
ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన సంజనా గల్రానీ.. తెలుగులో మరికొన్ని మూవీస్ కూడా చేసింది. కాకపోతే అనుకున్నంత పేరు రాలేదు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ కేసులోనూ ఈమె పేరు వినిపించింది కానీ ప్రస్తుతానికి అంతా సైలెంట్. ఇకపోతే నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈమెకు ఇదివరకే ఓ కొడుకు ఉండగా.. ఇప్పుడు మరోసారి తల్లి కాబోతుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ క్రేజీ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
తాజాగా ఉగాది సందర్భంగా సంప్రదాయ చీరకట్టులో బేబీ బంప్ కనిపించేలా ఉన్న వీడియోస్, ఫొటోలని సంజన.. తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. కొడుకుతో కలిసి ఈ ఫొటోషూట్ లో పాల్గొంది. దీంతో ఈమెకు నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.
2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న ఈమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, తమిళ చిత్రాల్లో నటించి ఓ మాదిరి గుర్తింపు తెచ్చుకుంది. 2021లో అజీజ్ పాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఒకటి అరా సినిమాలు చేస్తోంది.
(ఇదీ చదవండి: ఆ హీరో ఫ్యామిలీ గొడవలతో సంబంధం లేదు: దివ్య భారతి)