
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు ఉత్తరాదిలో దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలోనే మన తెలుగు డైరెక్టర్ మన టాలీవుడ్ ఫ్లేవర్ కథతో తీసిన సినిమా ఒకటి తాజాగా థియేటర్లలోకి వచ్చింది. టాక్ పాజిటివ్ వచ్చింది గానీ కలెక్షన్స్ మాత్రం విచిత్రంగా కనిపిస్తున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ తీసిన లేటెస్ట్ హిందీ సినిమా 'జాట్'(Jaat Movie). గోపీచంద్ మలినేని అనే తెలుగు దర్శకుడు తీసిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol)నటించాడు. విలన్ గా రణ్ దీప్ హుడా చేసినప్పటికీ.. చాలామంది తెలుగు ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ)
తెలుగు సినిమా కథతో తీసిన ఈ సినిమాకు తొలిరోజు రూ.11 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. అయితే వీకెండ్ కావడంతో ఏమైనా పెరుగుతాయేమోనని అందరూ అనుకున్నారు. కానీ మూడు రోజుల్లో(Day 3 Collection) కేవలం రూ.32.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.
ఉత్తరాదిలో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు రూ.32 కోట్ల అంటే చాలా నామమాత్రమే అని చెప్పొచ్చు. ఇలా అయితే రూ.100 కోట్ల మార్క్ చేరెదెప్పుడో? లాభాల్లోకి వచ్చేదెప్పుడో చూడాలి?
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే చెట్టాపట్టాల్.. ప్రియురాలితో స్టార్ హీరో)
