్‌లో చిక్కుకుని పోతే భూమ్మీద కులాసా జీవితం గడిపే మనం ఎంతమాత్రం వారి గురించి తలచుకున్నాం? వినోదంలో భాగంగా ఒక హౌస్‌లో కొందరు చేసే అల్లరి, ఆటపాటలు, న్యూసెన్ ్స గొడవలు చూపిస్తే, ఎందుకూ పనికిరాని వాటిని ఆసక్తితో చూస్తూ వుంటాం.సునీత అంతరిక్షంలో గడిపిన సమయంపై టీవీలో వస్తే ఆ సమాచారానికి, ముఖ్యంగా మనప్రాంతంలో టీఆర్పీ రేటింగ్స్ ఏ మేరలో ఉంటాయో! మొత్తంగా మన ఆసక్తులను పునర్ నిర్వచించమని, వాటిని పనికొచ్చే కార్యక్రమాల్లో పెట్టమని సునీత ఇవాళ మనకు సందేశం ఇస్తోంది. సునీత, అరవై ఏళ్లకు దగ్గర పడుతున్నది. ఈ దశలో చాలామంది ఆడవాళ్ళు పోస్ట్ మెనోపాజ్ సమస్యలను ఎదుర్కొంటూ ఇవాళ బాగా గడిస్తే చాలు, ఇంట్లో పనులు అవసరం అయినంత మేర చేస్తే చాలు, ఆఫీసులో అక్షింతలు పడకుండా బైటపడితే చాలు అనుకుంటారు. కానీ ఈ దశ మరింత ఉత్పాదక అభివృద్ధికి అడ్డంకి కాదు అని సునీత మనతో చెబుతోంది. సైకిల్ మెకానిజం సైతం మగవారి డొమైన్‌గా పరిగణన చేసే మన సమాజంలో, కృషి, పట్టుదలకి తోడు అవకాశం కల్పిస్తే మహిళ ఎయిర్ మెకానిక్ కావడం సాధ్యమే అని సునీతని చూస్తే అర్థం అవుతోంది. – డాక్టర్ ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి, ప్రోఫెసర్, రచయిత్రి -
Updates: విజయవంతంగా భూమ్మీదకు సునీత అండ్ కో
అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ల్యాండైన సునీతా విలియమ్స్ అండ్ కోదివి నుంచి భూమికి సేఫ్‌గా అడుగు పెట్టిన సునీతా విలియమ్స్ఫ్లోరిడా తీరం సముద్ర జలాల్లో దిగిన క్రూ డ్రాగన్ వ్యోమనౌకఅత్యంత ఉత్కంటగా సాగిన చివరి 7 నిమిషాలుఈ రోజు ఉ.3.27 గంటలకు భూమికి చేరిన సునీతాక్రూ డ్రాగన్ వ్యోమనౌక దగ్గరకు వచ్చిన నాసా శాస్త్రవేత్తలుక్రూ డ్రాగన్ సేఫ్ ల్యాండిగ్తో నాసా శాస్త్రవేత్తల సంబరాలుల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలించారుఅక్కడే వారికి కొన్ని రోజులు పాటు ఆరోగ్య పరీక్షలు చేయనున్న వైద్యులుసుదీర్గకాలం స్పేస్‌లో ఉండటం వల్ల పలు ఆరోగ్య సమస్యలుఆరోగ్య సమస్యలను ఎప్పటకప్పుడు పరీక్షించనున్న వైద్యులుదీంతో తన మూడో అంతరిక్ష యాత్రను సైతం విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్గతంలో 2006,2012లలో రెండు సార్లు అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సునీతా విలియమ్స్ Splashdown confirmed! #Crew9 is now back on Earth in their @SpaceX Dragon spacecraft. pic.twitter.com/G5tVyqFbAu— NASA (@NASA) March 18, 2025కాసేపట్లో భూమి మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాక.సునీతా విలియమ్స్ కోసం వేచి చూస్తున్న యావత్ ప్రపంచం17 గంటల ప్రయాణం తరువాత భూమిపైకి చేరుకోనున్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకభూమి మీదకు చేరగానే వ్యోమగాములకు వైద్య పరీక్షలు8 రోజుల మిషన్.. 9 నెలల హైటెన్షన్ అనుక్షణం ఒక అద్భుతం.. ప్రతీ క్షణం ప్రమాదంతో సహవాసం నిజానికవి 9 నెలలు కాదు..ఒక్కో క్షణం ఒక్కో యుగం అంతులేని ఒత్తిడిలోనూ అంతరిక్షాన్ని జయించిన సునీత.. ధీర వనిత అనుక్షణం ఒక అద్భుతం..👉మరికొద్ది గంటల్లో భూమ్మీదకు సునీతా విలియమ్స్(Sunita Williams), బచ్ విల్మోర్ రాకలైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసాభారత కాలమానం ప్రకారం.. 2.15గం. ప్రారంభం కానున్న లైవ్నాసా క్రూ 9 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్(ISS)కు వెళ్లిన సునీత, విల్మోర్290 రోజులపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన ఇరువురు నాసా వ్యోమగాములుభూమి యొక్క ఉపరితలం నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడిపిన మహిళ(59 వ్యోమగామిగా సునీతా విలియమ్స్ రికార్డు సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఇద్దరు!సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్లతో పాటు భూమ్మీదకు రానున్న నిక్ హేగ్(నాసా), అలెగ్జాండర్ గుర్బునోవ్(రష్యా వ్యోమగామి)క్రూ-9లో భాగంగా కిందటి ఏడాది సెప్టెంబర్‌లో అక్కడికి వెళ్లిన హేగ్, గుర్బునోవ్సునీత, బచ్‌ల కోసం కావాల్సినవి అందించడంతో పాటు వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలు చేసిన ఈ ఇద్దరు స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ రానున్న మొత్తం నలుగురుకిందటి ఏడాది జూన్‌లో.. మానవ సహిత బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా ఐఎస్ఎస్కు చేరుకున్న ఇద్దరు స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చిక్కుకుపోయిన ఇద్దరు ఇదీ చదవండి: అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..ఇండియన్ డాటర్‌కు స్వాగతంభారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్సునీత సాహసయాత్రపై భారత్‌లో అభినందనల వెల్లువత్వరలో భారత్‌కు రావాలంటూ లేఖ రాసిన ప్రధాని మోదీ క్షేమంగా రావాలంటూ గుజరాత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామంలో పూజలు, యాగాలు 👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి క్రూ డ్రాగన్ వ్యోమనౌక తిరుగు పయనం ఇలా.. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత: మంగళవారం ఉదయం 8.15కు మొదలుఅంతరిక్ష కేంద్రం నుంచి విడిపోవడం: ఉదయం 10.15 గంటలకు ప్రారంభం. భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ఆన్: బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు. సాగర జలాల్లో ల్యాండింగ్: తెల్లవారుజామున 3.27 గంటలకు.సహాయ బృందాలు రంగంలోకి దిగి.. స్పేస్ఎక్స్ క్యాపూల్స్ క్రూ డ్రాగన్‌ను వెలికితీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్షయాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లోనే చిక్కుకుపోయారు.ఇదీ చదవండి: Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ? -
‘ఆమె క్షేమంగా వస్తే చాలూ.. మాకు పండుగే!’
ఢిల్లీ: తొమ్మిది నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(sunita williams) , బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి తిరుగు పయనమయ్యారు. వ్యోమగాములంతా సురక్షితంగా భూమ్మీద అడుగు మోపాలని కోట్ల మంది ప్రార్థిస్తున్నారు. అయితే ఒక ఊరు మాత్రం ప్రత్యేకంగా సునీత క్షేమం కోసం పూజలు, హోమాలు చేస్తోంది. ఆమె రాకను ఒక పండుగలా జరిపేందుకు సన్నాహాలు చేస్తోంది. సునీతా విలియమ్స్ భారత సంతతి అనే విషయం తెలిసిందే కదా. గుజరాత్‌లోని మెహసానా జిల్లా ఝూలాసన్ ఆమె పూర్వీకుల గ్రామం(Ancestral Village). అక్కడ ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. కిందటి ఏడాది.. సునీత అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయినప్పటి నుంచి వాళ్లంతా ఆందోళనతోనే ఉన్నారు. ఆమె క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు.. ఆమె తిరిగి వస్తుండడంపై వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.‘‘నా సోదరి సునీతా రాక కోసం మేమంతా ఎంతో ఎదురుచూస్తున్నాం. సునీత తల్లి, సోదరి, సోదరుడుతో సహా ఈ దేశంలోని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ఆమె సురక్షితంగా కిందకు దిగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. సునీత కోసం దేవాలయాలకు వెళ్లి పూజలు చేశాం. సునీతా కోసం యజ్ఞం నిర్వహిస్తున్నాం’’ అని ఆమె సోదరుడు దినేశ్ అంటున్నారు. మరోవైపు ఊరు ఊరంతా.. సునీత రాకను చిరస్మరణీయమైన రోజు.. దేశం గర్వించదగిన రోజుగా చెబుతోంది. దీపావళి పండుగలా ఆమె రాకను సంబురంగా జరిపేందుకు సిద్ధం అయ్యింది. సునీతా విలియమ్స్ గతంలో రెండుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 2007లో తొలిసారి ఇండియాకు వచ్చిన ఆమె.. ఝూలాసన్తో పాటు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. తిరిగి 2013లో పర్యటనకు వచ్చి.. కోల్‌కతా, న్యూఢిల్లీతో పాటు తన పూర్వీకుల గ్రామాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఝూలాసన్ గడ్డకు ఆమె ప్రత్యేకంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. కిందటి వ్యోమగాములను భూమ్మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్(Space X Crew Dragon Capsule)లోకి వీరు చేరుకున్నారు. ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమ్మీదకు బయల్దేరింది. స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ ఐఎస్ఎస్ను వీడే అన్‌డాకింగ్ దృశ్యాలను ప్రపంచమంతా వీక్షించేందుకు నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. -
ISSలో ఉండగా సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ
-
వ్యోమగాములు జుట్టును ముడి వేసుకోరు.. కారణం?
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారి రాక కోసం అంతా నిరీక్షించారు. ఎట్టకేలకు ఆ ఉత్కంఠకు తెరపడేలా మరికొద్దిగంటల్లో భూమ్మీదకు రానున్నారు. వారు అన్నిరోజులు అంతరిక్షంలో ఎలా గడిపారు, వారి మానసికస్థితి వంటి వాటి గురించి తెలుసుకోవాలనే కుతుహలంతో ఉన్నారు అంతా. ఒకరకంగా ఈ పరిస్థితి వల్ల భవిష్యత్తు అంతరిక్షంలో మానువుని మనుగడ గురించి కొత్త విషయాలు తెలుసుకునే అనుభవం దొరికిందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఇదంతా ఎలా ఉన్నా.. ఆ ఇరువురు చిక్కుపోయిన సమయంలో ఎప్పటికప్పుడూ వారెలా ఉన్నారనే దాని గురించి ఫోటోల రూపంలో అప్డేట్ ఇచ్చేది. ఆ ఫోటోల్లో సునీతా ఎప్పుడు వదులుగా ఉన్న జుట్టుతోనే కనిపించేవారు. నిజానికి ఆ చిత్రాలు చాలామందిలో ఓ ఉత్సుకతను రేకెత్తించింది. అసలు ఎందుకని మహళా వ్యోమగాములు అంతరిక్షంలో జుట్టుని ముడివేసుకోరనే ప్రశ్నను లేవెనెత్తింది. మరీ దీని వెనుకున్న రీజన్, ఆ సైన్సు ఏంటో చూద్దామా..!.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) సూక్ష్మ గురుత్వాకర్షణ వాతావరణంలో వ్యోమగామి సునీతా విలియమ్స్ వదులుగా ఉన జుట్టుతో కనిపించేవారు. ఆమె జుట్టు అంతరిక్షంలో గాల్లో ఎగురుతున్నట్లుగా కనిపించేది. అదిగాక ఇటీవల అమెరికా అధ్యక్షుడు చిక్కుపోయిన ఈ ఇరువురు వ్యోమగాముల గురించి మాట్లాడుతూ..సునీతా విలియమ్స్ జుట్టుపై వ్యాఖ్యలు చేశారు. అడవిలా గాల్లో తేలుతున్నట్లు కనిపిస్తున్న ఆ ధృడమైన జుట్టుని చూస్తేనే తెలుస్తోంది ఆమె ఎంత ధైర్యవంతురాలేనది అని హాస్యాస్పదంగా అన్నారు.ఆ తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలకుగానూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురయ్యారు కూడా. ఆ నేపథ్యంలోనే వ్యోమగాములు, ముఖ్యంగా మహిళలు అంతరిక్షంలో తమ జుట్టును ఎలా నిర్వహిస్తారనే విషయం హైలెట్ అయ్యింది.అదీగాక సునీతా విలియమ్స్లాంటి వ్యోమగాములంతా కూడా తమ జుట్లుని ముడివేయడం లేదా రబ్బర్‌తో కట్టేయడం వంటివి ఎందుకు చెయ్యరు అని అంశంపై చర్చించడం ప్రారంభించారు అంతా. అందుకు సైన్సు పరంగా పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.అవేంటంటే..గురుత్వాకర్షణ శక్తి శూన్యం కాబట్టి.. జుట్టును క్రిందికి లాగదు కాబట్టి ముడివేయడం లేదా కట్టేయడం వంటివి చేయాల్సిన పనిలేదు. సులభంగా వాషింగ్ చేసుకోవచ్చట. ఎలాంటి షాంపులతో పనిలేకుండానే వాష్ చేయొచ్చట. పైగా టవల్‌తో తుడుచుకోవాల్సిన పని ఉండదట. ఇక డ్రైయర్లతో అస్సలు పని ఉండదట. ఎందకంటే జుట్టులోని నీరంతా ఆవిరి అయిపోతుందట . అలాగే అక్కడ ఉంటే జీరో గ్రావిటేషన్ కారణంగా ఇలా జుట్టు ఫ్రీగా వదిలేసినా..ముఖం మీదకి వచ్చి ఇబ్బంది పడే సమస్య ఉండదట. దీనిపై నాసా వ్యోమగామి కరెన్ నైబర్గ్ సోషల్ మీడియా వేదికగా తన అంతరిక్ష అనుభవాలను షేర్ చేసుకుంటూ..ఆ అంతరిక్షంలో తన హెయిర్ కేర్ రొటీన్ గురించి కూడా మాట్లాడారు. 2013లో ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఉన్నప్పుడు తన పొడవాటి జుట్టుని ఎలా వాష్ చేసుకుందో వివరించింది. తాము నీటిని చిమ్ముకుంటూ వాష్ చేసుకుంటామని తెలిపింది. తమకు షాంపుల వాడకం, అలాగే తడిచిన జుట్టుని పిండాల్సిన పని గానీ ఉండదని చెప్పింది. ఎందుకంటే తలపై ఉన్న నీరంతా అంతరిక్షంలో ఘనీభవించి త్రాగునీరుగా మారిపోతుందని చెప్పుకొచ్చింది.(చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?) -
సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?
ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (sunita Williams)కు ప్రధాని మోదీ (narendra modi) లేఖ రాశారు. భారత్‌లో పర్యటించాలని కోరారు.దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. బుధవారం ఉదయం 3 గంటల తర్వాత భూమ్మీదకు చేరుకున్నారు.As the whole world waits, with abated breath, for the safe return of Sunita Williams, this is how PM Sh @narendramodi expressed his concern for this daughter of India.“Even though you are thousands of miles away, you remain close to our hearts,” says PM Sh Narendra Modi’s… pic.twitter.com/MpsEyxAOU9— Dr Jitendra Singh (@DrJitendraSingh) March 18, 2025ఈ తరుణంలో సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మోదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో ‘సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు’ అని గుర్తు చేశారు. అంతేకాదు, మోదీ తన అమెరికా పర్యటనలో గతేడాది జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, ప్రతికూల పరిస్థితుల కారణంగా సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్‌ను భూమ్మీదకు తెచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలతో పాటు ఆస్ట్రోనాట్స్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జోబైడెన్ వద్ద ఆరా తీసినట్లు లేఖలో తెలిపారు.ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. -
అంతరిక్షంలో 9 నెలలున్నాక.. ఎదురయ్యే సమస్యలివే..
వాషింగ్టన్: అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలున్నాక తిరిగి భూమికి వస్తున్న తరుణంలో వారు ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలను ఎదుర్కోనున్నారనేది కీలకంగా మారింది. ప్రధానంగా వారు ఎముకలు, కండరాల క్షీణత, రేడియేషన్ ఎక్స్పోజర్, దృష్టి లోపం మొదలైన సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే ఇన్నాళ్లూ ఒంటరిగా ఉన్నందున పలు మానసిక రుగ్మతలను కూడా చవిచూడనున్నారు.అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ 9 నెలల 13 రోజుల తర్వాత భూమికి తిరిగి వస్తున్నారు. వారు అంతరిక్షంలోకి ఎనిమిది రోజులు మాత్రమే ఉండేందుకు వెళ్లారు. కానీ అక్కడే చిక్కుకుపోయారు. సునీతతో పాటు మొత్తం నలుగురు వ్యోమగాములు మార్చి 19న తెల్లవారుజామున 3:27 గంటలకు డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఫ్లోరిడా తీరంలో దిగుతారు. తొమ్మిది నెలలుగా భూ వాతావరణానికి దూరంగా ఉన్న ఈ వ్యోమగాములు ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోనున్నారనే విషయానికి వస్తే..1. నడక మర్చిపోవచ్చుమనం భూమిపై నడుస్తున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు కండరాలు గురుత్వాకర్షణ(Gravity)కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. కానీ అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా కండరాలు పనిచేయవు. ఫలితంగా కండరాలు బలహీనపడతాయి. అలాగే ప్రతి నెలా ఎముక సాంద్రత దాదాపు ఒక శాతం తగ్గుతుంది. ఇది కాళ్ళు, వీపు, మెడ కండరాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఫలితంగా ఈ వ్యోమగాములు భూమిపై వెంటనే నడవలేని స్థితిలో ఉంటారు.2. నిలబడేందుకూ ఇబ్బందిమన మెదడులో వెస్టిబ్యులర్ వ్యవస్థ ఉంటుంది. ఇది శరీరంలో సమతుల్యతను కాపాడేలా పనిచేస్తుంది. అంతరిక్షంలో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఫలితంగా భూమికి తిరిగి వచ్చే కొంతమంది వ్యోమగాములు కొంతకాలం పాటు నిలబడలేరు. చేతులు, కాళ్లను బ్యాలెన్స్ చేయలేరు. 2006లో అమెరికన్ వ్యోమగామి హెడెమేరీ స్టెఫానిషిన్-పైపర్ 12 రోజుల అంతరిక్షంలో ఉండి, ఆ తర్వాత భూమికి తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.3. వస్తువులను గాలిలో వదిలేస్తారుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల వ్యోమగాముల శరీరం సూక్ష్మ గురుత్వాకర్షణకు అనుగుణంగా మారుతుంది. అంతరిక్షంలో ఏదైనా వస్తువు గాలిలో ఉంచినప్పుడు, అది పడిపోకుండా తేలుతూనే ఉంటుంది. దీంతో వారికి భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ అలవాటు కొంతకాలం కొనసాగుతుంది.4. అంధత్వం వచ్చే ప్రమాదంఅంతరిక్షం(Space)లో సున్నా-గురుత్వాకర్షణ కారణంగా, శరీర ద్రవం తల వైపు కదులుతుంది. ఇది కళ్ల వెనుక ఉన్న నరాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనిని స్పేస్ ఫ్లైట్ అసోసియేటెడ్ న్యూరో-ఓక్యులర్ సిండ్రోమ్ (ఎస్‌ఏఎన్‌ఎస్) అని పిలుస్తారు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత వ్యోమగాముల శరీరాలు ఇక్కడికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేందుకు ప్రయత్నిస్తాయి. తద్వారా వారి కళ్లు ప్రభావితమవుతాయి. కంటి సమస్యలు లేదా అంధత్వం వచ్చే అవకాశం కూడా ఏర్పడవచ్చు.ఈ వ్యాధులు మాత్రమే కాదు.. ఎముక బలహీనత, అధిక రేడియేషన్‌కు గురికావడం వల్ల క్యాన్సర్ ముప్పు, డీఎన్ఏ దెబ్బతినడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం, గాయాలను నయం చేసుకునే సామర్థ్యం తగ్గడం,ఒంటరితనం, మానసిక ఒత్తిడి, నిద్ర సమస్యలు, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది లాంటి సమస్యలను వ్యోమగాములు ఎదుర్కొంటారు. ఇది కూడా చదవండి: Uttar Pradesh: ట్రక్కును 100 మీటర్లు లాక్కుపోయిన గూడ్సు -
Sunita Williams అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
ఋతుక్రమం లేదా పీరియడ్స్‌ను భరించడం, ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఉండటం సాధారణ మహిళలు లేదా అమ్మాయిలకే చాలా కష్టం. ముఖ్యంగా ఉద్యోగినులు, విద్యార్థినులకు ఇది ఇంకా కష్టం. మూడు రోజుల శారీరక బాధలతోపాటు, డ్రెస్‌కు ఏదైనా మరకలు ఉన్నాయా చూడవే బాబూ.. అని తోటి ఫ్రెండ్స్‌ను అడగడం మొదలు, ప్యాడ్ మార్చుకోవడానికి రిమైండర్లను సెట్ చేసుకోవడం, పగలు వినియోగానికి ఒక రకం, రాత్రి వినియోగానికి మరో రకం ప్యాడ్స్‌ను ఎంచుకోవడం, మంచంపైన దుప్పటికి మరకలైతే, అమ్మ తిడుతుందేమోనన్న భయం వరకు ఇలా చాలానే ఉంటాయి. ఆకాశమే హద్దు అంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు అంతరిక్షంలో కూడా అడుగు పెట్టారు. మరి అంతరిక్షంలో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తాయా? వస్తే ఎలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలో చిక్కుకున్న నాసా( NASA) వ్యోమగామి సునీతా విలియం (Sunita Williams) బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. కేవలం ఎనిమిది రోజులు అనుకున్న ఈ ప్రయాణం తొమ్మిది నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరి సునీతా విలియమ్స్ లాంటి మహిళలు అంతరిక్షంలో ఉన్నప్పుడు పీరియడ్స్‌ను ఎలా మేనేజ్ చేశారు అనేది సందేహం కలుగక మానదు. గ్లాస్ సీలింగ్స్‌ను బ్రేక్ చేస్తూ మహిళలు అంతరిక్షం వెళ్లాలనుకున్నపుడు వచ్చిన మొదటి సవాల్ ఇదే.హార్మోన్ల మార్పులు, సూక్ష్మ గురుత్వాకర్షణ (Microgravity) ప్రభావాలు చర్చకు వచ్చాయి. మార్గదర్శక మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా సెడాన్, అసలు ఇది సమస్యే కాదని వాదించారు. అలా మహిళలు సాహసయాత్రకు పూనుకున్నారు.Astronaut Periods: అలా అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ వాలెంటినా తెరేష్కోవా. ఇది 1963లో జరిగింది. అప్పటి నుండి మరో 99 మంది ఆమె అడుగుజాడలనుఅనుసరించి అతరిక్షంలోకి ప్రయాణించారు. అయితే పీరియడ్స్ విషయంలో రేకెత్తిన అన్ని ఆందోళనలకు, ఊహాగానాలకు విరుద్ధంగా మహిళా వ్యోమగాములకు అంతరిక్షంలో కూడా సాధారణంగానే పీరియడ్స్ వస్తాయి. ఋతుస్రావం భూమిపై ఉన్నట్లే సాధారణంగా పనిచేస్తుంది. వారు భూమిపై ఉన్న మాదిరిగానే ప్రామాణిక శానిటరీ, పరిశుభ్రత ఉత్పత్తులను ఉపయోగిస్తారు , అవి అంతరిక్షంలో ప్రభావవంతంగా ఉంటాయి కూడా.చదవండి : ఇన్నాళ్ళ బాధలు చాలు, రూ.5 కోట్ల సంగతి తేల్చండి : బాంబే హైకోర్టుమహిళల అంతరిక్ష యాత్రలో ఉన్నపుడు పీరియడ్స్ సమస్యలొస్తాయని రక్తం గాల్లో తేలుతుందని, హార్మోన్ల సమస్య వస్తుందని భయపడ్డారు. స్త్రీలు ఋతుస్రావం కావాలని ఆపితే తప్ప, ఈ ప్రక్రియ అంతరిక్షంలో సాధారణంగా జరుగుతుందని వాస్తవ అనుభవాల ద్వారా తేలింది. అయితే పీరియడ్స్ వాయిదా వేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం పూర్తిగా వ్యక్తిగతమైనది. మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్లూ నెలసరిని వాయిదా వేసుకుంటారు. పీరియడ్స్ రాకుండా హార్మోన్ల మాత్రలు(Birth control pills) వంటి గర్భనిరోధకాల (Hormonal contraceptives)ను ఎంచుకుంటారు. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని సైంటిస్టుల మాట. పైగా అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు స్త్రీపురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భనిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజెన్ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం అంతరిక్ష ప్రయాణాలకు వీటిని రికమెండ్ చేస్తున్నారు. తద్వారా శానిటరీ ప్యాడ్స్ వాడకం, నీరు ఆదా అవుతాయి. శుభ్రత కూడా సులభవుతుంది. అలా కాని పక్షంలో నెలసరిని ఆపకూడదు అనుకుంటే, భూమిపై ఎలా మేనేజ్ చేస్తారో, అంతరిక్షంలోనూ అలాగే మేనేజ్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా లభించే నీరు, తక్కువ స్టోరేజీ స్పేస్ కారణంగా వ్యోమగాములు వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. సలాం మీకు!అయితే పీరియడ్స్ నిర్వహణలో మహిళా వ్యోమగాముల సమస్యలు అన్నీ ఇన్నీ కావు. శ్యానిటరీ ఉత్పత్తుల అదనపు భారం, అలాగే భార రహిత స్థితిలో శ్యానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం అతి పెద్ద సవాలు అనడంలో ఎలాంటి సందేహంలేదు. దీనికి తోడు మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో నీటి కొరత ఎంత సమస్యో ఊహించుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సవాళ్లను అధిగమించి అంతరిక్షంలోకి అడుగుపెట్టి, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు, పరిశోధనలకు మూలమవుతున్న మహిళా వ్యోమగాములకు సలాం! ఇదీ చదవండి: 60లో 20లా మారిపోయాడుగా : హీరోలకే పోటీ, ఫ్యాన్స్ కమెంట్లు వైరల్ -
భూమ్మీదకు తిరిగొచ్చే ముందు సునీతా విలియమ్స్..
భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్ మోర్ లు సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయి తిరిగి భూమ్మీదకు చేరే సమయం ఎంత సేపో లేదు. ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు చ చివరిగా అక్కడ దిగిన ఫోటో ఒక్కటి వైరల్ గా మారింది. దానికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను నాసా విడుదల చేసింది. వారు అంతరిక్ష కేంద్రంలో గడిపిన చివరి క్షణాలు అంటూ ఫోటోను షేర్ చేసింది.ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్షం కేంద్ర నుంచి భూమ్మీదకు బయల్దేరిన సునీతా- బుచ్ లు మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిర్ణీత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెప్టెంబర్ లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్తో పాటే తిరిగి వస్తున్నారు. LIVE: @NASA_Astronauts Nick Hague, Suni Williams, Butch Wilmore, and cosmonaut Aleksandr Gorbunov are packing up and closing the hatches as #Crew9 prepares to depart from the @Space_Station. Crew-9 is scheduled to return to Earth on Tuesday, March 18. https://t.co/TpRlvLBVU1— NASA (@NASA) March 18, 2025 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ఆ జ్ఞాపకాలు పదిలంగా దాచుకుంటా..అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను అక్కడ నుంచే షేర్ చేసుకున్నారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు. -
#NASA : కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్ (ఫొటోలు)
-
రేపు భూమి మీదకు సునీత విలియమ్స్ రాక
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. తిరిగొస్తున్న సునీత
వాషింగ్టన్: భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో. ఏడెనిమిది రోజులనుకుంటే ఏకంగా వారాలూ, నెలలూ గడిచిపోతున్నాయి. ఉన్నది భారరహిత స్థితిలోనే. అయినా అటు కార్యభారం. ఇటు ఎడతెగని ఆలోచనల భారం. క్షణమొక యుగంగా సమయం కూడా భారంగానే గడుస్తున్న పరిస్థితి. ఎడతెగని ఆ ఎదురుచూపులకు ఎట్టకేలకు శుభంకార్డు పడనుంది. 9 నెలల అంతరిక్షవాసం ముగించుకుని నాసా వ్యోమగాములు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (59), బచ్ బారీ విల్మోర్ (62) భూమికి తిరిగి రానున్నారు. వాతావరణం అనుకూలించి, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27కు) అమెరికాలో ఫ్లోరిడా సముద్ర తీరంలో దిగనున్నారు. ఆదివారం నాసా ఈ మేరకు ప్రకటించింది. అనుకూల వాతావరణం నేపథ్యంలో తిరుగు ప్రయాణాన్ని నిరీ్ణత సమయం కంటే ఒక రోజు ముందుకు జరిపినట్టు పేర్కొంది. గత సెపె్టంబర్లో ఐఎస్ఎస్కు వెళ్లిన మరో ఇద్దరు వ్యోమగాములు నిక్ హేగ్ (అమెరికా), అలెగ్జాండర్ గుర్బనోవ్ (రష్యా) కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్–10 స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్తో పాటే తిరిగి వస్తున్నారు. వారి రాక కోసం ప్రపంచమంతా అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తోందిప్పుడు. బాధ్యతల అప్పగింత బోయింగ్ సంస్థ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ మేరకు వారు ఎనిమిది రోజుల్లోనే తిరిగి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా అది వీలు పడలేదు. దాని మరమ్మతుకు చేసిన ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలించలేదు. దాంతో రిస్కు తీసుకోరాదని నాసా నిర్ణయించింది. ఫలితంగా సెపె్టంబర్ 7న స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. వారిని తిరిగి తీసుకొచ్చేందుకు మధ్యలో చేసిన ఒకట్రెండు ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అలా 9 నెలలుగా సునీత ఐఎస్ఎస్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎట్టకేలకు ఆమెను, విల్మోర్ను వెనక్కు తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ ప్రయోగించిన డ్రాగన్–9 వ్యోమనౌక ఆదివారం విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరింది. అందులో వచ్చిన నలుగురు వ్యోమగాములు సునీత బృందం నుంచి లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. కమాండర్ బాధ్యతలను రష్యాకు చెందిన అలెక్సీ ఒచినిన్‌కు సునీత అప్పగించారు. వచ్చే ఆర్నెల్ల పాటు ఐఎస్ఎస్ కార్యకలాపాలన్నీ ఆయన కనుసన్నల్లో జరుగుతాయి. అయినా స్థైర్యమే... అనూహ్యంగా ఐఎస్ఎస్లో 9 నెలల పాటు గడపాల్సి వచ్చినా సునీత ఎక్కడా డీలాపడలేదు. మొక్కవోని ఆత్మస్థైర్యం ప్రదర్శించారు. తన పరిస్థితిపై కూడా తరచూ జోకులు పేల్చారు! నడవటమెలాగో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ గత జనవరిలో నాసా సెంటర్‌తో మాట్లాడుతూ చమత్కరించారు. ఐఎస్ఎస్లో ఉన్నన్ని రోజులూ ఊపిరి సలపని బాధ్యతల నడుమే గడిపారు. అలాగని చిన్నచిన్న సరదాలకూ లోటులేకుండా చూసుకున్నారు. సహచరులతో కలిసి సునీత, విల్మోర్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. వీడియో కాల్స్ ద్వారా తమ కుటుంబీకులతో టచ్‌లో ఉంటూ వచ్చారు. → ఐఎస్ఎస్ కమాండర్‌గా కీలక ప్రయోగాలకు సునీత సారథ్యం వహించారు. → అంతరిక్షంలో భారరహిత స్థితిలో మొక్కల్ని పెంచిన నాసా ప్రయోగాన్ని స్వయంగా పర్యవేక్షించారు. → మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేశారు. ఎందరికో స్ఫూర్తి వ్యోమగామిగా గ‘ఘన’ విజయాలు సాధించిన సునీతవి భారత మూలాలు. ఆమె పూర్తి పేరు సునీతా లిన్ విలియమ్స్. 1965లో అమెరికాలోని ఒహాయోలో జని్మంచారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ కాగా తల్లి బోనీ జలోకర్‌ది స్లొవేనియా. వారి ముగ్గురు సంతానంలో సునీత అందరికన్నా చిన్న. అమెరికా నావల్ అకాడెమీ నుంచి ఫిజిక్స్‌లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశారు. తండ్రి సూచనతో...తండ్రి సూచన మేరకు నావికా దళంలో బేసిక్ డైవింగ్ ఆఫీసర్‌గా చేరారు సునీత.→ నేవల్ ఏవియేటర్‌గా యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ పొందారు. కంబాట్ హెలికాప్టర్ స్క్వాడ్రన్‌లో పని చేశారు. → 30 ఏళ్ల వృత్తిగత జీవితంలో పైలట్‌గా 30 పై చిలుకు రకాల విమానాలను 3,000 గంటలకు పైగా నడిపిన అపార అనుభవం ఆమె సొంతం. → నేవీ నుంచి రిటైరయ్యాక సునీత 1998 జూన్ లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. → 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. ఐఎస్ఎస్లో ఆర్నెల్లకు పైగా గడిపి దాని నిర్వహణ, మరమ్మతులు తదితరాలపై అనుభవం గడించారు. → 2012లో రెండోసారి ఐఎస్ఎస్కు వెళ్లి నాలుగు నెలలకు పైగా ఉన్నారు. → సునీత భర్త మైకేల్ జె.విలియమ్స్ రిటైర్డ్ ఫెడరల్ మార్షల్. వారికి సంతానం లేరు. పెట్ డాగ్స్ అంటే ఈ జంటకు ప్రాణం. వాటినే తమ సంతానంగా భావిస్తుంటారు. → సునీత హిందూ మతావలంబి. నిత్యం భగవద్గీత చదువుతానని చెబుతారు.పరిహారమేమీ ఉండదు సునీత, విల్మోర్ ఏకంగా 9 నెలలకు పైగా ఐఎస్ఎస్లో చిక్కుబడిపోయారు కదా. మరి వారికి పరిహారం రూపంలో అదనపు మొత్తం ఏమన్నా లభిస్తుందా? అలాంటిదేమీ ఉండదు. తమకు ప్రత్యేకంగా ఓవర్‌టైం వేతనమంటూ ఏమీ ఉండదని నాసా వ్యోమగామి కాడీ కోల్మన్ చెప్పారు. ‘‘అంతరిక్ష యాత్రలను అధికార పర్యటనల్లో ఇతర కేంద్ర ప్రభుత్వోద్యోగుల మాదిరిగానే పరిగణించడమే ఇందుకు కారణం. ఇలాంటప్పుడు ఖర్చుల నిమిత్తమని మాకు అదనంగా రోజుకు కేవలం 4 డాలర్లు (రూ.347) అందుతాయంతే’’ అని వివరించారు. ఆ లెక్కన సునీత, విల్మోర్ అదనంగా 1,148 డాలర్లు (దాదాపు రూ.లక్ష) అందుకోనున్నారు. వారు అమెరికా ప్రభుత్వోద్యోగుల్లో అత్యున్నతమైన జీఎస్–15 వేతన గ్రేడ్‌లో ఉన్నారు. ఆ లెక్కన వాళ్లకు ఏటా 1.25 లక్షల నుంచి 1.62 లక్షల డాలర్ల (కోటి నుంచి 1.41 కోట్ల రూపాయల) వేతనం లభిస్తుంది.తిరుగు ప్రయాణం ఇలా... → సునీత బృందం తిరుగు ప్రయాణానికి భారత కాలమానం ప్రకారం మంగళవారం కౌంట్‌డౌన్ మొదలవుతుంది. → క్రూ డ్రాగన్–10 వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ మంగళవారం ఉదయం 8.15కు మొదలవుతుంది. → ఐఎస్ఎస్ నుంచి వ్యోమనౌక విడివడే ప్రక్రియ మంగళవారం ఉదయం 10.35కు మొదలవుతుంది. ఆ తర్వాత నాసా ప్రత్యక్ష ప్రసారం ఆడియోకు పరిమితమవుతుంది. అంతా అనుకూలిస్తే బుధవారం (మంగళవారం అర్ధరాత్రి దాటాక) తెల్లవారుజాము 2.15 గంటలకు తిరిగి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతుంది. → బుధవారం తెల్లవారుజాము 2.41 గంటలకు వ్యోమనౌక భూ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. → బుధవారం తెల్లవారుజామున సుమారు 3.27కు ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది. → ఆ వెంటనే నలుగురు వ్యోమగాములనూ నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటికి తీసుకొస్తారు. అన్నీ అనుకూలించాలి అయితే ప్రయాణ సమయం నిర్ణయమైనా చివరి నిమిషం దాకా అన్నీ అనుకూలించాల్సి ఉంటుంది. వాతావరణంతో పాటు ఇతర పరిస్థితులన్నీ సజావుగా ఉంటేనే తిరుగు ప్రయాణం షెడ్యూల్ ప్రకారం సాగుతుంది. ప్రత్యక్షప్రసారం సునీత బృందంతో స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్రూ–9 స్పేస్‌క్రాఫ్ట్ తిరుగు ప్రయాణాన్ని భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.30 నుంచి నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. రికార్డు మాత్రం కాదు సునీత, విల్మోర్ వరుసగా 9 నెలల పాటు (287 రోజులు) ఐఎస్ఎస్లో గడిపినా ప్రపంచ రికార్డుకు మాత్రం దూరంగానే ఉండిపోయారు. రష్యా వ్యోమగామి వలేరీ పొల్యకోవ్ తమ దేశానికి చెందిన మిర్ అంతరిక్ష కేంద్రంలో ఏకబిగిన 437 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. నాసా ఆస్ట్రోనాట్ 371 రోజులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచారు. మూడు అంతరిక్ష యాత్రల్లో కలిపి సునీత 583 రోజులు ఐఎస్ఎస్లో గడిపారు. క్రమశిక్షణ విషయంలో సునీత చాలా పట్టుదలగా ఉంటారు. ఐఎస్ఎస్లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా వ్యాయామం మానలేదట!టైమ్‌లైన్ 2024 జూన్ 5: సునీత, విల్మోర్లతో ఐఎస్ఎస్కు బయల్దేరిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక జూన్ 6: ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైన స్టార్‌లైనర్. కానీ ఆ క్రమంలో స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు పని చేయకపోవడం, ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీకేజీ వంటి సాంకేతిక లోపాలు తెరపైకొచ్చాయి. దాంతో వ్యోమగాములు క్షేమంగా తిరిగిరావడంపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 12: స్టార్‌లైనర్ ప్రయాణానికి సిద్ధంగా లేనందున సునీత, విల్మోర్ తిరుగు ప్రయాణం నిరవధికంగా వాయిదా పడ్డట్టు నాసా ప్రకటన. జూలై–ఆగస్టు: తిరుగు ప్రయాణంపై మరింత పెరిగిన అనిశ్చితి. దాంతో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ సిబ్బందితో కలిసిపోయి దాని నిర్వహణ బాధ్యతలు, పరిశోధనలు తదితరాను పూర్తిగా తలకెత్తుకున్నారు. ఆ క్రమంలో సునీత ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఎముకల సాంద్రత తగ్గడం వంటి పలు సమస్యలు తలెత్తాయి. సెపె్టంబర్: ఐఎస్ఎస్ కమాండర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునీత నవంబర్: సహోద్యోగులతో కలిసి ఐఎస్ఎస్లోనే దీపావళి, థాంక్స్ గివింగ్ వేడుకలు జరుపుకున్న సునీత. ఈ సందర్భంగా వారికోసం ప్రత్యేకంగా స్మోక్డ్ చికెన్ తదితర వంటకాలను పంపిన నాసా. డిసెంబర్: విద్యార్థులతో చిట్‌చాట్ చేసి తన అనుభవాలు పంచుకున్న సునీత. అంతరిక్షంలో జీవితం చాలా ఫన్నీగా ఉందని వ్యాఖ్య. 2025 జనవరి 30: తొలి స్పేస్ వాక్ చేపట్టిన సునీత. అందులో భాగంగా ఐఎస్ఎస్ బయట కీలక మరమ్మతుల్లో భాగస్వామ్యం. ఫిబ్రవరి: తిరుగు ప్రయాణంపై సర్వత్రా అనిశ్చితి పెరుగుతుండటంతో, తాము బాగున్నామని సందేశం పంపిన సునీత, విల్మోర్. మార్చి 12: స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకొస్తున్నట్టు ప్రకటించిన నాసా, ఎక్స్. మార్చి 16: విజయవంతంగా ఐఎస్ఎస్ను చేరిన డ్రాగన్ క్రూ–10 వ్యోమనౌక మార్చి 17: సునీత, విల్మోర్, మరో ఇద్దరు వ్యోమగాములతో డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ మార్చి 18న భూమికి తిరిగొస్తుందంటూ నాసా ప్రకటన – సాక్షి, నేషనల్ డెస్క్ -
సునీతా వచ్చేస్తోంది
-
WELCOME BACK సునీత... టైమ్ ఎప్పుడంటే?
-
మరికొన్ని గంటల్లో భూమి మీదకు సునీత విలియమ్స్.. టైమ్ ఎప్పుడంటే?
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మరికొన్ని గంటల్లో భూమికి చేరుకోనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 AM గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు) సునీతా విలియమ్స్ సహా వ్యోమగామి బుచ్ విల్మోర్ భూమిపై అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు నాసా ఓ ప్రకటనలో వెల్లడించింది.2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. దీంతో, సునీతా విలియమ్స్ (Sunita williams), బుచ్ విల్మోర్లు సుమారు తొమ్మిది నెలల అక్కడే గడపాల్సి వచ్చింది..@NASA will provide live coverage of Crew-9’s return to Earth from the @Space_Station, beginning with @SpaceX Dragon hatch closure preparations at 10:45pm ET Monday, March 17.Splashdown is slated for approximately 5:57pm Tuesday, March 18: https://t.co/yABLg20tKX pic.twitter.com/alujSplsHm— NASA Commercial Crew (@Commercial_Crew) March 16, 2025ఈ నేపథ్యంలో వారిని తీసుకురావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆదేశాలతో వారిని భూమి మీదకు తీసుకువచ్చేందుకు నాసా, స్పేస్ఎక్స్ రంగంలోకి దిగి ‘క్రూ-10 మిషన్’ చేపట్టింది. ఈ క్రమంలో అంతరిక్షంలోకి వెళ్లిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానమైన సంగతి తెలిసిందే. ‘క్రూ-10 మిషన్’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్‌ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణం ఇలా.. అంతరిక్షం నుంచి వారు బయలుదేరే క్రమంలో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10.45 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) మొదలవుతుంది. సోమవారం అర్ధరాత్రి 12.45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్‌డాకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ స్పేస్‌షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4.45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగు పయనమవుతుంది. సాయంత్రం 5.11 గంటలకు భూ కక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది. సాయంత్రం 5.57 గంటలకు(బుధవారం తెల్లవారుజామున 3:27 AM ప్రకారం) ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.Crew 10 Dragon vehicle arriving! pic.twitter.com/3EZZyZW18b— Don Pettit (@astro_Pettit) March 16, 2025 -
ఐఎస్ఎస్లోకి స్వాగతం
కేప్ కనావెరాల్: తొమ్మిది నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్, నాసా సంయుక్తంగా ప్రయోగించిన క్రూ క్యాప్సూల్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. అందులో వెళ్లిన నలుగురు వ్యోమగాములు అన్నె మెక్‌క్లెయిన్, నికోల్ అయేర్స్ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్), కిరిల్ పెస్కోవ్ (రష్యా) ఆదివారం ఉదయం ఐఎస్ఎస్లో అడుగు పెట్టారు.వారికి సునీత, విల్మోర్ సాదర స్వాగతం పలికారు. స్పేస్‌స్టేషన్ హ్యాచ్‌ను తెరచిన విల్మోర్ వ్యోమనౌక గంటను మోగించి వారిని స్వాగతించారు. వారింతా పరస్పరం హత్తుకుని, కరచాలనం చేసుకుని హర్షాతిరేకాలు చేశారు. ‘‘ఇది అద్భుతమైన రోజు. స్నేహితుల రాక మాకెంతో ఆనందాన్నిచ్చింది’’ అని మిషన్ కంట్రోల్‌తో విల్మోర్ చెప్పుకొచ్చారు. ఐఎస్ఎస్లో నిర్వర్తించాల్సిన విధులను వారికి సునీత, విల్మోర్ కొద్ది రోజుల పాటు విడమర్చనున్నారు.అనంతరం వాళ్లు బాధ్యతలు స్వీకరిస్తారు. వారం తర్వాత సునీత, విల్మోర్ క్రూ క్యాప్సూల్‌లో భూమికి తిరిగొస్తారు. వారితో క్యాప్సూల్ ఫ్లోరిడా తీర సమీపంలో సముద్ర జలాల్లో దిగనుంది. అప్పటిదాకా ఐఎస్ఎస్లో 11 మంది వ్యోమ గాములు సేవలందించనున్నారు. బోయింగ్ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా గత ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు వెళ్లడం తెల్సిందే. వారు ఎనిమిది రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్ సాంకేతిక సమస్యలతో ఆలస్యమైంది. -
Sunita Williams: భూమ్మీదకు సునీతా విలియమ్స్.. ఆమె జీతం ఎంతో తెలుసా ?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ (Sunita Williams), బుచ్ విల్మోర్లు(butch wilmore) భూమ్మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వాళ్లిద్దరు మార్చి 19 (బుధవారం) భూమ్మీదకు రానున్నారు.ఈ క్రమంలో పరిశోధనల నిమిత్తం ఎనిమిది రోజుల పాటు ఐఎస్ఎస్కు వెళ్లిన వ్యోమగాములు నెలల తరబడి అక్కడే ఉండాల్సి వచ్చింది. మరి నెలల తరబడి స్పేస్ స్టేషన్లో గడిపిన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్లకు నాసా ఎంత జీతం ఇస్తుందనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వ్యోమగాముల జీత భత్యాలపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వాటి ఆధారంగాఆస్ట్రోనాట్ జీతం ఎంతంటే?అమెరికా ఫెడరల్ గవర్నమెంట్లో జీఎస్(జనరల్ షెడ్యూల్)-15 కేటగిరీలో అత్యున్నత స్థాయి పదవుల్లో విధులు నిర్వహిస్తుంటారు ఆ కేటగిరీలో ఉన్న ఉద్యోగులకు 2024 లెక్కల ప్రకారం.. ఏడాదికి 136,908 నుంచి 178,156 డాలర్ల వరకు వేతనాలు తీసుకునేవారు. ఆ లెక్కన సునీత విలియమ్స్,బుచ్ విల్మోర్ల ఏడాది వేతనం అంచనా ప్రకారం.. 125,133 నుంచి 162,672 డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం.. రూ.1.08 కోట్లు నుంచి రూ.1.41కోట్ల వరకు) ఉంటుంది.నాసా అంత చెల్లించదుపరిశోధనల నిమిత్తం 9 నెలల పాటు ఐఎస్ఎస్లో ఉన్న ఈ ఇద్దరి ఆస్ట్రోనాట్స్‌లకు నాసా 93,850 డాలర్ల నుంచి 122,004 డాలర్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తం (భారత కరెన్సీలో రూ.81లక్షల నుంచి రూ.1.05 కోట్లు). కానీ, నాసా అంత చెల్లించదని, ఇలాంటి అనూహ్య పరిణామాలు ఎదురైనప్పుడు రోజుకు నాలుగు డాలర్లు (రూ.347 )మాత్రమే చెల్లిస్తుందని రిటైర్డ్ నాసా ఆస్ట్రోనాట్ క్యాడీ కోల్మన్ తెలిపారు. మరీ ఇంత తక్కువాసునీతా విలియమ్స్ ,బుచ్ విల్మోర్ ఐఎస్ఎస్లో 8 రోజులకు బదులు 287 రోజులు గడపాల్సి వచ్చింది. ఆ లెక్కన కేవలం రూ1,148డాలర్లు (రూ.1లక్ష) అదనంగా తీసుకోనున్నారు. ఫలితంగా, అసలు జీతంతో పాటు అదనంగా 1,148 డాలర్లు (సుమారు రూ. 1లక్ష) చెల్లించనుంది. ఈ మిషన్ కోసం వారి మొత్తం సంపాదన 94,998 డాలర్ల నుంచి 123,152 డాలర్ల వరకు (సుమారు రూ. 82 లక్షలు - రూ. 1.06 కోట్లు) ఉంటుందని అంచనా. నేటికి 284 రోజులుసునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. -
ఆ ‘మెరుపు’ను నాతోనే దాచుకుంటాను: సునీతా విలియమ్స్
అంతరిక్షంలో చిక్కుపోయి సుదీర్ఘ విరామం తర్వాత భూమి మీదకు రాబోతున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్.. తన అనుభవాలను మరోసారి పంచుకున్నారు. అంతరిక్షం నుంచే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆమె మాట్లాడారు. ‘ నేను, బుచ్ ఒక మిషన్ ను కంప్లీట్ చేసే క్రమంలో అంతరిక్షంలో అడుగుపెట్టాం. ఇక్కడ ఉన్నాన్నాళ్లు ఒకరికొకరు సమన్వయంతో సహకారంతో పని చేశాం. మేము ఇక్కడ పరిస్థితుల్లో మార్పులు గమనించాం. ఇక్కడ మనం నివసించడం వల్ల ఒక ప్రత్యేకమైన థృక్పదం ఏర్పడుతుంది. ఇక్కడ నా సుదీర్గ ప్రయాణం ఒక స్ఫూర్తిగా మిగిలిపోతుంది. ఆ మెరుపును ఎప్పటికీ కోల్పోను. దాన్ని నాతోనే దాచుకుంటాను’ అని సునీతా విలియమ్స స్పష్టం చేశారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులు. అంటే సుమారు 9 నెలలకు పైగానే అయ్యింది. 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! దాంతో కొన్ని నెలల పాటు వారు అంతరిక్షంలోనే ఉండిపోయారు.అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. సునీతా విలియమ్స్, బచ్ లు బుధవారం భూమ్మీదకు వచ్చే అవకాశం ఉంది. That’s good to hear! #SunitaWilliams returns to earth 🌎 https://t.co/RGUUmJh6lQ— Samina Shaikh 🇮🇳 (@saminaUFshaikh) March 16, 2025 -
సునీత వచ్చేస్తోంది.. ఐఎస్ఎస్తో క్రూ-10 అనుసంధానం సక్సెస్
అంతరిక్షకేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు మార్గం సుగమమైంది. నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9:40 గంటలకు ఈ అనుసంధాన ప్రక్రియ జరిగినట్లు వెల్లడించిన నాసా.. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది.నాసా-స్పేస్ ఎక్స్‌లు చేపట్టిన క్రూ-10 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ క్యాప్సుల్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లింది.ఈ ప్రయోగం ద్వారా నలుగురు వ్యోమగాములు మెక్ క్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ నలుగురు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయనున్నారు.Docking confirmed! pic.twitter.com/zSdY3w0pOS— SpaceX (@SpaceX) March 16, 2025సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12, 15 తేదీల్లో భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది కానీ రాలేదు! భూ కక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది!‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్తో అనుసంధానం విజయవంతమైంది. -
సునీతా విలియమ్స్ రాయని డైరీ
మై హ్యాపీ ప్లేస్! అంతరిక్షం!!తొమ్మిది నెలలుగా ఇక్కడ రోజుకు పదహారు సూర్యోదయాలు, పదహారు సూర్యాస్తమయాలు! ‘‘ఇంకెంత... కొన్ని గంటలే... ’’ అని నవ్వారు బుచ్ విల్మోర్ (butch wilmore). ఆయన నవ్వు నక్షత్రంలా ప్రకాశిస్తోంది.‘‘గంటల్ని మీరు ఏ ఖగోళ కొలమానంతో లెక్కిస్తున్నారు మిస్టర్ విల్మోర్?’’ అన్నాను నేను నవ్వుతూ.‘‘ఖగోళం కాదు మిస్ విలియమ్స్, భూగోళంలో నా కూతుళ్ల ఎదురు చూపులతో కాలాన్ని కొలుస్తున్నాను... ’’ అన్నారు విల్మోర్!విల్మోర్ కూతుళ్లిద్దరూ కింద ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. పెద్ద కూతురు డ్యారిన్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్టు అంతరిక్షం (Space) వరకు వచ్చేసింది. ‘‘నాన్నా! మీరిక్కడ చాలా మిస్ అయ్యారు. క్రిస్మస్ని మిస్ అయ్యారు. మీ థర్టీయత్ వెడ్డింగ్ యానివర్సరీని మిస్ అయ్యారు. చెల్లి స్కూల్ ఫైనల్ దాటేసింది. మీరది చూడలేదు. కాలేజ్ ప్లే లో నేను యాక్ట్ చేశాను. అదీ మీరు చూడలేదు. మీరు కిందికి రాగానే, మీ మెడ చుట్టూ చేతులు వేసి మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది నాన్నా...’’ అని డ్యారిన్ అంటోన్న ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూసుకుంటూ... ‘‘మిస్ విలియమ్స్! భూమి పైన మీకు ప్రియమైన వారు ఎవరు?!’’ అని నన్ను అడిగారు విల్మోర్!‘‘ఇండియా’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘భగవద్గీత’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘ఉపనిషత్తులు’’ అన్నాను. ‘‘ఇంకా?’’ అన్నారు! ‘‘సబర్మతి ఆశ్రమం’’ అన్నాను.నేను నా హజ్బెండ్ పేరు చెప్పేవరకు ఆయన ఇంకా... ఇంకా... ఇంకా... అని అంటూనే ఉంటారని నాకర్థమైంది. కానీ నేను మైఖేల్ పేరు చెప్పలేదు. గోర్బీ, గన్నర్, బైలీ, రోటర్ల పేర్లు చెప్పాను. అవి మా పెట్స్. ‘‘ఐయామ్ సారీ...’’ అన్నారు విల్మోర్.పెట్స్ పేర్లు చెప్పగానే మాకు పిల్లలు లేరన్న సంగతి ఆయనకు గుర్తొచ్చి ఉండొచ్చు. ‘‘ఇట్స్ ఓకే...’’ అన్నాను నవ్వుతూ. విల్మోర్ నా పట్ల గమనింపుతో ఉంటారు.‘‘మనమేమీ ఇక్కడ ఒంటరిగా లేము...’’ అంటారు. ‘‘మనల్నెవరూ ఇక్కడ వదిలేసి వెళ్లలేదు’’ అంటారు. నేనెప్పుడైనా దీర్ఘాలోచనలో ఉంటే, ‘‘అంతరిక్షంలో నివసించటం గొప్ప అనుభూతి కదా...’’ అని నవ్వించే ప్రయత్నం చేస్తారు.‘‘మిస్టర్ విల్మోర్! మీరేమీ నాకు ధైర్యం చెప్పక్కర్లేదు. కావాలంటే నా ధైర్యంలోంచి మీక్కొంచెం ఇస్తాను...’’ అన్నానొకసారి. ఈదురుగాలొచ్చి ఒక్క తోపు తోసినట్లుగా నవ్వారాయన! ఆ నవ్వుకు మేమున్న అంతరిక్ష కేంద్రం గతి తప్పుతుందా అనిపించింది! ‘స్పేస్ఎక్స్ క్యాప్యూల్’ మా కోసం బయల్దేరి వస్తోందని తెలియగానే'.... ‘‘మిస్ విలియమ్స్! అంతరిక్షంలో మీతో పాటుగా నేనూ ఉన్నానన్న సంగతిని భూమ్మీద అందరూ మర్చిపోయినట్లు న్నారు...’’ అన్నారు విల్మోర్ నవ్వుతూ. ఆ మాటకు నవ్వాన్నేను.‘‘చిక్కి సగమైన సునీతా విలియమ్స్’, ‘సునీతా విలియమ్స్ (sunita williams) రాక మరింత ఆలస్యం’, ‘నేడో రేపో భూమి పైకి సునీతా విలియమ్స్’... భూగోళం మొత్తం మీ గురించే రాస్తోంది, మీ కోసమే ఎదురు చూస్తోంది మిస్ విలియమ్స్...’’ అన్నారు విల్మోర్.నన్ను ఆహ్లాదపరచటం అది. ‘‘ఆశ్చర్యం ఏముంది మిస్టర్ విల్మోర్! భూగోళం ఒక వైపుకు మొగ్గి ఉంటుందని తెలియకుండానే డ్యారిన్ వాళ్ల నాన్న గారు ఆస్ట్రోనాట్ అయ్యారా?’’ అని నవ్వాను. దూరాన్నుంచి, చుక్క ఒకటి మా వైపుకు మెల్లిగా కదిలి వస్తూ ఉండటం కనిపించింది!చదవండి: మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీఆ చుక్క... తన బిడ్డల్ని గుండెల్లోకి పొదువుకోవటానికి వస్తున్న తల్లిలా ఉంది. భుజాలపైకి ఎక్కించుకొని తిప్పటానికి వస్తున్న తండ్రిలానూ ఉంది. ‘‘స్పేస్ఎక్స్ క్యాప్య్సూల్ వస్తున్నట్లుంది...’’ అన్నారు విల్మోర్, ఆ చుక్క వైపు చూస్తూ!- మాధవ్ శింగరాజు -
సునీతా విలియమ్స్ రిటర్న్స్
-
సునీత దిగొస్తే.. కల్పన మళ్లీ పుట్టినట్లే!
మూణ్ణాలుగు రోజుల్లో సునీతా విలియమ్స్ ఈ నెల 19న లేదా 20న ‘దివి’ నుండి దిగి వస్తారన్న ఆశతో ఈ భూగోళమంతా విశ్వాంతరాళంలోకి వెన్నెల కన్నులతో ఎదురు చూస్తోంది! ఒకవేళ ఇప్పటికే ‘నాసా’ ఆమెను భూమి మీదకు చేర్చి ఉంటే కనుక ఆ సంబరాలకు... రేపు కల్పనా చావ్లా జన్మదినమైన మార్చి 17 కూడా తోడవుతుంది. కల్పన అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ మహిళ కాగా, సునీత అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారత సంతతి మహిళ. వ్యోమనౌకలో తలెత్తిన లోపాల కారణంగా సునీతా విలియమ్స్ తొమ్మిది నెలలుగా పైనే ఉండిపోతే, ఇరవై రెండేళ్ల క్రితం – భూమి పైకి తిరిగొస్తుండగా స్పేస్ షటిల్ పేలిపోయి కల్పన కలలా మిగిలారు. సునీత ఇప్పుడు క్షేమంగా భువికి దిగి రావటమంటే సునీతే కాదు, కల్పన కూడా మళ్లీ పుట్టినట్లే!వారం అనుకున్నది...!సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్లి నేటికి 284 రోజులైంది! 2024 జూన్ 5న ఆమె అక్కడికి చేరుకున్నారు. తిరిగి జూన్ 12న లేదా 15న భూమి మీదకు తిరిగి రావాలి. కానీ రాలేదు! భూకక్ష్యకు సుమారు 400 కి.మీ. ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐ.ఎస్.ఎస్.) సునీతను, ఆమె సహ వ్యోమగామి బుచ్ విల్మోర్ను విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడ దింపేశాక, పని చేయటం మానేసింది! ‘నాసా’ టీమ్ భూమి మీద నుంచి స్టార్‌లైనర్‌కు చేసిన మరమ్మత్తులు ఫలితాన్నివ్వలేదు. ఏమైతేనేం, వారం రోజుల పనికి వెళ్లి, నెలలపాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా విలియమ్స్ భూమి పైకి తిరిగొచ్చే తేదీ ఖరారైంది. అందుకోసం ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ దగ్గర రన్నింగ్‌లో ఉన్న ‘క్రూ–10’ అనే వ్యోమ నౌకను సిద్ధం చేశారు. మార్చి 19న సునీతను, విల్మోర్ను భూమిపైకి తేవాలని ‘నాసా’ ప్రయత్నం. యాదృచ్ఛికం ఏమిటంటే – స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా పరీక్షించటానికి వెళ్లిన సునీత, విల్మోర్ అదే స్టార్‌లైనర్ పని చేయకపోవటంతో అక్కడే చిక్కుకుపోవటం!బరువు తగ్గి.. బుగ్గలు పీక్కుపోయినా.. నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోవటం వల్ల సునీత ఆరోగ్యం క్షీణించినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని ఫొటోలను బట్టి తెలుస్తోంది. ఆ ఫొటోలలో బరువు తగ్గినట్లుగా, బుగ్గలు లోపలికి పోయి, బాగా బక్కచిక్కినట్లుగా సునీత కనిపిస్తున్నారు. అంతరిక్షంలో ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని అమెరికన్ వైద్యులు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు కూడా. దీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్నవారికి ‘స్పేస్ ఎనీమియా’ వస్తుందని, ‘మైక్రో–గ్రావిటీ’కి గురవుతున్నప్పుడు ఎర్ర రక్తకణాల ఉత్పత్తి కన్నా, వాటి క్షీణత ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయితే వైరల్ అవుతున్న ప్రతి ఫొటోలో కూడా సునీత ఆత్మవిశ్వాసంతో, చిరునవ్వుతో కనిపిస్తుండటం విశేషం! సునీత అంతరిక్షంలోకి వెళ్లటం ఇది మూడోసారి.రెండు దశాబ్దాల క్రితం 2003 జనవరిలో అంతరిక్షంలోకి వెళ్లి, రెండు వారాల తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్నప్పుడు ఫిబ్రవరి 1న కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయి కల్పనా చావ్లా కన్ను మూశారు. ఆ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కల్పన తొలిసారి 1997 నవంబర్ 19న అంతరిక్షానికి బయల్దేరి, తిరిగి పదహారు రోజుల తర్వాత డిసెంబర్ 5న భూమి పైకి తిరిగి వచ్చారు. తర్వాత ఐదేళ్లకు రెండోసారి అదే స్పేస్ షటిల్లో ఆరుగురు క్రూ మెంబర్స్‌తో కలిసి అంతరిక్ష పరిశోధనలను ముగించుకుని వస్తూ.. భూమికి చేరువవుతుండగా జరిగిన ఆ ఘోర దుర్ఘటనలో తక్కిన వ్యోమగాములందరితో పాటు ప్రాణాలు కోల్పోయారు. వారి వ్యోమ నౌక 84,000 ముక్కలైంది. భారతీయుల గుండెలు కోట్ల తునాతునకలయ్యాయి.సునీత అంతరిక్షంలో చిక్కుకుపోయిప్పటి నుండీ ప్రపంచ ప్రజలకు, ముఖ్యంగా భారతీయులకు కల్పనే గుర్తుకు వస్తున్నారు. ఈ సమయంలో సునీత క్షేమంగా భూమి పైకి తిరిగి రావటం అంటే తనొక్కరే రావటం కాదు. తన రూపంలో కల్పన ఆత్మను భౌతికంగా సాక్షాత్కరింప జేయడం కూడా.పాలపుంత పౌరులుసునీతా విలియమ్స్ 1965లో యు.ఎస్.లో జన్మించారు. తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లోవేనియన్ మహిళ. సునీత ఫిజిక్స్‌లో డిగ్రీ, ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో డైవింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత ‘నాసా’ వ్యోమగామి అయ్యారు.కల్పనా చావ్లా 1962లో హరియాణాలో జన్మించారు. తండ్రి బనారసీ లాల్ చావ్లా టైర్ల ఉత్పత్తి కంపెనీ యజమాని. తల్లి సంజోగ్తా ఖర్బందా. కల్పన ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ, టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఎమ్మెస్సీ చేశారు. అనంతరం స్పేస్ ప్రోగ్రామ్‌లో చేరారు. అక్కడి నుంచి నాసాకు వెళ్లారు. -
సునీత వచ్చేస్తోంది!
కేప్ కెనావెరాల్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి తిరిగి రానున్నారు. వారిని వెనక్కు తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ ‘నాసా’ సహకారంతో క్రూ–10 మిషన్ ప్రారంభించింది. అమెరికాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఫాల్కన్–9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది.ఇందులో నలుగురు వ్యోమగాములు అన్నె మెక్‌క్లెయిన్, నికోల్ అయేర్స్ (అమెరికా), తుకుయా ఒనిషీ (జపాన్), కిరిల్ పెస్కోవ్ (రష్యా)లున్నారు. వారు ఆర్నెల్లపాటు ఐఎస్ఎస్లోనే ఉంటారు. గత సెప్టెంబర్‌లో స్పేస్ఎక్స్ వ్యోమనౌకలో ఐఎస్ఎస్కు వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో కలిసి సునీత, విల్మోర్ తిరిగొస్తారు. వాతావరణం అనుకూలిస్తే ఆ నలుగురూ వారం రోజుల్లో తిరిగొచ్చే అవకాశం ఉంది. వారు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో దిగుతారు. వారం అనుకుంటే... బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగంలో భాగంగా 2024 జూన్ 5న సునీత, విల్మోర్ ఐఎస్ఎస్కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎనిమిది రోజుల్లో వెనక్కి రావాలి. కానీ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అది వీలవలేదు. స్పేష్‌షిప్ థ్రస్టర్లు విఫలమవడంతో పాటు హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. మరమ్మత్తులకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.దాంట్లో వారిని వెనక్కు తీసుకురావడం ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరించడంతో స్టార్‌లైనర్ ఖాళీగానే తిరిగొచి్చంది. తర్వాత వారిని తీసుకొచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించినా కుదర్లేదు. చివరికి ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రచారాస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే సునీ త, విల్మోర్ను సాధ్యమైనంత త్వరగా రప్పిస్తా మని జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ప్రక టించారు.ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారిని తీసుకొచ్చేందుకు స్సేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సాయం కోరారు. మస్క్ చొరవ తో క్రూ–10 మిషన్ ప్రారంభమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే వారం రోజుల్లో సునీత, విల్మోర్ మళ్లీ భూమిపై అడుగుపెడతారు. -
సునీతా రాక అప్పుడే !
-
నింగిలోకి ఫాల్కన్.. వెల్కమ్ బ్యాక్ సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌ను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది. ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చేందుకు తాజాగా నాసా-స్పేస్ ఎక్స్‌లు క్రూ-10 మిషన్‌ను చేపట్టాయి. నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 (Falcon 9 Rocket) రాకెట్ భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4.33 గంటలకు కెన్నడీ స్పేస్‌సెంటర్ నుంచి నింగిలోకి తీసుకెళ్లింది. మూడోసారి రోదసీలోకి వెళ్లి అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita williams) త్వరలోనే భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. 2024 జూన్‌లోలో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ-9 ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‌లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హేగ్, అలెగ్జాండర్ తిరిగి భూమిపైకి రాగా.. సునీత, బచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. దీంతో, దాదాపు తొమ్మిది నెలలుగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ (Butch Wilmore) అంతరిక్ష కేంద్రం (ISS)లోనే ఉంటున్నారు. Have a great time in space, y'all!#Crew10 lifted off from @NASAKennedy at 7:03pm ET (2303 UTC) on Friday, March 14. pic.twitter.com/9Vf7VVeGev— NASA (@NASA) March 14, 2025ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్.. స్పేస్‌లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు మూడు రోజుల క్రితం క్రూ-10 మిషన్ (Crew-10 mission)ను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో ఆ ప్రయోగాన్ని నిలిపేశారు. తాజాగా వారిని తీసుకొచ్చేందుకు మళ్లీ ప్రయోగం చేపట్టారు. డ్రాగన్ క్యాప్సుల్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన వారిలో అన్నె మెక్లెయిన్, నికోల్ అయర్స్, టకుయా ఒనిషి, కిరిల్ పెస్కోవ్ వ్యోమగాములు ఉన్నారు. ఇక, మార్చి 19న విలియమ్స్ అంతరిక్షం నుంచి బయల్దేరనున్నారు. వీలైతే మరో వారం రోజుల్లో ఆమె భూమి మీదకు వచ్చే అవకాశం ఉంది. Crew-10 is go for launch! pic.twitter.com/xyQzIJ7Abf— SpaceX (@SpaceX) March 14, 2025 -
సునీతా విలియమ్స్ కు మళ్లీ నిరాశే
-
Sunita Williams: మళ్లీ నిరాశే.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ఎక్స్ సంయుక్తంగా ‘క్రూ 10 మిషన్’ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం.. చివరి నిమిషంలో నిలిచిపోయింది. కిందటి ఏడాది క్రూ9 మిషన్‌లో భాగంగా ఐఎస్ఎస్కి వెళ్లిన సునీత, విల్మోర్లు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే క్రూ-10 మిషన్ ద్వారా మరో నలుగురు వ్యోమగాముల్ని అక్కడికి పంపి.. ఆ ఇద్దరినీ వెనక్కి రప్పించాలని అనుకున్నారు. ఈ ఉదయం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39ఏ కాంప్లెక్స్ నుంచి రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ సైతం దగ్గర పడింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్ హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. దీంతో నలుగురు వ్యోమగాములు బయటకు వచ్చేశారు. రేపు, లేదంటే ఎల్లుండి.. ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా, అటు స్పేస్ఎక్స్ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత.. సునీత, విల్మోర్లు భూమ్మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి.ప్రీపోన్ అయినప్పటికీ.. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత ముందుకు జరిపింది నాసా. అయితే ఇవాళ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సమస్య తలెత్తి వాయిదా పడింది. క్రూ-10 ద్వారా కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ ద్వారా సునీత, విల్మోర్లు భూమ్మీదకు తిరిగి వస్తారు. అదే సమయంలో ఐఎస్ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. ఇక క్రూ10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజులపాటు ఐఎస్ఎస్లోనే ఉంటారు. ఆ తర్వాత స్పేస్ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు వస్తారు.9 నెలల నిరీక్షణ.. కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్మోర్లు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
మరో 4 రోజుల్లో భూమికి తిరిగి రానున్న సునీత
-
ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత
వాషింగ్టన్: కేవలం పది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాటు అక్కడే ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఈ నెల 19న తిరుగు పయనం కానున్నారు. ఇందుకు సన్నాహకంగా ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) కమాండ్ బాధ్యతలను శనివారం రష్యా వ్యోమగామి అలెక్సీ ఒవ్చినిన్కు అధికారికంగా అప్పగించారు. ఈ నెల 12 లేదా 13వ తేదీన ప్రయోగించే స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్‌లో నాసా (NASA) వ్యోమగాములు అన్నె మెక్ క్లయిన్, నికోల్ అయెర్స్తోపాటు జపాన్‌కు చెందిన టకుయా ఒనిషి, రష్యా వ్యోమగామి కిరిల్ పెస్కోవ్ ఉంటారు.ఐఎస్ఎస్లో కొత్త వారికి బాధ్యతలను అప్పగించే కార్యక్రమం మరో వారంపాటు కొనసాగనుంది. మార్చి 19వ తేదీన సునీతతోపాటు నాసాకే చెందిన బుచ్ విల్మోర్, నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గొర్బునోవ్లు స్పేస్ ఎక్స్ క్రూ–10 మిషన్‌లో భూమికి తిరిగి రానున్నారు. నూతనంగా ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు చేపట్టిన ఒవ్చినిన్ ఏప్రిల్ వరకు అక్కడే ఉంటారు. గతేడాది జూన్‌లో బుచ్ విల్మోర్తో కలిసి సునీతా విలియమ్స్ బోయింగ్ స్టార్ లైనర్‌లో ఐఎస్ఎస్కు చేరుకోవడం, స్టార్ లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఇన్నాళ్లూ చిక్కుకుపోవడం తెలిసిందే.కొలంబియా వర్సిటీపై ట్రంప్ ఆగ్రహంవాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ షాకుల పరంపర తన, పర అనే తేడా లేకుండా కొనసాగుతోంది. క్యాంపస్‌లో యూదు వివక్షను, యూదు విద్యార్థులపై వేధింపులు, దాడులను అడ్డుకోవడంలో విఫలమైందంటూ న్యూయార్క్‌లోని ప్రఖ్యాత కొలంబియా యూనివర్సిటీపై అధ్యక్షుడు తాజాగా కన్నెర్రజేశారు. అందుకు శిక్షగా వర్సిటీకి అందుతున్న ప్రభుత్వ నిధుల్లో ఏకంగా 40 కోట్ల డాలర్ల మేరకు కోత పెడుతున్నట్టు ప్రకటించారు! గాజాపై యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు నేపథ్యంలో గతేడాది పాలస్తీనా అనుకూల నిరసనలు, ఆందోళనలతో వర్సిటీ అట్టుడికిపోవడం తెలిసిందే. చదవండి: స్మగ్లింగ్.. కోడి గుడ్డేం కాదు!ఇలాంటి చట్టవిరుద్ధ నిరసనలకు వేదికలుగా మారే విద్యా సంస్థలు, వర్సిటీలకు నిధులు నిలిపేస్తానని గత వారమే ట్రంప్ హెచ్చరించారు. క్యాంపస్‌లో యూదు విద్యార్థులు నిరంతర వేధింపులు, వివక్ష, హింస ఎదుర్కొంటున్నా వర్సిటీ పాలక వర్గం చేష్టలుడిగిందని అమెరికా విద్యా శాఖ మంత్రి లిండా మెక్‌మోహన్ ఆరోపించారు. ‘‘దీన్ని సహించేది లేదు. కొలంబియాతో పాటు ఇతర వర్సిటీలకూ ఇదో హెచ్చరిక’’అని ఆమె చెప్పారు. పరిశోధనలు తదితరాలను ఈ నిధుల కోత తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వర్సిటీ తాత్కాలిక ప్రెసిడెంట్ కత్రీనా ఆర్మ్‌స్ట్రాంగ్ ఆందోళన వెలిబుచ్చారు. -
ఈనెల 16న భూమికి తిరిగి రానున్న సునీతా విలియమ్స్, విల్మోర్
-
అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు..
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు, కానీ ఎప్పుడు భూమి మీదకు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అన్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగమైనప్పటికీ... తను, విలియమ్స్ తిరిగి భూమిపైకి వెంటనే రాకపోవడానికి అవి కారణం కాదని విలియమ్స్ చెప్పారు. తన లాబ్రడార్ రిట్రీవర్స్తో తిరిగి ఆడుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్స్‌లో మార్పు కారణంగా ఇప్పుడు మరో రెండు వారాలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తోందని వెల్లడించారు. సహ వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 చివరిలో కాకుండా ముందుగానే రిటైర్ చేయాలని మస్క్ ఇటీవల చేసిన సూచనను విలియమ్స్ తోసిపుచ్చారు. ‘ఇప్పుడు కీలకమై న సమయంలో ఉన్నాం. ఐఎస్ఎస్ ని్రష్క మణకు ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను.’అని విలియమ్స్ అన్నా రు. ఇక ఇన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొంత ఆందోళన కలిగించినా.. తాము తిరిగి భూమిమీదకు ఎప్పుడు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, విలియమ్స్ వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. కానీ.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గతేడాది క్రిస్మస్ వేడుకల ఫొటోలను విల్మోర్, విలియమ్స్ పంచుకోవడం, అందులో నీరసంగా కనిపించడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వారిని వదిలేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. తొందరగా తీసుకురావాలంటూ స్పేస్ఎక్స్ చీఫ్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మస్క్ వీలైనంత తొందరగా తీసుకొస్తానని తెలిపారు. అయితే మస్క్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని నాసా ఉన్నతాధికారులు చెప్పారని బిడెన్ హయాంలోని నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఫిబ్రవరిలో వెల్లడించారు. దీనిపై స్పందించిన విల్మోర్ ఆ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మస్్కపై తమకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. ‘మేం దేశానికి మద్దతునిస్తాం. దేశాధినేతలకు మద్దతునిస్తాం. వారికి కృతజ్ఞతలు’అని ప్రకటించారు. జనవరిలో ఇద్దరూ కలిసి స్పేస్ వాక్ చేశారు. -
సునీతా విలియమ్స్ రాకకు సమయం ఆసన్నం
అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలిమ్స్, బుచ్ విల్మోర్ల రాకకోపం ఎదురుచూస్తున్నవారికి అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిష్ట్రేషన్(నాసా) శుభవార్త చెప్పింది. వీరు అంతరిక్షం నుంచి 2025, మార్చి చివరిలో భూమికి తిరిగి రానున్నట్లు వెల్లడించింది. సాంకేతిక ఇబ్బందులు, మిషన్ రీషెడ్యూలింగ్ కారణంగా ఈ ఇద్దరు వ్యోమగాములు గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారు.నాసా తాజాగా తెలిపిన వివరాల ప్రకారం క్రూ-10 మిషన్ మార్చి 12న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు బయలుదేరుతుంది. ఈ మిషన్‌లో అన్నే మెక్‌క్లెయిన్, నికోల్ అయర్స్ (నాసా), టకుయా ఒనిషి (జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ), కిరిల్ పెస్కోవ్ (రోస్కోస్మోస్) ఉన్నారు. వీరు అంతరిక్షంలోకి చేరుకున్నాక, క్రూ-9 మిషన్ (సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హేగ్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో కూడినది) భూమికి తిరిగి వస్తుంది. క్రూ-10 మిషన్ మార్చి 12న ప్రారంభమవుతుందని, ఒక వారం పాటు ఐఎస్ఎస్లో ఉంటుందని బుచ్ విల్మోర్ తెలిపారు. దీని తరువాత ఆ వ్యోమగాములు మార్చి 19 నాటికి భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. నాసా, స్పేస్‌ఎక్స్‌లు ఈ మిషన్‌ను వేగవంతం చేశాయి.ఈ మిషన్‌లో జరుగుతున్న జాప్యంపై స్పేస్ఎక్స్ సీఈవో ఇలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, వ్యోమగాములను ఇంత కాలం ఐఎస్ఎస్లో వదిలివేయడం సరికాదని అన్నారు. కాగా ఈ మిషన్‌లో పోలాండ్, హంగేరీల వ్యోమగాములతో పాటు భారత సంతతికి చెందిన శుభాన్షు శుక్లాను కూడా ఐఎస్ఎస్కు పంపనున్నారు. ఈ మిషన్ విజయవంతమైతే శుభాన్షు ఐఎస్ఎస్కు వెళ్లిన మొదటి భారతీయునిగా నిలుస్తారు. మార్చి 19న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని నాసా పేర్కొంది. ఇది కూడా చదవండి: తప్పుడు స్పెల్లింగ్‌తో పట్టాలు.. లక్షల విద్యార్థులు లబోదిబో -
‘ఇడియట్’..వ్యోమగామిపై మస్క్ చిందులు
వాషింగ్టన్:అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్ల విషయమై బిలియనీర్ ఇలాన్‌మస్క్, డెన్మార్క్‌కు చెందిన సీనియర్ వ్యోమగామి యాండీ మోగెన్సెన్ మధ్య ఎక్స్(ట్విటర్) వేదికగా మాటల యుద్ధం నడిచింది. వ్యోమగాములు నింగిలోనే ఉండిపోవడానికి బైడెన్ కారణమని ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ చెప్పారు. రాజకీయ కారణాల వల్లే వారిని తిరిగి తీసుకురాలేదని అన్నారు.ట్రంప్,మస్క్ కలిసి చేసిన ఈ వ్యాఖ్యలపై వ్యోమగామి యాండీ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శలు చేశారు. సునీత,విల్మోర్ల విషయంలో మస్క్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని యాండీ పోస్టు పెట్టారు. యాండీ పోస్టుకు మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘ఇడియట్..నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. వ్యోమగాములు సునీత,విల్మోర్లను తీసకువస్తానని నేను కొన్ని నెలల క్రితమే చెప్పాను.కొన్ని రాజకీయ కారణాల వల్ల బైడెన్ దీనిని పట్టించుకోలేదు’అని మస్క్ యాండీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తిరిగి స్పందించిన యాండీ ‘ఇలాన్ నువ్వంటే నాకు అభిమానం. టెస్లా, స్పేస్ ఎక్స్లలో నువు సాధించిన దానికి నిన్ను ప్రశంసించా.ఇది నీకు కూడా తెలుసు. అయితే సునీత,విల్మోర్ల విషయంలో నువు చెబుతున్నది మాత్రం అబద్ధం. వాళ్లను తీసుకురావడానికి గత సెప్టెంబర్‌లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. You are fully retarded. SpaceX could have brought them back several months ago. I OFFERED THIS DIRECTLY to the Biden administration and they refused. Return WAS pushed back for political reasons. Idiot.— Elon Musk (@elonmusk) February 20, 2025 నువ్వు ఇప్పుడు కొత్తగా ఏ రాకెట్‌ను ఐఎస్ఎస్కు పంపలేదు. ఎప్పటినుంచో ఐఎస్ఎస్లో ఉన్న క్రూ-9 వ్యోమనౌకలోనే వారు తిరిగి భూమికి వస్తున్నారు’అని యాండీ మస్క్‌కు కౌంటర్ ఇచ్చారు.కాగా, గతేడాది జూన్‌లో పది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన సునీత,విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల అక్కడే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు మార్చి మొదటి వారంలో తిరిగి భూమికి వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ వ్యోమనౌకలో వారు భూమికి రానున్నారు. -
‘రాజకీయ కారణాలతోనే బైడెన్ వారిని వదిలేశారు’
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతరిక్షంలో చిక్కుకుపోవడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్,ఆయన సన్నిహితుడు ఇలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాల వల్లే సునీతా విలియమ్స్,విల్మోర్లను బైడెన్ అంతరిక్షంలో వదిలేశారని చెప్పారు. మంగళవారం(ఫిబ్రవరి 18)ట్రంప్, మస్క్ సంయుక్తంగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.అధ్యక్షుడి ఆదేశాల మేరకు వ్యోమగాములిద్దరిని నాలుగు వారాల్లో భూమికి తీసుకువస్తామని మస్క్ తెలిపారు. గతంలో చాలా మంది వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకువచ్చిన చరిత్ర తన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీకి ఉందన్నారు. ఇంతలో ట్రంప్ జోక్యం చేసుకుని వారిని త్వరగా తీసుకు రావాలని మస్క్‌ను కోరారు. గతంలో బైడెన్ వ్యోమగాములను తీసుకువచ్చేందుకు ‘స్పేస్ ఎక్స్’కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదని ట్రంప్ చెప్పారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్షకేంద్రానికి(ఐఎస్ఎస్) 10 రోజుల కోసం వెళ్లిన సునీత,విల్మోర్లు బోయింగ్ వ్యోమనౌకలో సమస్యల వల్ల ఇప్పటికీ భూమికి తిరిగి రాలేదు. వీరిని మార్చి మొదటి వారంలో మస్క్‌కు చెందిన స్పేస్ క్స్ క్రూ డ్రాగన్ భూమికి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
మీరు చాలా మారాలి సార్!
