
గుంటూరు, సాక్షి: భారత సంతతి నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అభినందనలు తెలిపారు. సురక్షితంగా భూమి మీదకు తిరిగి రావటంపై హర్షం వ్యక్తం చేస్తూ.. సునీతతో పాటు మరో వ్యోమగామి బచ్ విల్మోర్‌కు కూడా అభినందనలు తెలియజేశారు. మీ సంకల్ప శక్తి, అంకితభావాన్ని చూసి మేము గర్విస్తున్నామంటూ ఆయన ట్వీట్ చేశారు.

సుమారు 9 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్‌లు.. ఎట్టకేలకు మిషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని భూమ్మీదకు వచ్చారు #sunitawilliamsreturn. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. భారత ప్రధాని మోదీ సైతం వెల్‌కమ్‌బ్యాక్ సునీత అంటూ అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment