స్పేస్ అనీమియా అంటే..? సుదీర్ఘకాలం ఉంటే ఏం జరుగుతుంది..? | Sunita Williams And Butch Wilmores Extended Space Stay Raised Several Health Concerns | Sakshi
Sakshi News home page

స్పేస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్‌..అన్ని రోజులు ఉండిపోతే వచ్చే అనారోగ్య సమస్యలు?

Published Thu, Aug 22 2024 4:41 PM | Last Updated on Thu, Aug 22 2024 6:19 PM

Sunita Williams And Butch Wilmores Extended Space Stay Raised Several Health Concerns

ఎనిమిది రోజుల మిషన్‌లో భాగంగా.. స్పేస్ టూర్ కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 78 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు. జూన్ 5 వ తేదీన అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోరీతో కలిసి.. బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, నిజానికి జూన్ 14 నే భూమ్మీదకి తిరిగి రావాల్సి ఉంది. వారు వెళ్లిన స్టార్ లైనర్స్ లో సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోయారు. ఇలా అన్ని రోజులు ఉండిపోతే ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది..?

అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల కళ్లు, హృదయనాళ వ్యవస్థ, ఎముకల సాంద్రత, అభిజ్ఞా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకశాం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా వ్యోమగాముల డీఎన్‌ఏ ముప్పు గురించి మాట్లాడుతున్నారు. స్పేస్‌ రేడియేషన్‌కు ఎక్కువసేపు గురి అయ్యితే ఎర్ర రక్త కణాలు నాశనమయ్యిపోతాయని చెబుతున్నారు. అంతరిక్షం శరీరంలోని ఎర్ర రక్తకణాలను సెకనుకు మూడు మిలియన్లు చొప్పున నాశనం చేస్తుందట. అంటే ఆరు నెలల అంతరిక్ష యాత్రల సమయంలో వ్యోమగాముల శరీరాలు సెకనుకు మూడు మిలియన్లు ఎర్రరక్తకణాలను కోల్పోతుందట. 

అదే భూమ్మీద సెకను రెండు మిలియన్ల ఎర్ర రక్తకణాలను సృష్టించి, నాశనం చేస్తుందట. అలాగే శరీర ద్రవాల మార్పులు, ఆర్‌బీసీలలో మార్పులు సంభవిస్తాయని పరిశోధకులు తెలిపారు. దీని వల్ల వ్యోమగాములు తమ రక్తనాళాలలో 10% వరకు ద్రవాన్ని కోల్పోతారు. వ్యోమగాములు అతరిక్షంలో ఉన్నంతకాలం ఎర్ర రక్తకణాల నాశనం లేదా హిమోలిసిస్‌ జరుగుతూనే ఉంటుంది. అంతేగాక 1998 నుంచి 2001 జరిపిన అధ్యయనంలో 13 రోజుల మిషన్‌కు వెళ్లిన 14 మంది వ్యోమగాములు రక్త నమునాలను నాసా విశ్లేసించింది. ప్రయోగానికి పది రోజుల ముందు తీసుకున్న రక్త నమునాలతో మిషన్‌ ల్యాండింగ్‌ అయిన తర్వాత సేకరించిన రక్త నమునాలలోని తేడాలను గుర్తించినట్లు తెలిపారు. 

ల్యాండింగ్‌ అయిన మూడు రోజుల తర్వాత ఫ్రీ-ఫ్లోటింగ్ మైటోకాన్డ్రియల్ డీఎన్‌ఏ స్థాయిలు పెరిగినట్లు గుర్తించారు. ఇది స్పేస్‌ ప్రయాణానికి ముందు కంటే 355 రెట్లు ఎక్కువని అన్నారు. అందువల్ల డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ అనేది ప్రమాదకరమని చెప్పారు వైద్యులు. దీనిపై మరింతగా పరిశోధనలు చేస్తే మిషన్‌ వెళ్లే ముందు, తదనంతరం ఎదురయ్యే ఒత్తిడి, వాపుల నుంచి వ్యోమగాములను రక్షించగలమా..? లేదా? అనేది తెలుస్తుంది. 

(చదవండి: కంగారు కేర్ గురించి విన్నారా..? తల్లులు తప్పక తెలుసుకోవాల్సింది..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement