
వాతావరణం.. చీడపీడలు
అలంపూర్: వ్యవసాయం.. వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా నేల స్వభావం వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. విత్తనం వేసే సమయం నుంచి పంట చేతికి వచ్చే వరకు వాతవరణ ప్రభావం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకాల వర్షాలు విపరీతమైన ఎండలు వర్షాభావ పరిస్థితులు వరదలు, తుఫాన్‌లు రావడం సర్వ సాధరణమైపోయింది. ఇటువంటి విపత్కర పరిణామాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియా నాయక్ రైతులు సూచించారు. వీటిని ముందుగా తెలుసుకోగలిగితే కొంత వరకై నా జాగ్రత్తలు తీసుకొని నష్టాలను తగ్గించే అవకాశం కలుగుతుంది చెబుతున్నారు. వాతవరణాన్ని బట్టి పురుగులు తెగుళ్ల తాకిడిపై ముందస్తు సమాచారం తెలుసుకోని చర్యలు చేపట్టవచ్చు. తుఫాను సమయం మబ్బులు, తేమ వాతవరణం, ఉష్ణోగ్రతలు తగ్గడం వంటివి బూజు తెగుళ్ల ఉధృతికి తోడ్పతాయి. వాతవరణం పొడిగా ఉంటే ఆకుముడత రసం పీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
ఉధృతమయ్యే చీడపీడలు
వాతావరణ పరిస్థితులు
లద్దె పురుగు చురుకవుతుంది
పచ్చ దీపపు పురుగులు వృద్ధి చెందుతాయి
చెరకు, మిర్చి, జొన్న, పత్తిలో రసం పీల్చే పురుగుల్లో ముఖ్యంగా నల్లి
వరిలో కాండం తొలిచే పురుగుల ఉధృతి తగ్గుతుంది.వరి ఈగ ఉధృతి పెరుగుతుంది.
వరిలో కంప నల్లి
.వరిలో పొట్ట కుళ్లు తెగుళ్లు, అగ్గి తెగుళ్లు
ప్యుజేరియం విల్టు, కూరగాయలు, పత్తి మొదలైన పైర్ల మీద
ఆముదంపై కాయ కుళ్లు, బూజు తెగుళ్లు
పత్తిలో తెల్ల దోమ
పత్తిలో కాయకుళ్లు
పగటి ఉష్ణోగ్రత తక్కువ..మేఘావృతమైన ఆకాశం
గాలిలో తేమ అధికంగా ఉండి.. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే
ఎక్కువ కాలం పొడి వాతావరణం ఎక్కువ ఉష్ణోగ్రత
ఎడతెరిపి లేని వర్షాలు పడితే
పూతదశలో వెచ్చని వాతావరణం.. మబ్బులు కమ్మిన ఆకాశం, తరుచు జల్లులు
రాత్రి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువ, గాలిలో తేమ ఎక్కువ,
చల్లగా ఉండటం, మంచు పడటం.
నీటి ఎద్దడి ఎక్కువ కాలం ఉంటే..
వర్షాలు ఎక్కువ పడి గాలిలో తేమ ఎక్కువగా ఉంటే..
సుదీర్ఘమైన బెట్ట, మధ్య మధ్య జల్లులు
వర్షం పడుతున్నప్పుడు, తేమ అధికంగా ఉన్నప్పుడు
పాడి–పంట

వాతావరణం.. చీడపీడలు

వాతావరణం.. చీడపీడలు