
భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 13న రిలీజైంది విజయ్ 'బీస్ట్' మూవీ. 'కోకోకోకిల', 'వరుణ్ డాక్టర్' వంటి చిత్రాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, అరబిక్ కుతు సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో 'బీస్ట్'పై అంచనాలు ఆకాశాన్నంటాయి.
Audience Review On Vijay Beast Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తన విలక్షణమైన నటనతో అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తుంటాడు. ఆయన ఫ్యాన్స్ అతన్ని ముద్దుగా 'ఇళయదళపతి' అని పిలుచుకుంటారు. సందేశాత్మకంగా, వైవిధ్యంతో ఉన్న భిన్నమైన సినిమాలు చేస్తుంటాడు విజయ్. అందుకే విజయ్‌కు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో సైతం అభిమానులు ఉన్నారు. విజయ్ సినిమా వస్తుందంటే వాళ్లందరికి పండగే.
ఈసారి భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 13న రిలీజైంది విజయ్ 'బీస్ట్' మూవీ. 'కోకోకోకిల', 'వరుణ్ డాక్టర్' వంటి చిత్రాలతో హిట్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, అరబిక్ కుతు సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో 'బీస్ట్'పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇన్ని అంచనాల మధ్య విడుదలైన 'బీస్ట్' వీక్షకులను ఎంతమేరకు మెప్పించిందో 'సాక్షి ఆడియన్స్ పోల్'లో ప్రేక్షకుల రివ్యూ ఏంటో తెలుసుకుందామా !