
‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన యువతేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించిన ఈ జాబ్‌మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో నల్లగొండ ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
రూ.40వేల వేతనంతో
ఉద్యోగం వచ్చింది
మాది నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామం. మాది వ్యవసాయం కుటుంబం. మా అమ్మనాన్న కష్టపడి వ్యవసాయం చేసి నన్ను చదివించారు. ప్రస్తుతం జీఎన్‌ఎం(నర్సింగ్ కోర్సు) ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు హాజరయ్యాను. నెలకు రూ.40వేల వేతనంలో హోమ్‌కేర్ హాస్పిటల్‌లో జాబ్ వచ్చింది. – కందుకూరి సోని,
వెలుగుపల్లి, నల్లగొండ మండలం
పోలీసు శాఖకు ధన్యవాదాలు
నేను 2013లో బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేశాను. మా నాన్న ప్రైవేట్ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తారు. ఈ జాబ్‌మేళా గురించి తెలుసుకుని హాజరయ్యాను. పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరై కాగా.. రూ.45 వేల వేతనంతో పీహెచ్‌సీ సొసైటీ హోమ్‌కేర్ సర్వీస్‌లో జాబ్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు.
– ఉప్పుల ఉదశ్రీ, నల్లగొండ
జాబ్ చేస్తూ చదువుకుంటా
ఇటీవల ఇంటర్ పూర్తి చేశాను. జాబ్‌మేళాలో ప్రైవేట్ కంపెనీలో రూ.16 వేల వేతనంతో జాబ్ వచ్చింది. ఈ జాబ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని ఉన్నత చదువులు చదివి ఇంకా మంచి ఉద్యోగం సంపాదిస్తాను.
– నారగోని శివాని, చిన్న సూరారం
ఉద్యోగ కల నెరవేరింది
డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్‌మేళా అవకాశాన్ని చూపింది. నెలకు రూ.14వేలు జీతంతో ప్రైవేట్ కార్ షోరూం నందు జాబ్ లభించింది. నా ఉద్యోగ కల నెరవేరింది.
– ఆర్. మోహన్, నల్లగొండ
భారీగా హాజరైన నిరుద్యోగులు

‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన

‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన

‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన

‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన

‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన

‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన