సునీతను తిరిగి తెచ్చేందుకు
అంతరిక్ష కేంద్రానికి స్పేస్–ఎక్స్
కేప్‌కనవెరాల్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో చిక్కుకున్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను సురక్షితంగా భూమికి తిరిగి తెచ్చేందుకు శనివారం స్పేస్–ఎక్స్ క్యాప్సుల్ డ్రాగన్ బయలుదేరింది. ఈ ఏడాది జూన్ 5న బోయింగ్ నిర్మిత స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన సునీత, విల్మోర్‌లు ఎనిమిది రోజులకు భూమికి తిరిగి రావాల్సి ఉండగా.. స్టార్‌లైనర్‌లో హీలియం లీక్, థ్రస్టర్ల సమస్యలు తలెత్తడంతో అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.
మానవసహిత తిరుగు ప్రయాణానికి స్టార్‌లైనర్ సురక్షితం కాదని నాసా తేల్చడంతో అది ఖాళీగానే తిరిగివచ్చింది. సునీత, విల్మోర్‌లను భూమికి తేవడానికి వీలుగా డ్రాగన్‌లో రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. ఇద్దరు వ్యోమగాములతో శనివారం ఇది ప్రయాణమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్‌లను తీసుకొని భూమికి తిరిగి వస్తుంది. ఎనిమిది రోజుల్లో రావాల్సిన వీరు ఏకంగా ఎనిమిది నెలల తర్వాత భూమికి వస్తారు.
Comments
Please login to add a commentAdd a comment