'దేవర' రన్‌ టైమ్‌.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన రవి బస్రూర్‌ | Ravi Basrur Gift To Jr NTR In Devara Movie Run Time | Sakshi
Sakshi News home page

'దేవర' రన్‌ టైమ్‌.. ఎన్టీఆర్‌కు గిఫ్ట్‌ ఇచ్చిన రవి బస్రూర్‌

Published Thu, Sep 12 2024 7:21 AM | Last Updated on Thu, Sep 12 2024 9:14 AM

Ravi Basrur Gift To Jr NTR In Devara Movie Run Time

ఎన్టీఆర్‌ (NTR)పై అభిమానాన్ని చాటుకున్నారు సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ (Ravi Basrur). ‘వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం’ అంటూ ఎన్టీఆర్‌పై ప్రత్యేక పాటను రూపొందించారు. కుటుంబంతో కలిసి ఎన్టీఆర్‌ ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నటుడు రిషబ్‌ శెట్టి, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కలిసి రవి బస్రూర్‌ స్టూడియోను సందర్శించారు. తన స్టూడియోకు ఎన్టీఆర్‌ వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేసిన రవి తనదైన శైలి సాంగ్‌ను కానుకగా ఇచ్చారు. ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌- రవి కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుంది. 'వీడు మాకే సొంతం.. వీడు మాకే మొత్తం' అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంది. అలా తారక్‌పై తనకున్న అభిమానాన్ని రవి బస్రూర్‌  చాటుకున్నాడు.

 ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లో సోనియా ఏడుపు.. హగ్గులతో ఓదార్పు
 

ఎన్టీఆర్‌-నీల్‌ సినిమాకు రవి బస్రూర్‌
ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా రవి బస్రూర్‌ అని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు కూడా..  పాన్‌ ఇండియా రేంజ్‌లో  మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న  ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేవర రన్‌టైమ్‌
'జనతా గ్యారేజ్‌' తర్వాత ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో విడుదల కానున్న సినిమా దేవర. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు భారీగా రెస్పాన్స్‌ వస్తుంది. సప్టెంబర్‌ 27న విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేవర సెన్సార్‌ పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసింది. దేవర్‌ రన్‌టైమ్‌ 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లుగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement