అల్లు అర్జున్‌, అట్లీ సినిమాలో క్రేజీ హీరోయిన్‌.. భారీ రెమ్యునరేషన్‌ | Allu Arjun And Atlee Kumar Movie Story Concept And Actress Priyanka Chopra Remuneration Details Inside | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌, అట్లీ సినిమా స్టోరీ కాన్సెప్ట్‌ ఇదే..

Published Fri, Apr 4 2025 7:06 AM | Last Updated on Fri, Apr 4 2025 10:33 AM

Allu Arjun And Atlee Kumar Movie Actress Priyanka Chopra Remuneration

పుష్ప – 2 చిత్రంతో సినిమా హద్దులను చెరిపేసిన అల్లు అర్జున్‌ (Allu Arjun).. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే భారీ కలెక్షన్లతో అనేక రికార్డులను బద్దలు కొట్టేశాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించే తదుపరి చిత్రం మామూలుగా ఉండకూడదు. అది కచ్చితంగా పాన్‌ ఇండియా చిత్రం అయ్యే ఉండాలి. దీంతో నటుడు అల్లు అర్జున్‌ అలాంటి చిత్రం వైపే నడుస్తున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్‌ యువ స్టార్‌ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించనున్నారని తెలుస్తోంది. సన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్‌ చేస్తుంది.

రాజారాణి చిత్రంతో దర్శకుడిగా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అట్లీ. ఆ తర్వాత నటుడు విజయ్‌ హీరోగా వరుసగా మెర్సల్‌, బిగిల్‌, తేరి చిత్రాలు చేసి హ్యాట్రిక్‌ కొట్టారు. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి నటుడు షారుఖ్‌ ఖాన్‌ కథానాయకుడుగా జవాన్‌ చిత్రాన్ని చేశారు. ఇందులో నయనతార, దీపిక పడుకొనే హీరోయిన్స్‌గా నటించారు. అయితే, అల్లు అర్జున్‌తో నటించే హీరోయిన్‌ను కూడా అట్లీ ఫైనల్‌ చేశారట. ఇండియాలోనే కాకుండా హాలీవుడ్‌లో కూడా రాణిస్తున్న ప్రియాంక చోప్రాను హీరోయిన్‌గా తీసుకోవాలని ఆయన ప్లాన్‌ చేశారట. ఈ చిత్రంలో నటించడానికి ఆమె రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేస్తున్నట్లు  సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

ఇందులో నిజం ఎంతో తెలియదు గాని ఆమె గనుక నటిస్తే ఈ చిత్రం వేరే లెవల్‌కు వెళుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అల్లు అర్జున్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కథకు మూలం పునర్జన్మ కాన్సెప్ట్‌ను ఎంపిక చేశారట. భారీ పీరియాడిక్‌ డ్రామా కథతో రానున్నారట. ఇందులో అల్లు అర్జున్‌  రెండు భిన్న గెటప్పుల్లో కనిపిస్తారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఎక్కువగా విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యముందని వైరల్‌ అవుతుంది. ఆగష్టులో ఈ మూవీ షూటింగ్‌ పనులు ప్రారంభం కావచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement