
నేడు మార్కెట్‌లో లావాదేవీలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం యథావిధిగా లావాదేవీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. శని, ఆదివారాల్లో సెలవుల కారణంగా మార్కెట్ బంద్ చేశారు. సోమవారం మధ్యాహ్నం మార్కెట్ కార్యాలయంలో ధాన్యం టెండర్లు వేసి ధరలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభం కావడంతో రైతులు పెద్దఎత్తున వరి ధాన్యం అమ్మకానికి తెస్తున్నారు.
రేపు సర్వసభ్య సమావేశం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలోని తమ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎన్జీవోల కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పద్మావతికాలనీ, శ్రీనివాసకాలనీలలో ఉంటున్న గృహ, ప్లాట్ల యజమానులు తప్పక హాజరు కావాలని ఆయన విజ్ఞపి చేశారు.
హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
మహబూబ్‌నగర్ క్రీడలు: ఒడిశా రాష్ట్రంలో మంగళవారం నుంచి శనివారం వరకు జరిగే జాతీయ సబ్ జూనియర్ హ్యాండ్‌బాల్ పోటీలకు జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. సాయి వివేక్, ఎండీ నవాజ్ తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరి ఎంపికపై సంఘం సభ్యులు రజనీకాంత్‌రెడ్డి, ఎండీ జియావుద్దీన్, ఎండీ అహ్మద్ హుస్సేన్, కోచ్ ప్రదీప్‌కుమార్, పీఈటీ ప్రణయ్ హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.
ఆరోగ్యమే.. ఆనందం
● జిల్లాలో పెరుగుతున్న
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
● 35 నుంచి 50 ఏళ్లలోపు వారే అధికం
● జీవన విధానం, ఆహారంలో
మార్పులే కారణం
● నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

నేడు మార్కెట్‌లో లావాదేవీలు

నేడు మార్కెట్‌లో లావాదేవీలు