
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఇటీవలే ఈ మూవీ టీజర్ విడుదల చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్–ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్, వైజయంతి పాత్రలో విజయశాంతి నటిస్తున్నారు.
ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. నాయాల్ది అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రఘు రామ్ లిరిక్స్ అందించగా.. నకాష్ అజీజ్, సోనీ కొమండూరి ఆలపించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ ఫేమ్ పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.