అంతరిక్షంలో చిక్కుకుపోయి, భూమికి చేరేమార్గం కోసం ధైర్యంగా ఎదురుచూస్తున్న సునీతా విలియమ్స్ (Sunita Williams) వంటి సాహసగత్తెల కాలంలో ఉన్నాము. అదే సమయంలో స్త్రీల మీద వివక్షలు మారకపోగా కొత్త రూపాలు తీసుకున్నాయని ఇటీవలి కొన్ని వరుస ఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రాబల్య స్థానాల్లో ఉన్న కొందరు పురుషులు బహిరంగంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా స్త్రీల గురించి చేస్తున్న వ్యాఖ్యలు పితృస్వామ్య సామాజిక స్థితిని దగ్గరగా చూపిస్తున్నాయి. ఈ పురుషుల్లో సినిమా నటులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, చివరికి న్యాయ, రక్షణ వ్యవస్థలు కూడా ఉండడం వివక్ష తీవ్రతను తెలుపుతున్నది.మాట, చూపు, హావభావ కవళికల్లో పెద్దమనిషితనం ఉట్టి పడుతున్నట్లు కనిపించేలా సవాలక్ష జాగ్రత్తలు తీసుకునే ‘మెగాస్టార్’ ఈసారి దొరికిపోయారు. ఆడపిల్లలతో నిండిన తన ఇల్లు లేడీస్ హాస్టల్లా, తను వార్డెన్‌లా ఆయనకి అనిపించింది. అయిదుగురు చెల్లెళ్లకి రక్షకుడిలా తను నటించిన ‘హిట్లర్’ సినిమా నిజం అనుకున్నారు కాబోలు! అంతేకాకుండా తమ లెగసీ కొనసాగించడానికి ఈసారైనా కొడుకుని కనమని కొడుక్కి బహిరంగంగా చమత్కారపూర్వక సలహా ఇచ్చారు. పసిబిడ్డ మొహాన్ని కూడా బహిరంగపరచకుండా తమ ప్రైవసీని కాపాడుకునే అతని కొడుకూ కోడలూ – తమ ఆడపిల్లకి ఎదురైన ఈ బహిరంగ వివక్షని ఎలా తీసుకుంటారో బహుశా అది వారి కుటుంబ విషయం. కానీ అనేకమంది ఆరాధకులని పెంచి పోషించుకునే ఒక సినిమా నటుడిగా ఆయన వ్యాఖ్యలు వ్యతిరేకించవలసినవి. రేపుమాపు ‘మెగా’ అభి మానులందరూ తమ ఇంటి స్త్రీలకి వార్డెన్లగానూ, లెగసీ కోసం కొడుకుల్ని కనమని వేధించేవారిగానూ ఉండడమే ఫ్యాషన్ అనుకుంటే అది ప్రమాదం కనుక ఈ వ్యాఖ్యలని కొందరైనా ఖండిస్తున్నారు. స్త్రీలపట్ల అసభ్యంగా ప్రవర్తించడంలో సినీనటుడు బాలకృష్ణ ‘గాడ్ ఆఫ్ వల్గారిటీ’కి ప్రతీకగా మారిపోయారు. స్త్రీలను ఉద్దేశించి నర్మగర్భంగా తను ఎక్కని ఎత్తులు, దిగని లోతులు లేవని అనడం, వెంటపడే పాత్రలు చేస్తే తన ఫాన్స్ ఊరుకోరని, అమ్మాయిలు కనపడగానే ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేసేయాలని కోరుకుంటారన్న అసభ్య వ్యాఖ్యలకి కోర్టుకేసులు ఎదుర్కున్నారు. ఒక నటిని పడిపోయేంతగా వేదిక మీద నెట్టడం దగ్గర్నుంచి తన చుట్టూ ఉండే స్త్రీలతో కొన్నిసార్లు ఆయన ప్రవర్తన వేధింపు పరిధిలోకి వస్తుంది. ఇటీవల విడుదలైన చిత్రంలోని ఒక పాటకు ఆయన వేసిన స్టెప్పులు దిగజారడానికి పరిధులు ఏమీ లేనంత హీనమైనవి. అది కళారంగపు టేస్ట్ అనుకుని వదిలేయనివ్వలేదు బాలకృష్ణ (Balakrishna). అదే నటితో ఒక ప్రయివేట్ పార్టీలో అవే స్టెప్పులు వేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టారు. వారికి లేని బాధ మీకేమిటనే అభిమానులకి కొరత లేదు. మగనటుల పవర్, స్త్రీ నటుల అవకాశాలను ప్రభావితం చేస్తుంది కనుక వారు ఊరుకుంటారు. కానీ సమాజం కూడా ఊరుకోవాల్సిన అవసరం లేదు. బహిరంగంగానే ఇలా ఉంటే కనపడని వేధింపులు ఎన్నో ఊహించలేము. నటుడిగా దాక్కోడానికి చోటు ఉన్నట్లు రాజకీయాల్లో ఉండదు కనుక ఇట్స్ టైమ్ టు స్టాపబుల్ మిస్టర్ ఎమ్మెల్యే!భార్యతో భర్త చేసే బలవంతపు అసహజ శృంగారం నేరం కాదని ఇటీవల ఛత్తీస్‌గఢ్ హైకోర్టు (chhattisgarh high court) ఇచ్చిన తీర్పు ఇపుడు చర్చలోకి వచ్చింది. 2017లో జరిగిన ఘటన ఇది. భర్త చేసిన అసహజ లైంగికచర్యల కారణంగా భార్య అనారోగ్యానికి గురయి మరణించింది. మరణ వాంగ్మూలంలో ఆమె ఇదే చెప్పింది. కింది కోర్టు వేసిన పదేళ్ళ శిక్షని కొట్టేసి భర్తని నిర్దోషిగా తేల్చింది హైకోర్టు. మారిటల్ రేప్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. భార్యకి ఇష్టం లేకుండా భర్త బలవంతంగా ఆమె శరీరాన్ని తాకకూడదన్నది ఒక విలువగా, హక్కుగా సమాజానికి అలవాటు కావాల్సిన సమయంలో ఈ తీర్పు స్త్రీల లైంగిక స్థితిని కొన్ని రెట్లు వెనక్కి నెట్టేదిగా ఉంది. ఆ భర్త అసహజ లైంగిక చర్య చేయడం గురించి కొంతమంది తప్పు బడుతున్నారు. సహజమా, అసహజమా అన్నది కాదు ముఖ్యం. ఆమె సమ్మతి ముఖ్యం. స్త్రీని లైంగిక కోరికలు తీర్చే వస్తువుగా చూసే పాత ఆలోచనా విధానాన్ని అందరూ సవరించుకోవాల్సిన అవస రాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. పనిగంటల విషయంలో ఎల్ అండ్ టి ఛైర్మన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చల్లోకి వచ్చాయి. వారానికి తొంభై పనిగంటలు పనిచేయాలని సూచిస్తూ ‘ఇంట్లో మీరు మీ భార్య మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలరు, మీ భార్య మీ మొహం ఎంతసేపు చూస్తూ ఉండగలదు’ అని వ్యాఖ్యానించారు. పనిగంటల భారాన్ని వ్యతిరేకిస్తూ ఇంటిపనులు, బైటిపనులు, వ్యక్తిగత, మానసిక అవసరాల గురించి చాలామంది మాట్లాడారు. అయితే తక్కువగా చర్చకు వచ్చిన విషయం ఒకటి ఉంది. అది ఈ పనిగంటల సూచన కేవలం మగ ఉద్యోగులను ఉద్దేశించినట్లుగా ఉండడం. దాని ద్వారా ఇల్లు, పిల్లలు, వృద్ధుల బాధ్యతలు మగవారి టెరిటరీ కావు, అవి కేవలం స్త్రీలకి ఉద్దేశించినవి మాత్రమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు! మగవారు తమ పూర్తికాలం ఉద్యోగంలో గడిపితే కుటుంబాల సమస్త బాధ్యతలు స్త్రీల మీద పడతాయి. ఉద్యోగం పురుష లక్షణం, ఇల్లు దిద్దుకోవడం స్త్రీ లక్షణంగా ఆ వ్యాఖ్యల అంతరార్థం స్ఫురిస్తోంది. చదవండి: ‘దంగల్’ చూడండి ‘మాస్టారు’పై నాలుగు ఘటనల్లో నాలుగు ప్రధానమైన సమస్యలు మన ముందుకు చర్చకు వచ్చాయి. ఆడశిశువుని పురిటిలోనే చంపేసిన సమాజాలు మనవి. ఆ దశ దాటి వస్తున్నాము. ఆకాశంలో సగాలకి తాము వార్డెన్లమని బాధపడటం కాకుండా– వారి పుట్టుక, ఎదుగు దల, విజయాలు సాధికారికంగా సెలెబ్రేట్ చేసుకోవడం మన వివేకంలో భాగం కావాలి. స్త్రీలకు సొంత లైంగిక వ్యక్తిత్వం ఉంటుంది. అధికారం, హోదా, పేరు ప్రఖ్యాతులతో మదించినవారు ఆ వ్యక్తిత్వం మీద దాడి చేస్తూనే ఉంటారు. చదవండి: దీపికా పదుకోన్ (బాలీవుడ్ నటి) రాయని డైరీధైర్యంగా వ్యతిరేకించే వారు పెరగాలి. న్యాయవ్యవస్థలు న్యాయసూత్రాల పరిధికి లోబడి పనిచేస్తాయి. న్యాయసూత్రాలు కాలం చెల్లినవిగా, స్త్రీలకి రక్షణ కల్పించలేనివిగా ఉన్నప్పుడు వాటిమీద పౌరసమాజం విస్తృత చర్చ చేయాలి. ఇంటిపనికి విలువ కట్టడం సరే, స్త్రీ పురుషుల మధ్య పని విభజనకి మార్గదర్శకాలు రూపొందించుకోవాలి. వీటన్నిటితో పాటు లోకం తన చూపుకి మరికాస్త స్త్రీ తత్వాన్ని అద్దుకోవాలి.కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ప్రరవే ఏపీ కార్యదర్శిmalleswari.kn2008@gmail.com -
సునీత,విల్మోర్లకు ‘గ్రావిటీ’ భయం..!
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు అంతరిక్షం నుంచి మార్చి 19న భూమి మీదకు బయలుదేరనున్నారు. గతేడాది జూన్‌లో అంతర్జాతీయ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్)కు వెళ్లిన వారిద్దరు అనుకోని పరిస్థితుల్లో ఎనిమిది నెలలపాటు అక్కడే ఉండిపోయారు. అయితే వ్యోమగాములిద్దరు భూమి మీదకు వచ్చిన తర్వాత పలు రకాల సమస్యలను ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది. జీరో గ్రావిటీ నుంచి భారీ గురుత్వాకర్షణ కలిగిన భూమి వాతావరణంలోకి 8 నెలల తర్వాత వారు రానుండడమే ఇందుకు కారణం. తాము భూమి మీదకు వచ్చిన తర్వాత చిన్న పెన్సిల్‌ను లేపినా పెద్ద బరువులు ఎత్తి వ్యాయామం చేసిన ఫీలింగే ఉంటుందని విల్మోర్ మీడియాకు తెలిపారు.‘ఇక్కడి నుంచి భూమి మీదకు వచ్చిన తర్వాత గ్రావిటీలో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. భూమిపై పరిస్థితులకు అలవాటుపడే దాకా ఇబ్బందిగానే ఉంటుంది.శరీరం బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది’ అని విల్మోర్ వెల్లడించారు. స్పేస్‌లో తేలియాడుతూ ఉండే వ్యోమగాములు..భూమి మీదకు వచ్చిన తర్వాత ఆ ప్రత్యేక అనుభూతికి దూరమవుతారు. అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ప్రభావం చూపిస్తుంది.ఒక వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లాక వారి శరీరం ఎర్రరక్తకణాలను నాశనం చేయడం ప్రారంభిస్తుంది.ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గించుకోవడం ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది.గుండె పనితీరుపైనా అంతరిక్షం ప్రభావం చూపిస్తుంది.బోయింగ్ వ్యోమనౌకలో భాగంగా నాసా గత జూన్‌లో సునీత,విల్మోర్లను ఐఎస్ఎస్కు పంపించింది. వ్యోమనౌకలో లోపాలు తలెత్తడంతో వారం రోజుల కోసం వెళ్లిన ఇద్దరు ఏకంగా 8 నెలలు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. -
ఇంకా ముందుగానే సునీతా విలియమ్స్ రాక!
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరింత ముందుగానే భూమ్మీదకు రానున్నారా?. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో ఎనిమిది నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే చిక్కుకుపోయిన ఆమెను వెనక్కి రప్పించే ప్రక్రియ మరింత వేగవంతం కానుందా?.. అసలు మేటర్ ఏంటంటే..మార్చి నెలాఖరులో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో క్రూ-10 మిషన్ నిర్వహించాలని నాసా భావించింది. ఈ మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములను స్పేస్ఎక్స్ ఫాల్కన్ రాకెట్ ద్వారా ఐఎస్ఎస్(ISS)కు పంపాలనుకుంది. అయితే ఈ ప్రయోగంలోనే సునీత, విల్మోర్లను తిరిగి భూమ్మీదకు రప్పించేందుకు స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ‘ఎండేవర్’ను వినియోగించబోతోంది. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్ చేయగా ఇప్పుడది ముందుకు జరిగింది. మార్చి 12వ తేదీనే ఈ ప్రయోగం నిర్వహించబోతున్నారని నాసా(NASA) ధృవీకరించింది. ఈ కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. -క్రూ-9లో వెళ్లిన సునీతా విలియమ్స్(Sunita Williams), విల్మోర్లు రిలీవ్ అవుతారు. అలా డ్రాగన్ క్యాప్సూల్ ఎండేవర్ ద్వారా ఇద్దరు భూమ్మీదకు రావడానికి మార్గం సుగమం అవడమే కాకుండా ఐఎస్ఎస్ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. అన్ని అనుకున్నట్లు జరిగితే.. మార్చి 19వ తేదీన సునీత, విల్మోర్లు భూమ్మీద అడుగుపెట్టే అవకాశాలున్నాయి .ఇక క్రూ-10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజుల తర్వాత అంటే ఈ జులైలో స్పేస్ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్ క్యాప్సూల్ ద్వారా భూమ్మీదకు చేరుకుంటారు. కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా క్రూ-9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్మోర్లు స్పేస్ స్టేషన్లోనే ఉండిపోయారు. ఇదీ చదవండి: యాక్సియోమ్ మిషన్-4లో భారతీయుడు -
సునీతా విలియమ్స్ రాకపై ఉత్కంఠ
-
యాక్సియోమ్–4 మిషన్ వాయిదా?
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే వారిని వెనక్కి తీసుకురావాలని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్పేస్ఎక్స్ సంస్థ తొలుత నిర్ణయించాయి. సాంకేతిక కారణాలతో మార్చి నెలకు వాయిదా వేశాయి. అది కూడా సాధ్యమయ్యే అవకాశం లేదని సైంటిస్టులు అంటున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఇద్దరు వ్యోమగాములను రప్పించడానికి స్పేస్ఎక్స్ సిద్ధం చేస్తున్న నూతన అంతరిక్ష వాహనం ‘డ్రాగన్’లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. బ్యాటరీల్లో కొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. ఎప్పటిలోగా సరి చేస్తారన్న ఎవరూ చెప్పలేకపోతున్నారు. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైతే తప్ప సునీతా విలియమ్స్, విల్మోర్ వెనక్కి రాలేరు. ఏప్రిల్ నాటికి కూడా డ్రాగన్ అందుబాటలోకి రావడం అనుమానమేనని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా, సునీతా విలియమ్స్, విల్మోర్ రాక ఆలస్యమవుతుండడం మరో కీలక ప్రయోగంపై ప్రభావం చూపుతోంది. యాక్సియోమ్–4 మిషన్‌లో భాగంగా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే భారత గ్రూప్ కెపె్టన్ శుభాంశు శుక్లా సహా మరో ముగ్గురు ప్రైవేట్ వ్యోమగాములు ఐఎస్ఎస్కు చేరుకోవాల్సి ఉంది. ఏప్రిల్‌లో ఈ ప్రయోగం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. డ్రాగన్‌లో సునీతా విలియమ్స్, విల్మోర్ను వెనక్కి వస్తేనే ఈ నలుగురు ఐఎస్ఎస్కు చేరుకోగలుగుతారు. లేకపోతే ప్రయోగం వాయిదా వేయక తప్పదు. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 19లోగా ఇద్దరు వ్యోమగాములు వెనక్కి వచ్చేస్తారు. అప్పుడు యాక్సియోమ్–4 మిషన్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సునీతా విలియమ్స్, విల్మోర్ గత ఏడాది జూన్‌లో బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం వారం రోజుల్లో భూమిపైకి తిరిగిరావాలి. స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో అది సాధ్యం కాలేదు. వారిద్దరూ అక్కడే ఉండిపోయారు. వారి ఆరోగ్యం బాగుందని, ఎలాంటి సమస్యలు లేవని నాసా అధికారులు ప్రకటించారు. -
సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు
నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అంతరిక్షంలో అత్యధిక సమయం నడిచిన మహిళా వ్యోమగామిగా నిలిచారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న ఆమె.. తన 9వ స్పేస్‌వాక్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎక్కువ సేపు స్పేస్ వాక్ చేసిన ఘనతతో ఆమె నాసా ఆల్‌టైం లిస్ట్‌లో చోటు దక్కించుకున్నారు.సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. తాజా స్పేస్‌వాక్‌తో కలిపి.. మొత్తంగా 62 గంటల 6 నిమిషాలపాటు ఆమె వాక్ పూర్తి చేసుకున్నారు. తద్వారా నాసా వ్యోమగామి పెగ్గీ వైట్సన్ రికార్డు(60 గంటలు) ఆమె అధిగమించారు. అంతేకాదు.. స్పేస్‌వాక్ టాప్ టెన్ జాబితాలో సునీతా విలియమ్స్ నాలుగో స్థానానికి ఎగబాకారు. అత్యధికంగా స్పేస్‌వాక్ చేసింది కాస్మోనాట్ అనాటోలీ సోలోవ్యెవ్. పదహారుసార్లు స్పేస్‌వాక్ చేసిన ఆయన.. 82 గంటల 22 నిమిషాలు గడిపారు. ఇక ఈ టాప్ టెన్ లిస్ట్‌లో ఎనిమిది మంది నాసా వ్యోమగాములే ఉండడం గమనార్హం. ఫైడోర్ యర్చికిహిన్(కాస్మోనాట్) 59 గంటల 28 నిమిషాలు వాక్ చేసి తొమ్మిది స్థానంలో కొనసాగుతున్నారు.కాస్మోనాట్.. రష్యా(పూర్వపు సోవియట్ యూనియన్) వ్యోమగామి , ఆస్ట్రోనాట్.. అమెరికా నాసా వ్యోమగామి.. వ్యోమనాట్.. తరచూ భారత వ్యోమగామికి, టైకోనాట్.. చైనా వ్యోమగామి, స్పేషియోనాట్.. ఫ్రాన్స్‌తో పాటు ఫ్రెంచ్ మాట్లాడే మరికొన్ని దేశాలువారం వ్యవధిలో సునీతా విలియమ్స్ స్పేస్‌వాక్ చేయడం ఇది రెండోసారి. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని వాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే.. అంతరిక్షంలో తొలిసారి స్పేస్‌వాక్ చేసింది సోవియట్ కాస్మోనాట్(ప్రస్తుత రష్యా) వ్యోమగామి అలెక్సీ లెనోవ్. 1965, మార్చి 18వ తేదీన వాష్కోడ్ 2 మిషన్‌లో భాగంగా.. 12 నిమిషాల 9 సెకండ్లపాటు ఆయన బయటకు వచ్చారు. అంతరిక్ష పరిశోధనల్లో ఆయన నడక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఇక.. గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.అయితే.. అందుకోసం ప్రయత్నాలు మాత్రం ముమ్మరం అయ్యాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ను కోరారు. అన్నీకుదిరితే.. ఈ మార్చి ఆఖర్లో లేదంటే ఏప్రిల్ మొదటి వారంలో వాళ్లను భూమ్మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరగొచ్చు. -
సునీతా విలియమ్స్, విల్మోర్ ఉమ్మడి స్పేస్‌వాక్
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా అస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ గురువారం ఉమ్మడిగా స్పేస్‌వాక్ చేశారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించారు. ఐఎస్ఎస్కు బయటి భాగంలో చేయాల్సిన మరమ్మతులు ఏమైనా ఉన్నాయా? అనేది పరిశీలించారు. ఇరువురు కలిసి స్పేస్‌వాక్ చేయడం ఇదే మొదటిసారి. వేర్వేరుగా స్పేస్‌వాక్ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. వారిద్దరూ గత ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు చేరుకున్న సంగతి తెలిసిందే. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, సాంకేతిక కారణాలతో అది సాధ్య పడలేదు. ఎనిమిది నెలలుగా ఐఎస్ఎస్లోనే ఉంటున్నారు. ఎప్పుడు తిరిగి వస్తారన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం జోక్యం చేసుకున్నారు. ఇద్దరు వ్యోమగాములను వెనక్కి తీసుకురావడానికి సాయం అందించాలని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ను కోరారు. మరోవైపు సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భూమికి 420 కిలోమీటర్ల ఎగువన సరిగ్గా స్పెయిన్ దేశం పైభాగాన తాము స్పేస్‌వాక్ చేశామని, చాలా ఆనందంగా ఉందని విల్మోర్ చెప్పారు. -
సునీతా విలియమ్స్ ను త్వరగా తీసుకురావాలని ఇలాన్ మస్క్ ను కోరిన ట్రంప్
-
సునీతా విలియమ్స్‌ను తీసుకురండి: ట్రంప్
వాషింగ్టన్: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి తీసుకురావాలంటూ టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఆ యన తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పంచుకున్నారు. ‘బైడెన్ ప్రభుత్వం అంతరిక్ష కేంద్రంలో వదిలేసిన ఇద్దరు ధైర్యవంతులైన వ్యోమగాములను తీసుకురావాలని మస్క్ ను కోరుతున్నా. సునీత, విల్మోర్ కొన్ని నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా వ్యోమగాములను తీసుకురావాలి. గుడ్ల క్ ఎలాన్’అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. దీనికి మస్క్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మేం తీసుకొస్తాం. బైడెన్ ప్రభుత్వం ఇంతకాలం వారిన లా వదిలేయడం దారుణం’’అని మస్క్ వ్యాఖ్యానించారు. పది రోజుల మిషన్ కోసం సునీత, విల్మోర్ 2024 జూన్ 5న బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లాక వ్యోమనౌకలోని థ్రస్టర్ పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి స్టార్‌లైనర్ క్యాప్సుల్ మాత్రం సెపె్టంబర్ 7న తిరిగి భూ మి మీదకొచి్చంది. అంతరిక్షంలో ఎక్కువకాలం ఉండటంతో ఆమె చాలా బరువు తగ్గినట్లు ఇటీవల బహిర్గతమైన ఫొటోల ద్వారా వెల్లడైంది. తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను గతేడాది నవంబర్‌లో సునీత తోసిపుచ్చారు. తన శరీరం కొద్దిగా మారిందని, అదే బరువుతో ఉన్నానని చెప్పారు. ఒకవేళ మార్చి నెలాఖరులో వీళ్లిద్దరూ భూమికి తిరిగొస్తే అనుకోకుండా అక్కడే ఉండిపోయి 300 రోజులపాటు అంతరిక్షంలో గడిపిన వ్యోమగాములుగా మరో రికార్డ్ నెలకొల్పుతారు. ఎలా నడవాలో గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా: సునీత ఇప్పటికే 7 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన సునీత తాను చదివిన పాఠశాల విద్యార్థులతో సోమవారం మాట్లాడారు. వర్చువల్‌గా జరిగిన ప్రశ్నోత్తరాల సెషన్లో సునీతను విద్యార్థులు అత్యల్ప గురుత్వాకర్షణ స్థితిపై ప్రశ్నలు సంధించారు. ‘‘ఈత కొట్టడం, ఎగరడం వంటి అనుభూతిని మాత్రమే ఆస్వాదిస్తున్నా. ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండటం వల్ల తన శరీరం అనేక సర్దుబాట్లకు లోనైంది. చాలాకాలంగా నేను నడవలేదు. కూర్చోలేదు. పడుకోలేదు. నడవడం ఎలా ఉంటుందో గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా’’అని తెలిపారు. ‘‘ఎలాగోలా తిరిగి రావడానికి మరో నెలరోజుల సమయం పడుతుందనుకున్నా. కానీ ఇన్ని రోజులైనా ఇంకా ఉండాల్సి రావడం కాస్త ఇబ్బందిపెడుతోంది. వృద్ధాప్యంలో ఉన్న నా తల్లితో వీలైనంతసేపు మాట్లాడుతున్నా. అంతరిక్ష కేంద్రంలో బిజీ షెడ్యూల్, కుటుంబంతో క్రమం తప్పకుండా మాట్లాడటం వల్ల తాను ఒంటరిగా ఉన్నట్లు భావించట్లేను’’అని సునీత చెప్పారు. -
Sunita Williams: అంతరిక్షంలోనే ఏడు నెలలు..నడక మర్చిపోయా..!
గతేడాది జూన్ 14వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దాంతో వారు ఏడు నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. వాళ్లు భూమ్మీదకి ఎప్పుడు అడుగుపెడతారనే దానిపై స్పష్టత లేదు. అయితే అంతకాలం అంతరిక్షంలోనే జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతుండటంతో వ్యోమగాములకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో..? అనే సందేహాలు సర్వత్రా లేవనెత్తాయి. అయితే వాటన్నింటికీ చెక్‌పెడుతూ గతంలో సునీతా తాను బాగానే ఉన్నానంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఇప్పుడు మాత్రం విలియమ్స్ తాజాగా తాను ఆ సమస్యలు ఎదుర్కొంటున్నా అంటూ.. బాంబు పేల్చింది. దీంతో ఆరోగ్య నిపుణుల అనుమానాలే నిజమవుతున్నాయా..? అనే సందేహం అందిరిలోనూ రేకెత్తింది. ఇంతకీ విలియమ్స్ ఏం చెప్పారు..? భవిష్యత్ మిషన్ల పరిస్థితి ఏంటీ అంటే..సునీతా విలియమస్స్(Sunita Williams) ఏడు నెలలుగా అంతరిక్షంలోనే(space) ఉండిపోవడంతో నడక(Walk) ఎలా ఉంటుందో మర్చిపోయానని అన్నారు. నిత్యం జీరో గ్రావిటీ వద్ద తేలియాడుతూ ఉండటంతో దేన్నైనా ఆధారం చేసుకుని నిలబడితే ఎలా ఉంటుంది అనే ఫీల్ వస్తోందట. ఇలా అన్నేళ్లు ఉండిపోతే ఎముకలు పటుత్వం కోల్పోతాయని, పలు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్యనిపుణులు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు. ఇప్పుడూ అదే నిజమైంది అన్నట్లుగా ఉన్నాయి విలియమ్స్ మాటలు చూస్తే. నెలల తరబడి గురత్వాకర్షణ శక్తిలో తేలుతూ ఉండటం వల్ల నడవడం ఎలా ఉంటుందో గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారామె. ఆమె అక్కడ కూర్చోలేదు, పడుకోలేదు, అందువల్ల నేలపై నడిచే అనుభూతిని తిరిగి పొందడానికి కష్టపడుతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అంతరిక్ష నౌకలో స్వల్పకాలిక మిషన్‌గా భావించిన సునీతాకు అదికాస్తా ఓపికకు పరీక్ష పెట్టే నిరుత్సాహకరమైన అనుభవంగా మారిపోయింది. ఇంతకాలం కుటుంబానికి భౌతికంగా దూరమైనా.. వారితో టచ్‌లో ఉండేలో ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తన అమ్మతో మాట్లాడతున్నట్లు తెలిపారు. ఈ మిషన్ తన శారీరక బలానికి మాత్రమే కాకుండా భావోద్వేగ స్థితిస్థాపకతకు కూడా పరీక్షగా మారింది. ఈ సుదీర్ఘ అంతరిక్ష పరిశోధన వ్యోమగాముల(Astronauts) కుటుంబ జీవితాన్నే గాకుండా భవిష్యత్తులో ఇలాంటి మిషన్ పరిశోధనల కోసం వ్యోమగాములకు త్యాగాలు తప్పవనే విషయాన్ని నొక్కి చెబుతోంది. అలాగే అంతరిక్ష ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉంటుందో ఈ ఉదంతమే చెబుతోంది. కాగా, మార్చి చివరలో లేదా ఏప్పిల్‌లో స్పేస్ఎక్స్ క్రూ-10 ప్రయోగించి ఆ వ్యోమగాములిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ కూడా వారిని సురక్షితంగా తీసుకురావాలని మస్క్‌ని కోరినట్లు సమాచారం. (చదవండి: ఆ ఇద్దరి కోసం ట్రంప్ సాయం అడిగారు: మస్క్) -
ఆ ఇద్దరి కోసం ట్రంప్ సాయం అడిగారు: మస్క్
వాషింగ్టన్:అంతరిక్షంలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములను తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు ట్రంప్ తన సాయం కోరారని ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ తెలిపారు. ఇందుకు తమ సంస్థ స్పేస్ఎక్స్ సాయం చేస్తుందన్నారు. ఈ మేరకు మస్క్ మంగళవారం(జనవరి28) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు అక్కడే ఉండిపోయిన విషయం తెలిసిందే. కేవలం పది రోజులు ఉండడానికి మాత్రమే వారిద్దరు అంతరిక్షానికి వెళ్లారు. అయితే అంతరిక్షానికి వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సమస్యలు రావడంతో వారు తిరిగి రాలేకపోయారు. బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఇద్దరు వ్యోమగాములు ఇప్పటివరకు అంతరిక్షంలోనే ఉండిపోయారని మస్క్ విమర్శించారు.కాగా, సునీత,విల్మోర్లను తీసుకురావడానికి నాసా తమ కంపెనీ సాయం కోరిందని మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ గతేడాది ఆగస్టులోనే ప్రకటించింది. ఇందుకుగాను స్పేస్ ఎక్స్‌కు చెందిన డ్రాగన్ రెండు ఖాళీ సీట్లతో అంతరిక్షంలోకి వెళ్లింది. ఇందులో నింగిలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములతో పాటు సునీత,విల్మోర్లను కూడా తిరిగి భూమికి తీసుకురావాల్సి ఉంది. అయితే డ్రాగన్ రాక కూడా కూడా వాయిదా పడుతూ వస్తోంది.మస్క్ తాజా పోస్టుతో సునీత,విల్మోర్లు త్వరలోనే భూమికి తిరిగి వచ్చే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. The @POTUS has asked @SpaceX to bring home the 2 astronauts stranded on the @Space_Station as soon as possible. We will do so.Terrible that the Biden administration left them there so long.— Elon Musk (@elonmusk) January 28, 2025 -
సునీత స్పేస్‌వాక్ చూశారా?
కేప్ కెనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి, స్టేషన్ కమాండర్ సునీతా విలియమ్స్ దినచర్య గురువారం కాస్త మారింది. దాదాపు ఏడు నెలలపాటు వివిధ శాస్త్రీయ ప్రయోగాలతో గడిపిన ఈమె గురువారం ఐఎస్ఎస్ వెలుపలికి వచ్చి స్పేస్‌వాక్ చేశారు.ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్(Space Walk). నాసాకే చెందిన మరో వ్యోమగామి నిక్ హేగ్‌తో కలిసి సునీతా విలియమ్స్(Sunitha Williams) ఐఎస్ఎస్కు అవసరమైన మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో ఐఎస్ఎస్ తుర్క్మెనిస్తాన్కు సరిగ్గా 260 మైళ్ల ఎత్తులో ఉందని నాసా తెలిపింది. అంతకుముందు కూడా పలుమార్లు ఐఎస్ఎస్లోకి వచి్చన సునీతకు తాజా స్పేస్‌వాక్ ఎనిమిదోది కావడం గమనార్హం.గతేడాది జూన్‌లో బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్‌లో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారం పాటు మాత్రమే వారు అక్కడ గడపాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో సమస్యలు తలెత్తడంతో అప్పటి నుంచి వారి తిరుగు ప్రయాణం వాయిదా పడుతూ వస్తోంది. వచ్చే వారం సునీత, విల్మోర్ను తిరిగి తీసుకు వచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తోంది. The rate gyro assembly that helps maintain station orientation has been replaced. @AstroHague will soon work on the NICER X-ray telescope while @Astro_Suni will replace navigation hardware. pic.twitter.com/EfqNDF8ZAI— International Space Station (@Space_Station) January 16, 2025🚀 జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. -
అంతరిక్షంలో క్రిస్మస్
-
మనం సెలవులు తీసుకోవడానికి కుదరదా చంద్ర!?
-
అంతరిక్షంలో ఉన్నా మాకూ సెలవు కావాలి
‘సెలవు కావాలి’. పండుగలు, పెళ్లిళ్లు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచదేశాలు అన్ని చోట్లా ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ తెగేసి చెప్పారు. వీళ్ల సెలవు అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందోఏమో క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహారపదార్థాలు తినేందుకు నోరూరుతోందని అక్కడి భారతీయమూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి ఒకటిన తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కనబెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ఐఎస్ఎస్కు వచి్చన స్పేస్ఎక్స్ డ్రాగన్ 2,700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడి విడిగా వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియోకాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్‌ను తెస్తూ సునీత, డాన్ పెటిట్లు శాంటా టోపీలు ధరించిన ఫొటో ఒకటి తాజాగా షేర్చేశారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు వచి్చన సునీతా విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి. – వాషింగ్టన్ -
సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం!
వాషింగ్టన్ : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ఇద్దరు వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమి మీదకు తీసుకురావడానికి మరింత సమయం పట్టనుందని నాసా ప్రకటించింది.వ్యోమగాముల్ని స్పేస్ నుంచి భూమికి తీసుకువచ్చే బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అనేక సాంకేతికత సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఫలితంగా సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాది మార్చి నెల చివరి నాటికి స్పేస్ నుంచి భూమి మీదకు వచ్చే అవకాశం ఉందని నాసా తెలిపింది. వ్యోమగాములు సునీతా విలియమ్స్,బుచ్ విల్మోర్లు 8 రోజుల మిషన్‌లో భాగంగా సునీత, విల్మోర్లు ఈ ఏడాది జూన్ 6న బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి సమస్యలు తలెత్తాయి.NASA again delays return of two astronauts stranded on space station.Veteran astronauts Butch Wilmore and Suni Williams arrived at the ISS in June aboard Boeing's Starliner spacecraft, and were due to spend eight days on the orbiting laboratoryhttps://t.co/1ZIsWApfvX pic.twitter.com/AyFR5ifJdd— AFP News Agency (@AFP) December 18, 2024 స్టార్ లైనర్‌లో సమస్యల్ని పరిష్కరించి భూమి మీదకు తెచ్చేందుకు పలుమార్లు ప్రయత్నించింది. ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరికి స్పేస్‌లో చిక్కుకున్న వీరిద్దరిని భూమి మీదకు తెచ్చేందుకు ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్పేస్ ఎక్స్ క్రూ మిషన్ స్పేస్‌లోకి పంపింది. క్రూ-9 మిషన్ విజయవంతంగా ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. ఇదే క్రూ-9 మిషన్‌లో సునీత విలియమ్స్, విల్మోర్లు వచ్చే ఏడాదిలో రానున్నట్లు నాసా వెల్లడించింది. -
Sunita Williams: ఆర్నెల్లు పూర్తి.. నాసా ఏమైనా దాస్తోందా?
వారం అనుకుంటే.. అటు తిరిగి ఇటు తిరిగి అదికాస్త ఆరు నెలలు దాటేసింది. నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లి ఆరు నెలలు పూర్తైంది. మరో రెండు నెలలపాటు వాళ్లు అక్కడ ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈలోపు సునీతా విలియమ్స్ ఆరోగ్యం పాడైపోయిందంటూ కథనాలు వెలువడ్డాయి. ఇంకొన్ని కథనాలైతే ఆమె బ్రెయిన్ డెడ్‌కు గురయ్యే అవకాశాలున్నాయంటూ భయపెట్టిస్తున్నాయి. ఇంతకీ నాసా ఏమంటోంది?🚀జూన్ 5వ తేదీన బోయింగ్ కొత్త స్టార్‌లైనర్ క్రూ క్యాప్సూల్‌లో.. సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు చేరుకున్నారు. వారంపాటు టెస్ట్ ఫ్లైట్ తర్వాత వాళ్లు తిరిగి భూమికి చేరాల్సి ఉంది. కానీ..🚀బోయింగ్ స్టార్‌లైనర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. థ్రస్టర్ ఫెయిల్యూర్స్, హిలీయం లీకేజీలతో.. ఇద్దరూ అక్కడే ఉండిపోయారు. దీంతో సెప్టెంబర్ 7వ తేదీన ఆ ఇద్దరు వ్యోమగాములు లేకుండానే క్యాప్సూల్ భూమ్మీదకు వచ్చేసింది. వాళ్లు భూమ్మీదకు ఎప్పుడు తిరిగి వస్తారో అనే ఆందోళన మొదలైంది.🚀టెంపరరీ విజిటర్స్‌గా వెళ్లిన విలియమ్స్, విల్మోర్లు.. ఐఎస్ఎస్కు ఫుల్‌టైం సిబ్బందిగా మారిపోయారు.స్పేస్‌వాక్, ఐఎస్ఎస్ నిర్వహణతో పాటు ఆ భారీ ప్రయోగశాలలో వీళ్లిద్దరితో శాస్త్రీయ పరిశోధనలు చేయించింది నాసా. అంతేకాదు.. వీళ్ల పరిస్థితిని మరో రూపకంలోనూ ‘ఛాలెంజ్’గా తీసుకుంది నాసా. ఇలాంటి విపత్కర పరిస్థితిల నడుమ అంతరిక్షంలో ఇరుక్కుపోయినవాళ్లను రక్షించేందుకు మంచి ఐడియాలు గనుక ఇస్తే.. వాళ్లకు రూ.17 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తామని నాసా ప్రకటించింది.🚀తప్పనిసరిగా ఇద్దరూ ఎనిమిది నెలలు అక్కడ ఉండాల్సిన పరిస్థితి. దీంతో.. సునీతా విలియమ్స్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న కథనాలు కలవరపాటుకు గురి చేశాయి. తాజాగా విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లోనూ ఆమె బరువు తగ్గినట్లు స్పష్టమైంది. గురుత్వాకర్షణ శక్తి లేని అలాంటి చోట.. కండరాలు, ఎముకలు క్షీణతకు గురవుతాయి. అలాంటప్పుడు.. రోజుకి రెండున్నర గంటలపాటు వ్యాయామాలు చేయడం తప్పనిసరి. 🚀అయితే నాసా మాత్రం ఆమె ఆరోగ్యంపై వస్తున్న కథనాలను.. పుకార్లుగా కొట్టిపారేస్తోంది. బరువు తగ్గినప్పటికీ ఆమె ఆరోగ్యంగానే ఉన్నారంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ను అందిస్తూ వస్తోంది. కానీ, ఐఎస్ఎస్లో ఆమె పరిస్థితిని చూసి నాసా ఏమైనా దాస్తోందా? అనే అనుమానాలు కలిగాయి. ఈ తరుణంలో తాను క్షేమంగానే ఉన్నానంటూ స్వయంగా సునీతనే ఓ వీడియో విడుదల చేశారు.🚀సెప్టెంబర్ 19న.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోనే ఈసారి ఆమె పుట్టినరోజు జరిగింది. అయితే అంతరిక్షంలో ఇదే ఆమెకు తొలి పుట్టినరోజేం కాదు. 2012లో జులై 14 నుంచి నవంబర్ 18 మధ్య ఆమె స్పేస్‌లోనే గడిపారు.🚀భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్.. అంతరిక్షం నుంచే కోట్లాది మందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాదు.. జులై 26వ తేదీన ఓ సరదా వీడియోను విడుదల చేసింది నాసా. భూమికి మైళ్ల దూరంలో స్పేస్ స్టేషన్లో వ్యోమగాములు సరదా యాక్టివిటీస్‌లో భాగం అవుతారని ‘ఒలింపిక్స్’పేరిట వీడియో రిలీజ్ చేశారు.🚀ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 1998 నవంబర్‌లో ఇది ప్రారంభమైంది. నాసాతో పాటు ఐదు దేశాల స్పేస్ స్టేషన్లు దీనిని నిర్వహణ చూసుకుంటాయి. అంతరిక్ష పరిశోధనల కోసం భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో లో ఎర్త్ ఆర్బిట్(LEO) వద్ద ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బరువు 4 లక్షల 45 వేల కేజీలు. 59ఏళ్ల సునీతా విలియమ్స్.. ప్రస్తుతం దీనికి కమాండర్‌గా ఉన్నారు. 🚀మరో రెండు నెలల తర్వాత.. ఫిబ్రవరిలో ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ -9 రాకెట్ అక్కడికి వెళ్లనుంది. అందులో సునీతా విలియమ్స్, బుట్చ్ విల్మోర్లను భూమ్మీదకు తీసుకు వస్తారు.🚀అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉన్న భారత–అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వచ్చే ఏడాది స్పేస్‌వాక్ చేయబోతున్నారు. ఇందుకోసం సన్నాహాలు ప్రారంభించారు. ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి కాసేపు అంతరిక్షంలో విహరించడమే స్పేస్‌వాక్. 🚀భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్.. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు. ఆమె తండ్రి గుజరాతీ. తల్లి స్లొవేనియన్. మసాచుసెట్స్‌లోని నీధమ్ హైస్కూల్లో స్కూలింగ్ పూర్తిచేసిన ఆమె.. యూఎస్‌లోని నావల్ అకాడమీలో ఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తిచేసిన సునీత.. తొలుత అమెరికన్ నావికా దళంలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. డైవింగ్ ఆఫీసర్‌గా కొన్నాళ్ల పాటు పనిచేసిన ఆమె.. అంతరిక్షంపై మక్కువతో 1998లో రోదసీ యానానికి సంబంధించిన శిక్షణ తీసుకున్నారు.🚀తన తొలి పర్యటనలో భాగంగా 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు.. సుమారు ఏడు నెలల పాటు ఐఎస్ఎస్లో గడిపారామె. ఈ సమయంలోనే 29 గంటల 17 నిమిషాల పాటు ఐఎస్ఎస్ వెలుపల నాలుగుసార్లు స్పేస్‌వాక్ చేశారు. ఇది అప్పట్లో రికార్డుగా నిలిచింది. ఇక 2012లో రెండోసారి అంతరిక్ష యాత్రకు వెళ్లారు సునీత. ఈ క్రమంలో నాలుగు నెలల పాటు ఐఎస్ఎస్లోనే గడిపిన ఆమె.. అక్కడి ఆర్బిటింగ్ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. ఈ సమయంలోనూ అంతరిక్షంలో నడిచిన ఆమె.. మొత్తంగా 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ చేసి.. ఎక్కువ సమయం స్పేస్‌వాక్ చేసిన రెండో మహిళా వ్యోమగామిగా చరిత్రకెక్కారు. ఇలా గత రెండు స్పేస్షటిల్స్తో కలిపి మొత్తంగా 322 రోజులు అంతరిక్షంలో గడిపారు సునీత. 🚀కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండో ఇండో-అమెరికన్ మహిళగా ఖ్యాతి గడించారు. ఇప్పటిదాకా రెండుసార్లు వెళ్లొచ్చారు. నాసా స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ముచ్చటగా మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్ష యానంలోనూ భారతీయ మూలాలను ఆమె ఏనాడూ వదల్లేదు. భగవద్గీతతో పాటు ఉపనిషత్తులను, గణపతి విగ్రహాన్ని వెంట తీసుకెళ్తానని ఆమె చెబుతూ ఉంటారు. -
థ్యాంక్స్ గివింగ్ : వ్యోమగామి సునీతా విలియమ్స్ స్పెషల్ మీల్
అంతరిక్షంలో థాంక్స్ గివింగ్ జరుపుకునేందుకు భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ సిద్ధమయ్యారు. ఒక ప్రత్యేక మీల్‌తో థ్యాంక్స్ గివింగ్ సందర్భాన్ని జరుపుకోనున్నారు. ఈ మేరకు బుధవారం సునీతా విలియమ్స్ సందేశంతో కూడిన ఒక వీడియోను నాసా విడుదల చేసింది.“ఇక్కడ ఉన్న మా సిబ్బంది భూమిపై ఉన్న మా స్నేహితులు,కుటుంబ సభ్యులందరికీ అలాగే మాకు మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ హ్యాపీ థాంక్స్ గివింగ్ చెప్పాలనుకుంటున్నారు” అని విలియమ్స్ తన వీడియో సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నాసా తమకు బటర్నట్ స్క్వాష్, యాపిల్స్, సార్డినెస్ (చేపలు), స్మోక్డ్ టర్కీ(బేక్చేసిన చికెన్) వంటి ఆహార పదార్థాలను అందించిందని వ్యోమగాములు పంచుకున్నారు. ప్రతీ ఏడాది నవంబరు నాలుగో గురువారం అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు."We have much to be thankful for."From the @Space_Station, our crew of @NASA_Astronauts share their #Thanksgiving greetings—and show off the menu for their holiday meal. pic.twitter.com/j8YUVy6Lzf— NASA (@NASA) November 27, 2024 కాగా 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన బోయింగ్ సంస్థ తయారు చేసిన స్టార్‌లైనర్ రాకెట్‌లోని ప్రొపల్షన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వారు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అక్టోబరులో దీపావళిని కూడా అంతరిక్షంలోనే జరుపుకున్నారు సునీత. వారిద్దరినీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకువచ్చేందుకు నాసా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
స్పేస్‌లో సునీతా విలియమ్స్.. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా
తన ఆరోగ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనలకు నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ చెక్ పెట్టారు. తాజాగా, తన ఆరోగ్యంగా బాగుందని స్పష్టం చేస్తూ ఓ ఫొటోని విడుదల చేశారు. కొద్ది రోజుల క్రితం సునీతా విలియమ్స్ బక్కచిక్కిన ముఖం కనిపించారు. ఇప్పుడు విడుదల చేసిన ఫొటోలో విలియమ్స్ ముఖంలో మార్పులు కనిపించాయి. ఆరోగ్యం సైతం కుదుట పడినట్లు అర్ధమవుతుంది. అంతరిక్షంలోని బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ ఏడాది జూన్ 5న సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ స్టార్‌లైనర్ స్పేస్‌లోకి వెళ్లారు. పని పూర్తి చేసుకుని కొన్ని రోజుల వ్యవధి తర్వాత తిరిగి భూమి మీదకు రావాల్సి ఉంది.కానీ వ్యోమగాముల్ని తీసుకెళ్లిన బోయింగ్ క్రూ ఫ్లైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాలు వచ్చే ఏడాది వరకు స్పేస్‌లో ఉండనున్నారు.అయితే స్పేస్‌లో మైక్రోగ్రావిటీ కారణంగా సునీతా విలియమ్స్ శరీరంలో ఎర్రరక్తకణాలు క్షీణించాయి. దీంతో సునీతా విలియమ్స్ ముఖం బక్కిచిక్కపోవంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తాయి. తిరిగి సాధారణ స్థితికి రావాలంటే పౌష్టికాహారం తప్పని సరి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సునీతా విలియమ్స్ అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకునేలా ఆహారాన్ని తీసుకున్నారు. ఫలితంగా ఆరోగ్యం కుదుట పడి సాధారణ స్థితికి వచ్చారు.తాజాగా, సునీతా విలియమ్స్ షేర్ చేసిన ఫొటోతో ఆమె ఆరోగ్యంపై రేకెత్తుతున్న ఆందోళనలకు పులిస్టాప్ పడింది. -
సునీతా విలియమ్స్: ఆరోగ్యంగానే ఉన్నా..! సుదీర్ఘకాలం ఉంటే శరీరంలో..
భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunitha villiams) ఈ ఏడాది జూన్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS) కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎనిమిది రోజుల కోసమని అంతరిక్షంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు బారీ విల్మోర్, సునీత విలియమ్స్‌లు ఎనిమిది నెలల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారు వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారిని స్పేస్ఎక్స్ డ్రాగన్‌లో భూమిపైకి తీసుకురావాలని నాసా ప్లాన్ చేస్తోంది. అయితే ఇటీవల సునీతాకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఆమె అనారోగ్యానికి గురయ్యిందని పలు కథనాలు రావడం మొదలయ్యాయి. ఈ తరుణంలో తన ఆరోగ్య పరిస్థితిపై ఐఎస్ఎస్ నుంచి సునీతా స్వయంగా అప్ డేట్ ఇచ్చారు. తన శారీరక పరిస్థితి, బరువు తగ్గడం తదితర ఊహగానాలకు చెక్‌పెట్టేలా తాను ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. అలాగే తాను బరువు కోల్పోలేదని పెరిగానని చెప్పారు. తాను అంతరిక్షం కేంద్రవ వద్దకు వచ్చినప్పుడు ఎంత బరువు ఉన్నానో అంతే ఉన్నానని అన్నారు. అంతేగాదు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించేలా చంద్రుడు, అంగారక గ్రహంపై భవిష్యత్తులో మానవ అన్వేషణ లక్ష్యంగా చేస్తున్న ఈ మిషన్ కొనసాగుతుందని ధీమాగా చెప్పారు. అలాగే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ కారణంగానే తన శరీరంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయే తప్ప బరువు కోల్పోలేదని వివరించారు. మైక్రోగ్రామిటీ వల్లే ఇదంతా..అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీకి శరీరంమంతా ఉండే ద్రవాలు పునః పంపిణీ అవుతుంటాయి. దీంతో తమ తలలు చాలా పెద్దవిగా కనిపిస్తాయని అన్నారు సునీతా. అలాగే ఈ అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వ్యాయామాలు, వర్కౌట్లు వంటివి అత్యంత అవసరమని అన్నారు. సుదీర్ఘకాలం అంతరిక్షంలో గడిపే వ్యోమగాములకు వారి తుంటి, వెన్నుమకల్లో ప్రతి నెల రెండు శాతం వరకు ఎముక సాంద్రతను కోల్పోతారని అన్నారు. అలా జరగకుండా ఉండేందుకు తాము వెయిట్ లిఫ్టింగ్, స్క్వాట్లు, ట్రెడ్మిల్ వర్కౌట్లతో సహా రోజువారీ ..వ్యాయామం రెండు గంటలకు పైగా చేస్తామని చెప్పారు. విపరీతంగా చేసిన వ్యాయమాల కారణంగానే శరీరాకృతిలో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. అలాగే తాను బాగానే తింటున్నాని, ముఖ్యంగా..ఆలివ్‌లు, అన్నం, టర్కిష్ చేపల కూర తింటున్నట్లు చెప్పారు. (చదవండి: క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పింది?) -
క్షేమంగానే ఉన్నా.. ఆరోగ్యంపై సునీతా విలియమ్స్ క్లారిటీ
-
క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం.. నాసా ఏం చెప్పిందంటే?
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ సంస్థ పంపిన రాకెట్లో ప్రొపల్షన్ వ్యవస్థలో లోపం కారణంగా భూమికి తిరిగిరాలేక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో ఉండిపోయిన భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఐఎస్ఎస్కు వెళ్లేటపుడు పుష్టిగా ఉన్న సునీత తర్వాత బక్కచిక్కిపోయారని వార్తలొచ్చాయి. బుగ్గలు నొక్కుకుపోయిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో చివరకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) వివరణ ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురైంది. ముందస్తు సన్నద్ధత లేకుండా సుదీర్ఘకాలంపాటు భారరహిత స్థితిలో గడపడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నదని మీడియాతో కథనలు వెలువడటం తెల్సిందే. ఈ వార్తలను నాసా తాజాగా తోసిపుచ్చింది.‘‘అక్కడి వ్యోమగాముల ఆరోగ్యస్థితిని ఫ్లైట్ సర్జన్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నారు’’ అని నానా స్పేస్ ఆపరేషన్స్ మిషన్ డైరెక్టరేట్ అధికార ప్రతినిధి జిమ్మీ రస్సెల్ అన్నారు. ‘‘ఎనిమిది రోజుల్లో తిరిగొస్తారనుకుంటే ఆరునెలలపాటు అక్కడే ఉంచుతున్నారు. సుదీర్ఘకాలం భారరహిత స్థితిలో ఉంటే కండరాల క్షీణత బారిన పడే వీలుంది. ఎముకల పటిష్టత తగ్గుతుంది. పోషకాలలేమి సమస్యలు వస్తాయి’’ అని కొందరు వైద్యనిపుణలు అభిప్రాయపడటం తెల్సిందే. సునీతతోపాటు బేరీ బుచ్విల్మోర్ సైతం అదేరోజున ఐఎస్ఎస్కు వెళ్లిన విషయం విదితమే.చదవండి: అమెరికా ఎన్నికల్లో సత్తా చాటిన ఎన్నారైలు.. ఎంతమంది గెలిచారంటే? కాగా, అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగొస్తారనే దానిపై స్పష్టత కరువైంది. ఈ సంవత్సరంలో ఆమె భూమికి తిరిగొచ్చే అవకాశాలు లేవని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఆమె అంతరిక్షం నుంచి రావొచ్చని నాసా వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఆరోగ్యంపై ఆందోళన
-
ఐఎస్ఎస్ చేరిన డ్రాగన్
వాషింగ్టన్: వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు బయల్దేరిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. సోమవారం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది. కాసేపటికే అందులోని వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బనోవ్ ఐఎస్ఎస్లో ప్రవేశించారు. సునీత, విల్మోర్ తదితరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. స్పేస్ ఎక్స్ క్రూ–9 మిషన్‌ను అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్‌కెనవెరల్ నుంచి శనివారం ప్రయోగించడం తెలిసిందే. జూన్‌లో బోయింగ్ తొలిసారి ప్రయోగాత్మకంగా పంపిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో సునీత, విల్మోర్ ఐఎస్ఎస్ చేరుకున్నారు. 8 రోజుల్లో వారు తిరిగి రావాల్సి ఉండగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలతో అక్కడే చిక్కుబడిపోయారు. చివరికి స్టార్‌లైనర్ ఖాళీగానే భూమికి తిరిగొచ్చింది. సునీత, విల్మోర్ డ్రాగన్ క్యాప్సూల్‌లో ఫిబ్రవరిలో తిరిగి రానున్నారు. వారికి చోటు కలి్పంచేందుకు వీలుగా నాలుగు సీట్ల సామర్థ్యమున్న డ్రాగన్ క్యాప్సూల్‌లో హేగ్, గోర్బనోవ్లను మాత్రమే పంపడం తెలిసిందే. -
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
Sunita Williams: నీ రాక కోసం!
కేప్కనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను సురక్షితంగా భూమికి తిరిగి తెచ్చేందుకు శనివారం స్పేస్–ఎక్స్ క్యాప్సుల్ డ్రాగన్ బయలుదేరింది. ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీత, విల్మోర్లు ఎనిమిది రోజులకు భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో హీలియం లీక్, థ్రస్టర్ల సమస్యలు తలెత్తడంతో అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. మానవసహిత తిరుగు ప్రయాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని నాసా తేల్చడంతో అది ఖాళీగానే తిరిగివచ్చింది. సునీత, విల్మోర్లను భూమికి తేవడానికి వీలుగా డ్రాగన్‌లో రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. ఇద్దరు వ్యోమగాములతో శనివారం ఇది ప్రయాణమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్లను తీసుకొని భూమికి తిరిగి వస్తుంది. ఎనిమిది రోజుల్లో రావాల్సిన వీరు ఏకంగా ఎనిమిది నెలల తర్వాత భూమికి వస్తారు. -
సునీత విలియమ్స్ కోసం 26న క్రూ–9 ప్రయోగం.. అయినా 5 నెలలు పడుతుందా!
కేప్ కెనవెరల్ (అమెరికా): హమ్మయ్యా... సునీతా విలియమ్స్ త్వరలోనే భూమిని చేరుకోనున్నారు. భూమికి సుమారు 300 కిలోమీటర్ల ఎత్తులోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన ఈ భారతీయ సంతతి అమెరికన్ వ్యోమగామిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇంకో రెండు రోజుల్లోనే (సెప్టెంబరు 26వ తేదీ) దీనికి సంబంధించిన ప్రయోగం ఉంటుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ - రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను కేప్ కెనవెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి గురువారం ప్రయోగించనున్నామని నాసా ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే సునీత, బుచ్ విల్మోర్లతోపాటు అమెరికా, రష్యాకు చెందిన మరో ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి భూమ్మీదకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.బోయింగ్ స్టార్‌లైనర్ -12 ద్వారా ఈ ఏడాది జూన్‌లో సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే వారి తిరుగు ప్రయాణం మాత్రం అనుకున్న విధంగా ముందుకు సాగలేదు. స్టార్‌లైనర్‌లోని 24 థ్రస్టర్లలో ఐదు పనిచేయకుండా పోయాయి. అలాగే ప్రొపల్షన్ వ్యవస్థలో హీలియం లీక్ అయినట్లు స్పష్టమైంది. ఐఎస్ఎస్ నుంచే ఈ సమస్యలను పరిష్కరించేందుకు సునీత, విల్మోర్లు, గ్రౌండ్‌స్టేషన్ నుంచి నాసా అన్ని రకాల ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ ఈ స్టార్‌లైనర్ సురక్షితంగా భూ వాతావరణంలోకి ప్రవేశించలేదని, ల్యాండింగ్‌ను నియంత్రించడమూ కష్టమని తేలిన నేపథ్యంలో ఖాళీగానే వెనక్కు రప్పించాలని నాసా నిర్ణయించింది. దీంతో సునీత, విల్మోర్లు నాలుగు నెలలపాటు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. కొసమెరుపు ఏమిటంటే.. ఈ నెల 26 నాటి ప్రయోగం కూడా కచ్చితంగా జరుగుతుందని చెప్పలేము. ఫ్లారిడాకు సమీపంలోని మెక్సికో జలసంధి వద్ద ఏర్పడ్డ ‘నైన్’ తుపాను ప్రయోగ కేంద్రం కేప్ కెనవెరాల్ వైపు దూసుకు వస్తూంది ఫలితంగా అనానుకూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయోగం వాయిదా పడే సూచనలు ఉన్నాయి.భూమికి సురక్షితంగా చేరుకున్న ముగ్గురు మాస్కో: ఇద్దరు రష్యన్, ఒక అమెరికన్ వ్యోమగాములతో కూడిన సోయుజ్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ నుంచి కజకిస్తాన్‌కు చేరుకుంది. ఐఎస్ఎస్ నుంచి సోమవారం విడివడిన క్యాప్సూల్ మూడున్నర గంటల తరువాత కజకిస్తాన్‌లోని పచ్చిక మైదానంలో దిగింది. సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు వీలుగా క్యాప్సూల్‌లోని రెండు థ్రస్టర్లను కొద్దిసేపు మండించారు. ఆఖరు దశలో 7.2 మీటర్ల పారాచూట్ విచ్చుకుని క్యాప్సూల్ సురక్షితంగా గంటకు 16 మైళ్ల వేగంతో కిందికి వచ్చింది.చదవండి: ట్రంప్ నోట ఓటమి మాట.. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోతే..అనంతరం అందులోని వ్యోమగాములను బయటకు తీసుకువచ్చి, వైద్య పరీక్షలు జరిపారు. ఈ వ్యోమగాములు ఒలెగ్ కొనొనెంకో, నికొలాయ్ చుబ్లు 374 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. ఇది ప్రపంచ రికార్డని అధికారులు తెలిపారు. వీరితోపాటే వచ్చిన అమెరికన్ వ్యోమగామి ట్రేసీ డైసన్ ఆరు నెలలపాటు ఐఎస్ఎస్లో ఉన్నారు. కాగా, ఐఎస్ఎస్లో సునీతా, విల్మోర్ సహా ఇంకా 8 మంది వ్యోమగాములున్నారు. -
Butch Wilmore and Sunita Williams: ఐఎస్ఎస్లో ఇబ్బందేమీ లేదు
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎగువన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో సుదీర్ఘకాలం సభ్యులుగా కొనసాగడానికి తాము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యామని అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చెప్పారు. మానసికంగా, శారీరకంగా తమను తాము సిద్ధం చేసుకున్నామని, పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడానికి ప్రయతి్నస్తున్నామని తెలిపారు. బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన సీఎస్టీ–100 స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఈ ఏడాది జూన్‌లో ఐఎస్ఎస్కు వెళ్లిన సునీతా విలియమ్స్, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. 8 రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, స్టార్‌లైనర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంలో అది సాధ్యపడలేదు. స్టార్‌లైనర్ ఒంటరిగానే భూమిపైకి తిరిగివచి్చంది. ఇద్దరు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరి దాకా ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. సునీతా విలిమమ్స్, విల్మోర్ శుక్రవారం ఐఎస్ఎస్ నుంచి ఫోన్లో మీడియాతో మాట్లాడారు. మనం నియంత్రించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆందోళన చెందడం అనవసరమని విల్మోర్ అన్నారు. ఐఎస్ఎస్లో ఎక్కువ రోజులు కంటే ఉండడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇక్కడి పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడ్డామని వివరించారు. తాము ప్రొఫెషనల్ వ్యోమగాములం కాబట్టి అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పనులు చేయడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడం ఎల్లప్పుడు ఆసక్తికరంగానే ఉంటుందని సునీతా విలియమ్స్ వ్యాఖ్యానించారు. స్టార్‌లైనర్‌లో వెనక్కి వెళ్లలేకపోవడం పట్ల తమకు ఎలాంటి విచారం లేదన్నారు. అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్, విల్మోర్ ఓటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అక్కడి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పౌరులుగా ఎన్నికల్లో ఓటు వేయడం ముఖ్యమైన బాధ్యత అని సునీతా విలియమ్స్ చెప్పారు. ఓటు వేసే క్షణం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని తెలిపారు. నవంబరు 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఓటు వేయడానికి ‘నాసా’ తగిన ఏర్పాట్లు చేస్తోందని విల్మోర్ వెల్లడించారు. -
అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్
ఫ్లోరిడా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతరిక్షం నుంచే ఓటు వేస్తామని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీతావిలియమ్స్,బుచ్విల్మోర్తెలిపారు. అంతరిక్షంనుంచిసునీత,విల్మోర్ శుక్రవారం(సెప్టెంబర్13)మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ‘పౌరులుగా ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యం. అంతరిక్షం నుంచి ఓటు వేసేందుకు ఎదురు చూస్తున్నా. ఐఎస్ఎస్లో ఉండి నా కుటుంబాన్ని, నా రెండు కుక్కలను చాలా మిస్సవుతున్నా.నాకే కాదు ఇది నా కుటుంబ సభ్యులకు కఠినమైన సమయం. అయితే పరిస్థితిని అందరూ అర్థం చేసుకున్నారు’అని సునీత అన్నారు.మరో వ్యోమగామి విల్మోర్ మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను తన బ్యాలెట్ రిక్వెస్ట్ పంపినట్లు చెప్పారు.జూన్5న బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునీత, విల్మోర్లు సాంకేతిక కారణాల వల్ల షెడ్యూల్ ప్రకారం భూమికి తిరిగి రాలేకపోయారు.వీరిని తీసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ మాత్రం సెప్టెంబర్ 6న భూమిపై దిగింది. ఇద్దరు వ్యోమగాములను స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్ 2025 ఫిబ్రవరిలో భూమికి తీసుకువస్తుందని నాసా వర్గాలు చెబుతున్నాయి.ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ప్రత్యక్షంగా ఓటు వేయలేని వారి కోసం ఆబ్సెంటీ ఓటింగ్‌తో పాటు ఓట్ బై మెయిల్ విధానాలు అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఆబ్సెంటీ ఓటింగ్ విధానంలో అర్హత కలిగిన ఓటర్లు బ్యాలెట్ రిక్వెస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఓట్ బై మెయిల్ విధానం అందుబాటులో ఉంది. ఈ విధానంలో రిజిస్టర్ ఓటర్లందరికీ ఎన్నికల మందే మెయిల్ పంపుతారు. దీని ద్వారా పౌరులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పోలింగ్ తేదీ కంటే ముందుగానే తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇదీ చదవండి.. అంతరిక్షం నుంచి ఐక్య గీతం -
ముంచుకొస్తున్న మరో ముప్పు! రెండు రోజులుగా ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వర్షాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నింగిలోనే వ్యోమగాములు.. భూమిపైకి ‘స్టార్‌లైనర్’
అంతరిక్షానికి వ్యోమగాములను మోసుకెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ అర్ధంతరంగా భూమికి తిరిగివచ్చింది. సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌విల్మోర్‌ను తీసుకు రాకుండానే భూమికి వచ్చేసింది. ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్ఎస్) నుంచి బయలుదేరిన ఆరు గంటల తర్వాత శుక్రవారం(సెప్టెంబర్ 6) రాత్రి స్టార్‌లైనర్ వ్యోమనౌక న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్లో భూమిపై దిగింది.అసలు స్టార్‌లైనర్‌కు ఏమైంది..?బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఈ ఏడాది జూన్‌లో ఈ ప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. 10 రోజుల మిషన్‌లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఈ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో జూన్ 5వ తేదీన ఐఎస్ఎస్కు చేరుకున్నారు. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సిఉంది. అయితే స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకైంది. ఒక దశలో స్టార్‌లైనర్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయన్న ప్రచారం జరిగింది. నాసా ఎందుకు ఒప్పుకోలేదు..?హీలియం లీకేజీ సమస్యను సరిచేసే క్రమంలో వ్యోమగాములు భూమికి తిరిగిరావడం ఆలస్యమవుతూ వచ్చింది. చివరిగా స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్ సంస్థ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్‌లైనర్ సురక్షితమే అని ప్రకటించింది. అయితే గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నాసా అందుకు అంగీకరించలేదు.వ్యోమగాముల తిరిగి రాక ఎలా..వ్యోమగాములను తిరిగి తీసుకురావడానికి నాసా ఒప్పుకోకపోవడంతో స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి రావాల్సి వచ్చింది. వ్యోమగాములను తిరిగి తీసుకురావడం కోసం ఇలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ మరో వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది. దీంతో మరికొన్ని నెలల పాటు వ్యోమగాములు సునీతా, విల్మోర్ ఐఎస్ఎస్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సునీత వచ్చేది అప్పుడేనా..స్పేక్స్ ఎక్స్‌కు చెందిన క్రూ-9 మిషన్‌లో భాగంగా ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా ఐఎస్ఎస్కు పంపే ఛాన్సుంది. సెప్టెంబరులోనే ఈ ప్రయోగం ఉండొచ్చని సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో క్రూ డ్రాగన్‌లో సునీత, విల్మోర్ను భూమి మీదకు తీసుకురావాలని నాసా యోచిస్తోంది. -
నేడు ఖాళీగా స్టార్‌లైనర్ తిరుగుప్రయాణం
కేప్‌కనావెరాల్: సాంకేతిక సమస్యలతో సతమతమైన బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ శుక్రవారం భూమికి తిరుగుప్రయాణం కానుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి శుక్రవారం సాయంత్రం స్టార్‌లైనర్ విడివడుతుంది. వ్యోమగాములు ఎవరూ లేకుండానే ఆటోపైలెట్ మోడ్‌లో భూమికి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తుంది. అంత సవ్యంగా సాగితే ఆరు గంటల తర్వాత న్యూమెక్సికోలోని వైట్‌సాండ్స్ మిసై్పల్ రేంజ్లో దిగుతుంది. బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు తీసుకొని జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి బయలుదేరింది. బోయింగ్‌కు ఇది తొలి అంతరిక్ష ప్రయోగం. స్టార్‌లైనర్‌లో థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీక్ సమస్యలు తలెత్తడంతో సునీత, విల్మోర్లు అతికష్టం మీద అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమయ్యారు. ఎనిమిది రోజుల తర్వాత భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. పలు పరీక్షల అనంతరం స్టార్‌లైనర్ మానవసహిత తిరుగు ప్రయాణానికి సురక్షితం కాదని నాసా తేలి్చంది. ఈనెల ద్వితీయార్ధంలో స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్యూల్‌ను ఐఎస్ఎస్కు వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి వెళుతుంటారు. కానీ తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను తీసుకురావడానికి వీలుగా డ్రాగన్‌లో ఇద్దరినే పంపనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరిద్దని, సునీత, విల్మోర్లను తీసుకొని డ్రాగన్ భూమికి తిరిగి వస్తుంది. 8 రోజుల కోసం వెళ్లి ఎనిమిది నెలల పైచిలుకు సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి రావడం సునీత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది. ఐఎస్ఎస్లో డ్రాగన్ పార్కింగ్‌కు వీలుగా శుక్రవారం స్టార్‌లైనర్‌ను అంతరిక్ష కేంద్రం నుంచి వేరుచేస్తున్నారు. -
స్టార్ లైనర్ నుంచి వింత శబ్దాలు
హూస్టన్: సెపె్టంబర్ 6వ తేదీన వ్యోమగాములు లేకుండానే భూమికి తిరిగి రానున్న బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకకు సంబంధించిన మరో పరిణామం. వివిధ సమస్యలతో ఇప్పటికే మూడు నెలలుగా ఐఎస్ఎస్తోపాటే ఉండిపోయిన స్టార్‌లైనర్ నుంచి వింతశబ్ధాలు వస్తున్నాయని వ్యోమగామి బచ్ విల్మోర్ చెప్పారు. ఆయన తాజాగా హూస్టన్‌లోని నాసా మిషన్ కంట్రోల్‌తో టచ్‌లోకి వచ్చారు. వ్యోమనౌకను బయటి నుంచి ఎవరో తడుతున్నట్లుగా, జలాంతర్గామిలోని సోనార్ వంటి శబ్దాలు పదేపదే వస్తున్నాయని చెప్పారు. స్టార్ లైనర్ అంతర్గత స్పీకర్‌ను తన మైక్రోఫోన్‌కు దగ్గరగా పెట్టి ఈ శబ్దాలను నాసా నిపుణులకు సైతం ఆయన వినిపించారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో అంతుపట్టడం లేదని, తెలుసుకునేందుకు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నామని నాసా తెలిపింది. విద్యుదయస్కాంత తరంగాల ప్రభావం లేక ఆడియో సిస్టమ్ వల్ల ఈ వింత శబ్దాలు వచ్చే అవకాశముందని నిపుణులు అంటున్నారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌తో కలిసి బచ్ విల్మోర్ బోయింగ్ జూన్ 5వ తేదీన చేపట్టిన మొట్టమొదటి మానవ సహిత ప్రయోగం ద్వారా స్టార్ లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)నకు చేరుకోవడం తెలిసిందే. వారు 8 రోజులపాటు అక్కడే ఉండి పలు ప్రయోగాలు చేపట్టిన అనంతరం భూమికి తిరిగి రావాల్సి ఉంది. అయితే, స్టార్ లైనర్‌లో థ్రస్టర్ వైఫల్యం, హీలియం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావడంతో ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఆ ఇద్దరినీ మరో అంతరిక్ష నౌకలో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భూమికి తీసుకురావాలని ఇటీవలే నాసా నిర్ణయం తీసుకుంది. స్టార్‌లైనర్‌ను మాత్రం వ్యోమగాములు లేకుండానే ఖాళీగా ఈ నెల 6న తిరిగి రప్పించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది. స్టార్‌లైనర్ పునరాగమనంపై దీని ప్రభావం ఉండకపోవచ్చని నాసా తెలిపింది. -
కల్పన మరణం.. నాసాకొక పాఠం
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారు అంతరిక్షంలోనే కాలం గడుపుతున్నారు. సునీతా విలియమ్స్, బుష్ విల్మోర్లు 2025 ఫిబ్రవరి నాటికి తిరిగివచ్చే అవకాశాలున్నాయని నాసా ప్రకటించింది. దీని ప్రకారం వారు ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండనున్నారు. ఇప్పుడు సునీతా విలియమ్స్ ఉదంతం మరో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లాను తలపిస్తోంది. నాటి విషాద ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు నాసా తన ప్రయత్నాలు సాగిస్తోంది.కల్పనా చావ్లా భారతీయ-అమెరికన్ వ్యోమగామి. వృత్తిరీత్యా ఇంజనీర్. ఆమె అంతరిక్షంలో ప్రయాణించిన మొదటి భారతీయ సంతతికి చెందిన మహిళగా చరిత్ర సృష్టించారు. ఆమె 1997లో ఎస్టీఎస్-87, 2003లో ఎస్టీఎస్-107 అనే రెండు స్పేస్ షటిల్ మిషన్లలో ప్రయాణించారు. అయితే 2023 ఫిబ్రవరి ఒకటిన రీ-ఎంట్రీ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ కొలంబియా కూలిపోవడంతో కల్పనా చావ్లా ప్రాణాలొదిలారు. ఈ ఘటనలో ఆరుగురు సిబ్బంది మృతిచెందారు. కొలంబియా ప్రమాదానికి ముందు 1986 జనవరి 28న స్పేస్ షటిల్ ఛాలెంజర్ పేలడంతో 14 మంది వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు.కల్పన ప్రాథమిక విద్యాభ్యాసం 1976లో హర్యానాలోని కర్నావ్లోని ఠాగూర్ బాల్ నికేతన్‌లో జరిగింది. కల్పన ఎనిమిదో తరగతిలో ఉండగా తాను ఇంజనీర్ కావాలనుకున్నారు. 1982లో పంజాబ్ ఇంజినీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. యుఎస్‌లో తదుపరి విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె 1994లో నాసాలో వ్యోమగామిగా చేరారు. 1995లో నాసాకు చెందిన వ్యోమగామి కార్ప్స్లో చేరారు. 1997లో అంతరిక్షయానానికి ఎంపికయ్యారు.సునీతా విలియమ్స్ అంతరిక్షంలో చిక్కుకుపోయిన నేపధ్యంలో ‘నాసా’ అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ అంతరిక్ష ప్రయాణానికి అత్యంత సురక్షితమైన ఏర్పాట్లు చేసినప్పటికీ అది ప్రమాదకరమేనని అన్నారు. టెస్ట్ ఫ్లైట్ అనేది సహజంగానే సురక్షితమైనది. బుచ్, సునీతలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచడం, సిబ్బంది లేకుండానే బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ని కిందకు తీసుకురావాలనే నిర్ణయం భద్రతా పరంగా సరైనదే అని అన్నారు. స్పేస్ ఎక్స్ వ్యోమగాములను తిరిగి తీసుకురాగలదు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా వారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అక్కడే ఉండాల్సివస్తుంది. కల్పనా చావ్లా ఉదంతాన్ని దృష్టిలో ఉంచుకున్న నాసా ఇప్పుడు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అత్యంత సురక్షితంగా తీసుకురావాలనుకుంటోంది. ఇందుకు స్పేస్ ఎక్స్ సాయంతో తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. -
సునీత రాక ఫిబ్రవరిలోనే!
కేప్‌కనావెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి తిరిగి రావడానికి బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్యూల్ సురక్షితం కాదని నాసా తేల్చిచెప్పింది. వారిని అందులో వెనక్కు తీసుకురావడం అత్యంత ప్రమాదకరమని శనివారం పేర్కొంది. ఆ రిస్క్ తీసుకోరాదని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలాన్ మస్‌్కకు చెందిన స్పేస్ ఎక్స్ షటిల్ డ్రాగన్ క్యాప్సూల్‌లో వారిని తీసుకురావాలని నిర్ణయించింది.పలు వైఫల్యాల తర్వాత బోయింగ్ స్టార్‌లైనర్ గత జూన్‌లో సునీత, విల్మోర్లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడం తెలిసిందే. థ్రస్టర్లు మొరాయించడం, హీలియం లీకేజీ తదితర సమస్యల నడుమ అతికష్టమ్మీద∙స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. వారం కోసమని వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు. ఫిబ్రవరిలో తిరుగు ప్రమాణమంటే ఎనిమిది నెలలకు పైగా ఐఎస్ఎస్లోనే గడపనున్నారు. స్టార్‌లైనర్‌కు మరమ్మతులు చేయడానికి బోయింగ్ ఇంజనీర్లతో కలిసి నాసా తీవ్రంగా శ్రమించింది. మూడునెలల ప్రయత్నాల అనంతరం.. మానవసహిత తిరుగు ప్రమాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని తేల్చేసింది. అది ఒకటి, రెండు వారాల్లో ఐఎస్ఎస్ నుంచి విడివడి ఆటోపైలెట్ మోడ్‌లో ఖాళీగా భూమికి తిరిగి రానుంది. తమ విమానాల భద్రతపై ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న బోయింగ్‌కు స్టార్‌లైనర్ వైఫల్యం గట్టి ఎదురుదెబ్బే.స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలోనే ఉంది. మార్చి నుంచి ఐఎస్ఎస్లో ఉన్న నలుగురు వ్యోమగాములను తీసుకుని సెపె్టంబరు నెలాఖరులో భూమికి తిరిగివస్తుంది. అత్యవసరమైతే తప్ప అందులో మరో ఇద్దరిని ఇరికించడం సురక్షితం కాదని నాసా తెలిపింది. రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సూల్ కూడా ఐఎస్ఎస్లోనే ఉన్నా అందులోనూ ముగ్గురికే చోటుంది. ఏడాదిగా ఐఎస్ఎస్లో ఉన్న ఇద్దరు రష్యా వ్యోమగాములు అందులో తిరిగొస్తారు. డ్రాగన్ సెపె్టంబరులో ఇద్దరు వ్యోమగాములతో ఐఎస్ఎఐస్కు వెళ్తుంది. తిరుగు ప్రమాణంలో సునీత, విల్మోర్లను కూడా తీసుకొస్తుంది. -
స్పేస్ అనీమియా అంటే..? సుదీర్ఘకాలం ఉంటే ఏం జరుగుతుంది..?
ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా.. స్పేస్ టూర్ కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 78 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు. జూన్ 5 వ తేదీన అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోరీతో కలిసి.. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, నిజానికి జూన్ 14 నే భూమ్మీదకి తిరిగి రావాల్సి ఉంది. వారు వెళ్లిన స్టార్ లైనర్స్ లో సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా అన్ని రోజులు ఉండిపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది..?అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కళ్లు, హృదయనాళ వ్యవస్థ, ఎముకల సాంద్రత, అభిజ్ఞా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకశాం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యోమగాముల డీఎన్ఏ ముప్పు గురించి మాట్లాడుతున్నారు. స్పేస్ రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి అయ్యితే ఎర్ర రక్త కణాలు నాశనమయ్యిపోతాయని చెబుతున్నారు. అంతరిక్షం శరీరంలోని ఎర్ర రక్తకణాలను సెకనుకు మూడు మిలియన్లు చొప్పున నాశనం చేస్తుందట. అంటే ఆరు నెలల అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల శరీరాలు సెకనుకు మూడు మిలియన్లు ఎర్రరక్తకణాలను కోల్పోతుందట. అదే భూమ్మీద సెకను రెండు మిలియన్ల ఎర్ర రక్తకణాలను సృష్టించి, నాశనం చేస్తుందట. అలాగే శరీర ద్రవాల మార్పులు, ఆర్బీసీలలో మార్పులు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల వ్యోమగాములు తమ రక్తనాళాలలో 10% వరకు ద్రవాన్ని కోల్పోతారు. వ్యోమగాములు అతరిక్షంలో ఉన్నంతకాలం ఎర్ర రక్తకణాల నాశనం లేదా హిమోలిసిస్ జరుగుతూనే ఉంటుంది. అంతేగాక 1998 నుంచి 2001 జరిపిన అధ్యయనంలో 13 రోజుల మిషన్‌కు వెళ్లిన 14 మంది వ్యోమగాములు రక్త నమునాలను నాసా విశ్లేసించింది. ప్రయోగానికి పది రోజుల ముందు తీసుకున్న రక్త నమునాలతో మిషన్ ల్యాండింగ్ అయిన తర్వాత సేకరించిన రక్త నమునాలలోని తేడాలను గుర్తించినట్లు తెలిపారు. ల్యాండింగ్ అయిన మూడు రోజుల తర్వాత ఫ్రీ-ఫ్లోటింగ్ మైటోకాన్డ్రియల్ డీఎన్ఏ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఇది స్పేస్ ప్రయాణానికి ముందు కంటే 355 రెట్లు ఎక్కువని అన్నారు. అందువల్ల డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ప్రమాదకరమని చెప్పారు వైద్యులు. దీనిపై మరింతగా పరిశోధనలు చేస్తే మిషన్ వెళ్లే ముందు, తదనంతరం ఎదురయ్యే ఒత్తిడి, వాపుల నుంచి వ్యోమగాములను రక్షించగలమా..? లేదా? అనేది తెలుస్తుంది. (చదవండి: కంగారు కేర్ గురించి విన్నారా..? తల్లులు తప్పక తెలుసుకోవాల్సింది..!) -
టిక్.. టిక్.. టిక్... మిగిలింది 19 రోజులే
వాషింగ్టన్: బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికే (ఐఎస్ఎస్) పరిమితమైన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. వారు మరో 19 రోజుల్లో వారం అక్కడి నుంచి బయల్దేరకపోతే మరో కీలక ప్రయోగాన్ని నిలిపివేయక తప్పదు. అందుకే నాసా సైంటిస్టులు, బోయింగ్ ఇంజనీర్లు ఆందోళన చెందుతున్నారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ఎందుకీ ఆందోళన? విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ సంస్థ తొలిసారి అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు సునీత, విల్మోర్ జూన్ 5న ఐఎస్ఎస్కు బయలుదేరారు. అయితే నింగిలోకి దూసుకెళ్తున్న క్రమంలోనే అందులో సాంకేతిక లోపాలు తలెత్తాయి. 28 థ్రస్టర్లకు గాను 5 మొరాయించాయి. సరీ్వస్ మాడ్యూల్లో ఐదు చోట్ల హీలియం లీకేజీలు బయటపడ్డాయి. సానా సైంటిస్టులు భూమి నుంచే రిమోట్ కంట్రోల్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. తర్వాత స్టార్‌లైనర్ ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమై జూన్ 13న సునీత, విల్మోర్ ఐఎస్ఎస్లోకి అడుగుపెట్టారు. షెడ్యూల్ ప్రకారం వారం తర్వాత స్టార్‌లైనర్‌లో వెనక్కు రావాలి. కానీ దానికి పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తే తప్ప బయల్దేరలేని పరిస్థితి! మరోవైపు స్పేస్ఎక్స్ ‘క్రూ–9 మిషన్’లో భాగంగా నాసా వ్యోమగాములు జెనా కార్డ్‌మాన్, నిక్ హేగ్, స్టెఫానీ విల్సన్, అలెగ్జాండర్ గోర్బునోవ్ ఈ నెల 18న ఐఎస్ఎస్కు బయలుదేరాల్సి ఉంది. వారు 23 కల్లా అక్కడికి చేరేలా గతంలోనే షెడ్యూల్ ఖరారైంది. ఐఎస్ఎస్ నుంచి స్టార్‌లైనర్ వెనక్కి వస్తే తప్ప ‘క్రూ–9’ను పంపలేని పరిస్థితి! దాంతో ఏం చేయాలో అర్థంకాక నాసా తల పట్టుకుంటోంది. దీనికి తోడు ఐఎస్ఎస్లో సునీత ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్లు సమాచారం. స్టార్‌లైనర్ త్వరలో సిద్ధం కాకుంటే ఆమెను రప్పించడానికి ప్రత్యామ్నాయం చూడాల్సి రావొచ్చు. -
Sunita Williams: వచ్చేస్తాగా..!
సాహసం అంటే సునీతకు సరదా! అంతరిక్షంలో భారరహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ... ‘డ్యూటీ’ చేయటం ఆమెకొక విహారం. ఇక స్పేస్‌లో ఉన్నన్నాళ్లూ ఒక్క రోజు కూడా ఆమె వ్యాయామం ఆపలేదు! ఆరోగ్యానికి, ఎముకల దృఢత్వానికి మేలు చేసే ఎక్సర్సైజ్లే అన్నీ. మానసికంగా శక్తినిచ్చే సాధనకు సైతం ఏనాడూ ఆమె విరామం ఇవ్వలేదు. ఆ సాధనే... అనుదిన భగవద్గీత పఠనం. ప్రస్తుతం సునీత ఆ అంతరిక్షంలోనే చిక్కుబడిపోయారు. భూమిపై అందరూ ఆమె కోసం భయాందోళనలు చెందుతూ ఉంటే ఆమె మాత్రం... చిరునవ్వుతో... ‘‘వచ్చేస్తాగా...’’ అని తనే రివర్స్‌లో నాసాకు, భారతీయులకు నమ్మకం ఇస్తున్నారు!సునీతా విలియమ్స్ గత 53 రోజులుగా అంతరిక్షంలోనే ఉండిపోయారు. సునీతను, సహ వ్యోమగామి బచ్ విల్మోర్ను భూకక్ష్యకు 400 కి.మీ ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఐ) విజయవంతంగా మోసుకెళ్లిన ‘బోయింగ్ స్టార్‌లైనర్’ వ్యోమనౌక తీరా వారిని అక్కడికి చేర్చాక చేతులెత్తేసింది. జూన్ 5న వాళ్లు వెళ్లారు. తిరిగి జూన్ 12కి, కనీసం జూన్ 15 కి వారు భూమి పైకి రావలసింది. స్టార్‌లైనర్‌లోని రాకెట్ మోటార్లు (థ్రస్టర్స్) మొరాయించటంతో విల్మోర్తో పాటుగా సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. మరోవైపు నాసా టీమ్ భూమి మీద నుంచే ఆకాశంలోని స్టార్ లైనర్‌కు నెలన్నరకు పైగా మరమ్మతులు చేస్తూ ఉంది. స్టార్‌లైనర్ మానవ ప్రయాణానికి పనికొస్తుందా లేదా అని ప్రత్యక్షంగా పరీక్షించేందుకు వెళ్లిన సునీత, విల్మోర్ అక్కడే ఉండిపోయారు. వారు ఎప్పటికి తిరిగొస్తారు అనే ప్రశ్నకైతే ఇప్పటి వరకు సమాధానం లేదు. తాజాగా చిన్న ఆశ మినుకుమంది! థ్రస్టర్స్‌ని మండించి చూసిన నాసాకు అవి పని చేయబోతున్న సంకేతాలు కనిపించాయి. ఇది గుడ్ న్యూస్. నాసాకే కాదు, సునీతా విలియమ్స్ సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్న యావత్భారతావనికి కూడా. ‘‘స్టార్‌లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది’’ అని సునీత భూమి పైకి సందేశం పంపారు. ‘‘ఆమె చాలా ధైర్యంగా ఉన్నారు’’ అని సహ వ్యోమగామి విల్మోర్ ఆమె గురించి గొప్పగా చె΄్పారు.అంతరిక్షంలో డాన్స్!విల్మోర్ చె΄్పారనే కాదు.. సునీతా విలియమ్స్ గట్టి అమ్మాయి. భూమి మీద ఉండి మనం ఆమె గురించి భయపడుతున్నాం కానీ.. అంతరిక్షంలో ఆమె ఉల్లాసంగా గడుపుతున్నారు. నాసా వారు ఇచ్చిన వీక్ ఆఫ్‌ని చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు. గేమ్స్ ఆడుతున్నారు కూడా. ఇంకా.. మైక్రో గ్రావిటీలో మొక్కలు నీటిని ఎలా సంగ్రహిస్తాయో సునీత పరీక్షిస్తున్నారు. నిజానికి రోదసీయానం సునీతా విలియమ్స్‌కి ఇదే మొదటిసారి కాదు. 2006లో, 2012లో ఐఎస్ఎస్కి వెళ్లారు. 322 రోజులు అంతరిక్షంలో గడిపారు. మొత్తం కలిపి 50 గంటల 40 నిముషాల పాటు స్పేస్ వాక్ చేశారు. ఈసారి అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లగానే ఆనందంతో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది కూడా. సునీతకు అంతరిక్ష యాత్ర ఇదే తొలిసారి కాకున్నా.. బోయింగ్ స్టార్ లైనర్‌తో మానవ సహిత యాత్రను నిర్వహించటం నాసాకు మొదటిసారే. కన్నవారి కలకల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మూలాలు కలిగిన రెండో మహిళ సునీతా విలియమ్స్. అమెరికాలోని ఒహాయో పట్టణంలో 1965లో జన్మించారు సునీత. ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాతీ. తల్లి ఉర్సులిన్ స్లొవేనియా మహిళ. సునీత ఫిజిక్స్ లో డిగ్రీ చేశారు. ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికన్ నావికాదళంలో కొన్నాళ్లు డైవింగ్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేశారు. 1998లో రోదసీయానంలో శిక్షణ తీసుకున్నారు. వ్యోమగామి కావాలన్నది మాత్రం తల్లిదండ్రుల కల. ఆ కల నెరవేరటానికి కూడా కారణం అమ్మానాన్నే అంటారు సునీత. సునీత త్వరగా భూమిపైకి తిరిగి రావాలని ఆకాంక్షిద్దాం. -
ఐఎస్ఎస్ నుంచి త్వరలో సునీత రాక!
వాషింగ్టన్: బోయింగ్ తయారీ స్టార్‌లైనర్ వ్యోమనౌక భూమికి తిరుగుపయనంపై ఆశలు ఇంకాస్త చిగురించాయి. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు చేర్చాక స్టార్‌లైనర్‌లోని రియాక్షన్ కంట్రోల్ వ్యవస్థలోని కొన్ని థ్రస్టర్లు మొరాయించిన విషయం విదితమే. నౌకను శూన్యంలో సరైన దిశలో తిప్పేందుకు చిన్నపాటి ఇంజన్లవంటి థ్రస్టర్లు అత్యంత కీలకం. హీలియం సైతం లీక్ అవుతుండటంతో సునీత, విల్మోర్ల తిరుగుప్రయాణాన్ని వాయిదావేసి రిపేర్ల పనిపట్టడం తెల్సిందే. తాజాగా థ్రస్టర్లను ఒకదాని తర్వాత మరొకటి ఇలా 27 థ్రస్టర్లను మండించి వాటి పనితీరును పరిశీలించారు. 97–02 శాతం ఖచి్చతత్వంతో అవి పనిచేశాయని హాట్ ఫైర్ పరీక్షకు నాయకత్వం వహించిన ఫ్లైట్ డైరెక్టర్ కోలోయి మెహరింగ్ చెప్పారు. ఈ పరీక్ష జరిపినంతసేపు హీలియం వ్యవస్థలు సవ్యంగానే పనిచేశాయని మెహరింగ్ ప్రకటించారు. ఈ ఫలితాలను వచ్చేవారు సమీక్షించనున్నారు. ఐఎస్ఎస్ను ఏ రోజున భూమికి తిరుగుపయనం మొదలెట్టాలనే విషయాన్ని వచ్చేవారం సమీక్షలో చర్చించనున్నారు. -
స్టార్ లైనర్లోనే సురక్షితంగా తిరిగొస్తాం
కేప్కనవెరాల్: బోయింగ్ అంతరిక్ష నౌక ‘స్టార్ లైనర్’లో పలు సమస్యలు తలెత్తినప్పటికీ.. తాము అందులోనే భూమికి సురక్షితంగా తిరిగి వస్తామనే విశ్వాసం ఉందని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బుధవారం తెలిపారు. స్టార్ లైనర్ తొలి మానవసహిత రోదసీ యాత్రలో జూన్ 5న సునీత, విల్మోర్లు అంతరిక్షంలోకి వెళ్లారు. హీలియం వాయువు లీక్ కావడం, థ్రస్టర్ల వైఫల్యం కారణంగా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌తో అతికష్టం మీద అనుసంధానం కాగలిగారు. ఎనిమిది రోజుల అనంతరం భూమికి తిరిగి రావాల్సిన వీరిద్దరూ రాకెట్లో సమస్యల వల్ల ఐఎస్ఎస్లోనే చిక్కుబడిపోయారు. ఐఎస్ఎస్ నుంచి బుధవారం వీరిద్దరూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. థ్రస్టర్‌ను పరీక్షించడం పూర్తయ్యాక తిరుగు ప్రయాణమవుతామన్నారు. రోదసీలో ఎక్కువ సమయం ఉండాల్సి రావడం పట్ల తమకేమీ ఫిర్యాదులు లేవని, ఐఎస్ఎస్లోని ఇతర వ్యోమగాములకు సహాయపడటాన్ని ఆస్వాదిస్తున్నామని తెలిపారు. ‘స్టార్ లైనర్ మమ్మల్ని భూమికి చేర్చుతుందని నా మనసు చెబుతోంది. సమస్యేమీ లేదు’ అని సునీతా విలియమ్స్ విలేకరులతో అన్నారు. -
నీ రాక కోసం.. అంతరిక్షంలో చిక్కుకున్న సునీత
సునీతా విలియమ్స్. పరిచయమే అవసరం లేని పేరు. భారత మూలాలున్న ఈ నాసా వ్యోమగామి మరో సహచరునితో కలిసి ఇటీవలే ముచ్చటగా మూడో అంతరిక్ష యాత్ర చేపట్టి మరోసారి వార్తల్లోకెక్కారు. తీరా అంతరిక్ష కేంద్రానికి చేరాక వ్యోమ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అక్కడే చిక్కుబడిపోయి నెలకు పైగా రోజూ వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నారు. వ్యోమ నౌకకు నాసా తలపెట్టిన మరమ్మతులు ఎప్పటికి పూర్తవుతాయి, సునీత ఎప్పుడు సురక్షితంగా తిరిగొస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. దీనికి ఎప్పటికి తెర పడుతుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు...ప్రపంచంలో అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవసహిత రోదసీ యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు. సహచరుడు బారీ బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. అయితే యాత్ర సజావుగా సాగలేదు. ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ మొదలుకుని వ్యోమ నౌకలో పలు లోపాలు తలెత్తాయి. ఉత్కంఠ నడుమే ఎట్టకేలకు జూన్ 6న స్టార్‌లైనర్ సురక్షితంగా ఐఎస్ఎస్తో అనుసంధానమైంది.నిజానికి ఇది మానవసహిత యాత్రల సన్నద్ధతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్ (సీఎఫ్‌టీ). షెడ్యూల్ ప్రకారం సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్ఎస్లో ఉండి జూన్ 13న బయల్దేరి 14న భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్ఎస్తో అనుసంధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీ తదితరాలకు తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా ప్రస్తుతం తలమునకలుగా ఉంది. వ్యోమగాములను వెనక్కు తీసుకొచ్చే విషయంలో తమకు హడావుడేమీ లేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ స్పష్టం చేశారు. వారి భద్రతకే తొలి ప్రాధాన్యమని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ సమస్యలు ఏమిటి?⇒ స్టార్‌లైనర్ వ్యోమ నౌకలో ఏకంగా ఐదు చోట్ల హీలియం లీకేజీలు చోటుచేసుకున్నాయి. ఇది పెను సమస్య. దీనివల్ల వ్యోమనౌక లోపలి భాగంలో అవసరమైన మేరకు ఒత్తిడిని మెయిన్‌టెయిన్ చేయడం కష్టమవుతుంది. నౌక పనితీరూ బాగా దెబ్బ తింటుంది. ⇒ దీంతోపాటు వ్యోమ నౌకలో కీలకమైన 28 రియాక్షన్ కంట్రోల్ సిస్టం థ్రస్టర్లలో ఏకంగా ఐదు విఫలమైనట్టు నాసా సైంటిస్టులు గుర్తించారు. అవి ఉన్నట్టుండి పని చేయడం మానేశాయి. సురక్షితంగా తిరిగి రావాలంటే కనీసం 14 థ్రస్టర్లు సజావుగా పని చేయాలి.⇒ ప్రొపెల్లెంట్ వాల్వ్ కూడా పాక్షికంగా ఫెయిలైంది.⇒ వీటిని పరిశీలిస్తున్న క్రమంలో మరిన్ని సాంకేతిక సమస్యలూ బయటపడ్డాయి. థ్రస్టర్లలో ప్రస్తుతానికి నాలుగింటిని రిపేర్ చేశారని, అవి సజావుగా పని చేస్తున్నాయని చెబుతున్నారు.⇒ ఈ సమస్యలను సరి చేసేందుకు బోయింగ్ బృందం నాసాతో కలిసి పని చేస్తోంది. నెవెడాలో అచ్చం ఐఎస్ఎస్ తరహా పరిస్థితులను సృష్టించి స్టార్‌లైనర్‌లో తలెత్తిన సమస్యలను ఎలా పరిష్కరించాలో పరీక్షిస్తున్నారు. ఇది తుది దశలో ఉన్నట్టు సమాచారం. ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి...బోయింగ్ స్టార్‌లైనర్ గరిష్టంగా 45 రోజుల పాటు ఐఎస్ఎస్తో అనుసంధానమై ఉండగలదు. అది జూన్ 6న అక్కడికి చేరింది. ఆ లెక్కన జూలై 22 దాకా సమయముంది. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే? సునీత, బుచ్ విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయి. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా, లేదంటే రష్యా సూయజ్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు.ఐఎస్ఎస్లోనే మకాంసునీత, విల్మోర్ ప్రస్తుతానికి ఐఎస్ఎస్లోనే సురక్షితంగా ఉన్నారు. సునీత తన అనుభవం దృష్ట్యా పరిశోధనలు, ప్రయోగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అక్కడున్న ఏడుగురుతో కలిసి ఐఎస్ఎస్ నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాల్లో బిజీగా గడుపుతున్నారు.నేను, మీ సునీతను...!అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న సునీతా విలియమ్స్ తమ తాజా అంతరిక్ష యాత్ర గురించి ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30కు ఈ కార్యక్రమం ఉంటుంది. నాసా టీవీ, నాసా యాప్, సంస్థ వెబ్‌సైట్‌తో పాటు యూట్యూబ్‌లో దీన్ని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
మరికొన్ని రోజులు అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ మరికొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారు కచి్చతంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారన్నది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు. స్టార్‌లైనర్‌లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో స్టార్‌లైనర్ మిషన్ వ్యవధిని 45 రోజుల నుంచి 90 రోజులదాకా పొడిగించాలని భావిస్తున్నారు. జూన్ 5న సునీత, విల్మోర్ అంతరిక్షంలోకి బయలుదేరారు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. హీలియం గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించారు. థ్రస్టర్లు కూడా మొరాయించాయి. బోయింగ్ సైంటిస్టులు అప్పటికప్పుడు కొన్ని మరమ్మతులు చేయడంతో వ్యోమనౌక అంతరిక్షంలోకి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం త్వరలో తిరిగి రావాల్సి ఉంది. కానీ, మరమ్మతులు పూర్తిస్థాయిలో జరగలేదు. ఇవి పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకొనే అవకాశం ఉంది. -
అంతరిక్ష కేంద్రంలో ‘స్పేస్ బగ్’ .. ఇబ్బందుల్లో సునీతా విలియమ్స్!
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్(59) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో సురక్షింతగా అంతరిక్ష కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)కు చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్‌తో సహా 8 మంది సిబ్బందికి ‘స్పేస్ బగ్’ రూపంలో ఇబ్బంది వచ్చిపడింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూపర్ బగ్గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాన్‌డెన్సిస్’ అనే బాక్టీరియా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతరిక్ష వాతావరణంలో ఈ బ్యాక్టీరియా మరింత బలం పెంచుకుంటోందని తెలిపారు. ఇది అనేక ఔషదాలను నిరోధించగలిగే శక్తివంతమైనదని వివరించారు. ఈ బ్యాక్టీరియా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కావడం వల్ల దీన్ని ‘సూపర్ బగ్’గా పిలుస్తారని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇది శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. ఈ స్పేస్ బగ్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునితా విలియమ్స్ సహా మిగిలిన ఎనిమిది మంది సిబ్బంది ఇబ్బందుల్లో పడనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా అంతరిక్ష కేంద్రం.. కదిలే అంతరిక్ష శిధిలాల వల్ల ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే ఒకరి నుంచి మరోకరి వ్యాపించే ‘స్పేస్ బగ్’ గత కొన్ని ఏళ్ల నుంచి అభివృద్ధి చెందటం మరింత ఆందోళన కలిగిస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొటుంన్నారు. వ్యోమగాములు అంతరిక్ష యాత్రల సమయంలో ఆరోగ్యపరంగా సవాళ్లను ఎదుర్కొంటారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం కోసం ‘స్పేస్ బగ్’ ప్రభావాన్ని, ప్రతికూలతలను అంతరిక్ష కేంద్రం త్వరగా అంచనా వేయటం కీలమని పేర్కొంటున్నారు.సునీతా విలియమ్స్‌తో పాటు మరో ఆస్ట్రోనాట్ బారీ యూజీన్ బుచ్ విల్మోర్ జూన్ 6, 2024 న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునిత డ్యాన్స్ చేసి తన ఆనందాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే వారు వారం రోజులు పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి.. అనంతరం భూమిపైకి తిరిగి వస్తారు. -
ఐఎస్ఎస్లోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి గమ్యస్థానం చేరుకున్నారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో బుధవారం అంతరిక్ష ప్రయాణం ప్రారంభించిన ఇద్దరు సాహసికులు గురువారం మధ్యాహ్నం 1.34 గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి(ఐఎస్ఎస్) విజయవంతంగా అడుగుపెట్టారు. అవాంతరాలను అధిగమించి స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ ఐఎస్ఎస్తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్లో ఇప్పటికే ఏడుగురు వ్యోమగాములుండగా, సునీత, బుచ్ విల్మోర్తో తొమ్మిదికి చేరారు. కొత్తగా తమ వద్దకు చేరిన సునీతా, విల్మోర్కు ఏడుగురు అస్ట్రోనాట్స్ ఘన స్వాగతం పలికారు. ఆలింగనం చేసుకున్నారు. సునీత ఆనందంతో నృత్యం చేశారు. వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘‘ఐఎస్ఎస్ వ్యోమగాములంతా నా కుటుంబ సభ్యులే. వారిని కలుసుకున్నందుకు వేడుక చేసుకున్నా. ఇదో లిటిల్ డ్యాన్స్ పార్టీ’’ అన్నారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ వారం తర్వాత స్టార్‌లైనర్‌లో భూమిపైకి తిరిగి రానున్నారు. -
సునీతా విలియమ్స్ అరుదైన ఘనత
భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(59) అరుదైన ఘనతను సాధించారు. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లారు. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌక ద్వారా మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో సురక్షితంగా అంతరిక్ష కేంద్రానికి(ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్) చేరుకున్నారామె. ఆ సమయంలో సునీతా విలియమ్స్ ఆనందంతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన 26 గంటల తర్వాత వారు బోయింగ్ అంతరిక్ష నౌకను ISSలో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఐఎస్ఎస్లో వీళ్లిద్దరికీ ఘన స్వాగతం లభించింది. అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను సునీత, బుచ్ విల్మోర్లు ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని వ్యక్తపర్చారు. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం.. గంటకొట్టి వారిని ఆహ్వానించారు. దీనికి సంబంధించిన వీడియోను బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో పంచుకోగా ప్రస్తుతం అది వైరలవుతోంది. That feeling when you're back on the station! 🕺@NASA_Astronauts Butch Wilmore and Suni Williams are greeted by the @Space_Station crew after @BoeingSpace #Starliner's first crewed journey from Earth. pic.twitter.com/fewKjIi8u0— NASA (@NASA) June 6, 2024ఐఎస్ఎస్లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు. వారిని కలిసిన సందర్భంగా తాను ఈ విధంగా డ్యాన్స్ చేసి వేడుక చేసుకున్నానని తెలిపారామె. కాగా, బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్‌లైనర్‌కు ఇది తొలి మానవసహిత యాత్ర. స్టార్‌లైనర్‌లో ప్రయాణించిన మొదటి సిబ్బంది విలియమ్స్, విల్మోర్. వీళ్లిద్దరూ అక్కడ వారం గడుపుతారు. ఈ యాత్ర ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఇవాళ ఉదయం కూడా హీలియం లీకేజీ కారణంగా వ్యోమనౌకలోని గైడెన్స్-కంట్రోల్ థ్రస్టర్లలో ఇబ్బందులు తలెత్తాయి. ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ.. ఐఎస్ఎస్తో అనుసంధానం కాగలిగింది. ఐఎస్ఎస్కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థలను సునీత, విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు. మార్గమధ్యంలోనూ ఈ క్యాప్సూల్‌ను హీలియం లీకేజీ సమస్య వేధించింది. అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు. వ్యోమనౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు.భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్‌కు ఇది మూడో రోదసి యాత్ర. 1998లో నాసా ద్వారా వ్యోమగామిగా ఎంపికయ్యారు. గతంలో ఆమె 2006, 2012లో ఐఎస్ఎస్కు వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. ఆమె ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. ఈసారి గణేశుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. -
మూడోసారి సునీత అంతరిక్ష ప్రయాణం
-
మూడోసారి అంతరిక్షంలోకి సునీత
హూస్టన్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్(61)తో కలిసి బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో బుధవారం పయనమయ్యారు. అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 25 గంటల్లో చేరుకోబోతోన్నారు. అక్కడ వారం రోజులపాటు ఉంటారు. స్టార్‌లైన్ స్పేస్‌క్రాఫ్ట్‌లోనే ఈ నెల 14న మళ్లీ భూమిపైకి చేరుకుంటారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది. స్టార్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యోమగాములుగా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ చరిత్ర సృష్టించారు. ఈ స్పేస్ మిషన్‌కు సునీతా ఫైలట్‌గా, విల్మోర్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. సునీతా అంతరిక్షంలోకి వెళ్లడం ఇది మూడోసారి కావడం విశేషం. 2006లో, 2012లో అంతరిక్ష ప్రయాణం సాగించారు. 2012లో అంతరిక్షంలో ట్రయథ్లాన్ పూర్తిచేసిన తొలి మహిళగా రికార్డుకెక్కారు. వెయిట్ లిఫ్టింగ్ మెషీన్ సాయంతో శూన్య వాతావరణంలో ఈత కొట్టారు. ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తారు. 2007లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బోస్టన్ మారథాన్ పూర్తిచేశారు. అమెరికా నావికాదళంలో పనిచేసిన సునీతా విలియమ్స్‌ను నాసా 1998లో ఎంపిక చేసి వ్యోమగామిగా శిక్షణ ఇచి్చంది. బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్టు మిషన్ చాలా ఏళ్లు వాయిదా పడింది. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్ అభివృద్ధిలో కొన్ని అటంకాలు తలెత్తడమే ఇందుకు కారణం. ఎట్టకేలకు స్పేస్‌క్రాఫ్ట్ సిద్ధమైంది. బోయింగ్ కంపెనీ డెవలప్ చేసిన మొట్టమొదటి అంతరిక్ష ప్రయోగం వాహనం స్టార్‌లైనర్ కావడం విశేషం. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ సంస్థ ఇలాంటి అంతరిక్ష ప్రయాణ వాహనాలు తయారు చేసే తొలి ప్రైవేట్ సంస్థగా రికార్డుకెక్కింది. తాజా ప్రయోగంతో రెండో ప్రైవేట్ సంస్థగా బోయింగ్ కంపెనీ రికార్డు సృష్టించింది. -
మళ్లీ వాయిదా పడిన బోయింగ్ రోదసీ యాత్ర
కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది. అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. -
నేడు సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
న్యూఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సమయం ఆసన్నమైంది. భారత కాల మానం ప్రకారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి బోయింగ్ స్టార్‌లైనర్ రాకెట్లో ఈ రోజు రాత్రి 10 గంటల సమయంలో అంతరిక్షంలోకి బయలు దేరనున్నారు. అంతరిక్షంలో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కి వ్యోమగాములను చేరవేసే ప్రాజెక్ట్‌పై బోయింగ్ స్టార్‌లైనర్ పనిచేస్తోంది.ప్రాజెక్ట్‌లో భాగంగా బోయింగ్ స్టార్‌లైన్ రాకెట్లో అంతరిక్షంలోకి వెళ్లే సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఐఎస్ఎస్కు చెందిన హార్మోనీ మాడ్యుల్ సబ్‌సిస్టమ్స్ పనితీరుపై వారం రోజుల పాటు పనిచేయనున్నారు. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్ లైనర్ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది. ఇప్పటివరకు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ నాసా సర్టిఫై అయింది. స్టార్ లైనర్ వ్యోమనౌక అంతరిక్ష యాత్ర కూడా విజయవంతమైతే స్పేస్ ఎక్స్ జాబితాలో చేరిపోనుంది.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయోగం గత నెల 7న ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆ రాకెట్‌ను నింగిలోకి పంపే రెండుగంటల ముందు వాల్వ్‌లో సమస్య తలెత్తడంతో.. కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. దీంతో భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా, బుచ్ విల్ మోర్ల అంతరిక్షయానం వాయిదా పడింది. తాజాగా భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 10గంటలకు ప్రారంభం కానుంది. 2006లో సునీతా విలియమ్స్ తన తొలి రోదసి యాత్రను చేపట్టారు. ఆ తర్వాత 2012లో రెండో సారి అంతరిక్షంలోకి వెళ్లారు. తాజాగా మరోసారి వెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు. -
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.అయితే, నిన్న(మే 7న) తలపెట్టిన ఈ యాత్ర ఆగిపోయిన విషయం తెలిసిందే. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. కాగా, మరమ్మతుల కోసం అట్లాస్-5 రాకెట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. తల భాగంలో బోయింగ్ ‘స్టార్ లైనర్’ వ్యోమనౌకను అమర్చిన ఈ రాకెట్ ప్రయాణానికి సిద్ధంగా ఇప్పటివరకు ఫ్లోరిడాలో కేప్ కెనెవరాల్ ల్యాంచ్ పాడ్ మీద నిలిచివుంది. .@NASA’s Boeing Crew Flight Test now is targeted to launch no earlier than 6:16 p.m. EDT Friday, May 17, to the @Space_Station. Following a thorough data review completed on Tuesday, ULA (United Launch Alliance) decided to replace a pressure regulation valve on the liquid oxygen… pic.twitter.com/Bh6bOHzgJt— NASA Space Operations (@NASASpaceOps) May 8, 2024 రాకెట్ సెంటార్ అప్పర్ స్టేజిలోని ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ పాడైపోవటంతో ప్రయోగం చివరి నిమిషంలో వాయిదాపడింది. వాల్వును మార్చడానికి అట్లాస్-5ను వర్టికల్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీకి తరలిస్తారు. అనంతరం, ఈస్టర్న్ డే టైమ్ (EDT) ప్రకారం ఈ నెల 17న సాయంత్రం 6.16 గంటలకు(భారత కాలమానం ప్రకారం 18వ తేదీ తెల్లవారుజామున 3:46 గంటలకు) ప్రయోగం నిర్వహించనున్నారు.ఇక, ఈ మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి. -
ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
తల్లాహస్సీ: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడోసారి రోదసి యాత్రకు సిద్ధం అయ్యారు. అయితే ఈ యాత్ర ఆగిపోయింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రోదసీ యాత్ర ఆగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఎక్స్ ద్వారా తెలిపింది. అయితే తిరిగి యాత్ర ఎప్పుడు ఉంటుందనేదానిపై నాసా స్పష్టత ఇవ్వలేదు.బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్ Starliner వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయాల్సి ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ఈ వ్యోమనౌక అట్లాస్-V రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. Today's #Starliner launch is scrubbed as teams evaluate an oxygen relief valve on the Centaur Stage on the Atlas V. Our astronauts have exited Starliner and will return to crew quarters. For updates, watch our live coverage: https://t.co/plfuHQtv4l— NASA (@NASA) May 7, 2024అయితే 90 నిమిషాల ముందర రాకెట్లో సమస్యతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇందులో సునీత.. మిషన్ పైలట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా వెళ్లాల్సి ఉంది.మిషన్ ప్రకారం.. వీరు భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వారం పాటు బసచేస్తారు. వాస్తవానికి స్టార్‌లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.ప్రస్తుతం ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ తరహా సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం మాత్రం ఇదే మొదటిసారి.అందుకే ఒకింత ఆత్రుత.: సునీతతాజా అంతరిక్ష యాత్ర గురించి సునీత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఐఎస్ఎస్కు వెళ్తుంటే.. సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉంది. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదు. రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టం. నేను ఆధ్యాత్మికవాదిని. గణేశుడు నా అదృష్ట దైవం. అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళతాను’’ అని ఆమె పేర్కొన్నారు. సునీత ఒక మారథాన్ రన్నర్. ఐఎస్ఎస్లో ఓసారి మారథాన్ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు. -
సునీత ‘స్టార్ ట్రెక్’!
ముప్పై ఏళ్లు సాగిన అమెరికన్ స్పేస్ షటిల్స్ శకం 2011లో ముగిసింది. ఇక 1960ల నాటి సోవియట్ సోయజ్ కేప్సూల్ ఓ పాతబడ్డ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో నెట్టుకొస్తున్నా అదీ ని్రష్కమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేసింది. రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడుపుతోంది. ఈ నేపథ్యంలో మున్ముందు అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, పెట్టుబడులు, పరిశోధన, చంద్ర–అంగారక యాత్రలు... అన్నింట్లోనూ ప్రైవేటైజేషన్‌దే హవా కానుంది! ప్రైవేటు రంగమే రోదసిని ఏలబోతోంది. ప్రభుత్వరంగ పాత్ర క్రమంగా కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తో కూస్తో నిధులకే పరిమితమవుతోంది. రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు (స్పేస్ కేప్సూల్స్) అంతరిక్షాన్ని అందుకోవడానికి సిద్ధమయ్యాయి. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లనున్నాయి. ‘ఎక్స్’ బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తోంది. సరుకులతో పాటు వ్యోమగాములనూ చేరవేస్తోంది. ప్రపంచ అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ–100 స్టార్‌లైనర్’ వ్యోమనౌకతో మే 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో విశేషం... మన సునీత హ్యాట్రిక్! సునీతా విలియమ్స్. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్. ముద్దుపేరు సునీ. 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతున్నారు. అమెరికన్ నేవీ కెపె్టన్ (రిటైర్డ్) సునీతకు అనుభవమే మనోబలం. ఆమెను నాసా 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్యాది ముంబై. తల్లి అర్సలిన్ బోనీ స్లోవేన్–అమెరికన్. సునీత 1965లో అమెరికాలో జని్మంచారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్–5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమనౌకలో ఈ నెల 6న రాత్రి 10:34కు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04కు) ఫ్లోరిడాలోని కేప్ కెనవరల్ నుంచి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ ఐఎస్ఎస్లో వారం గడిపి తిరిగొస్తారు. సునీత 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లారు. 2007 జూన్ 22 దాకా రోదసిలో గడిపారు. నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. రెండోసారి 2012 జులై 14 నుంచి 127 రోజులపాటు ఐఎస్ఎస్లో గడిపారు. మూడుసార్లు స్పేస్ వాక్ చేశారు. రెండు మిషన్లలో మొత్తం 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు. బోయింగ్... గోయింగ్! అమెరికా స్పేస్ షటిల్స్ కనుమరుగయ్యాక అంతరిక్ష యాత్రల కోసం రష్యా సోయజ్ రాకెట్–వ్యోమనౌకల శ్రేణిపైనే నాసా ఆధారపడింది. కానీ ఒక్కో వ్యోమగామికి రష్యా ఏకంగా రూ.700 కోట్లు చొప్పు న వసూలు చేస్తోంది. దాంతో వ్యోమనౌకల అభివృద్ధి కోసం నాసా 2014లో బోయింగ్‌కు 4.2 బిలియన్ డాలర్లు, (రూ.35 వేల కోట్లు), స్పేస్ ఎక్స్‌కు 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టులు కట్టబెట్టింది. స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్‌లో 2020 నుంచే వ్యోమగాములను తీసుకెళ్తోంది. బోయింగ్ ‘క్రూ స్పేస్ ట్రాన్సో్పర్టేషన్ (సీఎస్టీ)–100 స్టార్ లైనర్’ మాత్రం వెనుకబడింది. ఎట్టకేలకు ఈ నెల 6న తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, స్టార్ లైనర్ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదమైతే మానవసహిత అంతరిక్ష యాత్రలకు దానికి లైసెన్స్ లభిస్తుంది. – జమ్ముల శ్రీకాంత్ -
బోయింగ్ ‘స్టార్ లైనర్’.. సునీత ‘స్టార్ ట్రెక్’!
