
'నా ప్రేమ ఎప్పుడూ ఇండియాపైనే..'
న్యూయార్క్: తనకు భారతీయ చిన్నారులే ప్రేరణ అని భారత సంతతి వ్యోమగామి సునితా విలియమ్స్ అన్నారు. భారతీయ చిన్నారులో ఎంతో మేధస్సును కలిగి ఉంటారని ఆమె చెప్పారు.
ఆమె తదుపరి మిషన్ గురించి వివరించిన సందర్బంగా ఈ మాటలు చెప్పారు. ప్రతి ఒక్కరు తమపై విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఎవరు తమను తక్కువ అంచనా వేసుకోవద్దని చెప్పారు. తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని, తన ప్రేమ ఎప్పటికీ భారత్పైనే ఉంటుందని ఆమె అన్నారు.