
పరవశించిన పాలమూరు
స్టేషన్ మహబూబ్‌నగర్: శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం పాలమూరు పట్టణంలోని పలు ఆలయాల్లో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆయా ఆలయాల్లో కల్యాణ ఘట్టాలతో పాలమూరు పరవశించిపోయింది. అర్చకులు, వేదపండితులు సీతారాముల వివాహ ఘట్టాలను కళ్లకు కట్టినట్లు వర్ణిస్తూ కల్యాణతంతు జరిపించగా భక్తులు ఆధ్యాత్మిక భావనలో మునిగి తేలారు. ప్రధానంగా జిల్లాకేంద్రం టీచర్స్‌కాలనీలోని రామాలయం, బీకేరెడ్డి (శేషాద్రినగర్)లోగల శివాంజనేయస్వామి, లక్ష్మీనగర్‌కాలనీలోని అభయాంజనేయస్వామి, పంచముఖి ఆంజనేయస్వామి, ద్వారకామాయి షిరిడీసాయి, రాంమందిర్ చౌరస్తా, తూర్పు కమాన్ వద్ద సీతారామాంజనేయస్వామి, సింహగిరి శ్రీలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం జరిపించారు. ఏనుగొండలోని సాగర్‌కాలనీ, టీడీగుట్ట తిరుమలనాథస్వామి, రామాంజనేయాలయం, బాలాజీనగర్, నాగేంద్రనగర్, షాసాబ్‌గుట్ట, న్యూమోతీనగర్ ఆంజనేయస్వామి ఆలయాల్లో, వెంకటేశ్వరకాలనీ హయగ్రీవాలయంలో కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి.
సీతారాముల కల్యాణానికి హాజరైన భక్తులు

పరవశించిన పాలమూరు

పరవశించిన పాలమూరు