
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హృదయపూర్వం. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇందులో మాళవికా మోహనన్ (Malavika Mohanan) కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఆమె సెట్లో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మోహన్‌లాల్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో కూడా ఉంది. హృదయపూర్వం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది.
కుటుంబంలా..
ఒక సినిమా కంప్లీట్ చేసుకుని మరో సినిమా చేస్తున్నప్పుడు కొత్తగా ఫ్రెండ్స్ అవుతారు. లేదంటే మంచి సహనటుల్లా ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రమే అంతా ఒకే కుటుంబంలా అనిపిస్తుంది. ఈ సినిమా సెట్లో నాకు అలాగే అనిపించింది. నాకెంత సంతోషంగా ఉందో! మోహన్‌లాల్ సర్, సత్యన్ సర్ నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఇలాంటి గొప్పవారితో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన ఓ వ్యక్తి వీరిని తప్పుపడుతూ కామెంట్ చేశాడు.
వయసుతో పని లేదా? ఇదేంటి?
65 ఏళ్ల ముసలాయన.. 30 ఏళ్ల అమ్మాయితో ప్రేమాయణం.. ఈ ముసలి హీరోలు వారి వయసుకు సంబంధం లేని పాత్రల్ని పోషించేందుకు ఎందుకంత ఆసక్తి చూపిస్తారో అర్థం కాదు అని రాసుకొచ్చాడు. దీనికి మాళవిక స్పందిస్తూ.. సినిమాలో అతడు నన్ను ప్రేమిస్తాడని నీకెవరు చెప్పారు? నీకు నువ్వే కథలు అల్లేసుకుని ఏది పడితే అది మాట్లాడకు. నువ్వేదో ఊహించుకుని అవతలివారిని నిందించకు అని ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఈ కామెంట్స్‌ను తర్వాత డిలీట్ చేసినట్లు తెలుస్తోంది.
సినిమా
హృదయపూర్వం సినిమా విషయానికి వస్తే.. సత్యన్ అంతికాండ్ దర్శకత్వం వహించగా ఆంటోని పెరుంబవుర్ నిర్మిస్తున్నారు. గతేడాది తంగలాన్, యుద్ర సినిమాలతో అలరించిన మాళవిక ప్రస్తుతం ద రాజా సాబ్, సర్దార్ 2 చిత్రాల్లో నటిస్తోంది.