అమెరికన్ స్పేస్ షటిల్స్... ముప్పై ఏళ్లు కొనసాగిన వీటి శకం 2011లో ముగిసింది. 1960ల నాటి సోవియట్ ‘సోయజ్’ కేప్సూల్... పాతపడిన, ఇరుకైన ఓ డొక్కు వ్యోమనౌక. కొద్దిపాటి ఆధునిక మార్పులతో ‘ఐదో తరం సోయజ్’తో కాలం నెట్టుకొస్తున్నా అది కూడా నిష్క్రమించే వేళయింది. సొంత నౌకల్లో వ్యోమగాముల్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు పంపడానికి అమెరికా ఆర్థికంగా వెనకడుగు వేశాక... రష్యా సైతం స్పేస్ టూరిస్టులకు టికెట్లు అమ్మి ఆ సొమ్ముతో ‘ఐఎస్ఎస్ బండి’ నడపడాన్ని చూశాక... చెప్పేదేముంది? అంతరిక్ష కేంద్రానికి మానవసహిత యాత్రలు, రోదసి పరిశోధన, భావి చంద్ర-అంగారక యాత్రలు... అన్నీ ప్రైవేటైజేషనే! కేవలం ప్రోత్సాహం, సహకారం, కాస్తోకూస్తో నిధులు... వీటికే ప్రభుత్వరంగ పాత్ర పరిమితమవుతోంది. పెట్టుబడి, పరిశోధన, లాంచింగ్స్ పరంగా రోదసిని ఇకపై ప్రైవేటు రంగమే ఏలబోతోంది. అంతరిక్షాన్ని అందుకోవడానికి రెండు అధునాతన ప్రైవేటు వ్యోమనౌకలు సిద్ధమయ్యాయి. ఇవి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున కక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రానికి రాకెట్ల సాయంతో వ్యోమగాముల్ని తీసుకెళ్లే అంతరిక్ష నౌకలు (స్పేస్ కేప్సూల్స్). ‘ఎక్స్’ (ట్విట్టర్) బాస్ ఇలాన్ మస్క్ కంపెనీ ‘స్పేస్ ఎక్స్’ రూపొందించిన ‘క్రూ డ్రాగన్’ కేప్సూల్ ఇప్పటికే ఫాల్కన్ రాకెట్లతో అంతరిక్ష కేంద్రానికి రాకపోకలు సాగిస్తూ వ్యోమగాములు, సరుకుల్ని చేరవేస్తోంది. ప్రపంచ అతిపెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన ‘బోయింగ్’ కూడా తాజాగా ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ వ్యోమనౌకతో ఈ నెల 6న తొలి మానవసహిత రోదసీ యాత్రతో రంగప్రవేశం చేస్తోంది. భారతీయ మూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ ముచ్చటగా మూడోసారి అంతరిక్ష కేంద్రానికి పయనమవడం ఈ యాత్రలో మరో ప్రధాన విశేషం.మన సునీత హ్యాట్రిక్!ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్... ముద్దుపేరు సునీ... 11 ఏళ్ల విరామం అనంతరం 58 ఏళ్ల వయసులో మూడోసారి రోదసికి వెళ్లబోతోంది. అమెరికన్ నేవీ కెప్టెన్ (రిటైర్డ్) అయిన సునీతకు అనుభవమే మనోబలం. నాసా ఆమెను 1998లో వ్యోమగామిగా ఎంపిక చేసింది. సునీత తండ్రి ఇండియన్ అమెరికన్ దీపక్ పాండ్య (ముంబాయి) కాగా, తల్లి స్లోవేన్-అమెరికన్ అర్సలిన్ బోనీ. అమెరికాలో 1965లో సునీత జన్మించారు. యునైటెడ్ లాంచ్ అలయెన్స్ రాకెట్ ‘అట్లాస్-5’ శీర్షభాగంలో అమర్చిన బోయింగ్ కంపెనీ వ్యోమనౌక ‘స్టార్ లైనర్’లో ఈ నెల 6న రాత్రి 10:34 గంటలకు (భారత కాలమానం ప్రకారం 7వ తేదీ ఉదయం 8:04 గంటలకు) ఫ్లోరిడాలోని కేప్ కెవెవరాల్ నుంచి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరనున్నారు. నాసా వ్యోమగామి బుచ్ విల్మోర్ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. వీరిద్దరూ అంతరిక్ష కేంద్రంలో వారం రోజులు గడిపి భూమికి తిరిగొస్తారు. 2006 డిసెంబరు 9న తొలిసారి ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత 2007 జూన్ 22 వరకు రోదసిలో గడిపారు. ఆ సందర్భంగా మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. 2008లో మరో మహిళా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఐదు సార్లు స్పేస్ వాక్ చేసి సునీత రికార్డును బద్దలుకొట్టారు. తర్వాత సునీత రెండోసారి 2012 జులై 14 నుంచి 2012 నవంబరు 18 వరకు 127 రోజులపాటు ఐఎస్ఎస్లో ఉండి ప్రయోగాలు నిర్వహించారు. జపాన్ వ్యోమగామి అకిహికో హోషిడేతో కలసి ఆమె మూడు స్పేస్ వాక్స్ చేశారు. అంతరిక్ష కేంద్రం సౌర ఫలకాల నుంచి ఐఎస్ఎస్ వ్యవస్థలకు పవర్ సరఫరా చేసే ఓ విడిభాగం పాడైపోగా దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చారు. అలాగే ఐఎస్ఎస్ రేడియటర్ అమ్మోనియా లీకేజిని సరిచేశారు. ఈ రెండు మిషన్లలో సునీత 322 రోజులు రోదసిలో గడిపారు. మొత్తం 50 గంటల 40 నిమిషాలపాటు స్పేస్ వాక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ తర్వాత పెగ్గీ విట్సన్ 10 సార్లు స్పేస్ వాక్స్ చేసి మరోమారు సునీత రికార్డును అధిగమించారు. ఎట్టకేలకు బోయింగ్... గోయింగ్! రాకెట్లు అనేవి వాహకనౌకలు. అవి వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళ్లి వదిలివేస్తాయి. అక్కడి నుంచి వారు గమ్యం చేరుకోవడానికి వ్యోమనౌక (స్పేస్ షిప్/ స్పేస్ కేప్సూల్)లో ప్రయాణించాల్సిందే. అమెరికన్ స్పేస్ షటిల్స్ నేరుగా ఐఎస్ఎస్ కు వెళ్లి వచ్చేవి. ఆ ఫ్లీట్ కనుమరుగైంది. ఐఎస్ఎస్ యాత్రల కోసం నాసా మార్గాంతరం లేక తమ సోయజ్ రాకెట్-వ్యోమనౌకల శ్రేణిపై ఆధారపడటంతో రష్యా గట్టిగా డబ్బులు పిండటం మొదలెట్టింది. ఒక్కో సీటుకు రేటు పెంచేసింది. అమెరికన్ వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పట్టుకెళ్లి తిరిగి తీసుకురావడానికి ఒక్కొక్కరికి రూ.700 కోట్లు చొప్పున రష్యా వసూలు చేస్తోంది.దీంతో నాసా తమ ‘కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్’లో భాగంగా వ్యోమనౌకలను అభివృద్ధి చేసే కాంట్రాక్టుల్ని 2014లో రెండు సంస్థలకు కట్టబెట్టింది. ‘సీఎస్టీ-100 స్టార్ లైనర్’ స్పేస్ కేప్సూల్ డిజైనింగ్, అభివృద్ధి కోసం బోయింగ్ సంస్థ 4.2 బిలియన్ డాలర్ల (రూ.35 వేల కోట్లు) కాంట్రాక్టు, ‘క్రూ డ్రాగన్’ స్పేస్ కేప్సూల్ ఆవిష్కరణ కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ 2.6 బిలియన్ డాలర్ల (రూ.21,680 కోట్లు) కాంట్రాక్టు పొందాయి. 2020 నుంచే స్పేస్ ఎక్స్ తన ‘క్రూ డ్రాగన్’లో వ్యోమగాములను కక్ష్యకు తీసుకెళుతోంది. బోయింగ్ తన ‘సీఎస్టీ-100 (క్రూ స్పేస్ ట్రాన్స్‌పోర్టేషన్-100) స్టార్ లైనర్’ పరీక్షల్లో వెనుకబడింది. 2019లో మానవరహిత ఆర్బిటాల్ ఫ్లైట్ టెస్టు (ఓఎఫ్టీ-1) సందర్భంగా స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాఫ్టువేర్ సమస్య తలెత్తింది. దాంతో అంతరిక్ష కేంద్రానికి నౌక అనుసంధానం కాకుండానే వెనుదిరిగి అతి కష్టంమీద భూమికి తిరిగొచ్చింది. 2022లో అది మానవరహిత ఓఎఫ్టీ-2లో విజయవంతమైంది. తాజాగా ఈ నెల 6న ‘స్టార్ లైనర్’ తొలి మానవసహిత ప్రయాణ పరీక్షకు సిద్ధమైంది. అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం (డాకింగ్), భూమికి తిరుగు పయనం, ‘స్టార్ లైనర్’ వ్యవస్థల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో పరిశీలిస్తారు. ఈ యాత్ర జయప్రదం కాగానే... అంతరిక్ష మానవసహిత యాత్రలకు సంబంధించిన సర్టిఫికేషన్ ప్రక్రియను నాసా ఆరంభిస్తుంది. అలా ‘స్టార్ లైనర్’కు లైసెన్స్ లభిస్తుంది. ఏడుగురు వెళ్లి రావచ్చు!‘స్టార్ లైనర్’లో ఏడుగురు వ్యోమగాములు రోదసికి వెళ్ళి రావచ్చు. వీరి సంఖ్యను తగ్గించుకునే పక్షంలో సరకులను తరలించవచ్చు. ‘స్టార్ లైనర్’ లో క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్ ఉంటాయి. గత అమెరికన్ స్పేస్ కేప్సూల్స్ మాదిరిగా ఇది సముద్రంలో దిగదు. పైన పారాచూట్లు, కింద ఎయిర్ బ్యాగుల సాయంతో నేల మీదనే దిగుతుంది. అపోలో కమాండ్ మాడ్యూల్, స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’ కంటే సైజులో ‘స్టార్ లైనర్’ పెద్దది. ఇది ఐఎస్ఎస్ కు అనుసంధానమై ఏడు నెలల పాటు కక్ష్యలో ఉండగలదు. ‘స్టార్ లైనర్’ పునర్వినియోగ స్పేస్ కేప్సూల్. ఒక కేప్సూల్ పది మిషన్ల దాకా పనికొస్తుంది. నాసా తమ వ్యోమగాముల యాత్రల కోసం ఒక్కో సీటుకు స్పేస్ ఎక్స్ ‘క్రూ డ్రాగన్’లో అయితే రూ.450 కోట్లు, బోయింగ్ ‘స్టార్ లైనర్’లో అయితే రూ.700 కోట్లు కుమ్మరించి కొనుక్కోవాల్సిందే! - జమ్ముల శ్రీకాంత్ (Courtesy: The Boeing Company, NASA, The New York Times, The Washington Post, BBC, Reuters, Space.com, SciTechDaily, ars TECHNICA, PHYS.ORG, Forbes, Popular Science, Scientific American, Hindustan Times, The Indian Express, ND TV, India TV News, Business Today, The Economic Times, News 18, mint, Business Standard, First Post, Times Now) -
అమెరికాలో అంబానీ, మహీంద్ర ఉబెర్ కష్టాలు: మిలియన్ డాలర్ల సెల్ఫీ వైరల్
భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తులు ఉబెర్ కోసం ప్రయత్నించారంటే నమ్ముతారా? కానీ ఇటీవల అమెరికాలో అదే జరిగింది. ఈ సందర్భంగా బిలియనీర్ ముఖేష్ అంబానీ, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎపిక్ సెల్ఫీవైరల్గా మారింది. ఏమీ అర్థం కాలేదు కదా? అసలేం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. (రెస్టారెంట్ టూ స్టార్టప్ ఫండింగ్: సురేష్ రైనా నెట్‌వర్త్ తెలిస్తే షాకవుతారు) మహీంద్రా గ్రూప్ చైర్మన్ , రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఇద్దరూ వైట్‌హౌస్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన డిన్నర్‌కి హాజరైన సంగతి తెలిసిందే. స్టేట్ డిన్నర్ తర్వాత, ఇండియా యుఎస్ మధ్య జరిగిన హైటెక్ హ్యాండ్‌షేక్ సమావేశానికి కూడా వీరు హాజరయ్యారు. వీరితోపాటు ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్ తదితర దిగ్గజాలు కూడా ఈ మీటింగ్‌నకు హాజరైనారు. అయితే అంబానీ ఆనంద్ మహీంద్రా యూఎస్ సెక్రటరీ ఆఫ్ కామర్స్ గినా రైమోండో 3rdiTech సహ వ్యవస్థాపకురాలు బృందా కపూర్‌తో మాటల్లో పడి , తర్వాతి లంచ్ అపాయింట్‌మెంట్‌కి వెళ్లాలన్న విషయాన్ని మర్చిపోవడంతో వీరిందరినీ అక్కడికి చేర్చాల్సిన గ్రూపు షటిల్‌ను మిస్ అయిపోయారు. చివరికి ఉబెర్ కోసంప్రయత్నిస్తుండగా హై-టెక్ హ్యాండ్‌షేక్ కాన్ఫరెన్స్‌కు హాజరైన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ ని కలిశారు. (సింగిల్ బ్రాండ్‌తో 100 కోట్ల డీల్ కుదుర్చుకున్న తొలి ఇండియన్ క్రికెటర్ ఎవరో తెలుసా? ) ఈ సందర్భాన్ని ట్విటర్లో అభిమానులతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర బహుశా దీన్ని వాషింగ్టన్ మూమెంట్ అంటారేమో. ఇదే శక్తివంతమైన సెల్ఫీకి దారితీసింది అంటూ అంబానీ, సునీతా విలియమ్స్, బృందా కపూర్లతో ఉన్న సెల్ఫీని ట్వీట్ చేశారు. ఉబెర్కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఉబర్‌కు బదులుగా సునీతా స్పేస్ షటిల్లో వెళదామా అని సునీతాని అడిగామంటూ వెల్లడించారు. ఈ సెల్ఫీపై పలువురు నెటిజన్లు సంతోషంగా స్పందించారు. ఇది 10 లక్షలకు పైగా వ్యూస్, 40 వేలకు పైగా లైక్స్‌తో వైరలైంది. (వైట్‌హౌస్ స్టేట్ డిన్నర్: నీతా అంబానీ చీరల విశేషాలేంటో తెలుసా?) చాలా అరుదుగా కలుసుకున్నప్పుడు సాధారణంగా ఏం మాట్లాడుకుంటారు నిజంగా తెలుసుకోవాలని ఉంది..వ్యాపారం, ప్రయాణం, ఈవెంట్ ఏదైనా.. ఎలాంటి జోకులు వేసుకుంటారంటూ జేకే జ్యుయలర్ల్ వినీత్ చమత్కరించారు. గొప్ప వక్తులు.. ఒకే ఫ్రేమ్‌లో.. ప్రైడ్ ఆఫ్ ఇండియా అంటూ మరొకరు కామెంట్ చేయడం విశేషం. I suppose this was what they would call a ‘Washington moment.’ After the tech handshake meeting yesterday, Mukesh Ambani, Vrinda Kapoor & I were continuing a conversation with the Secretary of Commerce & missed the group shuttle bus to the next lunch engagement. We were trying… pic.twitter.com/gP1pZl9VcI — anand mahindra (@anandmahindra) June 25, 2023 -
ఎగరాలని ఎప్పుడూ అనుకోలేదు
చిన్నప్పటి కలలు వేరే ఉంటాయి. కాని ఈ బ్రహ్మాండమంతా కలిసి మన కోసం వేరే కల కని ఉంటుంది. ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ ఒక పశువుల డాక్టర్ అయితే చాలనుకుంది. కాని అంతరిక్షం ఆమెను తన ముద్దుబిడ్డను చేసుకుంది. ఆదివారం ఒక వెబినార్‌లో సునీతా విలియమ్స్ తన బాల్యాన్ని, అంతరిక్షయానాన్ని గుర్తు చేసుకుంది. ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ సెంటర్ సెంటర్ అబ్దుల్ కలామ్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన ఒక వెబినార్‌లో సుప్రసిద్ధ వ్యోమగామి సునీతా విలియమ్స్ పాల్గొని తన అంతరిక్ష జీవన జ్ఞాపకాలు పంచుకున్నారు. 7 స్పేస్‌వాక్‌లు, దాదాపు 320 రోజుల అంతరిక్ష బస చేసిన అరుదైన రికార్డును తన పేరున నమోదు చేసుకున్న ఈ సాహసి ఆ వెబినార్‌లో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. ఈ సందర్భంగా తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె ఏమన్నారంటే... పశువుల డాక్టర్ ‘మాది ఒక సాధారణ కుటుంబం. మా నాన్న దీపక్ పాండ్యా భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. తర్వాతి కాలంలో న్యూరోఅనాటమిస్ట్ అయ్యారు. ఆయన రెసిడెన్సీ చేస్తుండగా హాస్పిటల్లో మా అమ్మ ఉర్స్‌లిన్ ఎక్స్‌రే టెక్నీషియన్‌గా పని చేసేది. అలా వారు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. మేము ముగ్గురం పిల్లలం. నేను మూడోదాన్ని. బాగా కష్టపడి పైకి రావాలన్నది మాత్రం మాకు చిన్నప్పుడే అర్థమైంది. అయితే అప్పుడు నేను ఇలా వ్యోమగామిని అవుతానని రోదసిని ఛేదిస్తూ పైకి ఎగురుతానని ఎప్పుడూ అనుకోలేదు. నాకు స్విమ్మింగ్ ఇష్టంగా ఉండేది. అథ్లెటిక్స్ ఆసక్తి. పశువులంటే ఇష్టం. వెటర్నరీ డాక్టర్ అవుదామనుకున్నాను. కాని ఆ చదువుకు నేను అనుకున్న యూనివర్సిటీల నుంచి సీటు దొరకలేదు. అప్పుడు మా నాన్న నావల్ అకాడమీ వైపు ప్రోత్సహించారు. అలా నేను నేవీలోకి వచ్చాను.’ అది ఒక కల ‘2003లో కొలంబియా ప్రమాదం సంభవించడం, కల్పనా చావ్లా మృతి ఇవన్నీ అమెరికా అంతరిక్ష పరిశోధనలకు ఒక గట్టి దెబ్బ కొట్టాయి. మేమందరం డోలాయమానంలో పడ్డాం. నేనైతే అంతరిక్షంలోకి అడుగుపెడతానా అని సందేహంలో పడిపోయాను. కాని జరిగిన దుర్ఘటనను బేరీజు వేసుకుని, తిరిగి పుంజుకొని మేమందరం ప్రయాణం కట్టడం, అంతరిక్షంలో అన్ని రోజులు నేను గడపడం ఇదంతా ఇప్పుడు తలుచుకుంటే ఒక కల అనిపిస్తోంది. అంతరిక్షం నుంచి భూమిని మొదటిసారి చూసినప్పుడు వావ్ అనిపించింది. ఎంత ప్రశాంతంగా, సుందరంగా ఉంది భూమి అనుకున్నాను. అదొక అద్భుత అనుభూతి. ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు నాన్న నాకు బహూకరించిన భగవద్గీతను తీసుకెళ్లడం, అక్కడ దానిని తరచూ చదవడం కూడా ఈ సందర్భంగా చెప్పాలనిపిస్తోంది. అంతరిక్షంలో కూచుని భారతీయులు ఇష్టపడే సమోసాలను తినడం కూడా గొప్ప సరదాగా అనిపించింది’’ భూమికి ప్రతినిధులం ‘మేము శాస్త్రవేత్తలం, వ్యోమగాములం భూమి మీద వివిధ దేశాలకు చెందినవారం కావచ్చు. కాని ఒక్కసారి భూమిని విడిచిపెట్టాక భూమికి ప్రతినిధులం మాత్రమే. అంతరిక్షంలో మా ఉనికి అంతవరకే. వివిధ దేశాల వ్యోమగాములతో పని చేస్తున్నప్పుడు మేమందరం భూమి కోసం పని చేస్తున్నామన్న భావన కలుగుతుంది. మరో విషయం. ఏ ఒక్కరూ రోదసి రహస్యాలను అన్నింటిని ఛేదించరు. అందరూ ప్రయత్నించాలి. ఆ పోటీ కూడా బాగా పని చేయడానికి ఉపయోగపడుతుంది. అమెరికా 2024 నాటికి చంద్రుడి దక్షిణ ధ్రువం పైన పురుషుణ్ణి, మొదటి స్త్రీని దించడానికి కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ మార్స్ మీద మనిషి కాలుపెట్టాలన్న అమెరికా ప్రయత్నాలకు పరోక్షంగా సాయం చేస్తుంది. మనం మార్స్ మీదకు వెళ్లాలి. అక్కడ ఎలా మనగలమో తెలుసుకోవాలి. నాకు తెలిసి మన జనరేషన్ హయాంలోనే ఈ ఉజ్వల ఘట్టం ఉంటుంది’ అన్నారామె. మార్స్‌పై మనిషిని చేర్చేందుకు అమెరికా చేయనున్న కీలక ప్రయోగాల్లో కూడా సునీత ముఖ్యపాత్ర పోషించనున్నారు. ఆమె స్ఫూర్తి ఈ తరం కనే కలలను విశాలం చేస్తోంది. – సాక్షి ఫ్యామిలీ -
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి 20 ఏళ్లు!
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కి 20 ఏళ్లు నిండాయి. 1998 నవంబర్ 20న రష్యా రాకెట్ ద్వారా నింగికెగసిన ఐఎస్ఎస్ దశలదశలుగా విస్తరించి ఇప్పుడు ఓ ఫుట్‌బాల్ మైదానమంత సైజుకు చేరుకుంది. అంతరిక్షంపై కూడా పట్టు సాధించాలన్న సంకల్పంతో రష్యా ఐఎస్ఎస్ నిర్మాణాన్ని మొదలుపెట్టినా.. అమెరికా, యూరప్, కెనడా, జపాన్ చేరికతో అసలు సిసలైన అంతర్జాతీయ పరిశోధన కేంద్రంగా అవతరించింది. అంతరిక్ష పరిస్థితులను అర్థం చేసుకునేందుకు.. భవిష్యత్తులో గ్రహాంతర ప్రయాణానికి తొలి మజిలీగా ఉపయోగపడుతుందన్న అంచనాతో సిద్ధమైన ఐఎస్ఎస్ విశేషాలు మరిన్ని.. 230 +2000 నవంబర్ నుంచి ఐఎస్ఎస్ను సందర్శించిన వ్యోమగాముల సంఖ్య!! భారతీయ అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా 2003 ఫిబ్రవరి 1న ఐఎస్ఎస్ నుంచి తిరిగి వస్తూండగా జరిగిన ప్రమాదంలో మరణించగా.. సునీతా విలియమ్స్ విజయవంతంగా తిరిగివచ్చారు. ఉన్న బెడ్రూమ్లు 6 భూమి నుంచి ఐఎస్ఎస్కు చేరేందుకు పట్టే సమయం కూడా 6 గంటలే అనుసంధానం కాగల రాకెట్ల సంఖ్య కూడా ఆరే! 2028 ఐఎస్ఎస్ జీవితకాలం ముగిసే సంవత్సరం నిర్మాణానికి అయిన మొత్తం వ్యయం. ఇందులో నాసా భాగం పది వేల కోట్ల డాలర్లు! 15000 బిల్షెపర్డ్ (అమెరికా), సెర్గీక్రికలేవ్, యూరీ గిడ్జెంకో (రష్యా) ఐఎస్ఎస్పై అడుగుపెట్టిన తొలి వ్యోమగాములు 4–6 నెలలు... వ్యోమగాములు ఇక్కడ గడిపిన సమయం 90 నిమిషాలు.. భూమిని చుట్టేసేందుకు ఐఎస్ఎస్కు పట్టే సమయం ఇది! ఇంకోలా చెప్పాలంటే ఇది గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతూంటూ ఉంటుందన్నమాట! రాత్రివేళ ఆకాశంలో కనిపించే మూడో అతి ప్రకాశవంతమైన ఆకారం ఇదే! 16... అంతరిక్ష కేంద్రంలో భాగంగా ఉండే సోలార్ ప్యానెళ్ల సంఖ్య. వీటిద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతోనే మొత్తం వ్యవహారాలు నడుస్తాయి. 1200 ఐఎస్ఎస్లో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రచురితమైన వ్యాసాలు! ఐఎస్ఎస్లో వ్యోమగాముల శరీరపు స్వేదం ఆవిరి కానే కాదు. దీంతో తరచూ టవళ్లను వాడాల్సి వస్తుంది. 1760 83 దేశాల శాస్త్రవేత్తలు రిమోట్ పద్ధతి ద్వారా నిర్వహించిన పరిశోధనలు. చిన్న చిన్న మరమ్మతులకు అవసరమైన పరికరాలను అక్కడికక్కడే ప్రింట్ చేసుకునేందుకు ఐఎస్ఎస్లో ఒక త్రీడీ ప్రింటర్ కూడా ఉంది. ఈ ప్రింటర్‌తో ఇప్పటి వరకూ ఒక రెంచ్తోపాటు 13 డిజైన్లతో కూడిన 20 వస్తువులను ముద్రించారు. 2001 ఏప్రిల్ 30న ఐఎస్ఎస్పై అడుగుపెట్టి తొలి అంతరిక్ష యాత్రికుడిగా రికార్డు సృష్టించారు.. డెన్నిస్ టిటో! సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తొలి ‘వాణిజ్య యాత్ర’లో సునీతా
హూస్టన్: అమెరికా 2019లో చేపట్టనున్న తొలి మానవ సహిత వాణిజ్య అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాముల బృందంలో భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు. మరో 8 మంది వ్యోమగాములతో కలసి ఆమె అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ‘బోయింగ్’ సంస్థ తయారుచేసిన బోయింగ్ సీఎస్టీ–100, స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా ఈ వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాసా పంపనుంది. 2011లో స్పేస్ షటిల్ కార్యక్రమం ముగిసిపోవడంతో అమెరికా భూభాగం నుంచి ఇప్పటివరకూ వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపలేదు. తమ సహకారంతో బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆధునిక అంతరిక్ష నౌకల సహాయంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నామని నాసా తెలిపింది. సునీతా, మరో వ్యోమగామి జోష్ కస్సాడాతో కలసి స్టార్ లైనర్ నౌక ద్వారా అంతరిక్ష కేంద్రంపై అడుగుపెడతారని పేర్కొంది. గతంలో అంతరిక్షంలో 321 రోజులపాటు గడిపిన సునీతా తిరిగి 2012లో భూమిపై అడుగుపెట్టారు. ఇక స్పేస్ ఎక్స్ డ్రాగన్‌క్యాప్సూల్ మిషన్‌లో వ్యోమగాములు రాబర్ట్ బెహ్న్‌కెన్, డగ్లస్ హర్లీ అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. అయితే, వీరి ప్రయాణం కంటే ముందుగా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో రెండు సంస్థలు తమ నౌకల్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. -
నాసా టీమ్‌లో సునీతా విలియమ్స్
హూస్టన్: అగ్రరాజ్యం అమెరికా దాదాపు ఏడేళ్ల తర్వాత 2019లో మానవ సహిత అంతరిక్ష యాత్రలను చేపట్టనుంది. ఇందులో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ సహా 9 మంది ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ప్రైవేటు కంపెనీ బోయింగ్ రూపొందించిన సీఎస్టీ–100 స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ క్యాప్సూల్స్ ద్వారా వీరిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి వచ్చే ఏడాది ఆరంభంలో చేర్చనున్నారు. ఈ రెండు కంపెనీలు నాసా సహకారంతో ఈ అంతరిక్ష నౌకల్ని అభివృద్ధి చేశాయి. ఈ వివరాలను శుక్రవారం నాడిక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా) ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఐఎస్ఎస్కు వ్యోమగాముల్ని, ఆహారపదార్థాలను చేరవేయనున్నారు. మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపట్టేముందు బోయింగ్, స్పేస్ ఎక్స్ సంస్థలు తమ నౌకల్ని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నాయి. అలాగే ప్రమాద సమయంలో వ్యోమగాములు రాకెట్ నుంచి సురక్షితంగా బయటపడేసే అబార్ట్ వ్యవస్థ సమర్థతను కూడా ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పరీక్షిస్తారు. 1972, జనవరి 5న మొదలైన స్పేస్ షటిల్ కార్యక్రమం 2011 నాటికి ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా సరికొత్త అంతరిక్ష వాహక నౌకల అభివృద్ధిపై దృష్టి సారించింది. -
కల్పన.. నా ప్రియ నేస్తం
వాషింగ్టన్: మూడు రోజుల పర్యటన నిమిత్తం వాషింగ్టన్ లో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా భారత సంతతి వ్యోమగామి కల్పన చావ్లా సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. ఎర్లింగ్టన్ జాతీయ స్మారక స్థలిలోని కల్పన సమాధితోపాటు కొలంబియా వ్యోమనౌక ప్రమాద మృతుల స్మృతి చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచారు. మోదీ విన్పపం మేరకు ఈ కార్యక్రమానికి చావ్లా కుటుంబసభ్యులతోపాటు మరో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సునీత.. కల్పనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 'కల్పన నా ప్రియ నేస్తం. గొప్ప స్నేహితురాలు. మార్గదర్శి కూడా. ఆమెతో మాట్లాడిన, గడిపిన సమయం నా జీవితంలో అత్యంత విలువైనదిగా భావిస్తాను. ఎవరైనాసరే ఆమెతో ఒక్క మాట మాట్లాడారంటే.. ఇంకా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది' అంటూ కల్పన గురించి చెప్పుకొచ్చారు సునీత. ఇంకా.. 'ప్రధాని మోదీని కలుసుకోవడం ఆనందంగా ఉంది. మా నాన్న(దీపక్ పాండ్యా)తో కూడా మాట్లాడారాయన. నన్ను ఇండియాకు రమ్మని ఆహ్వానించారు. నాకు కూడా ఇండియాకు రావాలని, నావాళ్లను కలుసుకోవాలని ఉంది' అని సునీత అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న నాసా అసిస్టెంట్ డైరెక్టర్.. అంతరీక్ష పరిశోధనల్లో నాసా, ఇస్రోలు చక్కటి సహకారంతో ముందుకు పోతున్నాయన్నారు. -
'నా ప్రేమ ఎప్పుడూ ఇండియాపైనే..'
న్యూయార్క్: తనకు భారతీయ చిన్నారులే ప్రేరణ అని భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ అన్నారు. భారతీయ చిన్నారులో ఎంతో మేధస్సును కలిగి ఉంటారని ఆమె చెప్పారు. ఆమె తదుపరి మిషన్ గురించి వివరించిన సందర్బంగా ఈ మాటలు చెప్పారు. ప్రతి ఒక్కరు తమపై విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఎవరు తమను తక్కువ అంచనా వేసుకోవద్దని చెప్పారు. తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని, తన ప్రేమ ఎప్పటికీ భారత్‌పైనే ఉంటుందని ఆమె అన్నారు. -
అంగారక యాత్రకు సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2030లలో చేపట్టనున్న మానవసహిత అంగారక యాత్రకు భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వెళ్లనున్నారు. పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు సునీతతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు.. రాబర్ట్ బెన్కెన్, ఎరిక్ బో, డగ్లస్ హర్లీలను నాసా ఎంపిక చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అక్కడి నుంచి అంగారకుడి వద్దకు పర్యాటకులను తీసుకెళ్లే ‘కమర్షియల్ క్రూ వెహికల్స్’ను నడిపేందుకు ఈ నలుగురూ శిక్షణ పొందనున్నారు. ఈ రోదసి యాత్రల కోసం బోయింగ్, స్పేస్ఎక్స్ కంపెనీలతో కలసి సునీత బృందం పనిచేయనుంది. ఈ బృహత్తర యత్నంతో ఈ నలుగురూ చరిత్రలో నిలుస్తారని, అమెరికన్లు మార్స్ మీద కాలు మోపుతారని నాసా పేర్కొంది. సునీత(49)ను వ్యోమగామిగా నాసా 1998లో ఎంపిక చేసింది. రెండుసార్లు అంతరిక్ష యాత్రలకు వెళ్లి 322 రోజులు రోదసిలో ఉన్నారు. 50.40 గంటల పాటు రోదసిలో నడిచి అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు.