Nalgonda District News
-
జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు
పెద్దవూర: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించటంతో జిల్లా వ్యాప్తంగా ఆయిల్ పామ్ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. మండుతున్న ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకుంటే పంట ఎదుగుదల, దిగుబడిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వేసిన, ఎదిగిన పంట పెరుగుదలను కాపాడుకుంటూ, పంట పరిస్థితిని బట్టి రైతులు అధికారుల సూచనలు, సలహాలు పాటించి సాగు చేపట్టాలని, తద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని పేర్కొన్నారు. ● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుమును, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన తరువాత చిన్న, చిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్ (30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి. ● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్‌కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉంటే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో వేసవిలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి. ● మూడేళ్ల లోపు వయస్సు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాదనంతో(రెండుసార్లు) తొలగించాలి. ● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను తొలగించాలి. ● ఆయిల్‌పామ్ తోటల్లో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసిన తరువాత నరికి ముక్కలు చేసిన ఆయిల్‌పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్‌పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్గా పరచాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తిని ఉపయోగించి కోయాలి. ఆయిల్‌పామ్ సాగులో పాటించాల్సిన మెళకువలపై ఉద్యానవన అధికారి సూచనలు ఎదిగిన ఆయిల్‌పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పోటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌ను, ఒక కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వల్ల సమయం, ఎరువులపై ఖర్చు కూడా ఆదా చేయొచ్చు. ఆయిల్‌పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపిస్తే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కోసం పంపాలి. -
పడిపోతున్న నిమ్మ ధర
నకిరేకల్: వేసవిలో నిమ్మకాయలకు మంచి ధర వస్తుందనుకున్న రైతులు సరైన ధర లేక దిగాలు చెందుతున్నారు. పది రోజుల క్రితం పండు నిమ్మకాయలు బస్తాకు రూ.1800, పెద్ద సైజు కాయలు బస్తాకు రూ.2200, చిన్న సైజు కాయలు బస్తాకు రూ.1200 ధర లభించింది. గత రెండు, మూడు రోజుల నుంచి ఈ ధరలు సగానికి సగం పడిపోతున్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్లో ప్రస్తుతం పండు కాయ బస్తా ధర రూ.1000 నుంచి రూ.1300, పెద్ద సైజు కాయ బస్తాకు రూ.1200 ధర పలుకుతోంది. చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వస్తుంది. నిమ్మ ఎగుమతయ్యే ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో అక్కడ నిమ్మ కొనుగోళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రేటు ఉందని చెట్ల మీద చిన్న, పెద్ద అనే తేడా లేకుండా రైతులు కాయలను కోయడంతో దిగుబడులు పెరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మ అధికంగా దిగుబడి రావడంతో ఢిల్లీ, గుజరాత్ వంటి నగరాల్లో ధర పెరగడం లేదని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. రోజుకు ఏడు వేల బస్తాల రాక..ఉమ్మడి జిల్లాలో సూమారు 30వేల ఎకరాలకు పైగానే నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20వేల రైతు కుటుంబాలు, కౌలుదారుల కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఏకై క నిమ్మ మార్కెట్‌ను 2018 జూన్ 17న నకిరేకల్‌లో ప్రారంభించడంతో ఈ ప్రాంతంలో అత్యధిక విస్తీర్ణంలో నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోనే ఏటా మూడు లక్షల టన్నులకు పైనే నిమ్మ దిగుబడి వస్తోంది. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు గత 15రోజుల వరకు ప్రతిరోజు 2వేల నుంచి 3వేల వరకు నిమ్మకాయల బస్తాలు రాగా.. తాజాగా వారం రోజుల నుంచి రోజుకు 6వేల నుంచి 7వేల బస్తాలు వస్తున్నాయి. ఈ నిమ్మ మార్కెట్ నుంచి డీసీఎంలలో హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి అవుతున్నాయి. నిమ్మ దిగుబడులు పెరగడంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా నిమ్మకాయలు అధికంగా రావడంతోనే ధరలు పడిపోయాయని మార్కెటింగ్ నిపుణులు అంటున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపి మంచి ధర వచ్చేలా చూడాలని నిమ్మ రైతులు కోరుతున్నారు. వేసవిలో లభించని ఆశించిన రేటు దిగుబడి పెరగడంతో ధర లేదంటున్న మార్కెట్ అధికారులు -
నిర్దిష్టమైన ధర నిర్ణయించాలి
నేను మూడెకరాల్లో నిమ్మ సాగు చేశాను. 250 చెట్లు ఉన్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు 13 బస్తాల నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఒక్కో చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వచ్చింది. పండు కాయలకు బస్తాకు రూ.1300, పెద్ద సైజు కాయలకు రూ.1200 మించి ధర రావడం లేదు. పది రోజుల క్రితం మార్కెట్‌కు వస్తే రోజుకు రూ.30 వేలు వచ్చేవి. నేడు రూ.10వేలకు మించి రావడం లేదు. ధర సగానికి సగం పడిపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి. నిమ్మ దీర్ఘకాలిక పంట అయినందున ప్రభుత్వం బస్తాకు ఒక నిర్దిష్టమైన ధర నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి. – అన్నెబోయిన సురేందర్, బండమీదిగూడెం, శాలిగౌరారం మండలం -
పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా వర్రె వెంకటేశ్వర్లు
మోత్కూర్: స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యుడిగా మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామానికి చెందిన వర్రె వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి శివశంకర్‌రావును నియమించగా.. ముగ్గురు సభ్యులలో ఒకరిగా వర్రె వెంకటేశ్వర్లును నియమితులయ్యారు. వర్రె వెంకటేశ్వర్లు ఉమ్మడి రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్‌గా పనిచేశారు. ఆయన నియామకం పట్ల మోత్కూరు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. భూమి చదును చేస్తుండగా బయల్పడిన శివలింగం చివ్వెంల(సూర్యాపేట): చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రణబోతు బాజీరెడ్డి ఆదివారం తన వ్యవసాయ భూమిని చదును చేస్తుండగా శివలింగంతో పాటు నాగప్రతిమ బయల్పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని శివలింగాన్ని తిలకించారు. కాగా ఈ స్థలంలో గతంలో గుడి ఉండేదని గ్రామస్తులు తెలిపారు. అటవీ భూమిలో అగ్ని ప్రమాదంఅడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి గ్రామ సమీపంలో గల బౌద్ధమ దేవాలయాలకు వెళ్లే ప్రధాన రహదారి వెంట సర్వే నంబర్ 435లో గల అటవీ భూమిలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసిపడటంతో సుమారు 5 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యింది. పంట పొలాలకు వెళ్లి వస్తున్న కూలీలు గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఆలస్యమైతే అటవీ భూమి సమీపంలో గల పంటలను మంటలు చుట్టుముట్టేవని స్థానికులు పేర్కొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత మాడ్గులపల్లి: మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్ఐ కృష్ణయ్య తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కురియాతండాకు చెందిన ధనావత్ శ్రీనునాయక్ మాడ్గులపల్లి మండలం గజలాపురం గ్రామంలో రేషన్ లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అదే గ్రామంలో గుండెపురి భిక్షం ఇంట్లో నిల్వ చేశాడు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి ఏఎస్ఐ జాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన
నకిరేకల్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి మంచి పాలన అందిస్తున్నారని, ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు జీఓను విడుదల చేయడంపై హర్షిస్తూ నకిరేకల్‌లో ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో సోమవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డ్రోన్ సహాయంతో నకిరేకల్ మెయిన్ సెంటర్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేయించారు. అనంతరం సాయి మందిరం సమీపంలో స్టేడియంకు వెళ్లే దారిలో మహనీయుల విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం జీవితాంతం పరితపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు లింగాల వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్, పూజర్ల శంభయ్య, మేనిఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నకిరేకంటి ఏసుపాదం, బత్తుల ఉశయ్యగౌడ్, పెద్ది సుక్కయ్య, కంపసాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం -
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
సంస్థాన్ నారాయణపురం: విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని, ఒక లక్ష్యంతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సర్వేల్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థి బుర్రా వెంకటేశం అన్నారు. సర్వేల్ గురుకుల పాఠశాలలో 1983–84లో పదో తరగతి చదివిన ఆయన ఆదివారం పాఠశాలను సందర్శించారు. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించారు. నూతనంగా 5వ తరగతి అడ్మిషన్ పొందిన విద్యార్థితో ముచ్చటించారు. భవిష్యత్‌లో కలెక్టర్ అవుతానని సదరు విద్యార్థి చెప్పడంతో అభినందించారు. తాను ఈ పాఠశాలలో అడిష్మన్ కోసం తన అమ్మతో కలిసి వచ్చానని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంతకముందు పాఠశాలలో బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఇతర మహానీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు అమీర్ ఉల్లాఖాన్, పాల్వాయి రజిని, రామ్మోహన్రావు, గురుకుల విద్యాలయ సంస్థ కార్యదర్శి రమణకుమార్, డిప్యూటీ కార్యదర్శి ప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ సతీష్‌కుమార్ తదితరులున్నారు. అంతకుముందు మల్లారెడ్డిగూడెం గ్రామంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు నర్రి యాదయ్య ఇంట్లో జరిగిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం -
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
మునుగోడు: భర్త గుండెపోటుతో మృతిచెందడం తట్టుకోలేక ఒక్క రోజు వ్యవధిలోనే భార్య కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన నల్ల గొండ జిల్లా మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల గ్రామానికి చెందిన దుబ్బ శంకరయ్య(65), దుబ్బ లక్ష్మమ్మ(61) భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. శంకరయ్య మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శంకరయ్య ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆదివారం శంకరయ్యకు గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు సోమవారం శంకరయ్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. భర్త మృతిని తట్టుకోలేక ఆయన మృతదేహంపై పడి బోరున విలపించినా లక్ష్మమ్మ కూడా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెకు హైదరబాద్‌కు తరలించారు. అక్కడకి వెళ్లేసరికి ఆమె కూడా మృతిచెందింది. అన్యోన్యంగ జీవించిన భార్యాభర్తలు ఒక్క రోజు వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దంపతుల అంత్యక్రియలు సోమవారం పలివెల గ్రామంలో ఒకేసారి నిర్వహించారు. ఒక్కరోజు వ్యవధిలో గుండెపోటుతో ఇరువురు మృతి -
విద్యార్థులపై ప్రభుత్వానిది సవతి తల్లి ప్రేమ
యాదగిరిగుట్ట: విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కనబరుస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో సోమవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు, యువతకు కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని విమర్శించారు. పేద విద్యార్థులకు రూ.5లక్షల రుణాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కేబినెట్లో ఆ విషయాన్ని ప్రసావించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి విద్యార్థుల హక్కులు సాధించేలా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువతది కీలకపాత్ర అన్నారు. 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ఒగ్గు శివకుమార్, జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్‌రెడ్డి, ఆలేరు నియోజకవర్గ కన్వీనర్ ర్యాకల రమేష్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రాసాల ఐలేష్‌యాదవ్, కొంపల్లి నరేష్, పల్లె సంతోష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ -
కొత్తపేట గ్రామంలో విషాదఛాయలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపేట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం.. కొత్తపేట గ్రామానికి చెందిన అప్పల కొండయ్య కుమారుడు ఆదిత్య(27), ఊర ముత్తయ్య కుమారుడు ప్రవీణ్(25) చిన్ననాటి నుంచి స్నేహితులు. వీరిద్దరు ఆదివారం రాత్రి కొత్తపేట నుంచి బైక్‌పై సూర్యాపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో చీకటిగూడెం గ్రామ స్టేజీ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ హైవేపై ఉన్న జంక్షన్ వద్ద సూర్యాపేట వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటున్న లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుపుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివతేజ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం సోమవారం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ వేర్వేరుగా సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృతి -
ప్రమాదవశాత్తు ఆయిల్ పామ్ తోట దగ్ధం
గుర్రంపోడు: మండలంలోని చామలేడు గ్రామానికి చెందిన కొండ పెద్దులు ఆయిల్ పామ్ తోట ఆదివారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఉపాధిహామీ కూలీలు తన ఆయిల్ పామ్ తోట వెంట కాల్వలో కంపచెట్లు తొలగించి నిప్పు పెట్టి వెళ్లడంతో ఆ మంటలు తన తోటకు అంటుకొని చెట్లు దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు. మొత్తం మూడెకరాల తోటలో దాదాపు రెండెకరాలలో కాపు కొచ్చే దశలో ఉన్న ఆయిల్ పామ్ చెట్లు, డ్రిప్పు పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. ఫీల్డ్ అసిస్టెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపారు. చౌల్లరామారంలో.. అడ్డగూడూరు: అడ్డగూడూరు మండలం చౌల్లరామారం గ్రామంలోని సౌట కుంటలో సోమవారం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌట కుంటలో ఇటీవల ఉపాధి హామీ పనుల్లో భాగంగా కూలీలు తొలగించిన కంప చెట్లకు సోమవారం నిప్పు పెట్టడంతో పెద్దఎత్తున మంటలు ఎగిసి పక్కనే ఉన్న వరి పొలాల వైపు వ్యాపించాయి. స్థానిక రైతులు గమనించి మోత్కూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. -
ఆరేళ్లు.. 43,314 డెలివరీలు
మెరుగైన వైద్యం అందుతుంది ప్రభుత్వ ఆస్పత్రుల మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోంది. పీహెచ్సీ స్థాయిలోనే గర్భిణుల నమోదు చేసి వారిని రెగ్యులర్‌గా చెకప్‌కు తీసుకుపోతున్నారు. డెలివరీ అయ్యేంత వరకు ఆశ వర్కర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు గణనీయంగా పెరుగుతున్నాయి. – డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీఎంహెచ్ఓ, నల్లగొండనల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రికార్డుస్థాయిలో ప్రసవాలు నల్లగొండ టౌన్ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో ప్రభుత్వ ఆస్పత్రుల వైపు వచ్చేందుకు జంకే మహిళలు ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రల్లో డెలివరీలు చేయించుకోవడానికి క్యూ కడుతున్నారు. నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో రికార్డు స్థాయిలో డెలివరీలు జరుతున్నాయి. ఆరేళ్లుగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మొత్తం 71,737 డెలివరీలు జరగ్గా.. ఒక్క ఎంసీహెచ్‌లోనే 43,314 ప్రసవాలు జరిగాయి. మిగిలిన అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31,829 డెలివరీలు మాత్రమే జరిగాయి. మెరుగైన వసతులు నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటుగా ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఆస్పత్రి ఉండడంతో నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్నారు. దాంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ క్లిట్లను అందించి ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను తల్లి బ్యాంక్ ఖాతాలో జమచేసింది. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చే సమయంలో, డెలివరీ తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమయంతో ప్రభుత్వ వాహనంలో వారిని ఇంటికి చేర్చుతున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య పెరిగింది. నమోదు నుంచి ప్రసవం వరకు పర్యవేక్షణ గర్భం దాల్చిన మూడవ నెలలోనే ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు వారి ఇంటి వద్దనే గర్భిణుల పేర్లను ప్రత్యేక ఫొర్టల్లో నమోదు చేస్తున్నారు. ఆ తరువాత ప్రతి చెకప్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకెళ్లడంతోపాటు టీకాలు కూడా సరైన సమయంలో వేయిస్తున్నారు. డెలివరీల కోసం పీహెచ్‌సీలకు, ఏరియా ఆస్పత్రులకు తీసుకుపోతున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే వెంటనే అక్కడి వైద్యులు జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారు. ఆ సమయంలో గర్భిణి పరిస్థితి, ఆమెకు అందాల్సిన వైద్యం వివరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ యాప్‌లో డాక్టర్లు అప్లోడ్ చేస్తున్నారు. జీజీహెచ్‌లో ఉండే వైద్యులు గర్భిణి ఆస్పత్రికి చేరేలోపు అప్రమత్తమై ఆమెకు అందిచాల్సిన చికిత్సకు సిద్ధంగా ఉండి డెలివరీ చేస్తున్నారు. ఇక్కడ కూడా డెలివరీ కాని పరిస్థితి ఉంటే వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ తదితర ఆస్పత్రులకు రెఫర్ చేసి ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎంసీహెచ్ యాప్‌లో ఆప్‌లోడ్ చేస్తున్నారు. దీంతో అక్కడి ఎంసీహెచ్ నోడల్ అధికారి వైద్యులను అప్రమత్తం చేసి సకాలంలో వైద్య అందించి డెలివరీలు చేస్తున్నారు. దీంతో మాతాశిశు మరణాలు తగ్గుతున్నాయి. ఇలా అంతా సవ్యంగా సాగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేయించుకోవడానికి గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. ఎంసీహెచ్‌లో డెలివరీలు ఇలా.. సంవత్సరం ప్రసవాలు 2019–20 7,190 2020–21 7,4843. 2021–22 7,546 2022–23 7,639 2023–24 7,140 2024–25 6,315 మొత్తం 43,314 -
రైతును ముంచిన వడగండ్ల వాన
శాలిగౌరారం మండలంలో 1190 ఎకరాల్లో.. శాలిగౌరారం : అకాల వర్షానికి శాలిగౌరారం మండల వ్యాప్తంగా 1190 ఎకరాలోల పంటలు, 23 ఇళ్లు దెబ్బతిన్నట్లు తహసీల్దార్ యాదగిరి, ఏఓ సౌమ్య శృతి తెలిపారు. వరి 900 ఎకరాలు, మొక్కజొన్న 30 ఎకరాలు, నిమ్మతోటలు 260 ఎకరాల్ల దెబ్బతిన్నట్లు గుర్తించారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు, ధ్కంసమైన ఇళ్లను తహసీల్దార్ యాదగిరి సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఫ 200 ఎకరాల్లో దెబ్బతిన్న తోటలు ఫ విరిగిపోయిన మామిడి, నిమ్మ చెట్లునకిరేకల్ : ఈదురుగాలులు, వడగండ్ల వర్షం రైతులను నిండా ముంచాయి. గతంలో ఎన్నడూ లేనవిధంగా వీచిన గాలులతో మామిడి, నిమ్మ చెట్ల నేల కూలాయి. వడగండ్ల దాటికి కోతకొచ్చిన వరిచేలు దెబ్బతిన్నాయి. నకిరేకల్ మండలంలో ఆదివారం సాయంత్ర ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో సుమారు 210 ఎకరాల్లో పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. మండలంలోని ఓగోడు, పాలెం, టేకులగూడెం, నడిగూడెం, వల్లాబాపురం, నోముల, కడపర్తి గ్రామాల్లో నిమ్మ, మామిడి తోటలు దెబ్బతిన్నాయి. దాదాపు 100 మంది రైతుల తోటలు దెబ్బతిన్నట్లు ఉద్యానవన అదికారులు నిర్ధారించారు. సోమవారం నకిరేకల్ ఉద్యానవన క్లస్టర్ అధికారి ప్రవీణ్ ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న తోటలను సందర్శించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించారు. 200 నిమ్మ చెట్లు విరిగిపోయాయి నేను 25 ఏళ్ల నుంచి నిమ్మ తోట సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఈదురుగాలుల దాటికి 200 నిమ్మ చెట్లు పూర్తిగా విరిగిపోయాయి. తోటలోనే ఉన్న నా ఇంటి పైకప్పు రేకులు కూడా లేయిపోయాయి. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. నిమ్మ తోటే మాకు బతుకుదెరువు.. ప్రభుత్వమే మాకు సాయం చేసి ఆదుకోవాలి. – జక్కు వెంకట్‌రెడ్డి, రైతు టేకులగూడెం నష్టం అంచనా వేస్తున్నాం నకిరేకల్ మండలంలో సూమారు 200 ఎకరాల్లో పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నిమ్మకాయలకు మంచి గిరాకీ ఉన్న సమయంలోనే నష్టం వాటిల్లింది. పంట నష్టం వివరాలు సేకరిస్తున్నాం. నివేదికను ప్రభుత్వానికి పంపిస్తాం. – ప్రవీణ్‌కుమార్, ఉద్యాన అధికారి, నకిరేకల్ ● -
రాజ్యాంగం వల్లే.. హక్కులు, పదవులు
నల్లగొండలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళుర్పిస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ సత్యం, ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనప కలెక్టర్ శ్రీనివాస్ తదితరులునల్లగొండ టౌన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సమాజంలో ప్రతి ఒక్కరు హక్కులు, బాధ్యతలు, పదవులను పొందగలుగుతున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా సోమవారం నల్లగొండలోని మర్రిగూడ బైపాస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డీఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ డ్రాప్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా అంబేడ్కర్ పొందు పరిచిన ఆర్టికల్స్ వల్లే తాను ఐఏఎస్ కాగలిగానని చెప్పారు. భవిష్యత్‌లో ఐఏఎస్, ఐపీఎస్ కావాలనుకునే వారికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే స్ఫూర్తి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను ఈ నెల 14 నుంచే అమల్లోకి తీసుకురానుందని ఇది చరిత్రలో నిలిచిపోనుందన్నారు. ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్‌నాయక్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం భారత రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ చదువును ఆయుధంగా తీసుకుని సామాజిక మార్పును తీసుకొచ్చిన మహానుబావుడు అంబేడ్కర్ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, అదనపు ఎస్పీ రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఇన్చార్జి డీడీ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, ఆయా సంఘాల నేతలు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ, దుడుకు లక్ష్మీనారాయణ, నకిరెకంటి కాశయ్యగౌడ్, బొర్ర సుధాకర్, పాలడుగు నాగార్జున, కత్తుల జగన్‌కుమార్, గోలి ఏడుకొండలు, కత్తుల షన్ముఖకుమార్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, నూనె వెంకటస్వామి, బకరం శ్రీనివాస్, బాషపాక హరికృష్ణ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
పెండింగ్ బిల్లు వచ్చే వరకు.. ట్రాక్టర్ ఇవ్వ
చందంపేట : సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఏడాదిన్నర కావొస్తోంది. వారి పదవీకాలం ముగిసిన తర్వాత నిబంధనల మేరకు వారి ఆధీనంలో ఉన్న ట్రాక్టర్లను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించాలి. కానీ చందంపేట మండలంలోని బుడ్డోనితండా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ముడావత్ బాలునాయక్ ఆరు నెలలుగా గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను తన వద్దే ఉంచుకుంటున్నాడు. పంచాయతీ కార్యదర్శి వెళ్లి ట్రాక్టర్ గురించి అడిగితే.. పంచాయతీలో తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. అవి వచ్చే వరకు ట్రాక్టర్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. బకాయి బిల్లులు వచ్చాక ట్రాక్టర్ ఇస్తానని అన్నాడు. ఇక, తన ఆధీనంలో ఉన్న ట్రాక్టర్ పరికరాలను సైతం మార్చాడని తెలిసింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి యాదగిరిని వివరణ కోరగా.. పెండింగ్ బిల్లు రానిదే.. ట్రాక్టర్ ఇవ్వను అంటున్నాడని చెప్పారు. -
రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లా వ్యాప్తంగా 41,157 మంది నేరుగా దరఖాస్తు చేసుకున్నారు. సుమారు 60 వేల మందికిపైగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు సోమవారంతో ముగిసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ యువత స్వయం ఉపాధి పొందేలా వారికి ఆర్థిక చేయూత అందించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం మొదట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఈ నెల 4వ తేదీ చివరి గడువుగా పేర్కొంది. తర్వాత దరఖాస్తు గడువను 14వ తేదీ వరకు పొడిగించి గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణ వాసులు మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. ఆయా చోట్ల ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అక్కడే దరఖాస్తు పారాలు అందుబాటులో ఉంచింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు కూడా హార్డ్ కాపీని ఆయా కార్యాలయాల్లో అందజేయాలని సూచించింది. గడువు ముగిసే నాటికి 41,157 మంది నేరుగా దరఖాస్తు చేసుకోగా, ఆన్లైన్లో 60 వేల పైచిలుకే దరఖాస్తులు వచ్చాయి. వాటి పూర్తి వివరాలు ఇంకా తేలలేదు.ఫ నేరుగా 41,157 మంది.. ఆన్లైన్లో 60వేలకు పైగా.. ఫ ముగిసిన దరఖాస్తుల గడువుఆయా కార్పొరేషన్ల వారీగా వచ్చిన ఆఫ్‌లైన్ దరఖాస్తులు..కార్పొరేషన్ దరఖాస్తులుఎస్సీ 11,375 ఎస్టీ 5,698 బీసీ 20,915 ఈబీసీ 800 మైనార్టీ 2,173 క్రిస్టియన్ 96 -
భూ భారతికి శ్రీకారం
భూ సమస్యలు ఇక చకచకా పరిష్కారంసాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఽభూమిపై హక్కుల విషయంలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఇక క్షేత్ర స్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతిని తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌ను డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి విధివిధానాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి జిల్లా నుంచి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, తహసీల్దార్లు హజరయ్యారు. ధరణి స్థానంలో ఇకపై భూ భారతి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో రెవెన్యూ చట్టాన్ని తెచ్చి, ఆ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ధరణిని ప్రారంభించింది. దాంతో రైతులకు ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా.. కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ధరణిలో అన్ని ఆప్షన్లు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్) చట్టం చేసింది. అయితే దానిని వెంటనే అమలు చేయలేదు. ధరణిలో ఎలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? అనే అంశాలను ముందుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అక్కడ గుర్తించిన సమస్యల ఆధారంగా.. వాటి పరిష్కారాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం–2025 అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే భూ భారతి పోర్టల్‌ను ప్రారంభించింది. మొదట రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లోని నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనుంది. ఆ తరువాత జూన్ నుంచి అన్ని మండలాల్లో అమలు చేయనుంది. అంతకంటే ముందుగా జిల్లాలో ప్రతి రోజు రెండు మండలాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సమావేశాలకు కలెక్టర్ ఇలా త్రిపాఠి హాజరుకానున్నారు. ఈ చట్టంలో క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లకు, ఆర్డీఓలకు కూడా అధికారాలు లభించనున్నాయి. ఫ భూ భారతి పోర్టల్‌ను లాంచనంగా ప్రారంభించిన సీఎం ఫ జూన్ నుంచి అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో అమలు ఫ మళ్లీ తహసీల్దార్, ఆర్డీఓలకు అధికారాలు ఫ భూ భారతి ప్రారంభంలో జిల్లా నుంచి పాల్గొన్న కలెక్టర్, అధికారులు -
ముగిసిన మహనీయుల జయంతి ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న మహనీయుల జయంతి ఉత్సవాలు సోమవారం ముగిశాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఆచార్య ఇటికాల పురుషోత్తం, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, ఢిల్లీ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమలి హాజరై విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో 57 మంది విద్యార్థులు, అధ్యాపకులు రక్తదానం చేశారు. కార్యక్రమంలో అడప సత్యనారాయణ, వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, అల్వాల రవి, అరుణప్రియ, కొప్పుల అంజిరెడ్డి, శ్రీదేవి, ప్రేమ్‌సాగర్, సుధారాణి, వసంత, రేఖ, సరిత, కళ్యాణి, దోమల రమేష్, సబీనా హెరాల్డ్, వై.ప్రశాంతి పాల్గొన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలి నల్లగొండ టౌన్ : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు సైదిరెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గుర్రంవెంకట్రెడ్డి, ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు బొంగురాల నర్సింహలు డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కార్మిక సంఘాల సంయుక్త సమావేశంలో వారు మాట్లాడారు. మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతానికి 19న టీఎన్జీఓ భవన్లో నిర్వహించే సదస్సుకు కార్మికులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో నాయకులు ఎండీ.సలీం, పరిపూర్ణచారి, ఆర్.ఆచారి, బోడ ఇస్తారి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రికార్డు స్థాయిలో సభలు పెట్టాం
నల్లగొండ : ఉద్యమ పార్టీగా రికార్డు స్థాయిలో సభలు పెట్టామని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఈ నెల 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఆదివారం నల్లగొండలో నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 25 ఏళ్ల పండుగ ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహిస్తున్నామని.. ఆ సభను విజయవంతం చేసేందుకు వెల్లువలా వచ్చేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు టీఆర్ఎస్ ఉండదు మధ్యలోనే బంద్ అవుతుందని చెప్పారని.. కానీ, ఎన్నో మైలురాళ్లు, అవరోధాలను అధిగమించి తెలంగాణను అడ్డుకునే రాక్షసులను తరిమికొట్టామన్నారు. మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారాడని.. మంత్రుల చేతకానితనం వల్లే రైతులకు మద్దతు ధర అందడం లేదన్నారు. ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసి బాధితులను వెలికితీసే దమ్ము, తెలివి కాంగ్రెస్ నాయకులకు లేదని ఎద్దేవా చేశారు. హాస్టళ్లలో కల్తీ నిత్యావసరాలు సరఫరా చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని.. ఇందులో మంత్రుల మనుషులే ఉన్నారని ఆరోపించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నాయకులు కటికం సత్తయ్యగౌడ్, చకిలం అనిల్‌కుమార్, మాలె శరణ్యారెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, మందడి సైదిరెడ్డి, అభిమన్యు శ్రీను, రవీందర్రావు, కరీంపాష, మారగోని భిక్షం, బోనగిరి దేవేందర్, రవీందర్‌రెడ్డి, మారగోని గణేష్, రావుల శ్రీని వాస్‌రెడ్డి, మెరుగు గోపి పాల్గొన్నారు. ఫ 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనం వెల్లువలా తరలివస్తారు ఫ ఎన్నో అవరోధాలను అధిగమించి రాక్షసులను తరిమికొట్టాంఫ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి -
ఆయిల్‌పాం రైతులకు ప్రోత్సాహకం
రైతులు సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం సాగుకు ప్రోత్సాహకం అందిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటికే సాగులో ఉన్న రైతులకు ప్రోత్సాహక డబ్బులను జమ చేసింది. జిల్లాలో ఆయిల్‌పాం కంపెనీ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఆయిల్‌పాం సాగును విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. – పిన్నపురెడ్డి అనంతరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి నల్లగొండ అగ్రికల్చర్ : ఆయిల్‌పాం సాగును విస్తరించడానికి ఉద్యానవన శాఖ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేసింది. ఆయిల్‌పాం సాగుపై రైతుల్లో అవగాహన కల్పించడానికి క్షేత్రస్థాయి అధికారులను సన్నద్ధం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 9,768 ఎకరాల్లో అయిల్‌పాం తోటలను 2,217 మంది రైతులు సాగు చేశారు. ఆయా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించిన ప్రోత్సాహకం రూ.6.144 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. సాగు రెండింతలు చేయాలని లక్ష్యం.. ఆయిల్‌పాం సాగును జిల్లాలో రెండింతలు చేయాలని ఉద్యానవన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం తోటలను సాగుచేసే రైతులను ప్రోత్సహిస్తోంది. ఎకరా ఆయిల్‌పాం సాగుకు 57 మొక్కలు అవసరం కాగా ఒక్కో మొక్కకు రూ.193 గాను.. రైతు రూ.20 చెల్లిస్తే.. ప్రభుత్వం మిగతా రూ.173 చెల్లిస్తుంది. సాగుకు అవసరమైన డ్రిప్‌ను ఎస్సీ, ఎస్టీలకు నూరు శాతం సబ్సిడీపై, బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, పెద్ద రైతులకు 80 శాతం సబ్సిడీపై అందిస్తోంది. ఎకరానికి ప్రతి సంవత్సరం ఎరువులు, పురుగుల మందుతో పాటు అంతర్‌పంట సాగు చేసుకునేందుకు రూ.4200 ప్రోత్సాహకం ఇస్తుంది. సాగు చేసిన నాటి నుంచి కాతకు వచ్చేంత వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తుంది. మెట్రిక్ టన్నుకు రూ.21 వేలు.. ఎకరం వరికి సరిపోను నీరు ఉంటే మూడు ఎకరాల్లో ఆయిల్‌పాం తోటను సాగు చేసుకోవచ్చు. ఆయిల్‌పాం తోట నాలుగు సంవత్సరాలకు కాతకు వస్తుంది. కాతకు వచ్చిన తరువాత ఆయిల్‌పాం గెలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తుంది. మెట్రిక్ టన్నుకు రూ.21 వేలకు పతాంజలి సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసుంది. కొత్తలూరులో కంపెనీ! జిల్లాలోని అనుముల మండలం కొత్తలూరు గ్రామంలో పతాంజలి సంస్థ అయిల్‌పాం కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఆ గ్రామంలో 16 ఎకరాల భూమిని ఆ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇంకో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి త్వరలో కంపెనీ ఏర్పాటు పనులను ప్రారంభించే అవకాశం ఉంది. అయిల్‌పాం కంపెనీ ఏర్పాటు పూర్తయితే జిల్లాలో సాగు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఉద్యానవన శాఖ అంచనాలు వేస్తోంది. ఫ రైతుల ఖాతాల్లో డబ్బు జమచేసిన ప్రభుత్వం ఫ సాగును ప్రోత్సహించడానికి ప్రణాళికలురైతుల ఖాతాల్లో ప్రోత్సాహకం జమ ఇలా.. సంవత్సరం రైతులు విస్తీర్ణం పోత్సాహకం (రూ.కోట్లలో) 1వ 401 1856 2.8202వ 934 3933 1.6523వ 651 3290 1.3404వ 141 789 0.332 -
మాటల యుద్ధం
మంత్రి పదవిపై.. అధిష్టానం నిర్ణయం ఏమిటో? ప్రస్తుత పరిస్థితులు అన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాల్సి ఉంది. జానారెడ్డి లేఖను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇస్తుందా..? ముందుగా ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి మాట నిలుపుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి రాకుండా అడ్డుకునేందుకే జిల్లా కాంగ్రెస్ పెద్దలు డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇప్పించారన్న చర్చ సాగుతోంది. తనకు మంత్రి పదవి కావాలని బాలునాయక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఇది జరగడం, ఆయన ఎప్పుడు బహిర్గతం అవుతారోనన్నది చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌లో మంత్రి పదవి మంట రేపుతోంది. నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మాజీ మంత్రి జానారెడ్డి తీరుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరులో బహిరంగంగానే విమర్శలు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో 15 రోజుల కిందట జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైందని, ఇక ప్రకటనే తరువాయి అన్న చర్చ జోరుగా సాగింది. అదే సమయంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు కేబినెట్లో చోటు కల్పించాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాయడంతో చిచ్చు మొదలైంది. రాజగోపాల్‌రెడ్డికి వచ్చే మంత్రి పదవిని అడ్డుకునేందుకు ఆయన లేఖ రాశారని రాజగోపాల్‌రెడ్డి అనుచరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లోలోపల రగులుతూనే ఉన్నా ఆ మంట ఆదివారం బహిర్గతమైంది. జానాపై భగ్గుమన్న రాజగోపాల్‌రెడ్డి ఆదివారం చౌటుప్పల్, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీల నూతన పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్‌రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, కొంతమంది దుర్మార్గులు అడ్డుపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 20 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డి ధర్మరాజు మాదిరిగా పెద్దన్నలా వ్యవహరించకుండా మహాభారతంలో ధృతరాష్ట్రుడి పాత్ర పోషించారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకుండా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడమేంటని ఆయన ప్రశ్నించారు. సామాజిక న్యాయం, సామాజిక కూర్పు అంటున్న జానారెడ్డికి ఇన్నేళ్ల తర్వాత ఆ అంశం గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన తమ కుటుంబంలో ఇద్దరికీ పదవులు ఇస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. మొత్తానికి జానారెడ్డి లేఖ కాంగ్రెస్‌లో కాకరేపగా.. ఆయనను రాజగోపాల్‌రెడ్డి ధృతరాష్ట్రుడితో పోల్చుతూ హాట్ కామెంట్ చేయడం పార్టీలో చిచ్చు రగిల్చింది. ఫ జానారెడ్డి తీరుపై భగ్గుమన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫ ధృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని మండిపాటు ఫ వేరే జిల్లాలకు మంత్రి పదవులివ్వాలని లేఖ రాయడంపై అభ్యంతరం ఫ తెలంగాణ కోసం పోరాడిన కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇస్తే తప్పేంటని ప్రశ్నమంత్రి పదవి రచ్చ ఎటు దారి తీస్తుందో? ఎప్పుడూ గుంభనంగా ఉండే జానారెడ్డి ఒక్కసారిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలంటూ లేఖ రాయడం వెనుక ఆంతర్యమేమిటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వొద్దని సూటిగా చెప్పలేక వేరే జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వాలని లేఖ రాశారన్న చర్చ జరుగుతోంది. ఆయన లేఖ తరువాతే కేబినెట్ విస్తరణకు బ్రేక్ పడిందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి బహిరంగా విమర్శలు చేయడం ఎటు దారి తీస్తుందో చూడాలి. అంతేకాదు మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు మంత్రి అయ్యే అర్హత లేదా? అని ప్రశ్నించారు. తాను ఇన్నాళ్లూ ఆగానని, ఇకపై కచ్చితంగా మంత్రి పదవిని అడుగుతానని స్పష్టం చేశారు. అంతేకాదు ఖమ్మంలో 9 మంది గెలిస్తే మూడు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు నల్లగొండలో 11 మంది గెలిచినప్పుడు ఎందుకు మూడో మంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించారు. -
నల్లగొండ బిడ్డకు అత్యున్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి అత్యున్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్‌గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్ఎం, ీపీహెచ్డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్‌గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్‌కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకు కీలకపాత్ర బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా నిలిచాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, ప్రముఖులు సహచర న్యాయమూర్తులకు ఆదర్శంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం -
ప్రారంభానికే పరిమితమా ?
మునుగోడు : రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు అధికారులు వారం రోజుల క్రితం మునుగోడు మండలంలో 15 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కానీ నేటికీ ఏ ఒక రైతు ధాన్యం కూడా తూకం వేయలేదు. దీంతో పది పదిమేను రోజులుగా.. రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు. మండల వ్యాప్తంగా ఒక్కో కొనుగోలు కేంద్రంలో 50 నుంచి 200 మంది రైతులు ధాన్యం రాశులు పోశారు. అధికారులు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ధాన్యం ఆరబెడుతూ.. సాయంత్రానికి రాశి చేస్తున్నారు. మరోవైపు ఆకాలు వర్షాలు కురుస్తుండడంతో తమ ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కొనుగోళ్లు ప్రారంభించాల రైతులు కోరుతున్నారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
రైతులు సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం పశువులకు, గేదెల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం ఉచితంగా టీకాలు వేయనుంది. ఈ నెల 15వ తేదీ నుంచి వైద్య బృందాలు గ్రామాలకు వెళ్లి టీకాలు వేస్తాయి. ఆయా గ్రామాలకు వచ్చినప్పుడు బృందాలకు రైతులు సహకరించి పశువులకు టీకాలను వేయించుకోవాలి. ప్రభుత్వం ఉచితంగా టీకాల వేస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ జీవీ రమేష్, జిల్లా పశువైద్యాధికారి ఫ బృందాలను ఏర్పాటు చేసిన పశు సంవర్థక శాఖ ఫ పశు వైద్యశాలలకు టీకాలు సరఫరా నల్లగొండ అగ్రికల్చర్ : పశువుల్లో వ్యాప్తి చెందే గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశు సంవర్థక శాఖ టీకాలు వేయనుంది. ప్రతి సంవత్సరం రెండు దఫాలుగా వేసే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కోసం జిల్లా పశుసంవర్థక శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. టీకాలను వేయడానికి జిల్లా వ్యాప్తంగా 90 బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో పశు వైద్యుడితో పాటు ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పశు వైద్యశాలలకు టీకాలను సరఫరా చేసింది. ఈ నెల 15న మంగళవారం టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మే 15వ తేదీ వరకు నెల రోజుల పాటు (సెలవు దినాలు మినహా) పశువులు, గేదెలకు టీకాలను వేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచే.. జిల్లా వ్యాప్తంగా సుమారు 4 లక్షలకుపైగా తెల్ల, నల్ల పశువులు ఉన్నట్లు జిల్లా పశుసంవర్థక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వేసవిని దృష్టిలో ఉంచుకుని సిబ్బంది ప్రతి గ్రామానికి ఉదయం 8 గంటలకు చేరుకుని మధ్యాహ్నం 12 గంటల వరకు టీకాలు ఉచితంగా వేయనున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లే ముందు రైతులకు ముందస్తుగా సమాచారం అందించనున్నారు. ప్రతి పశువుకూ టీకా వేసేలా పశుసంవర్థక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
రైస్ మిల్లర్ల పరేషన్
మిర్యాలగూడ: రాష్ట్ర ప్రభుత్వ రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం డిమాండ్ పడిపోయింది. గతంలో కంటే 80శాతం మేరకు మార్కెట్లో సన్న బియ్యం డిమాండ్ లేకపోవడంతో తమ వద్ద ఉన్న బియ్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక మిల్లర్లు సతమతమవుతున్నారు. పైగా గత వానాకాలం సీజన్లో కొనుగోలు చేసిన ధాన్యంలో 20శాతం మేరకు నిల్వ ఉండగా ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యంతో మిల్లుల్లో గోదాములు నిండుకుండలా ఉన్నాయి. మార్కెట్లో సన్న ధాన్యానికి డిమాండ్ లేకపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లాలో 360కు పైగా మిల్లులు.. ఉమ్మడి జిల్లాలో 360కు పైగా మిల్లులు ఉన్నాయి. వీటిలో నల్లగొండ జిల్లాలో 190, సూర్యాపేట జిల్లాలో 100, యాదాద్రి భువనగిరి జిల్లాలో 70 మిల్లులు ఉన్నాయి. ఇందులో మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లోనే 90కు పైగా మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల ద్వారా అత్యధికంగా సన్న బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు, వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. పెరిగిపోతున్న మిల్లింగ్ చార్జీలు.. ధాన్యాన్ని కొనుగోలు చేసి బియ్యంగా మార్చి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన ఖర్చులన్నీ పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడి కూడా రావడం లేదని మిల్లర్లు వాపోతున్నారు. క్వింటాకు రూ.2300 సన్నరకం ధాన్యం కొనుగోలు చే స్తే దానిని బాయిలర్‌లో వేసేందుకు అదనంగా రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చు వస్తుంది. దీంతో క్వింటాకు రూ.2700 వరకు ధర పడుతుంది. దాన్ని మిల్లింగ్ చేసినట్లయితే 55కేజీల బియ్యం, 10 కేజీల నూక వస్తుంది. 55కేజీల బియ్యానికి రూ.2700 ఖర్చయితే మిల్లులకు కిలో బియ్యానికి హెచ్‌ఎంటీకి రూ.45, ఇతర క్వాలిటీకి రూ.48 ఖరీదు అవుతుంది. బ్యాగులు, ఎగుమతుల చార్జీలు, హమాలీల ఖర్చులు కలుపుకుంటే కనీసం రూ.5 ఖర్చు పడుతుంది. కానీ మార్కెట్లో హెచ్‌ఎంటీకి రూ.4500, ఇతర సన్న రకాలకు రూ.4800 ధర ఉంది. మొత్తంగా రూ.200 నుంచి రూ.300 వరకు నష్టం వస్తుంది. ప్రధానంగా హెచ్ఎంటీ రకం బియ్యానికి హైదరాబాద్‌లోనే మార్కెటింగ్ ఉంటుంది. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడం ద్వారా హైదరాబాద్‌లో హెచ్ఎంటీ రకం బియ్యం అడిగేవారు లేకపోవడతో ధర పడిపోయింది. అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యే సన్నరకం బియ్యం ధర కూడా పడిపోయింది. కర్ణాటకలో రైస్ భాగ్య పథకం రద్దుతో.. గతంలో సన్న బియ్యానికి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా బియ్యం పంపిణీ చేసే బదులు రైస్ భాగ్య పథకాన్ని(నగదు బదిలీ) అమలు చేశారు. రేషన్ కార్డుదారులకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులకు మరికొన్ని కలుపుకుని సన్న బియ్యం కొనుక్కునేవారు. కానీ ఆ రాష్ట్రంలో సన్న ధాన్యం ఎక్కువగా దిగుబడి రావడంతో రైస్ భాగ్య పథకాన్ని రద్దు చేసి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఇదే తరహాలో బిహార్, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఒడిషా, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో సన్న ధాన్యం దిగుబడి అధికంగా వచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో బీపీటీ సన్నబియ్యం పంపిణీ చేస్తుండగా రాబోయే 9 నెలలకు కావాల్సిన స్టాక్ ప్రభుత్వం అందుబాటులో ఉంచుకుంది. దీంతో సన్న బియ్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో కొనే పరిస్థితి లేకుండా పోయింది. రూ.600 కోట్లు పెండింగ్..ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని అప్పగించేందుకుగాను సీఎంఆర్ కింద మిల్లులకు ప్రతి సీజన్‌కు కేటాయిస్తుంటారు. అందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో సుమారు 270కు పైగా మిల్లులు సీఎంఆర్ పైనే ఆధారపడి నడస్తున్నాయి. గత పది సీజన్ల నుంచి సీఎంఆర్ బియ్యం అందించినందుకుగాను ప్రభుత్వం నుంచి మిల్లులకు కోట్ల రూపాయల బాకీ పడి ఉంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే రూ.600కోట్లకు పైగా మిల్లింగ్ చార్జీలు రావాల్సి ఉంది. చార్జీలు ఇవ్వాలని మిల్లర్లు పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఫలితం లేదు. పైగా మిల్లుల వద్ద గన్నీ సంచులు పెండింగ్‌లో ఉన్నాయని సాకులు చెప్పి దానికి గాను మిల్లింగ్ చార్జీలు సరిపోతుందని ప్రభుత్వం నుంచి సమాధానం రావడంతో మిల్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీతో పడిపోయిన డిమాండ్ ఎగుమతులు లేక మిల్లుల్లోనే బియ్యం స్టాక్ ఐదేళ్లుగా అందని సీఎంఆర్ బిల్లులు ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్న మిల్లర్లుమా ఇబ్బందులను గుర్తించాలిమిల్లర్ల ఇబ్బందులను కూడా ప్రభుత్వం గుర్తించాలి. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో అన్నిరకాలుగా సహకారం అందించాం. అయినప్పటికీ మాపై నిందలు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో సన్న బియ్యంకు డిమాండ్ లేకపోవడంతో మిల్లుల్లో ధాన్యం పెద్దఎత్తున పేరుకుపోయింది. వాటిని అమ్ముకునేందుకు కష్టాలు పడుతున్నాం. స్టాక్ ఉన్న నిల్వలకు వడ్డీ, తరుగును పరిగణిస్తే నష్టాలే వస్తాయి. – గౌరు శ్రీనివాస్, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడుపెండింగ్ బిల్లులు చెల్లించాలిమిర్యాలగూడ పరిసరా ల్లోని మిల్లుల ద్వారా గత సీజన్లో చేసిన మిల్లింగ్ చార్జీలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. గన్నీ సంచుల పెండింగ్ కారణంతో బిల్లులు ఇవ్వడం లేదు. చిరిగినోయిన, పనికిరాని బస్తాలకు రూ.21 ధర నిర్ణయించడం వల్ల మిల్లర్లకు నష్టం జరుగుతుంది. మిల్లుల వద్ద గన్నీ సంచులను ప్రభుత్వం తీసుకొని మిల్లింగ్ చార్జీలను వెంటనే చెల్లించాలి. – వెంకటరమణచౌదరి, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ కార్యదర్శి -
కాళ్ల పారాణి ఆరకముందే వివాహిత ఆత్మహత్య
చౌటుప్పల్: పైళ్లెన 27 రోజులకే ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలికాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన గాయత్రి అలియాస్ లావణ్య(19)కు చౌటుప్పల్‌కు చెందిన జెల్ల సంతోష్‌తో మార్చి 16న వివాహం జరిగింది. సంతోష్ స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రోజుమాదిరిగానే ఆదివారం ఉదయం సంతోష్ డ్యూటీకి వెళ్లాడు. సంతోష్ తల్లిదండ్రులు వివాహానికి వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గాయత్రి చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహానికి వెళ్లిన అత్తమామలు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి గాయత్రి విగతజీవిగా కనిపించింది. గాయత్రి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి తల్లిదండ్రులు లేరని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
బీపీ మండల్ సిఫారసులు అమలుచేయాలి
మునుగోడు: దేశంలో అధికశాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో తగినా వాటా ఇవ్వాలని బీపీ మండల్ చేసిన సిఫారసులను ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం బీపీ మండల్ 43వ వర్ధంతి సందర్భంగా మునుగోడులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీసీల సామాజిక స్థితిగతులపై బీపీ మండల్ సమగ్ర అధ్యయనం చేసి ఇచ్చిన 40 సిఫారసుల్లో కేవలం 2 మాత్రమే అమలు చేయడం విచారకరమన్నారు. మిగిలిన సిఫారసులను అమలుచేసే వరకు తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు గుంటోజు వంకటాచారి, యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజయ్‌గౌడ్, బూడిద మల్లిఖార్జున్‌గౌడ్, మిర్యాల వెంకన్న, ఈదులకంటి కై లాస్‌గౌడ్, పాలకూరి కిరణ్, మేకల మల్లయ్యయాదవ్, యాదప్ప, లింగయ్య, నర్సింహ తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
సాగునీటి వనరుల కల్పనలో తుంగతుర్తికి పెద్దపీట
మోత్కూరు: సాగునీటి వనరుల కల్పనలో తుంగతుర్తి నియోజకవర్గానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పెద్దపీట వేశారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల జల సౌధ కార్యాలయంలో ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన సాగు, తాగునీరు పెండింగ్ పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గంలోని 9 మండలాల్లో తాగు, సాగు నీటి సమస్యలను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సంబంధిత ఉన్నత స్థాయి అధికారులకు వివరించారు. రానున్న రోజుల్లో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని బిక్కేరు వాగుపై ఆరు చెక్‌డ్యాంలు కట్టడం ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాగు నీటి కొరత లేకుండా చూడటం వల్లనే పంట దిగుబడి బాగా పెరిగిందన్నారు. మరికొన్ని మండలాల్లో కూడా చెక్‌డ్యాంల నిర్మాణం అవసరమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అడ్డగూడూరు, శాలిగౌరారం మండలాల్లోని మానాయికుంట చెక్‌డ్యాం, బునాదిగాని కాల్వ, కేతిరెడ్డి కాల్వ పూర్తిచేస్తే వేలాది ఎకరాలకు నీరు అందించే అవకాశం ఉందని వివరించారు. ఎస్ఆర్ఎస్పీ కాల్వ, గంధమల్ల రిజర్వాయర్ ద్వారా మరిన్ని చెరువులు నింపాలని ఆయన కోరారు. చెరువులు, కుంటలు, ట్యాంకులు నింపడంతో సాగు మరింత పెరుగుతుందని అన్నారు. నియోజకవర్గంలోని సాగు నీటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులను కేటాయించాలని కోరారు. సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్‌అలీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొన్న ట్యాంకర్.. ఒకరు దుర్మరణం
చౌటుప్పల్ రూరల్: బైక్‌ను వెనుక నుంచి కెమికల్ ట్యాంకర్ ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్ద ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామానికి చెందిన వెల్గ నర్సిరెడ్డి(48) సంస్థాన్ నారయణపురం మండలం మల్లారెడ్డిగూడెంలో ఉంటున్న తన కుమార్తె ఇంటికి బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామ స్టేజీ వద్దకు రాగానే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కెమికల్ ట్యాంకర్ బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సిరెడ్డి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
మిస్టరీగానే తల్లి, కుమార్తె మరణం
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో శనివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన తల్లి, కుమార్తె మరణం మిస్టరీగానే మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన గుర్రం సీతారాంరెడ్డి తన అక్క కుమార్తె రాజేశ్వరీ(34)ని 2008లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే ఓ ప్రైవేట్ ఆగ్రో కెమికల్ సంస్థలో పనిచేస్తున్న సీతారాంరెడ్డి నల్లగొండ జిల్లా సేల్స్ మేనేజర్‌గా బదిలీపై 15ఏళ్ల క్రితమే మిర్యాలగూడకు వచ్చి హౌసింగ్‌బోర్డులో అద్దెకు ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు వేదశ్రీ, వేద సాయిశ్రీ(13) సంతానం. ఈ నెల 10న కంపెనీ బడ్జెట్ ఆడిట్ సమావేశం ఉండటంతో సీతారాంరెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన సీతారాంరెడ్డికి గొంతుపై గాయాలతో చిన్న కుమార్తె వేద సాయిశ్రీ, బెడ్రూంలో ఉరేసుకుని భార్య రాజేశ్వరీ మృతిచెంది ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. నోరు విప్పని పెద్ద కుమార్తె..సీతారాంరెడ్డి పెద్ద కుమార్తె వేదశ్రీ నోరు విప్పితేనే రాజేశ్వరీ, వేద సాయిశ్రీ మృతికి గల కారణాలు తెలుస్తాయి. కానీ ఆమె మాత్రం తాను శుక్రవారం రాత్రి నిద్రపోగా శనివారం మధ్యాహ్నం మేలుకువ వచ్చిందని చెబుతోంది. దీంతో వారిపై మత్తు పదార్ధాల ప్రయోగం జరిగిందా..? అనే అనుమానాలకు తావిస్తోంది. అయితే సీతారాంరెడ్డి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వస్తున్న సమయంలో ‘ఎక్కడ ఉన్నావు డాడీ’ అంటూ మెసేజ్ చేయడం, తల్లి ఫోన్‌కు వరుసగా వస్తున్న ఫోన్ కాల్స్‌ను కట్ చేయడం వంటివి చూస్తే పెద్ద కుమార్తె వేదశ్రీ స్పృహాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలపై కత్తి గాట్లు..రాజేశ్వరీ ఎడమ చేయి మణికట్టు, పాదాల వద్ద కత్తిగాయాలు ఉండగా, వేద సాయిశ్రీ గొంతును పదునైన కత్తితో కోసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఇది హత్యగానే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు నేతృత్వంలో మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మృతుల ఇంట్లో ఓ లేఖ లభ్యమైనట్లు ప్రచారం జరుగుతుండగా పోలీసులు మాత్రం దానిని ధ్రువీకరించడం లేదు. మిర్యాలగూడ వన్ టౌన్ సీఐ మోతీరాం పర్యవేక్షణలో తల్లి, కుమార్తె మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం: డీఎస్పీ తల్లి, కుమార్తె మరణంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. మూడు బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల శరీరాలపై కత్తిగాట్లు ఉన్నందున పోస్టుమార్టం నివేదిక తర్వాత క్లూస్‌టీం సమాచారం మేరకు లోతైన విచారణ చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. మూడు బృందాలతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు -
విద్యుత్ తీగలు తగిలి గడ్డి దగ్ధం
యాదగిరిగుట్ట రూరల్: విద్యుత్ తీగలు తగిలి ట్రాక్టర్లో తీసుకెళ్తున్న గడ్డి దగ్ధమైంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామంలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ మండలం తేరాల గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ నల్ల అరుణ్ ఆదివారం 130కట్టల గడ్డిని తన ట్రాక్టర్లో లోడు చేసుకుని తేరాల గ్రామం నుంచి వయా ఆలేరు, బాహుపేట మీదుగా పెద్దకందుకూరు గ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బాహుపేట గ్రామానికి రాగానే విద్యుత్ తీగలు గడ్డి కట్టలకు తాకడంతో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పెద్దవి కావడంతో డ్రైవర్ అరుణ్ ట్రాక్టర్‌పై నుంచి కిందకు దూకాడు. ట్రాక్టర్ రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. వెంటనే స్థానికుల సహాయంతో హుటాహుటిన చెరువులోని నీళ్లతో గడ్డికి అంటుకున్న మంటలను ఆర్పుతూ, జేసీబీ సహాయంతో దగ్ధమవుతున్న గడ్డిని కిందపడేశారు. అరుణ్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. నాలుగు టీంలతో గాలింపునల్లగొండ: నల్లగొండలో సంచలనం సృష్టించిన మణికంఠ ఫొటో కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేష్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్పీ శరత్చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు నాలుగు టీంలను ఏర్పాటు చేయగా.. ఆ టీంలు గాలింపు చర్యలు చేపట్టాయి. టూటౌన్ పోలీసులు అనుమానితులతో పాటు హత్యకు ముందు మృతుడితో ఫోన్లో మాట్లాడిన వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
కేతేపల్లి: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చల్లా రఘురాములు, చల్లా అశోక్, దిలీప్ కలిసి ఖమ్మంలో తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యలో కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామ జంక్షన్ వద్దకు రాగానే కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కేతేపల్లి 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. రఘురాములు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. కారు ఢీకొని.. బీబీనగర్: బైక్‌ను కారు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూరుకు చెందిన వినయ్, గౌతమ్ బైక్‌పై హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్తుండగా.. బీబీనగర్ మండల కేంద్రంలోకి రాగానే వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వినయ్, గౌతమ్‌కు గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
తిరుమలగిరి: విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుంగతుర్తి మండలం గన్యానాయక్తండాకు చెందిన రమేష్ రాథోడ్(49) హెడ్‌కానిస్టేబుల్‌గా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రమేష్ రాథోడ్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుర్చీలోనే కూలబడిపోయాడు. తోటి సిబ్బంది గమనించి వెంటనే సీపీఆర్ చేసి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మృతుడి భార్య, కుమార్తె ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమా ర్తె, ఉన్నారు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
50 ఏళ్ల ఆత్మీయ సమ్మేళనం
సూర్యాపేటటౌన్: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలలో 1971–74 వరకు బీఏ, బీకాం చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం కళాశాల ఆవరణలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాడు అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన బి. విశ్వనాథంను ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కళాశాలలో మొదటి బ్యాచ్ తమదేనని, తమ బ్యాచ్‌లో మొత్తం 35 మంది ఉండగా.. ఆత్మీయ సమ్మేళనానికి 19 మంది మాత్రమే హాజరయ్యామని పేర్కొన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను ఒకరికొకరు పంచుకొని సరదాగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. వెంకటేశులు, పదవీ విరమణ చేసిన అధ్యాపకులు, ఆనాటి పూర్వ విద్యార్థులు ఎన్. బాల్‌రెడ్డి, ఎన్. పిచ్చిరెడ్డి, శేఖర్‌రెడ్డి, సంజీవరెడ్డి, వెంకటరంగయ్య, కృపాకర్, అమృతారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, జానకి రాంరెడ్డి, లింగారెడ్డి, యానాల సుదర్శన్‌రెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
ఆ దమ్ము ప్రభుత్వానికి ఉందా?.. ఎస్ఎల్బీసీపై జగదీష్‌రెడ్డి షాకింగ్ కామెంట్స్
సాక్షి, నల్గొండ జిల్లా: ఎస్ఎల్బీసీని శాశ్వతంగా మూసేస్తున్నారని.. సొరంగంలో ఉన్న మృతదేహాలను తీసుకొచ్చే దమ్ము లేదంటూ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఈ నెల 27న వరంగల్ సభ నేపథ్యంలో నల్లగొండలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నీళ్ల విషయంలో ప్రభుత్వం దద్దమ్మలా మారిందన్నారు.‘‘మిర్యాలగూడలో రైతులపై మిల్లర్లు దాడి చేస్తున్నారు. కేసీఆర్ పాలన పోవడంతో నల్లగొండ జిల్లా అనాథలా మారింది. మిల్లర్ల వద్ద కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లంచాలు తీసుకున్నాడు. అందుకే మద్దతు ధర ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీకి కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, మిల్లర్లే కనిపిస్తున్నారు. చంద్రబాబు నీళ్లు తరలించుకుపోతుంటే కాంగ్రెస్‌కు సోయి లేదు’’ అంటూ జగదీష్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
నకిరేకల్ : రాజ్యంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని ఎమ్మెల్సీ శంకర్‌నాయర్, ఎమ్మెల్యే వేముల వీరేశంలు పిలుపునిచ్చారు. జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నకిరకల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యంగ పరిపరిక్షణ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యంగ నిర్మాణంలో చేసిన విశేష కృషిని గౌరవించేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గాంధీ శాంతి సందేశం, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటం, రాజ్యంగ విలువలను ప్రజలకు చేరవేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ శత్రు, మార్కెట్, మున్సిపల్ చైర్పర్సన్లు గుత్తా మంజుల, చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్, పూజర్ల శంభయ్య, చామల శ్రీని వాస్, గాజుల సుకన్య, నకిరెకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, బత్తుల ఉశయ్య, దూదిమెట్ల సత్త య్య, పెద్ది సుక్కయ్య, సుంకరబోయిన నర్సింహ, మల్లారెడ్డి, కంపసాటి శ్రీనివాస్, కోట మల్లి కార్జున్, లక్ష్మీనర్సు, గాదగోని కొండయ్య, నకిరేకంటి నరేందర్, యాసా కరుణాకర్‌రెడ్డి, పాల్గొన్నారు.ఫ ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, ఎమ్మెల్యే వీరేశం -
మీసేవ కేంద్రాల్లో సర్వర్ డౌన్
రామగిరి(నల్లగొండ) : నిరుద్యోగులైన యువతకు రాజీవ్ యువ వికాసం దరఖాస్తులకు సర్వర్ సహకరించడం లేదు. ఈ నెల 14 తేదీ చివరి గడువు కావడంతో.. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినా ఆ తర్వాత నేరుగా ఎంపీడీఓ ఆఫీసులో దరఖాస్తులను సమర్పించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డుతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకుంటే సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఆమోదించిన తర్వాత సర్టిఫికెట్ జారీ అవుతుంది. ఇప్పుడు రెండవ శనివారం, ఆదివారం, సోమవారం (అంబేద్కర్ జయంతి) సెలవు దినాలు కావడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తుకు శుక్రవారం మాత్రమే గడువు ఉందని కానీ, మీ సేవ కేంద్రాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో సర్వర్ డౌన్ సమస్య వచ్చింది. దీంతో శుక్రవారం జనం మీ సేవ కేంద్రాల వద్ద బారులుదీరారు. సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకున్నా.. తహసీల్దార్ కార్యాలయ సమయం ముగియడంతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారిలో గందరగోళం ఏర్పడింది. ఫ రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులకు తప్పని ఇబ్బందులుసెలవు దినాల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తాం : కలెక్టర్ నల్లగొండ : ప్రభుత్వ సెలవు దినాల్లోనూ రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు ప్రభుత్వం ఈనెల 14 చివరి తేదీగా నిర్ణయించిందని తెలిపారు. 12న రెండవ శనివారం, 14న అంబేద్కర్ జయంతి రోజున సెలవు దినాల్లోనూ దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలతో పాటు ప్రజాపాలన సేవా కేంద్రాల్లో తీసుకుంటారని తెలిపారు. -
మద్దతు ధరకు మంగళం!
రకరకాల కొర్రీలతో ధాన్యం రేటు తగ్గిస్తున్న మిల్లర్లుక్వింటాకు రూ.300 వరకు తగ్గింపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యధికంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సుమారు 300కు పైగా రైస్ మిల్లులు ఉన్నాయి. వీటిలో సన్నరకం ధాన్యం వాటిల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర సాధారణ రకం క్వింటాకు రూ.2,300, గ్రేడ్–1 రకానికి రూ.2,320 ఉంది. కానీ మిల్లుల్లో వివిధ సాకులతో మద్దతు ధర కంటే రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గిస్తున్నారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడుస్తుందనే ఆందోళనతో మిల్లర్లు చెప్పిన ధరకే రైతులు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇక హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని పెద్దగా కొనడమే లేదు. ఏ మిల్లులోనైనా కొనుగోలు చేస్తే రూ.2100లోపే చెల్లిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. యాసంగి సీజన్లో మిల్లర్లు ధాన్యానికి ధర తగ్గించి అన్నదాతను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. మిల్లులకు పెద్ద మొత్తంలో ధాన్యం రావడంతో కొనుగోలు చేయకుండా మార్కెట్ లేదని, పచ్చ గింజ ఉందని, తాలు, ఎక్కువ డ్రై అయిందంటూ కొర్రీలు పెడుతూ ధర తగ్గిస్తున్నారు. ఒక మిల్లులో కొనకపోవడంతో మరో మిల్లుకు వెళ్లడం, అక్కడా కొనుగోలు చేయకపోవడంతో ఇంకో మిల్లుకు వెళ్లడం ఇలా రైతులు ధాన్యం అమ్ముకునేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో అధికారులే దగ్గరుండి ధాన్యం ట్రాక్టర్లను మిల్లుల్లోకి పంపిస్తున్నా.. ధరను అమాంతం తగ్గిస్తున్నారు. వానాకాలం సీజన్లో క్వింటాకు రూ.2,800 వరకు ధర పెట్టిన మిల్లర్లు ఇప్పుడు సుమారు రూ.500 నుంచి రూ.600 వరకు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో నెమ్మదిగా కొనుగోళ్లు.. జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు వేగంగా సాగడం లేదు. 17 శాతంలోపు తేమ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయిస్తే గ్రేడ్–1 ధాన్యం క్వింటాకు రూ.2,320 మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్‌తో కలిసి రూ.2,820 ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఆయా కేంద్రాల వద్ద కొనుగోళ్లలో వేగం పుంజుకోవడం లేదు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు 85వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రాద్దిప్పటి వరకు 10వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. 90 శాతం మంది రైతులు ధాన్యాన్ని మిల్లులకే అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకు మిర్యాలగూడలో ఉన్న మిల్లుల్లోనే సుమారు 4 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సమాచారం. మిర్యాలగూడలోని ఓ మిల్లు వద్ద ధాన్యం ట్రాక్టర్లుమిల్లర్లు ధర తగ్గించవద్దు తేమ, పచ్చ గింజ, డ్రై అధికంగా ఉందని సాకులు చెప్పి ధర తగ్గించవద్దు. హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని కూడా ఎక్కువ మంది రైతులు సాగు చేశారు. మార్కెట్లో ఆ ధాన్యానికి డిమాండ్ లేదని కొనకపోవడం సరైందికాదు. ఏ ధాన్యమైనా మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలి. – వీరేపల్లి వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హెచ్‌ఎంటీకి మార్కెట్ లేదు ప్రభుత్వం పేదలకు రేషన్‌షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఆ బియ్యం హెచ్ఎంటీలకు సమానంగా ఉంది. దీంతో మార్కెట్లో ఆ బియ్యానికి రూ.400కు పైగా ధర తగ్గిపోయింది. మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో హెచ్ఎంటీ రకం ధాన్యాన్ని తక్కువగా కొనుగోలు చేస్తున్నాం. జైశ్రీరామ్, చింట్లూ, జేఎస్ఆర్ తదితర సన్నరకం ధాన్యానికి దాదాపు మద్దతు ధర ఇస్తున్నాం. – గౌరు శ్రీనివాస్, మిర్యాలగూడ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు2,100 రూపాయలే పెట్టారు మిర్యాలగూడలోని ఓ మిల్లులో నా ధాన్యం క్వింటాకు రూ.2,100 ధర పెట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మద్దతు ధర కంటే తక్కువ ధరకే నా ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. – వెంకన్న, పాములపాడుఅధికారులు పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోకపోవడం వల్లే మద్దతు ధర కంటే తక్కువకు కొంటున్నారు. కావేరి చింట్లు రకానికి గత సీజన్లో రూ.2,800 వరకు కొన్నారు. ఇప్పుడు రూ.2,250 కే అమ్ముకోవాల్సి వచ్చింది. – సత్యనారాయణరెడ్డి, నాగారం ఫ సిండికేట్‌గా మారి కనీస మద్దతు ధర చెల్లించని మిల్లర్లు ఫ వానాకాలం సీజన్‌తో పోల్చితే ధరలో భారీగా కోత ఫ దగ్గరుండి మిల్లుల్లోకి ధాన్యం ట్రాక్లర్లు పంపిస్తున్న అధికారులు ఫ వారి సాక్షిగానే మిల్లుల్లో సాగుతున్న దోపిడీ -
మహనీయులను స్మరించుకుందాం
నల్లగొండ టూటౌన్ : మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారు ప్రజలకు చేసిన సేవలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఎంజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న మహానీయుల జయంతి ఉత్సవాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. అంతకు ముందు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో పూలే విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూల మాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం సమ్మిళిత సమాజం పేరుతో విద్యార్థులు గడియారం సెంటర్ నుంచి మర్రిగూడ బైపాస్ రోడ్డు వరకు 5కే రన్ నిర్వహించారు. అనంతరం యూనివర్సిటీలో నిర్వహించిన మహనీయుల ఉత్సవాలకు తెలంగాణ బీసీ కమీషన్ సభ్యురాలు ఆర్. బాలలక్ష్మి హాజరై మాట్లాడారు. మార్పునకు పూలే దంపతులు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో ఎంజీయూ రిజిస్ట్రార్ అల్వాల రవి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, షీటీమ్స్ ఇన్స్పెక్టర్ కోట కరుణాకర్, ఉత్సవాల చైర్మన్ ప్రొఫెసర్ అంజిరెడ్డి, కన్వీనర్ శ్రీదేవిరెడ్డి, డాక్టర్ మద్దిలేటి, ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, అరుణప్రియ, సుధారాణి, వసంత, సరిత, శ్రీలక్ష్మి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రత్యేక’ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి నాకు రోడ్డు ప్రమాదం కారణంగా వెన్నుపూస దెబ్బతిని ఆపరేషన్లు అయ్యాయి. ఎలాంటి పని చేయలేని పరిస్థితి. నేను చాలా నిరుపేదను. ఇల్లు కూడా లేదు. నాకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి. మూడు చక్రాల వాహనం మంజూరు చేయాలి. – దోమలపల్లి వెంకన్న, మాడ్గులపల్లి నల్లగొండ : ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌తో ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు ఎక్కువగా పిల్లలు భూములు పట్టాలు చేయించుకుని తమను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు చేయగా మరికొందరు పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. సోమ, మంగళవారాల్లో వారి సంబంధీకులను పిలిపించి సమస్యను పరిష్కరిస్తామని సంబంధిత అధికారుల ద్వారా కౌన్సిలింగ్‌కు తేదీలను ఖరారు చేశారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలి
నాగార్జునసాగర్ : ప్రపంచ సుందరీమణులు మెచ్చేలా బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్ అన్నారు. మే12వ తేదీన నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో జరగనున్న బుద్ధపూర్ణిమ కార్యక్రమానికి మిస్‌వరల్డ్ పోటీలకు హాజరవుతున్న ఆసియాదేశాల సుందరీమణులు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఇక్కడి ఏర్పాట్ల సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఎండీ ప్రకాశ్‌రెడ్డితో మాట్లాడనని 90శాతం పనులు పూర్తయినట్లు వారికి వివరించినట్లు తెలిపారు. సమయం ఉన్నందున ఏర్పాట్లు ఘనంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బుద్ధవనం ఓఎస్డీ సూధన్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ శ్రీనునాయక్, ఎస్ఐ సంపత్, బుద్ధవనం అధికారులు పాల్గొన్నారు. నాణ్యమైన ధాన్యం తేవాలినార్కట్పల్లి : కొనుగోలు కేంద్రాలకు రైతులు అరబెట్టి, తూర్పార బట్టిన నాణ్యమైన ధాన్యాన్ని తేవాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం నార్కట్‌పల్లి మండలంలోని నెమ్మాని, తొండల్వాయి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తొండల్వాయిలోని రైస్ మిల్లును సందర్శించి లారీల ద్వారా వచ్చే ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఏఓ గౌతమ్, ఎంపీఓ శ్రీదేవి, ఏఈఓ నవీన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు నల్లగొండ : నల్లగొండలోని చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో లష్కర్ పోస్టులు (229), హెల్పర్ (56) పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఆసక్తి గల అవుట్సోర్సింగ్ ఏజెన్సీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ఎం ప్యానెల్ అయిన ఆసక్తి గల అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు రూ.500 రుసుం చెల్లించి వారి ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో డ్రా తీసి అవుట్సోర్సింగ్ ఏజెన్సీని ఎంపిక చేస్తామని తెలిపారు. డీటీడీఓగా ముడావత్ చత్రునాయక్నల్లగొండ : డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అధికారి (డీటీడీఓ)గా ముడావత్ చత్రునాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్‌నగర్‌లో పనిచేసిన ఆయన నల్లగొండకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఇన్చార్జిగా పని చేస్తున్న రాజ్‌కుమార్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. -
ఆస్తి కోసం ఘాతుకం
సవతి కూతురును హత్యచేసిన మహిళ శాలిగౌరారం: ఆస్తి కోసం సవతి కూతురును హత్య చేసి మృతదేహాన్ని మూసీనదిలో పూడ్చిపెట్టగా పోలీసులు హత్య కేసును ఛేదించి ఆ మహిళతో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామం పడమటితండా(డి)కి చెందిన జాటోతు పీనానాయక్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య శాంతి, రెండవ భార్య లలిత. మొదటి భార్యకు కొడుకు, కూతురు మహేశ్వరి(23) ఉండగా రెండవ భార్య లలితకు కుమార్తె(14) ఉన్నారు. మొదటి భార్య శాంతి అనారోగ్యం బారినపడడంతో 16 సంవత్సరాల క్రితం ఆమెకు పీనానాయక్ రూ.4 లక్షలు నగదు, పోషణ కోసం నెలకు రూ.4 వేలు ఇవ్వడంతో పాటు కుమార్తె మహేశ్వరిని తన వద్ద ఉంచుకొని చదివిపించి వివాహం చేసేవిధంగా పెద్దల సమక్షంలో ఒప్పదం చేసుకుని శాంతికి దూరంగా ఉంటున్నాడు. దీంతో శాంతి తన కుమారుడితో కలిసి దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని తన పుట్టినింటికి వచ్చి అక్కడే ఉంటోంది. శాంతి నుంచి విడిపోయిన సంవత్సరం తర్వాత పీనానాయక్ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆయన తన కుమార్తె మహేశ్వరి, రెండవ భార్య లలితతో కలిసి ఉంటున్నాడు. ప్రస్తుతం లలితకు కుమార్తె(14) ఉంది. ప్రస్తుతం పీనానాయక్ రెండవ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. పీనానాయక్‌కు స్వగ్రామంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమితో పాటూ హైదరాబాద్‌లోని బోడుప్పల్ లక్ష్మీనగర్ కాలనీలో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. తండ్రి, పినతల్లి వద్ద ఉంటూ మహేశ్వరి(23) బీఎస్సీ నర్సింగ్ విద్య పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో కాంట్రాక్టు పద్ధతిలో స్టాప్‌నర్స్‌గా పనిచేస్తుంది. మహేశ్వరికి వివాహం చేసేందుకు తండ్రి పీనానాయక్ పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో శంషాబాద్‌కు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేస్తున్న బంధువైన ఓ అబ్బాయికి మహేశ్వరిని ఇచ్చి వివాహం చేసుకునేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలో 2024 అక్టోబర్‌లో రూ.కోటి కట్నం ఇచ్చేవిధంగా ఒప్పందంతో నిశ్చితార్ధం చేసుకున్నారు. మహేశ్వరికి కట్నం కింద బోడుప్పల్ లక్ష్మీనగర్‌లోని ఒక ఇల్లుతో పాటు బంగారం, కొంత నగదు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. డిసెంబర్ 7న ఇంట్లో హత్య చేసి... మహేశ్వరిని చంపాలనే పథకంలో భాగంగా 2024 డిసెంబర్ 7న ఇంట్లో పాయసంలో నిద్రమాత్రలు వేసి మహేశ్వరికి ఇచ్చారు. ఆ పాయసం తాగిన మహేశ్వరి స్పృహతప్పి పడిపోవడంతో లలిత, రవిలు కలిసి మహేశ్వరిని గొంతునులిమి చంపాశారు. అనంతరం మహేశ్వరి మృతదేహాన్ని గోనేసంచిలో మూటకట్టి మరో వ్యక్తి సహాయంతో అదేరోజు రాత్రి రవి కారులో మృతదేహాన్ని తీసుకువచ్చి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి వద్ద మూసీనదిలో బ్రిడ్జి పిల్లర్ నెంబర్ 1 సమీపంలో ఇసుకలో గుంతతీసి పూడ్చిపెట్టారు. రాత్రి ఇంటికి వచ్చిన పీనానాయక్.. కుమార్తె మహేశ్వరి ఇంటికి రాకపోవడంతో ఎటు పోయిందని భార్య లలితను అడగగా డ్యూటీకని చెప్పి ఇంట్లో ఫోన్వదిలి వెళ్లిపోయిందని, తాను ప్రేమించిన వ్యక్తితో ప్రేమ వివాహం చేసుకుంటానని ఫోన్‌చేసి చెప్పిందని వివరించింది. దీంతో భార్య చెప్పిన విషయాన్ని నమ్మిన మహేశ్వరి తండ్రి పీనానాయక్ కుమార్తెకు వివాహ నిశ్చితార్ధం కావడంతో ప్రేమ విషయాన్ని బయటకు పొక్కుండా రహస్యంగా ఉంచి కుమార్తె కోసం వెతకడం ప్రారంభించాడు. మహేశ్వరిని వివాహం చేసుకునే అబ్బాయి మహేశ్వరి ఫోన్ ఎత్తడం లేదని, మెసేజ్‌లకు స్పదించడంలేదని మామ పీనానాయక్‌కు చెప్పడంతో అదోఇదో చెబుతూ నెట్టుకొస్తున్నాడు. ఈక్రమంలో ఆ అబ్బాయి ఒత్తిడి చేస్తుండటంతో వారం రోజుల క్రితం పీనానాయక్ తన కుమార్తె అదృశ్యంపై మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని కుటుంబ సభ్యుల ఫోన్‌కాల్ డేటా, లొకేషన్ ఆధారంగా పీనానాయక్ రెండవ భార్య లలితను, ఆమె ప్రియుడు రవిని విచారించారు. దీంతో మహేశ్వరి హత్య, మృతదేహం పూడ్చివేత విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో మేడిపల్లి పోలీసులు, శాలిగౌరారం పోలీసుల సహాయంతో శుక్రవారం ఉదయం నేరస్తులను పట్టుకొచ్చి పూడ్చిపెట్టిన ప్రాంతాన్ని గుర్తించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన మహేశ్వరి మృతదేహాన్ని వెలికి తీసి స్థానిక తహశీల్దార్ యాదగిరి సమక్షంలో పంచనామా జరిపి హైదరాబాద్‌కు చెందిన వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. మహేశ్వరి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహాన్ని మూసీనది ఇసుకలో పాతిపెట్టిన నిందితులు మృతురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు ఫోన్‌కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులుఆస్తి పోతుందనే కక్షతో... తనవద్ద ఉంటున్న సవతి కుమార్తె మహేశ్వరి పెళ్లికి కోటి రూపాయల కట్నం ఇస్తుండటం, కట్నం కింద ఇల్లు, బంగారం, నగదు ఇవ్వడం లలితకు నచ్చలేదు. దీంతో మహేశ్వరిపై లలిత కక్ష పెంచుకుంది. మహేశ్వరిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పీనానాయక్ పేరున బ్యాంకులో ఉన్న రూ.20 లక్షల నగదును భర్తపై ఒత్తిడి తెచ్చి తన ఖాతాలోకి మార్చుకుంది. ఇక ఇల్లు, బంగారం దక్కాలంటే మహేశ్వరిని భూమి మీదలేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో లలిత తన స్వగ్రామమైన వెలిశాలకు చెందిన తన మేనమామ కుమారుడు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అయిన రవితో వివాహేతర సంబంధం పెట్టకొని.. మహేశ్వరిని చంపితే ఆస్తి మొత్తం తనకు, తన కుమార్తెకే దక్కుతుందని, ఎలాగైనా మహేశ్వరిని చంపాలని రవితో కలిసి పథకం రచించింది. -
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
ఆలేరురూరల్: తాటిచెట్టు పైనుంచి జారి పడి గీత కార్మికుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం ఆలేరు మండలంలో చోటు చేసుకుంది. స్థాని కులు తెలిపిన వివరాల ప్రకారం.. శారాజిపేట గ్రామానికి చెందిన దూడల ఆంజనేయులు(45) కుల వృత్తిలో భాగంగా ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు కాలు జారి తాటి చెట్టు పైనుంచి కింద పడడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులకు వృద్ధురాలు అప్పగింతనల్లగొండ: కర్ణాటక రాష్ట్రానికి చెందిన వృద్ధురాలిని కలెక్టర్ శుక్రవారం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. వృద్ధురాలు నాగమ్మ తన ఇంట్లో సమస్యల కారణంగా మనస్థాపానికి గురై నల్లగొండకు వచ్చింది. సామాజిక కార్యకర్త శ్రీకాంత్ గత మూడు రోజుల క్రితం రైల్వే స్టేషన్లో వృద్ధురాలిని గుర్తించాడు. ఆమె వివరాలు అడిగి వయోవృద్ధుల శాఖకు సమాచారం ఇచ్చాడు. దీంతో వయోవృద్ధుల శాఖ అధికారి కృష్ణవేణి మెడికల్ కళాశాలలో చేర్పించాలని ఆదేశాలు ఇవ్వడంతో ఆమెకు ఇక్కడ ఆశ్రయం కల్పించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు శుక్రవారం నల్ల గొండకు రాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ నాగిరెడ్డి, శ్రీకాంత్ సునీల్ పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేతకోదాడరూరల్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న ఆటోను కోదాడరూరల్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్ఐ అనిల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తమ్మరబండపాలేనికి చెందిన షేక్. సికిందర్ కోదాడ మండల బీక్యాతండాలో రేషన్‌కార్డుల దారుల నుంచి నాలుగు క్వింటాళ్ల పాత రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేశాడు. వాటిని ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లికి చెందిన భరత్ కుమార్‌కు విక్రయించేందుకు వెళ్తున్నాడు. కూచిపూడి వద్ద పోలీసులు, సివిల్ సప్లై అధికారులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డారు. ఈమేరకు సికిందర్‌పై కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
నల్లగొండ : పట్టణంలోని రామగిరిలో గల గీతాంజలి అపార్ట్మెంట్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్(44) నల్లగొండ పట్టణం రామగిరిలోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ ఫొటో లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తూ.. సమీపంలోనే అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. కాగా, శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి సురేష్‌పై కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. సురేష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ● హతుడు నకిరేకల్‌కు చెందిన గద్దపాటి సురేష్‌గా గుర్తింపు -
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు
రామన్నపేట: పెంచుకున్న రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. పెరిగిన అప్పుల కారణంగా దంపతుల మధ్య వాగ్వాదం నెలకొంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోవడంతో మనస్థాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న భర్త మరుసటిరోజే గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒక్కరోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. హృదయ విదారకమైన సంఘటన రామన్నపేట మండలంలోని నిధానపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాలకు చెందిన బొబ్బల మల్లయ్య కుమార్తె కావ్య(25)కు రామన్నపేట మండలం నిధానపల్లి గ్రామానికి చెందిన జినుకల ఆంజనేయులు(31)తో ఏడేళ్ల క్రితం జరిగింది. వారికి నిహాన్, విహాన్ అనే ఇద్దరు ఆరేళ్లలోపు కుమారులు ఉన్నారు. ఆంజనేయులు నిధానపల్లిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం వారికి చెందిన రెండు పాడిగేదెలు, రెండు పాడి ఆవులు చనిపోయాయి. దాంతో పాటు యాసంగిలో సాగుచేసిన వరిపొలం ఎండిపోయింది. ఆర్థిక సమస్యల కారణంగా ఈనెల 8న భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అదేరోజు భర్త ఆంజనేయులు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. భర్త ఇంటికి తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురైన కావ్య గురువారం తమ వ్యవసాయబావి వద్ద పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త తెలుసుకున్న ఆంజనేయులు హైదరాబాద్ నుంచి రామన్నపేటకు బయలు దేరాడు. మార్గమధ్యంలో గడ్డిమందు కొనుగోలు చేశాడు. ఇంద్రపాలనగరం శివారులోని అయ్యప్పగుడి సమీపంలో దానిని సేవించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు ఫోన్‌చేసి తెలిపాడు. దీంతో వారు అక్కడకు వెళ్లి రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి తండ్రి సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మల్లయ్య తెలిపారు. కాగా.. కావ్య, ఆంజనేయులు మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం గ్రామంలో ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. దంపతుల మధ్య గొడవతో ఇంటి నుంచి వెళ్లిపోయిన భర్త మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న భార్య విషయం తెలుసుకుని గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డ భర్త తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు అనాథలైన చిన్నారులుతల్లిదండ్రులిద్దరూ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమారులు నిహాన్, విహాన్‌లు అనాథలయ్యారు. అంత్యక్రియల సమయంలో అక్కడ ఏం జరుగుతుందో తెలియక ధీనంగా చూస్తూ ఉండిపోయారు. చిన్నారుల చూసి బంధువులు, గ్రామస్తులు కంటతడి పెట్టారు. హృదయ విదారకమైన సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి
మాడ్గులపల్లి: రోడ్డు వెంట నిలిపిన ట్రాక్టర్‌ను బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, గోప్యానాయక్‌తండా గ్రామానికి చెందిన ముడావత్ ిపీర్యా(36) చిట్యాల మండలం నుంచి పనినిమిత్తం తన ద్విచక్ర వాహనంపై హాలియా మండలం సూరేపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన రేకా గోవింద్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచాడు. ఈక్రమంలో బైక్‌పై వస్తున్న పీర్యా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హాషిష్ ఆయిల్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
భువనగిరి: రూ.80 లక్షలు విలువ చేసే మత్తు పదార్థమైన హాషిష్ ఆయిల్‌ను తరలిస్తున్న ఇద్దరిని ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషరేట్‌లో సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాకు చెందిన పెట్ల శేఖర్ ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని శ్రీవిద్యా కళాశాలలో బీఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. ఎలాంటి ఉద్యోగం లేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుల ద్వారా హైదరాబాద్‌లో గంజాయి సరఫరా చేసే దుర్గా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇదే సమయంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో హషిష్ ఆయిల్ సరఫరా చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో శేఖర్ తన చిన్ననాటి స్నేహితుడైన అనిమినిరెడ్డి దుర్గారావును కలిసి హాషిష్ ఆయిల్ గురించి వివరించాడు. దీంతో దుర్గా నుంచి హాషిష్ ఆయిల్ సేకరించి ఇద్దరు తమకు తెలిసిన ప్రాంతాల్లో అవసరమైన వారికి విక్రయించాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం శేఖర్, దుర్గారావులు దుర్గా వద్ద సుమారు 4 కేజీల హాషిష్ ఆయిల్ కొనుగోలు చేశారు. భువనగిరి రైల్వేస్టేషన్లో దిగి మండలంలోని అనంతారం గ్రామానికి వెళ్లే సర్వీస్ రోడ్డు మార్గంలో అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో సమాచారం మేరకు ఎస్ఓటీ, భువనగిరి రూరల్ పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. వారి వద్ద 4 కేజీల హాషిష్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు. ఆయిల్‌తో పాటు రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇదరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని, దుర్గా పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. సమావేశంలో డీసీపీ అక్షాంశ్ యాదవ్, ఎస్ఓటీ పోలీసులు, రూరల్ ఎస్హెచ్ఓ సంతోష్‌కుమార్ ఉన్నారు. రూ.80లక్షల విలువగల హాషిష్ ఆయిల్ స్వాధీనం -
మద్దతు ధర చెల్లింపులో ప్రభుత్వాలు విఫలం
మిర్యాలగూడ: రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమాయ్యయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్ట ణంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిల్లుల్లో అమ్ముకున్న ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్ అందించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాల్లో రెండు సీజన్లు అయ్యాయని, ఇప్పటి వరకు రైతులకు రైతుభరోసా అందించలేదని, వచ్చే సీజన్ నాటికై నా మొత్తం చెల్లించాలని అన్నారు. పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీశ్చంద్ర, రవినాయక్, బావండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, అంజాద్, పాదూరి గోవర్ధని, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, రామారావు పాల్గొన్నారు. ఫ జూలకంటి రంగారెడ్డి -
నెల రోజులు.. పోలీస్ యాక్ట్
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్ నల్లగొండ: శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలరోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిదే జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగేలా, ప్రజా ధనానికి నష్టం కల్గించేలా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదని తెలిపారు. ఈ నిషేధ ఉత్తర్వులను చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాగర్ కాల్వలకు నీటి నిలిపివేతనాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వలకు గురువారం సాయంత్రం నీటిని నిలిపి వేశారు. యాసంగి పంటకుగాను అధికారులు గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీటిని విడుదల చేశారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాలు సాగైంది. ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 115 రోజులపాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశారు. ధాన్యానికి మద్దతు ధర అందించాలి మిర్యాలగూడ: రైతులు మిల్లు పాయింట్ల వద్దకు తీసుకొస్తున్న ధాన్యానికి మద్దతు ధర అందించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. గురువారం మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్‌తో కలిసి రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల నుంచి రైస్ మిల్లుల్లో ధాన్యం ధరను తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, మిల్లర్లు మద్దతు ధరలకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. ధర అమాంతం తగ్గించి కొటే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైస్‌మిల్లుల్లో అన్నిరకాల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. రైస్ మిల్లుల్లో తూకం తేడాలు రావొద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ హరీష్, తహసీల్దార్ హరిబాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వెంకటరమణ చౌదరి, బండారు కుశలయ్య, జైయిని ప్రకాశ్‌రావు, గుడిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
తండాల్లో మౌలిక వసతులు కల్పించాలి
నాగార్జునసాగర్: దర్తి ఆభాజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకం కింద గిరిజన తండాల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పాటు అంచనాలు రూ పొందించాలని కలెక్టర్ ఇలాత్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం నందికొండ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దర్తి ఆభా యోజన కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి గతేడాది నవంబర్ 14న ప్రారంభించారని, ఈ పథకం అమలులో భాగంగా అత్యంత వెనుకబడిన గిరిజన గ్రామాలు, తండాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో ఎంపిక చేసిన గిరిజన తండాల్లో మౌలిక వసతుల కల్పనకు సుమారు రూ.95కోట్ల వ్యయం అయ్యే అవకాశం ఉందని, అంచనాల దస్త్రాలు అందగానే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ప్రత్యేకించి నాగార్జునసాగర్ నియోజకవర్గం పరిధిలో తిరుమలగిరి(సాగర్)పెద్దవూర, త్రిపురారం మండలాల్లో గుర్తించిన 18 తండాల్లో అన్నిరకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ అమిత్, గిరిజన సంక్షేమశాఖ ఇన్చార్జి అధికారి రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, మత్స్యశాఖ ఏడీ చరిత, నందికొండ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పెద్దవూర తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, విద్యుత్‌శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
అకాల వర్షం.. ఆగమాగం
నల్లగొండ, గుర్రంపోడు, పెద్దవూర: జిల్లా కేంద్రంతోపాటు గుర్రంపోడు, పెద్దవూర తదితర మండలాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కుసింది. నల్లగొండ పట్టణంలో గంటపాటు ఈదురు గాలులు వీచడంతో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి పట్టణమంతా అంధకారమైంది. రామగిరి, గడియారం ప్రాంతం, పానగల్ రోడ్డు, వన్‌టౌన్, టూటౌన్ ప్రాంతాల్లో వాహనదారులు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. గుర్రంపోడు మండలంలో చామలేడు, కొప్పోలు, పిట్టలగూడెం, కోయగూరవానిబావి గ్రామాల్లో వడగండ్ల వానకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి వరద నీట కొట్టుకుపోయింది. ఆమలూరులో మేకలను కాస్తున్న కాపరి మేకల రాములు(60)పై పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందాడు. బ్రాహ్మణగూడెం గ్రామంలో మేడ చంద్రయ్య ఇంటి రేకుల పైకప్పు లేచిపోయింది. పిట్టలగూడెంలో కేసాని అనంతరెడ్డి సొరకాయ పందిరి సాగు దెబ్బతిన 50 టన్నుల పంటకు నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. అలాగే పెద్దవూర మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షంతో తమ ధాన్యం తడిసిందని చాలా మంది కన్నీరుమున్నీరయ్యారు. అధికారులు టార్పాలిన్లు పంపిణీ చేయకపోవడంతోనే ధాన్యం తడిసిందని రైతులు వాపోతున్నారు. ఫ నల్లగొండ, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో గాలివాన బీభత్సం ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఫ నష్టం వాటిల్లిందని రైతుల ఆవేదన -
రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం
నల్లగొండ టూటౌన్, తిప్పర్తి: ధాన్యాన్ని కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ, తిప్పర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ మోర్చా, బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా మంత్రులు, సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవాల్వల్సి వస్తదనే కారణంతోనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలు కురుస్తున్నాయని, రైతుల వడ్లు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. తేమ, తాలు పేరుతో బస్తాకు రెండు కిలోల తరగు తీస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్, పడమటి జగన్మోహన్రెడ్డి, పోతెపాక లింగస్వామి, యాదగిరిచారి, మిర్యాల వెంకన్న, గడ్డం వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పకీరు మోహన్‌రెడ్డి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కన్మతరెడ్డి అశోక్‌రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, సీతారాంరెడ్డి, పార్టీ తిప్పర్తి మండల అధ్యక్షుడు వంగూరి రవి తదితరులు పాల్గొన్నారు. ఫ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి -
రైతులను పట్టించుకోని మంత్రులు
నల్లగొండ టూటౌన్: మంత్రులు గాలి మోటార్లలో వస్తూపోతూ గాలి మాటలు మాట్లాడుతున్నారే తప్ప జిల్లా రైతులను పట్టించుకోవడం లేదని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆట్లాడారు. ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా వారు ఏనాడూ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించలేదన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ముందు చూపు లేకపోవడం వల్ల రైతులు మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో సన్న ధాన్యం మిల్లులకు అమ్ముకుంటే నేడు దొడ్డు ధాన్యం కూడా రైతులు మిల్లర్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయమై కలెక్టర్‌తో మాట్లాడదామని ఫోన్ చేస్తే ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎత్తడం లేదన్నారు. మంత్రి వస్తే ఆయన వెంటే కలెక్టర్ తిరుగుతూ, కాంగ్రెస్ నేతలకు పనిచేస్తుంది తప్ప రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టడం లేదన్నారు. కలెక్టర్ అందుబాటులో ఉంటూ ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించాలన్నారు. లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిగా తెరుచుకోలేదని, సివిల్ సప్లయ్ మంత్రి ఏమి చేస్తున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 13న సన్నాహక సమావేశం ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జిల్లా నుంచి 3 వేల మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి వెళ్లాలని నిర్ణయించామన్నారు. అందుకు సంబంధించి ఈ నెల 13న లక్ష్మీగార్డెన్స్‌లో నల్లగొండ నియోజక వర్గ స్థాయి సన్నాహక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో కటికం సత్తయ్యగౌడ్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బొర్ర సుధాకర్, సహదేవరెడ్డి, జి.వెంకటేశ్వర్లు, తండు సైదులుగౌడ్, కరీంపాషా, సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి -
బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి –జటంగి నర్సమ్మ, కేతేపల్లి అందరం కడుపునిండా తింటున్నాం.. ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయి. నూకలు వేరు చేసి వండితే అన్నం చాలా బాగా ఉంటుంది. లేకపోతే ముద్దవుతోంది. దొడ్డు బియ్యం తినే బాధ తప్పింది. సన్నబియ్యాన్ని అందరం కడుపునిండా తింటున్నాం. –కాటేపల్లి పూలమ్మ, పెద్దవూర సన్న బియ్యం ఇవ్వడం సంతోషకరం ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. సన్న బియ్యం బాగానే ఉన్నాయి. అన్నం వండితే కొంచెం మెత్తగా అవుతుంది. కొత్త బియ్యం కావడం, రెండు, మూడు రకాల బియ్యం కలవడం వల్ల అలా అయి ఉండవచ్చు. రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తుండడంతో పేదలకు బయట బియ్యం కొనుక్కునే ఖర్చు తగ్గింది. – పున్నమ్మ, ఆగామోత్కూర్, మాడ్గులపల్లి మండలం పేదల కడుపు నింపుతున్న సన్నబియ్యం సన్న బియ్యం పేదల కడుపు నింపుతోంది. ఇంతకు ముందు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినడానికి వీలుగా లేకుండా పోయేది. ఈ సన్న బియ్యం ఎల్లకాలం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి. – కుడికిళ్ల నీలమ్మ, పెద్దఅడిశర్లపల్లి -
రాయితీపైనే రాబట్టేలా..!
నల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను పసూలుకు యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఆస్తి పన్ను ముందస్తుగా చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం మినహయింపు ఇవ్వనున్నారు. ఈ ఐదు శాతం రాయితీ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్ మున్సిపాలిటీల భవన యజమానులకు వర్తించనుంది. దీంతో ఎక్కువ మంది ముందస్తుగానే పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. దీని ద్వారా ఆస్తి పన్ను బకాయిలు తగ్గించుకోవడానికి ఉపకరిస్తుందని మున్సిపల్ అధికారులు భావిస్తున్నారు. బకాయిలతో సహ చెల్లిస్తేనే రాయితీ వర్తిపు... మున్సిపాలిటీల్లో నివాస భవనాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2025 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్నును ఈనెల 30వ తేదీలోగా పూర్తి చెల్లించిన వారికి పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహ చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఏడాదికి లక్ష రూపాయల ఆస్తి పన్ను చెల్లించే వారు ముందస్తుగా చెల్లించడం ద్వారా రూ.5 వేలు లబ్దిపొందనున్నారు. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం చెల్లించాల్సి ఉండడంతో.. ప్రజలు ఈ ఐదు శాతం రాయితీ వినియోగించుకుని లబ్ధి పొందవచ్చు. నీలగిరి టార్గెట్ రూ.10 కోట్లు నీలగిరి మున్సిపాలిటీలో 40 వేల భవనాలు ఉన్నాయి. ఇక్కడ సంవత్సరానికి ఆస్తి పన్ను డిమాండ్ రూ.17.25 కోట్లు ఉంది. ఈ ముందస్తు పన్ను రాయితీలో భాగంగా ఈ ఒక్క నెలలో రూ.10 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక, మిర్యాలగూడలో రూ.3 కోట్లు, దేవరకొండలో రూ.2.26 కోట్లు, చండూరులో రూ.7 లక్షలు, నకిరేకల్‌లో రూ.50 లక్షలు టార్గెట్ పెట్టుకొని పని చేస్తున్నారు. కాగా హాలియా, చిట్యాలలో టార్గెట్ పెట్టుకోకుండానే సాధ్యమైనంత వరకు ఎక్కువగా పన్ను వసూలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుకు ప్రణాళిక ఫ ఏడాది పన్ను ఒకేసారి చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఫ నెలాఖరు వరకు గడువు.. ఫ ఈ నెలలోనే అధిక మొత్తంలో పన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్న మున్సిపాలిటీలు సద్వినియోగం చేసుకోవాలి సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఒకేసారి చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలి. బకాయిలతో సహ ఈ ఏడాది పన్ను చెల్లిస్తే రాయితీ వర్తిస్తుంది. ప్రభుత్వం కల్పించిన ఐదు శాతం రాయితీ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – సయ్యద్ ముసాబ్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్, నల్లగొండ జిల్లాలోని మున్సిపాలిటీల్లో భవనాలు, ఆస్తి పన్ను వివరాలు ఇలా.. మున్సిపాలిటీ ఆస్తి పన్ను భవనాలు ఈ నెలలో (రూ.కోట్లలో) టార్గెట్ (రూ.కోట్లలో) నల్లగొండ 17.25 40,000 10మిర్యాలగూడ 09.50 12,306 03 హాలియా 02.05 5,640 టార్గెట్ లేదు దేవరకొండ 03.29 7224 02.26చండూరు 67.50 (లక్షలు) 3,682 07(లక్షలు) చిట్యాల 1.40 3,207 టార్గెట్ లేదు నకిరేకల్ 4.00 8,000 50 (లక్షలు) జూన్ దాటితే అపరాధ రుసుం.. మున్సిపాలిటీల్లో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్ను మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై అపరాధ రుసుం పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్ను డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఆస్తి పన్ను చెల్లించని వారు అపరాధ రుసుంతో సహ చెల్లించాల్సి ఉంటుంది. గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్‌గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. భవన యజమానులంతా అపరాధ రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రాయితీ పొందవచ్చు. -
పోషణ పక్షం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
నల్లగొండ : పోషణ పక్షం– 2025 అమలులో భాగంగా ఈనెల 11న దేవరకొండలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమానికి అవసరమైన ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పోషణ పక్షం– 2025పై బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ పక్షంలో భాగంగా పిల్లలు, గర్భిణుల బరువు తీయడం, వారి సంరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. దేవరకొండ డివిజన్లో మహిళలు, బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అవగాహన కల్పించేందుకుగాను ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఏపీడీ శారద, ఉపవైద్యాధికారి వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా పార సరఫరాల ఇన్చార్జి అధికారి రాజేష్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు 384 కేంద్రాలు
చిట్యాల : యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలుకు జిల్లా వ్యాప్తంగా 384 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన పీఏసీఎస్ కార్యాలయ నూతన భవనాన్ని, వెలిమినేడు, పెద్దకాపర్తి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వహకులు సమన్యయంతో పని చేసి ధాన్యం కొనుగోలును వేగంవంతం చేయాలన్నారు. ధాన్యం డబ్బులను వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చేలా ఏఈఓలు, కేంద్రాల నిర్వాహకులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నకిరేకల్ నియోజకవర్గంలో 45 దొడ్డు రకం, 05 సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ పత్యానాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఏనుగు రఘుమారెడ్డి, సీఈఓ రాజమల్లు, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పిశాటి భీష్మారెడ్డి, పీఎసీఎస్ వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, డైరెక్టర్ ఎదుళ్ల అజిత్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సిహ, సుర్కంటి సత్తిరెడ్డి, కొంపెల్లి వెంకట్‌రెడ్డి, గోలి గణేష్ పాల్గొన్నారు. 14 వరకు రాజీవ్‌యువ వికాసం దరఖాస్తులు నల్లగొండ : రాజీవ్ యువ వికాస పథకానికి ఈ నెల 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం ఆమె అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు, దివ్యాంగులు, తెలంగాణ ఉద్యమకారులు, ఎస్సీ, ఎస్టీ ఉపకులాల వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. గతంలో ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు అన్ని పత్రాలను జతచేసి దరఖాస్తులను ఆయా కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు. అర్హత ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీపీ వర్గాల ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
దేవరకొండ : భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ సభ్యుడు సంజీవ్ ముదిరాజ్తో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాయిని మాధవరెడ్డి, దొంతం సంజీవరెడ్డి, ఎంఏ సిరాజ్‌ఖాన్, అలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్, ముక్కమళ్ల వెంకటయ్య, శిరందాసు కృష్ణయ్య, వేణుధర్‌రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ -
నల్లగొండ రీజియన్‌కు 152 ఎలక్ట్రిక్ బస్సులు
ప్రయాణికులకు మెరుగైన రవాణా ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడానికి అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతోంది. త్వరలోనే రీజియన్‌కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి. ఆయా రూట్లలో బస్సుల కొరత తీరడంతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందనుంది. –జాన్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం భానుపురి (సూర్యాపేట) : నల్లగొండ ఆర్టీసీ రీజి యన్ పరిధిలో బస్సుల కొరత తీరనుంది. డొక్కబస్సుల స్థానంలో త్వరలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. నల్లగొండ రీజియన్‌కు 152 బస్సులను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 41 ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట డిపోకు చేరుకున్నాయి. మిలిగిన బస్సులు త్వరలోనే ఆయా డిపోలకు రానున్నాయి. ఈ బస్సులన్నీ చార్జింగ్తోనే నడవనున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట, నల్లగొండలో ఈ చార్జింగ్ పాయింట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. రెండుచోట్ల చార్జింగ్ పాయింట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఈ బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో ప్రధాన బస్టాండ్ అయిన సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చార్జింగ్ పాయింట్లో రోజుకు ఐదారు బస్సులకు మాత్రమే చార్జింగ్ పెడుతున్నారు. సూర్యాపేట డిపోకు దాదాపు 77 బస్సులు రావడంతో కొత్తబస్టాండ్ డిపో ఆవరణలోనూ చార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నల్లగొండలో కూడా చార్జింగ్ పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా బస్టాండ్ల నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ మొత్తంలో బస్సులను నడపనున్నారు. నల్లగొండ – సూర్యాపేట, సూర్యాపేట – వరంగల్, సూర్యాపేట – ఖమ్మం, నల్లగొండ– మిర్యాలగూడ రూట్లలో ఇలా డిపోల పరిధిలో బస్సులను నడపనున్నారు. డ్రైవర్లకు శిక్షణ అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు హైదరాబాద్‌లో డ్రైవర్లకు సుమారు 20 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిసిన వెంటనే బస్సుల రూట్లను పూర్తిస్థాయిలో కేటాయిస్తారు.ఫ సూర్యాపేటకు 75, నల్లగొండకు 77 బస్సుల కేటాయింపు ఫ ఇప్పటికే సూర్యాపేట డిపోకు 41 బస్సులు రాక ఫ త్వరలో రోడ్డెక్కనున్న బస్సులు -
చెరువు శిఖం ఆక్రమణపై విచారణ
నార్కట్‌పల్లి : చెర్వుగట్టు గ్రామ శివారులో గల 50 ఎకరాల చెరువు శిఖం ఆక్రమణపై బుధవారం జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి సమగ్ర విచారణ చేపట్టారు. గ్రామంలోని 50 ఎకరాల చెరువు శిఖం భూమిని చెర్వుగట్టు గ్రామ పంచాయతీ యశోధ టౌన్‌షిప్‌కు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందడంతో.. 2012 నుంచి 2020 వరకు ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులపై విచారణ చేపట్టారు. విచారణలో డీఎల్పీఓ లక్ష్మీనారాయణ, చందంపేట ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓలు సత్యనారాయణ, సురేష్‌రెడ్డి, కార్యదర్శులు శ్రవణ్‌కుమార్‌రెడ్డి, జ్యోతి, రిటైర్డ్ కార్యదర్శి యాదగిరిరెడ్డి ఉన్నారు. చెరువులు నింపితేనే భూగర్భ జలాల పెంపుచిట్యాల : చెరువులను నింపుకోవటం ద్వారానే భూగర్భ జలాల పెరుగుతాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలంలోని ఉరుమడ్ల ఊర చెరువు మరమ్మతు పనులను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రూ.1.18 కోట్లతో ఊర చెరువు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, ఏఎంసీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, చెరుకు సైదులు, పొలగోని స్వామి, పల్లపు బుద్దుడు, పట్ల జనార్దన్, జనపాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తేవాలిరామగిరి(నల్లగొండ) : ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. బుధవారం నల్లగొండ సమీపంలో ఆర్జాలబావిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని తూర్పార యంత్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కేంద్రం నిర్వాహకులకు సహకరించాలని రైతులకు సూచించారు. ఆయన వెంట డీసీఎస్ఓ హరీష్, డీటీ దీపక్, ఏఓ ఎస్.శ్రీనివాస్ ఉన్నారు. ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉండాలి చిట్యాల, నార్కట్‌పల్లి : ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏఈఓలు రైతులకు అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్ సూచించారు. బుధవారం నార్కట్‌పల్లి, చిట్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ధాన్యం కొనుగోలు తీరుపై ఆరాతీశారు. రైతులు ధాన్యాన్ని అరబెట్టి తేమ శాతం 17 లోపు ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. తూర్పార బట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఆయన వెంట డీసీఓ పత్యానాయక్, మానిటరింగ్ ఆఫీసర్ రేణుక, ఏఓ గౌతమ్, పీఏసీఎస్ సీఈఓ బ్రహ్మాచారి, ఏఈఓలు మనిషా, నవీన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్ ఇన్చార్జి రాము, నాగరాజు, వెంకటేశ్వర్లు, నరేష్ తదితరులు ఉన్నారు. -
పరిశోధనలతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆమ్లికాన్ కంపెనీ డైరెక్టర్ కుషాల్ వాంగుడేల్ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు పోటీన్ల అధ్యయనంలో ఎస్డిస్పేజ్, వెస్ట్రన్ బ్లాటింగ్ విధానంపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా అనేక మెళకువలు తెలుస్తాయని, ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేసి తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ప్రేమ్‌సాగర్, విభాగ అధిపతి తిరుమల, కె.రామచందర్‌గౌడ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పరీక్షలు నిర్వహించలేం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో తాము డిగ్రీ పరీక్షలు నిర్వహించే పరిస్థితిలో లేమని తెలంగాణ అఫిలేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎంజీయూ వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు రాక యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. 9 నెలలుగా వివిధ రూపంలో నిరసన తెలియజేసినా ఫీజు బకాయిలు విడుదల చేయలేదన్నారు. కొన్ని జిల్లాలకు విడుదల చేసి నల్లగొండ జిల్లాపై వివక్ష చూపడం సరికాదన్నారు. అంతకుముందు ఎంజీయూ ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ మారం నాగేందర్‌రెడ్డి, ఎం.సైదారావు, ప్రవీణ్, మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులకు త్వరలో పట్టాలు
మిర్యాలగూడ, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : ఏన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న భూ సమస్యలు వారం, పది రోజుల్లో తొలగిపోనున్నాయి. కొద్ది రోజుల్లోనే రైతులకు పట్టాలు అధించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. నూతన ఆర్ఓఆర్ – 2024 చట్టాన్ని తీసుకువచ్చే క్రమంలో అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తిరుమలగిరి(సాగర్) మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అందులో భాగాంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో 14 రెవెన్యూ, సర్వే బృందాలు, 80 మందితో ఏడు నెలలుగా గ్రామాల వారీగా ఎంజాయిమెంట్ సర్వే పూర్తి చేసి అర్హులను గుర్తించారు. అర్హులైన రైతులకు అసైండ్‌మెంట్ పట్టాలు ఇవ్వనున్న నేపథ్యంలో మంగళవారం మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ కార్యాలయంలో అసైన్మెంట్ కమిటీ సభ్యులు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి.. అధికారులతో సమావేశమై పట్టాల పంపిణీపై చర్చించారు. ముందుగా మొదటి విడతలో భాగంగా తిరుమలగిరి(సాగర్) మండలంలోని 13 గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో కాస్తూ కబ్జా కలిగి ఉండి సేద్యం చేసుకుంటూ అర్హత కలిగి ఉన్న సుమారు 4500 మంది రైతులకు గాను 4000 ఎకరాలకు లావుణి పట్టాలు పంపిణీ చేయడానికి అసైన్మెంట్ కమిటీ ఆమోదించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంతవరకు ధరణిలో నమోదు కాని పరేడ్, ఉడాఫ్ నంబర్లను కూడా గుర్తించి ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. ఈ అసైన్మెంట్ కమిటీలో చైర్మన్‌గా జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరావు, సభ్యులుగా అడిషినల్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి ఉండనున్నారు. కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరావు ఆమోదించగానే అర్హులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. సమావేశంలో తహసీల్దార్లు ఎస్.అనిల్‌కుమార్, కృష్ణయ్య, కృష్ణ, దశరథ, మధుసుధన్‌రెడ్డి, శ్రీనివాస్, హరిబాబు, రఘు, శ్రీనివాస్, ప్రమీల, జవహర్, పుష్పలత తదితరులు ఉన్నారు.ఫ మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అసైన్మెంట్ కమిటీ సమావేశం -
వస్తోంది.. టీబీఎం బేరింగ్!
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు త్వరలో పునఃప్రారంభంఇన్లెట్లో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ అనుమతులకు ప్రతిపాదనలు షియర్‌జోన్ కారణంగా ఇన్లెట్ 14వ కిలోమీటరు వద్ద సొరంగం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఇన్లెట్లోని టీబీఎం పూర్తిగా ధ్వంసమైంది. పైగా అక్కడి ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో కూలిన ప్రాంతానికి కంటే ముందు నుంచి యాభై మీటర్ల పక్కకు వెళ్లి అక్కడి నుంచి సమాంతరంగా డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ పద్ధతిలో టన్నెల్‌ను తవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రతిపాదనలను రూపొందించి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి కోసం పంపించింది. ఆ అనుమతులు వస్తే ఇన్లెట్ నుంచి కూడా పనులను చేపట్టే అవకాశం ఉంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.15 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ఔట్లెట్లో తవ్వకం పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. మన్నెవారిపల్లిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ఔట్‌లెట్‌లోని టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) బేరింగ్ పాడైపోవడంతో 2023 జనవరిలో తవ్వకం పనులు ఆగిపోయాయి. అమెరికాలోని రాబిన్స్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన బేరింగ్, ఇతర పరికరాలను జనవరి నెలలో రాబిన్స్ కంపెనీ అమెరికా నుంచి ప్రత్యేక నౌకలో చైన్నె పోర్టుకు పంపించింది. అది 20 రోజుల కిందట చైన్నెపోర్టుకు చేరుకుంది. నౌక నుంచి దానిని బయటికి తీసుకొచ్చి, పరిశీలించేందుకు 20 రోజుల సమయం పట్టింది. రెండురోజుల కిందట ఆ బేరింగ్ ప్రత్యేకమైన భారీ వాహనంలో చైన్నె పోర్టు నుంచి బయలుదేరింది. రాత్రి వేళల్లోనే ప్రయాణించనున్న వాహనం బేరింగ్ మరో 20–25 రోజుల్లో టన్నెల్ ఔట్లెట్ ప్రారంభం ప్రాంతమైన మన్నెవారిపల్లికి చేరుకోనుంది. రోడ్డు మార్గంలోనే బేరింగ్‌ను ప్రత్యేక వాహనంలో తీసుకొస్తున్నారు. అయితే ప్రధాన రోడ్డుపై రద్దీ ఉండే సమయంలో కాకుండా కేవలం రాత్రి వేళలోనే వాహనం ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు. అందుకే ఇక్కడికి రావడానికి ఎక్కువ సమయం పడుతుందని పేర్కొంటున్నారు. దానిని నేరుగా మన్నెవారిపల్లికి తీసుకొచ్చిన తరువాత అన్లోడ్ చేయడం, సొరంగంలోకి తీసుకెళ్లడం, టీబీఎంకు బిగించడం వంటి కీలకమైన పనులను చేపట్టాల్సి ఉంటుంది. అందుకు రెండు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆ పనులు పూర్తయ్యాక తవ్వకం పనులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఔట్లెట్లో తవ్వాల్సింది.. 3.545 కిలోమీటర్లు నాగర్‌కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం రిజర్వాయర్ సమీపంలోని దోమలపెంట నుంచి మన్నెవారిపల్లి వరకు 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగాన్ని 10 మీటర్ల డయాతో (వెడెల్పు) తవ్వేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శ్రీశైలం వద్ద నీటిని తీసుకునే ఇన్లెట్ నుంచి, మన్నెవారిపల్లి ఔట్ లెట్ నుంచి రెండు వైపులా సొరంగం తవ్వకం పనులను చేపట్టింది. రెండువైపులా కలిపి 34.37 కిలోమీటర్లు టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అందులో ఔట్లెట్ నుంచి ఇప్పటివరకు 20.435 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు పూర్తి కాగా, మరో 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. అయితే అక్కడ రాయి గట్టిదనం ఎక్కువగా ఉన్నందున తరచూ బేరింగ్, ఇతర పరికరాలు పాడైపోతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు బేరింగ్ పాడైపోయింది. దీంతో 2023 జనవరిలో పనులు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బేరింగ్ తెప్పించి పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది.అదనంగా తవ్వే ఆలోచనల్లో ప్రభుత్వం చైన్నె పోర్టు నుంచి బేరింగ్ వస్తుండటంతో మరికొద్ది నెలల్లో పనులను ప్రారంభించే అవకాశం ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఔట్లెట్లో తవ్వాల్సింది 3.545 కిలోమీటర్లే అయినా ఇంకా ఎక్కువ దూరం తవ్వే ఆలోచనలను ప్రభుత్వం చేస్తున్నట్లు తెలిసింది. మొత్తం టన్నెల్లో 34.37 కిలోమీటర్లు పూర్తయింది. అందులో ఇన్లెట్లోనూ 13.935 కిలోమీటర్ల తవ్వకం పూర్తయింది. రెండింటికి మధ్యలో మిగిలిన 9.56 కిలోమీటర్లలో ఇన్‌లెట్‌లో 6.015 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. 2019లో వరదల కారణంగా భారీగా సీపేజీ రావడం మొదలైంది. దాంతో అప్పటి నుంచి అక్కడ పనులు ఆగిపోయాయి. అయితే ఫిబ్రవరి 21వ తేదీన తవ్వకం పనులను తిరిగి ప్రారంభించారు. 150 మీటర్లు తవ్వగానే 22వ తేదీన ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున బురదతో కూడిననీరు రావడంతో టన్నెల్ కుప్పకూలిపోయింది. 200 మీటర్ల మేర మట్టితో నిండిపోయింది. 8 మంది ఉద్యోగులు, కార్మికులు అందులోనే కూరుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను మాత్రమే బయటకు తీయగలిగారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఔట్లెట్ నుంచి ఇంకా ఎక్కువ దూరం సొరంగం తవ్వేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ఫ చైన్నె పోర్ట్ నుంచి భారీ వాహనంలో రప్పిస్తున్న అధికారులు ఫ 25 రోజుల్లో మన్నెంవారిపల్లికి చేరనున్న బేరింగ్ ఫ మూడు నెలల్లోగా ప్రారంభం కానున్న పనులు ఫ దోమలపెంట ఇన్‌లెట్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు ఫ ఇన్‌లెట్‌లో ప్రత్యామ్యాయ తవ్వకం దిశగా కసరత్తు -
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్
త్వరలోనే ఆధార్ ఈ– సంతకం ప్రస్తుతం రిజిస్ట్రేషలన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసే వారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమయం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఈ– సంతకం విధానాన్ని ప్రవేశపెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.చౌటుప్పల్: ఇళ్లు, ఇంటిస్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు గతంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి. ఽగత ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూములు తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగేవి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షణ కొనసాగుతుండేది. ఈ పద్ధతికి స్వస్తి పలకడంతోపాటు సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నూతనంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ప్రయోగాత్మకంగా 22 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ కార్యాలయాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో భువనగిరి, చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు 48 స్లాట్లుగా విభజన ఇప్పటివరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో అత్యధిక డాక్యుమెంట్లు సమర్పిండంతో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ రోజువారీ పనివేళలను 48స్లాట్లుగా విభజించనున్నారు. ప్రజలు డాక్యుమెంట్ రైటర్లపై ఏమాత్రం ఆధారపడకుండా registration.tela ngana.gov.in వెబ్సైట్లో తమకు అనుకూలమైన తేదీ, రోజును ఎంచుకొని ఆ సమయానికి కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ పూర్తిగా 10– 15నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది. రేపటి నుంచి భువనగిరి, చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు ఇళ్లు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానంస్లాట్ బుకింగ్ లేని ఐదు డాక్యుమెంట్లకు అనుమతి స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్లాట్ బుకింగ్ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చేసుకోని 5 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. -
11న ప్రత్యేక ప్రజావాణి
నల్లగొండ : జిల్లాలోని వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 11న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వృద్ధులు, దివ్యాంగులు హాజరై వారి సమస్యలపై వినతులు అందజేయవచ్చని ఆమె తెలిపారు. రైస్ మిల్లుల వద్ద నేటి నుంచి రెవెన్యూ అధికారులకు విధులుమిర్యాలగూడ : రైస్ మిల్లుల వద్ద ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే విధంగా చూసేందుకు బుధవారం నుంచి రెవెన్యూ అధికారులు మిల్లుల వద్ద విధులు నిర్వహించనున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ నారాయణ్ అమిత్ ఆయా మిల్లులకు రెవెన్యూ అధికారులను కేటాయించారు. మిల్లుల వద్ద ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులే పరిష్కరించాలని పేర్కొన్నారు. ఏదైనా మిల్లు వద్దకు అధికంగా ట్రాక్టర్లు ఇచ్చి ఇబ్బందులు ఎదురైతే ఇతర మిల్లులకు పంపించాలని సూచించారు. రోజూ ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఫాం–బీ రిజిస్టర్లో ధాన్యం కొనుగోలు వివరాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలినల్లగొండ : మహాత్మా జ్యోతిరావుపూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఈనెల 11న జ్యోతిరావుపూలే జయంతి ఏర్పాట్లపై మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జ్యోతిరావుపూలే జయంతిని ప్రభుత్వ నిబంధనల మేరకు ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు మాట్లాడుతూ జ్యోతిరావుపూలే జయంతిని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం ● డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి మునుగోడు : రాష్ట్రంలోని రైతుల ఆర్థికాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మునుగోడు మండలంలోని కొరటికల్, పులిపలపుల, ఊకొండి, కచలాపురం, కొంపల్లి తదితర గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ కూడా ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో చండూరు మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, నాయకులు పాల్వాయి చెన్నారెడ్డి, భీమనపల్లి సైదులు, వేమిరెడ్డి జితేందర్‌రెడ్డి, ఏఓ పద్మజ, ఏపీఎం మహిశేశ్వరరావు, సీఈఓ సుఖేందర్ తదితరులు పాల్గొన్నారు. వృత్తి శిక్షణకు దరఖాస్తులు నల్లగొండ : ఆసక్తిగల కిషోర బాలికలు (విద్యార్థినులు) వృత్తి శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మేనేజర్ ఎ.అనిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కిషోర బాలికల పథకం ద్వారా బ్యూటిషియన్, టైలరింగ్ కోర్సుల్లో వృత్తి శిక్షణ తరగతులు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. బ్యూటిషియన్, టైలరింగ్ కోర్సులకు 8వ తరగతి, వయసు 15 నుంచి 18 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. ఒక్కో కోర్సులో 25 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం (మహిళా ప్రాంగణం, నల్లగొండ)లో సమర్పించాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 76600 22517 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి మాడ్గులపల్లి : పేదలకు సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామంలో జానకమ్మ ఇంట్లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్‌అమిత్, జిల్లా పౌరసరఫరాల ఇన్చార్జి అధికారి హరీష్కుమార్తో కలిసి ఆమె ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యంతో వండిన భోజనం చేసి మాట్లాడారు. సన్నబియ్యం ఇవ్వడంపై లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారన్నారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా, లోపాలు లేకుండా సన్న బియ్యాన్ని సక్రమంగా సరఫరా చేస్తున్నామన్నారు. అంతకుముందు ఆమె పాములపాడు పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలు, ఓపీ, ఇన్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోరు, మోటార్‌ను మంజూరు చేశారు. పీహెచ్‌సీకి ఎదురుగా ఉన్న పాడుబడిన భవనాన్ని వెంటనే తొలగించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ తిరుమలస్వామి, వైద్యాధికారులు సత్యనారాయణ, సంజయ్, మాజీ జెడ్పీటీసీ పుల్లెంల సైదులు, గడ్డం పురుషోత్తంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, మునుగోటి యాదగిరి, నాగరాజు, యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రూ.1800 కోట్లతో ‘డిండి’ పనులు
దేవరకొండ : పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ఎత్తిపోతలకు నీటిని తరలించేందుకు ప్రతిపాదించిన పనులకు రూ.1,800 కోట్లతో ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. మంగళవారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నల్లగొండ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, నాగర్‌కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అమరేందర్‌తో పాటు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఏదుల నుంచి 2.52 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్తోపాటు 16 కిలోమీటర్ల సొరంగం ఆ తర్వాత మరో 3.05 కిలోమీటర్ల కాల్వ నిర్మించి డిండికి నీళ్లు మళ్లించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తిచేసి తాగు, సాగునీరు అందిస్తామన్నారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ నటరాజన్, ఇరిగేషన్ సీఈ అజయ్‌కుమార్, ఆర్డీఓలు రమాణారెడ్డి, శ్రీను, శ్రీదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే బాలునాయక్ -
ఆశయాలు ప్రతిబింభించేలా ఉత్సవాలు
నల్లగొండ టూటౌన్ : మహనీయుల ఆశయాలు ప్రతిబింభించేలా ఈ నెల 11 నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 6 గంటలకు 5కే రన్, పానెల్ డిస్కషన్, 12న విశ్వవిద్యాలయ యువకులకు కెరీర్ అవకాశాలపై అవగాహన, 13న సింపోసియం, 14న ‘సామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయాల పాత్ర’పై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వకృత్త్వం, పాటలు, కవితల పోటీలను నిర్వహిస్తానమి పేర్కొన్నారు. మహనీయుల భావ స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ కొప్పుల అంజిరెడ్డి, రిజిస్ట్రార్ అల్వాల రవి, శ్రీదేవి, వసంత, కె.ప్రేమ్‌సాగర్, సుధారాణి, అరుణప్రియ, సబీనా, హరీష్‌కుమార్, శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు. -
పేదల కడుపునింపేందుకు సన్న బియ్యం
చిట్యాల : పేదల కడుపునింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని పట్ల జనార్దన్ ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనాన్ని మంగళవారం ఆయన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి తిన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు ఆతీతంగా అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రస్తుతం ఎస్డీఎఫ్ నిధులు ఆరు కోట్లతో లింకురోడ్ల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర డెయిరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, నార్మాక్స్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ సుంకరి మల్లేష్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీనర్సింహ, ఏఎంసీ మాజీ చైర్మన్ కాటం వెంకటేశం, కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, సుంకరి వెంకన్నగౌడ్, పల్లపు బద్దుడు, జన్నపాల శ్రీను, ఎద్దులపురి క్రిష్ణ, జడల చినమల్లయ్య, మందుగుల సైదులు తదితరులు పాల్గొన్నారు. -
ఉరి శిక్ష సరైనదే..
పన్నెండేళ్లుగా నరకం అనుభవిస్తున్నా● కాలుకు మేకులు గుచ్చుకున్నా పరిగెత్తా.. చిలుకూరు: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో తన కాలుకు మేకులు గుచ్చుకున్నా ప్రాణాలు కాపాడుకునేందుకు పరిగెత్తానని చిలుకూరుకు చెందిన నీలకంఠం అశోక్ తెలిపారు. నాటి ఘోర సంఘటన గురించి ఆయన మాటల్లోనే.. నేను కానిస్టేబుల్ ఉద్యోగం కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని భాగ్యనగర్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్నాను. రోజు మాదిరిగానే పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఏ–1 మిర్చి బండి దగ్గర టీ తాగేందుకు వెళ్లాను. అక్కడికి వెళ్లిన రెండు నిమిషాలకే పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. ఆ సమయంలో నా కాలుకు మేకులు వచ్చి కుచ్చుకున్నాయి. దీంతో నా కాలు ఎముకకు తీవ్ర గాయమైంది. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్ధంకాక బిత్తరపోయాను. అందరూ పరుగెడుతుండడంతో భయంతో నేను కూడా కొద్ది దూరం పరిగెత్తాను. ఆ తర్వాత పోలీసులు అంబులెన్స్‌లో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 15 రోజులు చిక్సిత పొందాను. ఆ తర్వాత చిలుకూరులో మా ఇంటికి వచ్చాను. పూర్తిగా కోలుకోవడానికి ఏడాది సమయం పట్టింది. నాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.లక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.50 వేల ఆర్థికసాయం అందింది. కాలి నొప్పులు పోయాయి. కానీ నేటికీ ఆ చేదు జ్ఞాపకాన్ని తలచుకుంటే ఉలిక్కిపడేవాడిని. ● దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన మృతుల కుటుంబ సభ్యులు, బాధితులుహైదరాబాద్లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నింది తులకు గతంలో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్ష సరైనదే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. ఈ ఘటనలో రాష్ట్ర వ్యాప్తంగా18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందగా.. 13మంది గాయపడ్డారు. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. ఆనాటి భయానక పరిస్థితులు, పన్నెండేళ్లుగా తాము అనుభవిస్తున్న క్షోభను మృతుల కుటుంబ సభ్యులు, బాధితులు సాక్షితో పంచుకున్నారు.కోదాడ, మఠంపల్లి : ఈ జంట పేలుళ్లలో కుమారుడిని పోగొట్టుకున్న మఠంపల్లి మండలం రామచంద్రాపురం తండాకు చెందిన మాలోతు రవీందర్ అనుభవాలు ఆయన మాటల్లోనే.. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నా రెండున్నరేళ్ల కుమారుడు అనిల్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం నా భార్య లక్ష్మి, కుమార్తె అర్చన, తల్లి గంగులు, మామ హతియా, తమ్ముడు రంగానాయక్తో కలిసి 2013 ఫిబ్రవరి 21న హైదరాబాద్‌కు తీసుకెళ్లాం. కుమారుడిని ఇన్నోవా హాస్పిటల్లో డాక్టర్‌కు చూపించగా మూడు నెలల తర్వాత ఆపరేషన్ చేస్తానని చెప్పారు. దీంతో తిరిగి ఇంటికి వచ్చేందుకు దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడి వద్దకు వచ్చి బస్సు కోసం రోడ్డు పక్కన నిల్చున్నాం. సాయంత్రం సుమారు 5.45గంటలకు మేము నిలబడిన ప్రదేశానికి సమీపంలో రోడ్డు పక్కన డబ్బా కొట్ల వద్ద బాంబు పేలింది. ఏమి జరుగుతుందో తెలుసుకొనే లోపు నా కుడికాలు తెగి రక్తం వస్తుంది. మావాళ్లందరికి గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు వచ్చి మమ్ములను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నా కుడి కాలు తెగిపడడంతో పూర్తిగా కాలు తీసివేశారు. పేలుడు శబ్ధం ధాటికి నా కొడుకు అపస్మారక స్ధితిలోకి వెళ్లాడు. మెరుగైన చికిత్స వైద్యం కోసం మమ్ములను కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ నా కుమారుడు చనిపోయాడు. మా తమ్ముడికి చెవులు వినపడడం లేదు. నా భార్య కాలికి గాయం కావడంతో సరిగ్గా నడవలేకపోతుంది. మా అమ్మ చేతి వేళ్లు రెండు తెగిపోయాయి. మామ హతియాకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆ సంఘటన గుర్తుకు వస్తే ఇప్పటికి భయం వేస్తోంది. రూ.6లక్షల సాయమందించారుప్రభుత్వం నాకు రూ.6లక్షల ఆర్థికసాయం అందించింది. నా కుడికాలు తెగిపోవడంతో పూర్తిగా తీసివేశారు. జైపూర్ కృత్రిమ కాలును పెట్టించుకున్నాను. నాకు చికిత్సకు, కాలు ఏర్పాటుకు మొత్తం రూ.12 లక్షల ఖర్చయ్యింది. 2014లో నాకు అటెండర్ ఉద్యోగం ఇచ్చారు. ప్రస్తుతం కోదాడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం మాకు ఐదెకరాల భూమి ఇస్తానని చెప్పింది. నేటి వరకు భూమి ఇవ్వలేదు. నా కుటుంబానికి ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా ఐదెకరాల భూమి ఇచ్చి ఆదుకోవాలి. నా కుటుంబంతో పాటు నాలాంటి అమాయకులు అనేక మంది బలయ్యారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిందితులకు ఉరి శిక్ష వేయడం సరైనదే. ఆలస్యమైనా బాధితులకు కొంత ఊరట, మృతుల ఆత్మకు శాంతి కలుగుతుంది.● ఇన్నేళ్లకు న్యాయం జరిగిందిదేవరకొండ: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో దేవరకొండ పట్టణానికి చెందిన నక్క వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు. అతడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు భవనగిరి డివిజన్ పరిధిలో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం చేసేవారు. విధి నిర్వహణలో భాగంగా పేలుళ్లు జరిగిన రోజు సాయంత్రం దిల్సుఖ్నగర్ బస్టాప్‌లో బస్సు దిగి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతూ ఫోన్లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకుంటున్న తన కుమారుడితో మాట్లాడుతున్నారు. ఒక్కసారిగా బాంబు పేలడంతో వెంకటేశ్వర్లు శరీరం ఛిద్రమై మృతిచెందారు. వెంకటేశ్వర్లు మృతి తర్వాత ఆయన భార్యకు అదే శాఖలో ఉద్యోగం కల్పించారు. వెంకటేశ్వర్లుకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించడంతో ఇన్నేళ్లకు న్యాయం జరిగిందని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.● దివ్యాంగుడిలా మిగిలిపోయా..నాంపల్లి: దిల్సుఖ్నగర్ పేలుళ్ల ఘటన గుర్తుచేసుకుంటూనే నా ప్రాణం లేచి వస్తుంది. ఆ పేలుళ్లలో నా కాలు విరిగింది. దీంతో నేను దివ్యాంగుడిలా మిగిలిపోయాను. ఆ ఘాతుకం సృష్టించిన నిందితులకు హైకోర్టు ఉరి శిక్షను సమర్ధిస్తూ తీర్పు ఇవ్వడం సంతోషంగా ఉంది. నాకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చింది. ప్రస్తుతం నేను ఆర్ఐగా మర్రిగూడెం తహసీల్దార్ కార్యలయంలో పనిచేస్తున్నాను.● గాయాలతో బయటపడ్డాంనిడమనూరు: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో నిడమనూరు అవాస గ్రామం నర్సింహులగూడేనికి చెందిన కొండారు శ్రీనివాస్, రాములమ్మ దంపతులు గాయాలపాలయ్యారు. ఆరోజు భయానక వాతావరణం గురించి శ్రీనివాస్ మాటల్లో.. నేను ఉపాధికోసం హైదరాబాద్‌లో పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ దిల్‌సుఖ్‌నగర్‌లోని పీఅండ్‌టీ కాలనీ నివాసముండేవాడిని. జంట పేలుళ్లు జరిగిన రోజు మా బాబు టిఫిన్ తీసుకురమ్మంటే టిఫిన్ సెంటర్లో దోశ ఆర్డర్ చేశాను. దోశ తీసుకుని నా బైక్ దగ్గరకు వెళ్లగానే బాంబు పేలింది. దీంతో నా కాలికి గాజు పెంకులు కోసుకుపోయాయి. నడవలేని పరిస్థితి, నా భార్య దూరంగా ఉండటంతో ఆమె కోసం వెతికాను. ఆమె దూరంగా కాళ్లకు గాయాలతో పడి ఉంది. మాకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. సుమారు రూ.50 వేలు మా సొంతంగానే ఖర్చు పెట్టుకున్నాం. మాకు ప్రభుత్వ సాయం అందితే బాగుంటుంది. ప్రస్తుతం కూడా పెట్రోల్ బంక్‌లోనే పనిచేస్తున్నాను.● బైక్ పార్కింగ్ చేసిన చోటే ప్రాణాలు వదిలి..చిట్యాల: చిట్యాల మండలం తాళ్లవెల్లెంల గ్రామానికి చెందిన ఏలే రాములు దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన బాంబు పేలుళ్లలో మృతి చెందాడు. ఆయన జీహెచ్ఎంసీలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ అక్కడే నివాసముండేవాడు. ఆయనకు కుమారుడితో పాటు ముగ్గురు కుమార్తెలున్నారు. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతంలో తన బైక్‌ను పార్క్ చేసి చౌటుప్పల్‌లోని తన బంధువు ఇంటికి వచ్చాడు. అనంతరం తిరుగు ప్రయాణంలో దిల్‌సుఖ్‌నగర్‌లో తాను పార్కింగ్ చేసిన బైక్‌ను తీసుకుంటుండగా అకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించటంతో పాటు కుమారుడు సుధాకర్‌కు జీహెచ్ఎంసీలో ఉద్యోగాన్ని ఇచ్చింది. రాములు భార్య అండాలు ఇటీవల మృతి చెందింది. రాములు మృతి చెందటంతో తమ కుటుంబానికి తీరని నష్టం జరిగిందని అతడి కుమారుడు సుధాకర్ పేర్కొన్నాడు. పన్నెండేళ్ల తర్వాత నిందితులకు కోర్టు ఉరి శిక్ష విధించి బాధితులకు న్యాయం చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కేసుల్లో దర్యాప్తు వేగంగా చేసి తీర్పులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.● కన్న కొడుకును కోల్పోయాం.. రామన్నపేట: జంట పేలుళ్ల ఘటనలో తమ కొడుకును కోల్పోయామని రామన్నపేట మండలం కక్కిరేణి మదిర గ్రామం రంగమ్మగూడేనికి చెందిన ముద్రబోయిన యాదమ్మ–శంకరయ్య దంపతులు అన్నారు. వీరివారి రెండో కుమారుడు మత్స్యగిరి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆనంద్ చాయ్ సెంటర్లో పనిచేసేవాడు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబ్ బ్లాస్ట్‌లో మృతి చెందాడు. మత్స్యగిరికి అన్న స్వామి, తమ్ముడు అంజనేయులు ఉన్నారు. మత్స్యగిరి మృతి అనంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రూ.6లక్షల ఎక్స్‌గ్రేషియా, 160 గజాల ఇంటి స్థలం ఇచ్చారు. మత్స్యగిరి సోదరుడు స్వామికి భువనగిరి సీపీఓ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం ఇచ్చారు. నిందితులకు శిక్ష పడటం ఆనందంగా ఉందని యాదమ్మ, శంకరయ్య పేర్కొన్నారు.షాపింగ్‌కు వెళ్లి పేలుళ్లలో చిక్కుకున్నాంమోతె: తన స్నేహితులతో కలిసి 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బస్టాండ్ ఏరియాలో షాపింగ్ చేసి బయట వచ్చి పేలుళ్లో చిక్కుకున్నామని మోతె మండలం హుస్సేనాబాద్ గ్రామానికి చెందిన రావుల హుస్సేన్ అన్నారు. ఆయన మాటల్లోనే.. ఆ రోజు షాపింగ్ పూర్తిచేసి రోడ్డు మీదకు వచ్చే వరకు పెద్ద శబ్దంతో బాంబులు పేలాయి. నా ఎడమ చేతికి గాజు పెంకు గుచ్చుకొని రక్తం కారుతుండగా నా ఫ్రెండ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ ఘటనకు పాల్పడిన సంఘ వ్యతిరేక శక్తులను ఉరి తీయడం నాకు సంతోషంగా ఉంది. తప్పు చేసిన వారికి ఎప్పటికై నా శిక్ష పడాల్సిందే.● కోర్టు తీర్పు హర్షణీయంపెద్దఅడిశర్లపల్లి: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనపై కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయం. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ తీర్పు ఉపకరిస్తుంది. ఆనాడు బాంబు పేలుళ్ల ఘటన సమయంలో నేను బీటెక్ ఫైనలియర్ హైదరాబాద్‌లో చదువుకుంటున్నాను. రోజు మాదిరిలాగే ఆరోజు సాయంత్రం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి బండి దగ్గర టీ తాగేందుకు వెళ్లాను. టీ తాగుతున్న సమయంలో పెద్ద శబ్ధంతో బాంబు పేలింది. దీంతో నా కాలు విరగడంతో పాటు బలమైన గాయం అయ్యింది. అక్కడ ఏం జరుగుతుందో ఏమి అర్ధం కాని పరిస్థితుల్లో నన్ను ఆటోలో సమీప ఓమ్నీ ఆస్పత్రిలో చేర్పించి నెల రోజుల పాటు వైద్యం అందించారు. నా వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను.● భయాందోళనకు గురయ్యా..నేరేడుచర్ల: మాది నేరేడుచర్ల మండల కేంద్రం. నేను హైదరాబాద్‌లోని మలక్‌పేట సిరిపురం కాలనీలో నివాసముండేవాడిని. నా స్నేహితుడు టీవీ చారి కుమారుడు ఈశ్వర్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉండగా.. అతడికి డబ్బులు ఇచ్చేందుకు దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు జరిగిన రోజు వెళ్లాను. డబ్బులు ఇచ్చి తిరిగి ఇంటికి వెళ్తుండగా.. బాంబు పేలుళ్లు జరిగాయి. ఆనాటి పేలుళ్లలో నా ఎడమ కాలు విరగడమే కాకుండా.. కాలులోకి సైకిల్ చర్రాలు కుచ్చుకుపోయాయి. యశోదా ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేసేందుకు 8గంటల సమయం పట్టింది. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురయ్యాను. ప్రభుత్వం నుంచి వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష సాయం అందించారు. ప్రస్తుతం కుటుంబంతో హైదరాబాద్‌లోనే నివాసముంటున్నా.బస్సు ఆలస్యంతో బాధితుడినయ్యా..భూదాన్‌పోచంపల్లి: బస్సు ఆలస్యం కావడంతో దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో బాధితుడిని అయ్యానని భూదాన్‌పోచంపల్లి మండలం పెద్దరావులపల్లికి చెందిన సుక్క లింగస్వామి ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.. నేను ప్రతిరోజు పెద్దరావులపల్లి నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌లోని నాగోల్‌కు వెళ్లి ప్రైవేట్ జాబ్ చేస్తుండేవాడిని. 2013 ఫిబ్రవరి 21న కూడా జాబ్ పూర్తయ్యాక ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం దిల్సుఖ్నగర్ బస్టాండ్‌కు వచ్చాను. పోచంపల్లి బస్సు ఆలస్యం ఉందని తెలిసి స్నేహితుడి సిమ్ కార్డు యాక్టివేషన్ చేయించడానికి సాయంత్రం 6.40 గంటలకు కోణార్క్ థియేటర్ సమీపంలో మొబైల్ షాపు వద్దకు వెళ్లాను. అదే సమయంలో మొదట వెంకటాద్రి థియేటర్ బస్టాప్‌లో బాంబు పేలుడు జరిగడంతో ప్రజలంతా పరుగెత్తుతున్నారు. వెంటనే కోణార్క్ థియేటర్ పక్కనే ఉన్న టీస్టాల్ వద్ద కూడా పేలుడు జరిగింది. పేలుడు ధాటికి పొగ కమ్ముకొని దారి కన్పించక భయానక వాతావరణం ఏర్పడింది. చిన్నచిన్న ఇనుప ముక్కలు నా వీపు, భుజం, కాళ్లలో దిగాయి. అలాగే పరిగెడుతూ రన్నింగ్ బస్సు ఎక్కి ఎల్బీనగర్లో బంధువుల ఇంటికి వెళ్లాను. అనంతరం ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించుకున్నాను. అదేరోజు రాత్రి 12 గంటలకు ఇంటికి చేరుకుని మా అమ్మ, బంధువులకు మాత్రం నేను సురక్షితంగా ఉన్నానని చెప్పాను. కానీ ఇంటికి వచ్చిన తర్వాత గాయపడిన నన్ను చూసి మా అమ్మ ఏడ్చింది. అనంతరం నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకొన్నాను. నా అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డానని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇప్పటికీ దిల్‌సుఖ్‌నగర్‌కు వెళ్లినపుడల్లా నాటి పేలుళ్ల ఘటన గుర్తుకొచ్చి నాకు పునర్జన్మ లభించిందని భావిస్తాను. -
గోడ కూలి భవన నిర్మాణ కార్మికురాలి మృతి
చౌటుప్పల్ రూరల్: నిర్మాణంలో ఉన్న గోడ కూలి భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం మన్నేవారిపంపు గ్రామానికి చెందిన మల్లేమోని భిక్షపతి, అతడి భార్య సుగుణమ్మ(50) 20 సంవత్సరాల క్రితం చౌటుప్పల్‌కు వలస వచ్చి, తంగడపల్లి రోడ్డులో సొంతంగా ఇల్లు నిర్మించుకుని, కూలీ పనులు చేసుకుంటూ జీవవనం సాగిస్తున్నారు. సుగుణమ్మ భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తోంది. మంగళవారం ఉదయం పంతంగి గ్రామానికి చెందిన భవన నిర్మాణ గుత్తేదారు బోయ నర్సింహ ఎస్.లింగోటం గ్రామంలో ఉప్పు వెంకటేష్ ఇంటి నిర్మాణం చేయడానికి సుగుణమ్మను కూలీకి తీసుకెళ్లాడు. ఉదయం 11 గంటల సమయంలో మొదటి అంతస్తు పైకి సుగుణమ్మ ఇసుక మోస్తుండగా.. పరంజా కూలిపోవడంతో ఒక్కసారిగా ఆమె కింద ఉన్న పిల్లర్‌పై పడిపోయింది. అదే సమయంలో నిర్మాణంలో ఉన్న గోడ ఆమె మీద కూలింది. దీంతో సుగుణమ్మ తలకు తీవ్ర గాయాలు కాగా చౌటుప్పల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటి యాజమాని వెంకటేష్, గుత్తేదారు బోయ నర్సింహ పనిచేసే చోట సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతోనే తన తల్లి కిందపడి మృతి చెందినట్లు మృతురాలి కుమారుడు మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
దొంగల ముఠా అరెస్ట్
● చౌటుప్పల్‌లో గత నెల కిరాణ దుకాణంలో సిగరెట్ల దొంగతనానికి పాల్పడ్డ నిందితులు ● నిందితులంతా రాజస్తాన్ రాష్ట్రానికి చెందినవారే ● రూ.10 లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు, కారు, సెల్ఫోన్లు స్వాధీనంచౌటుప్పల్: రాజస్తాన్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అనంతరం నల్లగొండ జైలుకు తరలించారు. ఈ ముఠా సభ్యులు గత నెల 6న చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బాలాజీ కిరాణ దుకాణంలో దొంగతనం చేసి రూ.10లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు ఎత్తుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ మన్మథకుమార్ మంగళవారం విలేకరులకు వెల్లడించారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ రాష్ట్రం బీవేర్ జిల్లా రాయిపూర్థానా గ్రామానికి చెందిన డ్రైవర్ లక్ష్మణ్‌రామ్, కినవాడీ గ్రామానికి చెందిన డ్రైవర్ రాఖేష్ కుమావత్, జోధ్‌పూర్ జిల్లా జాక్ గ్రామానికి చెందిన కూలీ పనిచేసే దినేష్ అలియాస్ దినరామ్, అదే గ్రామానికి చెందిన ప్రైవేట్ జాబ్ చేసే అశోక్‌జాట్, పాలీ జిల్లాలోని హపత్ గ్రామానికి చెందిన భారత్‌కుమార్ ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. షట్టర్ తాళం పగులగొట్టి దొంగతనం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ నుంచి చిన్నకొండూర్ రోడ్డు వైపు వెళ్లే దారిలో సర్వీస్ రోడ్డులో ఉన్న బాలాజీ కిరాణ దుకాణంలో గత నెల 6న అర్ధరాత్రి సమయంలో వీరు దొంగతనానికి పాల్పడ్డారు. వీరులో కారులో వచ్చి దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాను పక్కకు తిప్పారు. రోడ్డు వెంట వెళ్లే వ్యక్తులకు ఏమీ కన్పించకుండా ఉండేందుకు షట్టర్‌కు అడ్డంగా పరదాలు కట్టారు. ఆ తర్వాత దుకాణానికి వేసిన తాళాన్ని గడ్డపారతో పగులగొట్టి లోనికి ప్రవేశించారు. దుకాణం నుంచి ఎనిమిది సిగరెట్ కార్టన్లను తీసుకొని బయటకు వచ్చారు. అన్నింటిని కారులో వేసుకునేందుకు ప్రయత్నించగా ఏడు మాత్రమే అందులో పట్టాయి. మరొకటి పట్టకపోవడంతో దానిని దుకాణం బయటనే పడేసి కారులో అక్కడి నుంచి పారిపోయారు. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు దొంగతనం జరిగిన మరుసటి రోజున దుకాణం యజమాని ఊర కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని ఆంథోల్ మైసమ్మ దేవాలయం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. అటుగా వెళ్తున్న నిందుతులు కారును అక్కడే ఆపి పారిపోయే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పారిపోతున్న నిందితులను వెంబడించి పట్టుకొని అదుపులోకి తీసుకొని విచారించగా సిగరెట్ కార్టన్ల చోరీ చేసింది తామేనని ఒప్పుకున్నారు. నిందితుల నుంచి కారుతో పాటు రూ.10లక్షల విలువైన 7 సిగరెట్ కార్టన్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో రిమాండ్ చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● మరొకరి పరిస్థితి విషమం నల్లగొండ: నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ టూటౌన్ ఎస్ఐ ఎర్రం సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి హైదరాబాద్‌కు షేక్ ఫిరోజ్ తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తున్నాడు. అదేవిధంగా హైదరాబాద్‌లోని బోడుప్పల్‌కు చెందిన పిదురు అనిల్ తన తల్లిదండ్రులు రఘురామమూర్తి(80), స్వరాజ్యంతో కలిసి కారులో ఒంగోలుకు వెళ్తూ.. నార్కట్‌పల్లి–అద్దంకి బైపాస్‌పై నల్లగొండ పట్టణంలోని లెప్రసీ కాలనీ వద్ద డివైడర్‌ను ఢీకొన్నాడు. దీంతో అనిల్ ప్రయాణిస్తున్న కారు ఎగిరి అటుగా వస్తున్న ఫిరోజ్ కారుపై పడి పల్టీ కొట్టి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో పడిపోయింది. స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించారు. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బాధితులను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రఘురామమూర్తి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఫిరోజ్ బంధువు మహమూద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై
హుజూర్నగర్ : రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా చింతలపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్ 24న రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరుగురిపై కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి రూ.15 వేలు లంచం అడిగాడని, వారిరువురి మధ్య రూ.10 వేలకు ఒప్పదం కుదిరిందని ఏసీబీ డీఎస్పీ తెలి పారు. మంగళవారం బాధితుడు చింతలపాలెం పోలీస్ స్టేషన్లో ఎస్సై అంతిరెడ్డికి రూ.10వేలు అందజేయగా ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నామని, విచారణ అనంతరం ఎస్సైని హైదరాబాద్‌లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతామని డీఎస్పీ తెలిపారు. -
ప్రజలపై గ్యాస్ భారం
నల్లగొండ : వంట గ్యాస్ వినియోగదారులపై బండబాదుడు మొదలైంది. ఎల్పీజీ సిలిండర్ ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధర పెరగడం, ఇతర కారణాలతో ఒక్కో సిలిండర్‌పై రూ.50 వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో 14.2 కిలోల సిలిండర్ఽ ధర రూ.876.50నుంచి రూ.926.50లకు పెరిగింది. ఈ పెంపు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన ఉజ్వల్ లబ్ధిదారులకు సైతం వర్తించనుంది. జిల్లాలోని ఏజెన్సీల ద్వారా ప్రతి నెలా 1.55 లక్షల సిలిండర్లు రిఫిల్ అవతుండగా.. ఈలెక్కన వినియోగదారులపై రూ.80 లక్షల అదనపు భారం పడనుంది. పేద, మధ్య తరగతిపై భారం.. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంటగ్యాస్ ధరలతో జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడనుంది. చాలాకాలంగా వంట గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం, కంపెనీలు పెంచలేదు. వాణిజ్య గ్యాస్ ధరలను మాత్రం పెంచుతూ తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటికే రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలకు తాజాగా గ్యాస్ సిలిండర్ల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తుండగా.. ప్రస్తుతం పెరిగిన ధరలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందా... లేదంటే వినియోగదారులే చెల్లించాలన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్‌ను పూర్తి ధర చెల్లించి నింపిస్తే.. తదనంతరం ప్రభుత్వం వినియోగదారుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఫ ఒక్కో సిలిండర్‌పై రూ.50 పెరిగిన ధర ఫ నెలకు సుమారు రూ.80 లక్షల అదనపు భారం ఫ జిల్లాలో 6,18,701 గ్యాస్ కనెక్షన్లు జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు.. జిల్లాలో మూడు కంపెనీల కింద 6,18,701 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వాటిలో జనరల్ కనెక్షన్లు 4,76,748, దీపం కనెక్షన్లు 82,209, ఉజ్వల యోజన కనెక్షన్లు 59,744 ఉన్నాయి. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం సంవత్సరానికి సుమారు 6 సిలిండర్లు, పట్టణ ప్రాంతాల్లో సుమారు 8 నుంచి 12 సిలిండర్లను వినియోగిస్తుంటారు. సరాసరి ప్రతి నెలా 1,55,000 సిలిండర్లు సరఫరా అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా వినియోగదారులపై రూ.77,50,000 అదనపు భారం పడనుంది. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలన్నారు. వేసవిలో తాగునీటికి సమస్య రాకుండా ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈనెల 8 నుంచి 10 రోజులపాటు పోషణ పక్వాడా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో మహిళలు, గర్భిణులు, పిల్లలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. టీఎస్ ఐ–పాస్ కింద వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్చార్జి డీఆర్ఓ వై.అశోక్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..
మిర్యాలగూడ టౌన్ : చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారం లోపాన్ని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేలా.. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం(పోషణ పక్వాడీ) నిర్వహిస్తోంది. పోషక విలువలు, అదనపు ఆహార విశిష్టత, తల్లిపాల ప్రాముఖ్యత, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించే పోషణ పక్షం–2025 (పోషణ పక్వాడీ) కార్యక్రమం ఈనెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. తల్లులు, పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. చిన్నారులు, కిశోర బాలికలు, బాలింతలు, గర్బిణీలను పోషకాహారం లోపం నుంచి విముక్తులను చేసేందుకు ఈ పోషణ పక్వాడీ కార్యక్రమం దోహదపడుతుంది. పోషణపక్షం కార్యక్రమాలు ఇలా.. ● గర్భిణుల బరువు చూడడం, వారి సంరక్షణపై భర్తలకు అవగాహన కల్పించడం, రెండేళ్ల కంటే తక్కువగా వయస్సు ఉన్న పిల్లలకు పెరుగుదలను పర్యవేక్షించడం. ● ప్రత్యేక గృహ సందర్శన ద్వారా తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించడం, వ్యాధి నిరోధక షెడ్యూల్ తనిఖీ చేయడం. ● మొదటి వెయ్యి రోజుల్లో పోషకాహారం ప్రాముఖ్యత, గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పాటు సంరక్షులకు సమావేశాలు నిర్వహించడం. ● వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్డి ఉపయోగం, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం, సురక్షితమైన నీటిని తాగడంపై అవగాహన కల్పించడం. రక్త పరీక్ష శిబిరాలు నిర్వహించడం. ● ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ఉపయోగంలో భాగంగా వంటకాల ప్రదర్శన. ● పోషణ ట్రాకర్ లబ్ధిదారుల మాడ్యూల్‌ను పరిచయం చేసేందుకు గర్భిణులు, బాలింతలు, కౌమర బాలికలకు సంరక్షులతో సమావేశాలు నిర్వహించడం. ● అంగన్వాడీ కేంద్రాల్లో ఆకలి పరీక్షలు, ప్రొటోకాల్‌పై అవగాహన కల్పించడం. ● వ్యాయం ప్రాముఖ్యతను వివరించడం.ఫ అంగన్వాడీల్లో నేటి నుంచి 22వ తేదీ వరకు పోషణ పక్షం ఫ పోషకాహారంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల వివరాలు ప్రాజెక్టులు 09కేంద్రాలు 2,093 6నెలలలోపు పిల్లలు 6,855 7 నెలల నుంచి 3 ఏళ్లలోపు.. 42,5633 నుంచి 6 ఏళ్లలోపు.. 27,686 గర్భిణులు 7,555 బాలింతలు 6,855 అందరూ భాగస్వాములు కావాలి చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహార లోపం నిర్మూలనే ప్రధాన లక్ష్యం. పోషకాహారంపై పిల్లల తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తాం. స్కూల్ పిల్లలకు క్విజ్ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. – కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి, నల్లగొండ -
రిజిస్ట్రేషన్లు తగ్గినా ఆదాయం భేష్
ఎల్ఆర్ఎస్తో ఆదాయం పెరిగింది నల్లగొండ జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరిగింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా గత సంవత్సరం రూ.412 కోట్లు ఆదాయం వస్తే.. ఈ సారి రూ.426 కోట్లకు పెరిగింది. ఎల్ఆర్ఎస్ చెల్లింపుల ద్వారా ఆదాయం పెరిగింది. – డీఆర్.ప్రకాష్, జిల్లా రిజిస్ట్రార్, నల్లగొండ ఫ గతేడాదితో పోల్చిత్చే రూ.14 కోట్లు పెరిగిన ఆదాయం ఫ ఎల్ఆర్ఎస్కు అవకాశం ఇవ్వడంతో ఆదాయం రాకనల్లగొండ : రిజిస్ట్రేషన్ల శాఖకు రాష్ట్రమంతటా ఆదాయం తగ్గితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించడంతో చాలా జిల్లాల్లో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి.. ఆదాయం కూడా తగ్గింది. నల్లగొండ జిల్లాలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గినా.. రూ.14 కోట్ల మేర ఆదాయం పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1,43,420 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.412 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక.. 2024–25 సంవత్సరంలో 1,40,845 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కాగా వాటి ద్వారా రూ.426 కోట్లు ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు నల్లగొండ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి వరకు ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. హైడ్రా, ఎఫ్టీఎల్ తదితర ప్రాంతాల్లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు నిలిపివేసింది. అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసేందుకు నిరాకరించింది. దీంతో రిజిస్ట్రేషన్లు తగ్గి చాలా వరకు ఆదాయం పడిపోయింది. అయితే గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ చెల్లిస్తే 25 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. దీంతో ఫిబ్రవరి, మార్చి నెలల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం పెరుగుతూ వచ్చింది. -
ఆస్పత్రిలో కలుషిత నీరు!
ఈ ఫొటోలను గమనించారా.. ఇవి నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రోగులు తాగునీరు అందించే ఫ్రిడ్జ్, అందులోని నీరు. కలుషితంగా కనిపిస్తున్న ఈ నీటినే రోజూ రోగులు తాగుతున్నారు. సోమవారం ఒక వ్యక్తి గ్లాసులో నీళ్లు పట్టుకుని తాగుతుండగా పురుగుల వచ్చాయి. దీంతో ఫ్రిడ్జ్ పైన మూత తీసి చూడగా ఫ్రిడ్జ్ నీరు కలుషితంగా.. పురుగుల మయంగా కనిపించింది. అక్కడి సిబ్బంది ఆ నీరు చూపించాడు. వారు ఆ నీటిని పారబోశారు. మళ్లీ అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోగాలు నయం చేసుకోవాడానికి ఆస్పత్రికి వస్తుంటే.. ఈ నీరు తాగితే మళ్లీ రోగాల బారినపడే ప్రమాదం ఉంటుందని అక్కడి రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. – నాగార్జునసాగర్ -
రైతుభరోసా రూ.419.21 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి రైతుభరోసా ఇప్పటి వరకు 4.33 లక్షల మంది రైతులకు అందింది. మొత్తం రూ.419.21 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమయింది. నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే ప్రభుత్వం రైతు భరోసా అందించింది. ఇంకా సుమారు రెండు లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. 5,60,801 మంది రైతులు జిల్లా వ్యాప్తంగా 5,60,801 మంది పట్టాదారు పాస్‌పుస్తకాలను కలిగిన రైతులు ఉన్నారు. ప్రభుత్వం యాసంగి రైతు భరోసాను జనవరి 26వ తేదీ నుంచి జమ చేస్తోంది. తొలి విడతలో ఎంపిక చేసిన 31 గ్రామాల్లోని రైతులకు ఎలాంటి కటాఫ్ లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు రూ.46,93,19,160 ఖాతాల్లో జమ చేసింది. ఆ తరువాత రెండవ, మూడవ దశలో, నాలుగవ దశలో నాలుగు విడుతలగా మొత్తం 4,33,543 మంది రైతుల ఖాతాల్లో రూ.419,11,54,632 జమ చేసింది. ఇంకా 1,13,218 మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సీజన్ ముగిసినందున మిగిలిన రైతులకు రైతుభరోసా అమలు చేస్తుందా లేదా అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమలు చేస్తుంది అనే దానిపై కూడా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో మిగిలిన రైతులలో ఆందోళన నెలకొంది. దశల వారీగా విడుదల చేస్తుంది రైతు భరోసా నిధులను ప్రభుత్వం దశల వారీగా జమ చేస్తుంది. ఇప్పటి వరకు 4 విడతల్లో రూ.419.21 కోట్లు జమ చేసింది. 4,33,543 మంది రైతులకు రైతు భరోసా అందింది. – పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ రైతు భరోసా రాలేదు యాసంగి రైతు భరోసా ఇప్పటి వరకు నా ఖాతాలో జమ కాలేదు. నాకు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉంది. ఎప్పుడు పడుతుందో అధికారులు కూడా చెప్పడం లేదు. అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే జమ చేయాలి. – కె.రాము, రామడుగు, హాలియా మండలం ఫ 4.33 లక్షల మంది రైతులకు అందిన సొమ్ము ఫ నాలుగు ఎకరాల్లోపు వారికి వర్తింపు ఫ మిగతా రైతులకు తప్పని ఎదురుచూపు రైతు భరోసా నిధులు జమ ఇలా.. దశ రైతులు రూపాయలు మొదటి 35,568 46,93,19,160రెండవ 1,55,232 88,42,80,319 మూడవ 85,894 67,02,72,632 నాల్గవ 1,56,849 216,72,82,521 మొత్తం 43,3543 419,11,54,632 -
అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
రామగిరి (నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఏప్రిల్ 10 తేదీ సాయంత్రం 6 గంటలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్ఎం కే.జానిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీ దష్ట్యా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు. వివరాలకు 9298008888 ఫోన్‌నంబర్‌ను లేదా అన్ని సమీప బస్స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖలో అద్దె వాహనాలకు ఆహ్వానంనల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. ఆసక్తి గల ఏజెన్సీలు, వ్యక్తులు తమ టెండర్లను 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై ఆర్డీఓ ఆరా..!తిప్పర్తి : మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి సోమవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తాలు పట్టకపోవడంతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలేదని, ప్యాడీ క్లీనర్ ద్వారా ధాన్యం శుభ్రం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యం ఒక క్వింటా శుభ్రం చేసుకుని ఎంత శాతం తాలు వచ్చిందో చూసి దాని ప్రకారం కోత విధించి మిల్లర్లు కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీఓ పాత్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, తహసీల్దార్ పరుశురాములు, ఏఓ సన్నిరాజు, ఆర్ఐ ద్రోణార్జున, రైతులు ఉన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలిమాడ్గులపల్లి : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలోని గారకుంటపాలెం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు 17శాతం తేమ ఉండేలా చూసుకోని కేంద్రాలకు ధాన్యాన్ని తేవాలన్నారు. రైతులు తమ వెంట ఆధార్‌కార్డు, బ్యాంక్, పట్టా పాస్‌బుక్ జిరాక్స్‌లను తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌కుమార్, డీపీఎం బెనర్జీ, ఏపీఎం భాషపాక చంద్రశేఖర్, ఆర్ఐ నాగయ్య, ఏఈవో వేణుగోపాల్, సీసీ నాగయ్య, శివలీల, సోమయ్య, నాగలక్ష్మి రైతులు పాల్గొన్నారు. -
బుద్ధవనాన్ని సిద్ధం చేయాలి
నల్లగొండ : బుద్ధపూర్ణిమ సందర్భంగా వచ్చే నెల 12న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నందున తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిస్‌వరల్డ్ పోటీదారుల రాక ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్, తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనానికి వస్తారని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4.30 గంటల నుంచి 7.30 గంటల వరకు విజయవిహార్, బుద్ధవనాల్లో వారు గడుపుతారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే దారిలో చింతపల్లి వద్ద కాసేపు విశ్రాంతి తీసుకుంటారని తెలిపారు. బుద్ధుడి ధ్యాన మందిరంలో ధ్యానంలో పాల్గొంటారని వారికి ఎలాంటి లోటుపాట్లు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాసులు ఉన్న వారిని తప్ప ఇతరులను బుద్ధవనంలోకి అనుమతించవద్దని సూచించారు. వారు విశ్రాంతి తీసుకునేందుకు విజయ్విహార్లోని రూమ్‌లను సిద్ధం చేయాలన్నారు. వారు తిరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో ప్రదేశం వద్ద ఒక సీఐ స్థాయి అధికారిని ఇన్చార్జిగా నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, బుద్ధవనం ఆఫీసర్ మధుసూదన్‌రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం రైతు దిగాలు!
ప్రభుత్వ కేంద్రాల్లో నత్తనడకన కొనుగోళ్లు ఈ ఫొటోలోని రైతు శాలిగౌరారం మండలం భైరవునిబండ గ్రామానికి చెఇందిన యాదగిరిరెడ్డి. ఈ రైతు సాగు చేసిన వరి పంటను మార్చి 4న కోత కోసి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించాడు. ధాన్యం మొత్తాన్ని ఆరబోసి రాశి చేశాడు. కానీ ఈ గ్రామంలోని కేంద్రం ఇప్పటి వరకు ప్రారంభించలేదు. అసలు మిల్లు ట్యాగింగ్, రవాణా సౌకర్యాల కల్పనపై ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. కేంద్రానికి ఈ రైతు ధాన్యం తెచ్చి నెలరోజులవుతున్నా.. ఇప్పటి వరకు కాంటా వేయకపోవడంతో రోజు రాశి వద్దే పడిగాపులు కాస్తున్నాడు. ప్రస్తుతం అకాల వర్షాల సీజన్ కావడంతో వర్షం పడితే ధాన్యం తడిసి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నాడు. ఇదీ జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద పరిస్థితి. నల్లగొండ : యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభమే కాలేదు. ఇక.. కేంద్రాలు ప్రారంభించిన చోట ధాన్యం కాంటా వేసేందుకు నిర్వాహకులు అనేక కొర్రీలు పెడుతున్నారు. జిల్లాలోని కేంద్రాలకు ఇప్పటి వరకు 76,716 మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా.. కేవలం 2,269 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నిర్ధేశిత తేమ శాతం రావడంలేదని నిర్వాహకులు చెబుతుండగా.. కొన్ని కేంద్రాల్లో హమాలీలు, బస్తాలు లేవన్న కారణంతో కొనుగోలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రాల వద్ద రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ఇక సన్నధాన్యం పండించిన రైతులు ఎక్కడా కేంద్రాల వద్దకు రావడం లేదు. నేరుగా మిల్లర్లకు ధాన్యం విక్రయించుకుంటున్నారు. 180 కేంద్రాలు ప్రారంభం జిల్లాలో యాసంగి సాగు ముందస్తుగా ప్రారంభమైంది. ఈ సీజన్లో ఏడున్నర లక్షల పైచిలుకు ధాన్యం మార్కెట్‌కు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలుకు 375 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మార్చి 24వ తేదీన రాష్ట్రంలోనే మొదట నల్లగొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 180 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఆయా కేంద్రాలకు 76,716 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది. కేంద్రాలకు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతోంది. 2,269 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసినా దానికి సంబంధించి ట్యాబ్ ఎంట్రీ, మిల్లులకు ట్రాన్స్‌పోర్టు కూడా వేగంగా సాగడం లేదు. ధాన్యం తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేయడంలో క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇంకా మిల్లుల కేటాయింపు కూడా చేపట్టలేదని తెలుస్తోంది. మిల్లుల బాట పడుతున్న రైతులు.. ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం అమ్ముకోవాలంటే రోజుల తరబడి అక్కడ కాపాలా ఉండాల్సి వస్తోంది. అక్కడ అన్ని సౌకర్యాలు లేకపోగా.. నిర్వాహకులు రకరకాల కారణాలతో ధాన్యం కాంటా వేయడం లేదు. వాతావరణంలో మార్పులతో అకాల వర్షాలు వచ్చే అవకాశాలు ఉండడంతో సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యం పండించిన రైతులు కూడా మిల్లుల వైపు వెళ్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న మిల్లర్లు ధాన్యం ధర భారీగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఫ కొన్నిచోట్ల అసలు ప్రారంభంకాని కేంద్రాలు.. ఫ ప్రారంభించిన చోట కొనుగోళ్లకు కొర్రీలు ఫ కేంద్రాలకు వచ్చిన ధాన్యం 76,716 మెట్రిక్ టన్నులు ఫ కొనుగోలు చేసింది 2,269 మెట్రిక్ టన్నులే.. ఫ మిల్లులకే వెళ్తున్న సన్న ధాన్యం పండించిన రైతులు -
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
నల్లగొండ టూటౌన్ : బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో బీజేపీ జెండాను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి ఎగురవేశారు. అనంతరం పార్టీ నాయకులు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ దేశం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పని చేస్తుందన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కిందన్నారు. కార్యక్రమంలో నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్, పోతెపాక లింగస్వామి, లోకనబోయిన రమణ, పకీరు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతాంనల్లగొండ టౌన్ : కష్టజీవులు, పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడతానని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఆయనతో కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో పాలు పంచుకుంటున్న మిత్రులు, ఎమ్మెల్సీ సత్యంను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానంలో పార్టీ సభ్యులు, మిత్రులు అందించిన సహకారంతో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కుంభం కృష్ణారెడ్డి, కట్టా వెంకట్‌రెడ్డి, గుర్రం వెంకట్‌రెడ్డి, కందుల భిక్షం, నర్సింహాచారి, ప్రద్యుమ్నారెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, బరిగెల నగేష్, లింగారెడ్డి, నర్సింహ, పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి పాల్గొన్నారు. -
తెలంగాణ లోకాయుక్తగా పెద్దవూర మండల వాసి
పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన హైకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ లోకాయుక్తగా నియమితులయ్యారు. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు యడవెల్లి రామాంజిరెడ్డి–జయప్రద దంపతులకు ఐదుగురు సంతానం కాగా.. రాజశేఖర్‌రెడ్డి పెద్దవారు. ఆయన 1960 మే 4వ తేదీన జన్మించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలోని సెయింట్ మేరీ పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్సెస్ పాఠశాలలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్‌లోని ఏవీఎం కళాశాలలో, బీఎస్సీ డిగ్రీ, ఎల్ఎల్బీ వరంగల్‌లో సాగాయి. ఆ రోజుల్లోనే ఆయన విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్ మీడియంలో సాగింది. డిగ్రీ సైన్స్‌లో చేసినప్పటికీ బాబాయి కొండల్‌రెడ్డి అడ్వకేట్‌గా స్థిరపడటంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజశేఖర్‌రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం సాధించారు. ఎల్ఎల్బీ పూర్తికాగానే 1985లో మొదట నల్ల గొండలో న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే న్యాయవాదిగా 1985 ఏప్రిల్‌లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతహాగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా, అదే ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013 ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2022 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై లోకాయుక్తగా యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేరును ఖరారు చేసి రాజ్‌భవన్‌కు పంపింది. ఒకటి, రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేరు ఖరారు రాజ్‌భవన్‌కు చేరిన ప్రతిపాదనలు ఒకటి రెండు రోజుల్లో జారీకానున్న ఉత్తర్వులుస్వగ్రామంతో అనుబంధం కొనసాగిస్తూ.. శిర్సనగండ్ల గ్రామానికి పండుగలకు, శుభకార్యాలకు తరచూ రాజశేఖర్‌రెడ్డి వస్తుంటారని గ్రామస్తులు తెలిపారు. ఆయనకు సోదరులు యడవెల్లి దేవేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, దిలీప్‌రెడ్డి, సోదరి మంజుల ఉన్నారు. వీరిలో దేవేందర్‌రెడ్డి, రఘుపతిరెడ్డి శిర్సనగండ్ల గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. దిలీప్‌రెడ్డి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆస్తి పంపకాల్లో రాజశేఖర్‌రెడ్డికి అనుముల మండలం కొసలమర్రి గ్రామంలో 12 ఎకరాల పొలం వచ్చింది. దీనిలో బత్తాయి తోట సాగుచేస్తూ తరచూ ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. స్వగ్రామంలో తనకంటూ కొంత భూమి ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ మధ్యనే శిర్సనగండ్లలో రాజశేఖర్‌రెడ్డి మూడెకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు ఆయన సోదరుడు దేవేందర్‌రెడ్డి తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి చిన్నతనం నుంచి చదువులో మంచి ప్రతిభ కనపర్చేవారని కూడా పేర్కొన్నారు. తమ గ్రామానికి చెందిన వ్యక్తి లోకాయుక్తగా నియామకం కావడంతో శిర్సనగండ్ల గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన యువతేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించిన ఈ జాబ్‌మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రూ.40వేల వేతనంతో ఉద్యోగం వచ్చిందిమాది నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామం. మాది వ్యవసాయం కుటుంబం. మా అమ్మనాన్న కష్టపడి వ్యవసాయం చేసి నన్ను చదివించారు. ప్రస్తుతం జీఎన్ఎం(నర్సింగ్ కోర్సు) ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు హాజరయ్యాను. నెలకు రూ.40వేల వేతనంలో హోమ్‌కేర్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. – కందుకూరి సోని, వెలుగుపల్లి, నల్లగొండ మండలం పోలీసు శాఖకు ధన్యవాదాలునేను 2013లో బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేశాను. మా నాన్న ప్రైవేట్ స్కూల్లో అటెండర్‌గా పనిచేస్తారు. ఈ జాబ్‌మేళా గురించి తెలుసుకుని హాజరయ్యాను. పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరై కాగా.. రూ.45 వేల వేతనంతో పీహెచ్సీ సొసైటీ హోమ్‌కేర్ సర్వీస్‌లో జాబ్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు. – ఉప్పుల ఉదశ్రీ, నల్లగొండజాబ్ చేస్తూ చదువుకుంటాఇటీవల ఇంటర్ పూర్తి చేశాను. జాబ్‌మేళాలో ప్రైవేట్ కంపెనీలో రూ.16 వేల వేతనంతో జాబ్ వచ్చింది. ఈ జాబ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని ఉన్నత చదువులు చదివి ఇంకా మంచి ఉద్యోగం సంపాదిస్తాను. – నారగోని శివాని, చిన్న సూరారంఉద్యోగ కల నెరవేరిందిడిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్‌మేళా అవకాశాన్ని చూపింది. నెలకు రూ.14వేలు జీతంతో ప్రైవేట్ కార్ షోరూం నందు జాబ్ లభించింది. నా ఉద్యోగ కల నెరవేరింది. – ఆర్. మోహన్, నల్లగొండ భారీగా హాజరైన నిరుద్యోగులు -
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు
నల్లగొండ టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఏడాది కాలంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.22కోట్ల విలువైన ఎల్ఓసీలు పేద ప్రజలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణాల్లో నల్లగొండ ఒకటని, నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల తర్వాత ఎక్కువ ప్రసవాలు నల్లగొండలో జరుగుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్ అవసరమని, సంవత్సర కాలంలోనే క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 3 కోర్సులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
మానసిక ఒత్తిడితో కార్మికుడి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: మానసిక ఒత్తిడితో ఉరేసుకుని కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పసూనూరు గ్రామానికి చెందిన షేక్ సయ్యద్(50) కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. గత 20ఏళ్లుగా భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచింది. కానీ సయ్యద్‌కు మాత్రం జీతం పెంచలేదు. దీంతో కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. శుక్రవారం పరిశ్రమకు వెళ్లిన సయ్యద్ తనకంటే జూనియర్లకు జీతం పెంచి తనకు ఎందుకు పెంచలేదని పరిశ్రమ యాజమాన్యాన్ని అడిగాడు. ‘ఇక్కడ పనిచేస్తే చెయ్.. లేదంటే వెళ్లిపో’ అని పరిశ్రమ యాజమాన్యం అనడంతో ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్యతో చెప్పి బాధపడ్డాడు. సొంతూరికి వెళ్దామని, సామాను సర్దమని భార్యకు చెప్పాడు. శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రించిన సయ్యద్ అర్ధరాత్రి మరొక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం సయ్యద్ కుమార్తె నిద్ర లేచి చూడగానే తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తల్లికి చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి సయ్యద్‌ను కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు. తన చావుకు కంపెనీ యాజమాన్యం మరియు శేఖర్ అనే వ్యక్తి కారణమని రాసిన లెటర్ లభ్యమైంది. మృతుడి భార్య షేక్ జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
ఆలేరురూరల్: బైక్‌పై వెళ్తు న్న యువకుడు అదుపుతప్పి కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన ఆలేరు పట్టణంలో శనివారం జరిగింది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. ఆలేరు మండలం మందనపల్లికి చెందిన పంగ మల్లేష్ పెయింటింగ్ పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం పని ముగించుకొని ఆలేరు నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి వద్ద ఎదురుగా వస్తున్న వృద్ధుడిని తప్పించబోయి బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడికి ఆలేరు ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం జనగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రజినీకర్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిపాలకవీడు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పాలకవీడు మండలం శూన్యపహాడ్ గ్రామ సమీపంలో శనివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం చిల్లేపల్లికి చెందిన వట్టె నాగరాజు(37) శుక్రవారం గరిడేపల్లి మండలం కల్మల్చెరువు లో తమ బంధువు అంత్యక్రియలకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో నాగరాజుకు అతడి తమ్ముడు గంగరాజు ఫోన్ చేయగా.. తాను మరో వ్యక్తితో కలిసి దాచేపల్లికి వెళ్తున్నట్లు నాగరాజు చెప్పాడు. శనివారం ఉదయం వరకు నాగరాజు ఇంటికి రాకపోవడం, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో గంగరాజు దామరచర్ల నుంచి శూన్యపహాడ్ వెళ్లే దారిలో అన్నను వెతుక్కుంటూ వెళ్లాడు. శూన్యపహాడ్ సమీపంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలుపగా.. గంగరాజు అక్కడికి వెళ్లి చూడగా నాగరాజు మృతిచెంది కనిపించాడు. నాగరాజు మృతిపై గంగరాజు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చే సి మృతదేహాన్ని హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ లక్ష్మీనర్సయ్య తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదం
వలిగొండ: కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్(సవరణ)–2025 బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామానికి చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్‌రెడ్డి సంతాప సభను శనివారం టేకులసోమారం సమీపంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత హాజరై మోహన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వక్ఫ్(సవరణ)–2025 బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో లోక్‌సభలో రాహుల్ గాంధీ నోరు మెదపలేదని, ప్రియాంక గాంధీకి లోక్‌సభకు రావడానికి కూడా తీరిక లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. అనంతరం టేకులసోమారం గ్రామానికి చెందిన పనుమటి జంగారెడ్డికి చెందిన ఎండిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టదని, పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్‌రెడ్డి తన సొంత డబ్బుతో పాటు భూమిని కూడా దానమిచ్చి శ్రీవెంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 600 ఎకరాలకు సాగునీరందించి రైతులకు ఎంతో మేలు చేశారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఈఈలు శ్యాంసుందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మ వెంకట్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, పనుమటి మమతానరేందర్‌రెడ్డి, డేగల పాండరి, ఎండీ అఫ్రోజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో పూజలు..భువనగిరిటౌన్: భువనగిరి మండలం నందనంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పూజలు చేశారు. వలిగొండ వెళ్తున్న ఆమెకు భువనగిరి వద్ద మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్ అమరేందర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
నాడు కళకళ.. నేడు వెలవెల
అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుందిరంగనాథ రంగశాలను అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుంది. ప్రాజెక్టు అధికారులు సమయానుకూలంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ఉంటాయి. – శివ, స్థానిక వ్యాపారిసాగర్లో థియేటర్ లేదుసాగర్లో ఒకప్పుడు మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్కటి కూడా లేదు. వారాంతంలో సినిమాలు చూసేందుకు స్థానికులు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. రంగనాథ రంగశాలను లీజుకు తీసుకుని మినీ సినిమా థియేటర్‌గా రూపొందిస్తే పూర్వ వైభవం వస్తుంది. – భాస్కర్, ఉపాధ్యాయుడునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు తమ శ్రమను మర్చిపోయి ఆనందంగా గడిపేందుకు హిల్‌కాలనీలో రంగనాథ రంగశాలను నిర్మించారు. ఇందులో నిత్యం నాటకాలు ప్రదర్శించేవారు. అలనాటి సినిమా తారలు నూతన్‌ప్రసాద్, సావిత్రి, రేలంగి, జగ్గారావు, రాజనాల వంటి వారు రంగనాథ రంగశాలలో స్టేజీపై నాటకాలు వేశారని అప్పటి ఉద్యోగులు చెబుతుంటారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే ఉన్నతాధికారులు, విదేశీయులు సైతం ఇందులో వేసే నాటకాలు చూసి అబ్బుర పడేవారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో సినిమా థియేటర్లు వచ్చాక రంగనాథ రంగశాలలో నాటకాలు ప్రదర్శన ఆగిపోయాయి. కొంతకాలం సమావేశాలకు వినియోగం ఆ తర్వాత కొంతకాలం వరకు రంగనాథ రంగశాలను సమావేశాలు నిర్వహించేందుకు వినియోగించారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులు సేద తీరేందుకు గాను రూ.50లక్షలు ఖర్చు చేసి విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్, వాష్‌రూమ్స్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిర్వహణ లేక రంగనాథ రంగశాల ఆవరణలో కంపచెట్లు మొలిచాయి. బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. విద్యుత్ బోర్డులు, ఫ్యాన్లు చోరీకి గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో గతంలో మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్క థియేటర్ కూడా లేదు. స్థానికులు సినిమా చూడాలంటే హాలియా, మాచర్ల, మిర్యాలగూడకు వెళ్తుంటారు. రంగనాథ రంగశాలను అద్దెకిస్తే మినీ థియేటర్‌గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ ఇంజనీర్‌కు సినిమా థియేటర్ల నిర్వహణలో అనుభవం కలవారు దరఖాస్తు చేశారు. కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిని అద్దెకిస్తే ప్రాజెక్టు అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని స్థానికులు అంటున్నారు. శిథిలావస్థలో నాగార్జునసాగర్‌లోని రంగనాథ రంగశాల అద్దెకిచ్చి మినీ థియేటర్‌గా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు -
కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం
కోదాడరూరల్ : కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఆనుకొని ఉన్న వీధిలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్టారు. ఆ నిప్పు గాలికి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పడడంతో రాలిన చెట్ల ఆకులకు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ ఆవరణలో ఉంచిన పలు కేసుల్లో సీజ్ చేసిన మూడు ఆటోలు, కారు, టాటా ఏస్ వాహనం, స్కార్పియో వాహనానికి మంటలు అంటుకొని దగ్ధమాయ్యయి. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఏమాత్రం ఆలస్యమైనా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కు నిప్పంటుకొని పెను ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు దగ్ధం -
లక్ష మందిని తరలించాలి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించాలని పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సభకు జన సమీకరణకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులతో శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ సమావేశం నిర్వహించి నియోజవకర్గాల వారీగా టార్గెట్ విధించారు. వరంగల్‌కు 100 నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నాలుగు నియోజకవర్గాల నుంచి లక్షల మందిని తరలించాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఆలేరు, భువనగిరి, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచే టార్గెట్‌లో సగం మంది వచ్చేలా చూడాలని సూచించినట్లు తెలిసింది. మిగతా నియోజకవర్గాల నుంచి ఆరేడు వేల మంది చొప్పున ప్రజలు వరంగల్ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, విద్యుత్, సాగునీటి విషయంలో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఫలితం లేదని, సూర్యాపేటతో పాటు నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దానిని బీఆర్ఎస్ అందిపుచ్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు. స్థానికంగా పరిస్థితులను బట్టి స్థానిక సమస్యలపై, ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు కన్నీరుపెడుతున్నారని, ఇప్పుడు ప్రజల కన్నీరు తుడిచే బాధ్యత గులాబీ జెండాదేనని ఆ దిశగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం ఫ వరంగల్ సభకు జనసమీకరణపై ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో సమావేశం ఫ కాంగ్రెస్ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉందన్న గులాబీ అధినేత ఫ ప్రజలు మనవైపు ఉన్నారు.. స్థానికంగా పోరాటాలు చేయాలని పిలుపు -
7న ఎంజీయూలో ప్లేస్మెంట్ డ్రైవ్
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ లోని మహత్మాగాంధీ యూనివర్సిటీలో ఈనెల 7వ తేదీన శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సహకారంతో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, ప్లేస్మెంట్ కోఆర్డినేటర్స్ వెంకట్, శేఖర్, సత్యనారాయణరెడ్డి, సమ్రీన్ బేగం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడానికి ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పీజీ బీఈడీ, యూజీ బీఈడీ పూర్తయిన వారు అర్హులని చెప్పారు. సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 9010203857 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘ఏమి చేయాలి ఇండియాలో..’ పుస్తకావిష్కరణ నల్లగొండ టౌన్ : బహుజన పొలిటికల్ సెంటర్ జాతీయ నాయకుడు సాధు మాల్యాద్రి రచించిన ‘ఏమి చేయాలి ఇండియాలో..’ అనే సిద్దాంత గ్రంథాన్ని శనివారం నల్లగొండలోని అంబేద్కర్ భవన్లో బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డేవిడ్‌కుమార్, దర్శనం నర్సింహ, అంబటి నాగయ్య, పాలడుగు నాగార్జున, జానకిరాంరెడ్డి, చింతమళ్ల గురవయ్య, గజ్జి రవి, పందుల సైదులు, సుధాకర్‌రెడ్డి, సాగర్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు. ధ్రువీకరణ పత్రాలు తెచ్చి వాహనాలు తీసుకెళ్లాలినల్లగొండ : కేసులు నమోదైన వాహనాలను సంబంధిత వాహనదారులు ఆరు నెలల్లోగా సరైన ద్రువీకరణ పత్రాలు చూపించి వారి వాహనాలు తీసుకెళ్లాలని సోమవారం ఒక ప్రకనటలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన 14 మోటారు సైకిళ్లను నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. ఆరు నెలల్లోగా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించి వాహనాలు తీసుకెళ్లకపోతే ఆ వాహనాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 8712670170 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతలపై దృష్టిపెట్టాలినల్లగొండ : ఉపాధ్యాయులు హక్కుల కంటే తమ బాధ్యతలపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. నల్లగొండలోని టీఎస్‌యూటీఎఫ్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు బాధ్యతలపై దృష్టి పెట్టకపోతే రాబోయే పదేళ్లలో ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అనంతరం జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బక్క శ్రీనివాస్‌చారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, శేఖర్‌రెడ్డి, ఎడ్ల సైదులు, రమాదేవి, అరుణ, రామలింగయ్య, గేర నరసింహ, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, నలపరాజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న అధికారులు’నల్లగొండ టూటౌన్ : రేషన్‌షాపుల వద్ద ప్రధాని మోదీ ఫొటో పెట్టకుండా.. కాంగ్రెస్ నాయకుల ఫొటోలు పెడుతూ అధికారులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్నబియ్యానికి ఏడాదికి రూ.10 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. రేషన్‌షాపుల వద్ద సన్న బియ్యం పథకాన్ని కాంగ్రెస్ మాజీ ప్రతినిధులతో ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, మిర్యాల వెంకటేశం, రమణ తదితరులు పాల్గొన్నారు. -
సన్న బియ్యం.. క్యూ కట్టిన జనం!
చెప్పలేని సంతోషం ఉంది ప్రభుత్వం రేషన్ దుకా ణాల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను నా భర్త వయస్సు మీదపడటంతో ఏపనీ చేయలేక ఇంటి దగ్గరే ఉండి రేషన్‌కార్డు ద్వారా వచ్చే బియ్యం తీసుకెళ్లి తినేవాళ్లం. ఎప్పుడైనా పండుగ రోజు సన్న బియ్యం బయట దుకాణంలో కిలో రూ.70 పెట్టి కొని తినేవాళ్లాం. కానీ ఇప్పుడు ఆ బాధలేదు. రేషన్ దుకాణంలోనే ఉచితంగా సన్నబియ్యం ఇస్తుండటంతో నెల రోజుల పాటు కడుపునిండా తింటాం. ఇలానే ప్రతి నెలా ఇస్తే ఎంతో ఆనందపడతాం. – రేవెల్లి లక్ష్మమ్మ, లబ్ధిదారు మునుగోడు ఇకనుంచి సన్నబియ్యం తింటాం ఇంట్లో మేము ఇద్దరమే. మాకు రేషన్‌షాపుల ద్వారా 12 కిలోలు వస్తాయి. మొన్నటి వరకు దొడ్డు బియ్యం తినలేకపోయాం. మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటి నుంచి రేషన్‌షాపుల నుంచి వచ్చే సన్న బియ్యం తింటాం. – వెంకటేశ్వర్లు, ముత్తిరెడ్డికుంట, మిర్యాలగూడ సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం కోసం జనం ఎగబడుతున్నారు. చాలాషాపుల్లో సరిపడా బియ్యం రాకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కోటా ప్రకారం పౌర సరఫరాల శాఖ బియ్యం అలాట్ చేసింది. అయితే.. బియ్యం రేషన్ షాపు వద్దకు రావడంలో కొంత ఆలస్యం అవుతోంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ప్రతి నెల ఒకటో తేదీన నుంచి పదో తేదీలోగా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి తెచ్చుకునే వారు. అప్పట్లో ఒక్కో రేషన్‌షాపులో రోజుకు ఐదారు క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయగా.. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండటంతో లబ్ధిదారులు రేషన్‌షాపుల వద్ద బారులు దీరుతున్నారు. దీంతో ఒక్కో షాపులో రోజూ 30 నుంచి 40 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వస్తోంది. రేషన్ కేటాయింపులు ఇలా.. ● నల్లగొండ జిల్లాలో 4,66,522 రేషన్ కార్డులు.. 13,85,506 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 88,77,999 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రేషన్ షాపులకు 67,50,011 కిలోల బియ్యం ప్రభుత్వం కేటాయించింది. ● సూర్యాపేట జిల్లాలో 3,25,235 కార్డులు ఉండగా, 9,30,259 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికోసం 59,39,941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, రేషన్ షాపులకు 47,31,478 కిలోలు కేటాయించింది. ● యాదాద్రి జిల్లాలో 2,17,072 కార్డులు ఉండగా, 6,64,043 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికోసం 42,40,348 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, 34,92,799 కిలోల బియ్యాన్ని కేటాయించింది. ● ప్రస్తుతం సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ రేషన్ షాపులకు సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు కేటాయింపులో 80 శాతం బియ్యం రేషన్ షాపులకు చేరగా, అందులో దాదాపు సగానికిపైగా బియ్యం ప్రజలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫ రేషన్ షాపులకు భారీగా వస్తున్న లబ్ధిదారులు ఫ ఐదురోజుల్లోనే చాలాషాపుల్లో రేషన్ కోటా కంప్లీట్ ఫ పోర్టబిలిటీ ఆప్షన్‌తో పెరిగిన డిమాండ్ ఫ డీలర్ల వద్ద మిగులు బియ్యం నిల్వలకు కాలం చెల్లినట్టే.. -
డెడ్ స్టోరేజీకి చేరువలో సాగర్
నాగార్జునసాగర్ జలాశయంనాగార్జునసాగర్: సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. ప్రస్తుతం 517 అడుగులకు చేరింది. 144.7570 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే, ప్రాజెక్టులో నీటిమట్టం 510 అడుగులకు(131.6690 టీఎంసీలు)కు చేరితే డెడ్ స్టోరేజీగా పరిగణిస్తారు. సుమారు 13టీఎంసీల నీటిని వినియోగిస్తే కనీస డెడ్ స్టోరేజీకి చేరుకుటుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23వ తేదీ వరకు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఆ తర్వాత పంటలకు నీరు బంద్ చేసినా.. మళ్లీ వర్షాలు కురిసి కృష్ణానదికి వరదలు వచ్చే వరకు తాగునీటి అవసరాలకు నీరు విడుదల చేస్తునే ఉండాలి. సాగర్ జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు(312.450టీఎంసీలు). డిసెంబర్ 15వ తేదీన సాగర్ జలాశయంలో నీరు 580.80 అడుగులు(285.3216టీఎంసీలు) ఉంది. మూడు నెలల్లో నీటి వినియోగం అధికం కావడంతో నీటిమట్టం గణనీయంగా పడిపోయింది. -
జగదీష్‌రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదు
నల్లగొండ : మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను విమర్శిస్తున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ అన్నారు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పథకం సూర్యాపేటలో ప్రారంభిచారని.. ఏ ఊరిలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. పదేళ్లలో జిల్లాలో ఉన్న ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లెంల, ఇతర ఏ ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తూ పేదల కడుపు నింపుతున్నామన్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ డైనమిక్ అధికారులని.. వారిని కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని అనడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శమన్నారు. ఇప్పటికై నా ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, దుబ్బ అశోక్‌సుందర్, ముంతాజ్ అలీ, మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ -
ఉద్యోగం.. ఉజ్వల భవిష్యత్తుకు పునాది
రామగిరి(నల్లగొండ) : ఉద్యోగం.. ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యువతేజం మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోలీస్‌శాఖ.. శాంతి భద్రతల నిర్వహణతోపాటు, సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలో పోలీస్ శాఖ తరఫున జాబ్‌మేళా నిర్వహించడం ఇదే మొదటిసారని చెప్పారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడంతోపాటు సేవా కార్యక్రమాలు చేస్తున్న పోలీస్‌శాఖను అభినందించారు. అనంతరం మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మెగా జాబ్‌మేళాలో ఉద్యోగాలు పొందిన వారు మొదటిసారి వేతనం తక్కువగా ఉన్నప్పటికీ నిరాశపడవద్దని, అనుభవం కోసం కృషి చేయాలన్నారు. ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు 112 కంపెనీలు వచ్చాయని, 6497 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. 3300 మందిని ఆయా కంపెనీలు ఎంపిక చేసుకున్నాయని.. మరో 40 మందిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎల్ఐసీ ఎంపిక చేసిందని వివరించారు. ఈ జాబ్‌మేళాలో అత్యధికంగా రూ.45 వేల వేతనం పొందే ఉత్తర్వులు ఇచ్చామన్నారు. యువత సంఘవిద్రోహ శక్తులుగా తయారు కాకుండా వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో జాబ్‌మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక్కడ ఉద్యోగానికి ఎంపిక కాని వారు నిరాశపడొద్దని సూచించారు. జాబ్‌మేళాకు హాజరైన వారికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయం కల్పించడంపై ఆయన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మౌనిక, డీఎస్పీ శివరాంరెడ్డి, జాబ్ కో ఆర్డినేటర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫ జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్‌మేళా ఫ హాజరైన 112 కంపెనీల ప్రతినిధులు ఫ 6,497 మంది నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ -
జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ముందుకెళ్లాలి
నల్లగొండ టౌన్ : యువత డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం జగ్జీవన్‌రామ్ 118వ జయంతి సందర్భంగా నల్లగొండలోని ఎన్జీ కళాశాల ఎదురుగా, మర్రిగూడ బైపాస్ వద్ద ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం క్లాక్‌టవర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ జగ్జీవన్‌రామ్ అంటరానితనం నిర్మూలనకు కృషి చేశాడన్నారు. జిల్లాలో అభివృద్ధిలో భాగంగా ఈనెల7న అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో మరమ్మతులకు జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ.25 లక్షలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్, చొల్లేటి ప్రభాకర్, చక్రహరి రామరాజు, వంగూరి లక్ష్మయ్య, దున్న యాదగిరి, బొర్ర సుధాకర్, కత్తుల జగన్‌కుమార్, సంహితారాణి, పెరిక హ రిప్రసాద్, ఇరిగి ప్రసాద్, అంజిబాబు పాల్గొన్నారు.ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్జీ కళాశాల వద్ద బాబుజగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తరువాత జిల్లా పోలీస్ కార్యాలయంలో నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన యువతేజం జాబ్‌మేళాలో పాల్గొంటారు. 12 గంటలకు నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్రిటికల్‌కేర్ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు వెళతారు. ‘ఓపెన్ స్కూల్’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలినల్లగొండ: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలన నిర్వహణపై శుక్రవారం నల్లగొండలో డీఈఓ భిక్షపతితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే అభ్యాసకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సత్యమ్మ, అధికారులు పాల్గొన్నారు. టీబీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలినార్కట్పల్లి: అనుమానం ఉంటే జాప్యం చేయకుండా టీబీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి అన్నారు. టీబీ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే అత్యాధునిక ట్రూనాట్ టెస్టింగ్ పరికరాన్ని శుక్రవారం నార్కట్‌పల్లి పరిధిలోని కామినేని మెడికల్ కళాశాలలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ తరహా ఆధునిక పరికరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయన్నారు. బాధితుల నుంచి ఇతరులకు కూడా టీబీ వ్యాపించే ప్రమాదం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పీవీ.రామమోహన్, సమీయుద్ధీన్, రవిప్రసాద్, అజయ్, సైదులు, అంజన్, నవనీత్ ఉన్నారు. పేట మార్కెట్‌కు 33,457 బస్తాల ధాన్యం భానుపురి: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 33,457 బస్తాల వరి ధాన్యం వచ్చింది. అత్యధికంగా జైశ్రీరాం రకం 19,704 బస్తాలు, హెచ్‌ఎంటీలు 7,038 బస్తాలు, ఆర్ఐ(64) 6,632 బస్తాల చొప్పున వచ్చింది. అదేవిధంగా 333 బస్తాల పెసర, 84 బస్తాల కంది, అపరాలు మొత్తం 657 బస్తాలు వచ్చాయి. దీంతో మార్కెట్ ధాన్యం రాశులతో కళకళలాడింది. -
జీవాల పెంపకానికి చేయూత
నల్లగొండ అగ్రికల్చర్: దేశంలో మాంసం విని యోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు సరిపడా మాంసం ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో మాంసానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని జీవాల పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే గొర్రెలు, మేకల పెంపకానికి నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ స్కీం (ఎన్ఎల్ఎంఎస్) కింద ఉత్సాహావంతులైన వ్యాపారులు, పెంపకందారులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని భావిస్తోంది. అయితే 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకాన్ని రాష్ట్ర పశువైద్య సంవర్థక శాఖ అమలు చేస్తోంది. జీవాలకు సంబంఽఽధించిన సబ్సిడీ పూర్తిగా విడుదలయ్యే వరకు ఈ పథకాన్ని ప్రతి రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖ పర్యవేక్షించనుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో యాభై శాతం లేదా రూ.50 లక్షలు మించకుండా పెంపకందారులకు సబ్సిడీ రుణాలు అందించనున్నారు. యూనిట్ ప్రారంభం మొదలుకుని రెండు విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ నిధులు జమ చేయనున్నారు. ఇలా.. దరఖాస్తు చేయాలి గొర్రెలు, మేకల యూనిట్ల కోసం www.nim.udyamimitra.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులకు రాష్ట్ర పశువైద్య సంవర్థక శాఖ ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారుని పాన్‌కార్డు, ఆధార్, అడ్రస్ ప్రూఫ్, పాస్ పోర్టు ఫొటో, రుణం తీసుకునే బ్యాంకు స్టేట్మెంట్, ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అర్హతలు ఇవే.. గొర్రెలు, మేకలు పెంపకంపై ఆసక్తి కలిగిన వ్యక్తి లేదా సంస్థ లేదా స్వయం సహాయక సంఘాలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పశుపోషణలో తగిన అనుభవం కలిగి ఉండాలి. గొర్రెలు మేకల పెంపకంపై ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి శిక్షణ పొంది ఉండాలి. సాంకేతిక సలహాదారుడిగా అనుభవజ్ఞులైన పశువైద్య సిబ్బందిని ఫాం నిర్వహణకు నియమించుకోవాల్సి ఉంటుంది. మాంసం ఉత్పత్తి పెంచేలా కేంద్రం చర్యలు ఫ ఎన్ఎల్ఎం స్కీం ద్వారా రుణాలు ఫ యూనిట్‌కు 50 శాతం సబ్సిడీ ఫ గరిష్టంగా రూ.50 లక్షలు మంజూరు ఫ ఆన్లైన్లో అర్జీలకు ఆహ్వానం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలి. నిరుద్యోగ యువత యూనిట్లు పొంది స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి. ఇతర వివరాల కోసం నల్లగొండలోని జిల్లా కార్యాలయంలో సంప్రదించాలి. – జీవీ.రమేష్, జిల్లా పశువైద్య సంవర్థక శాఖ అధికారి, నల్లగొండ యూనిట్లకు సబ్సిడీ ఇలా.. యూనిట్ సబ్సిడీ (గొర్రెలు, పొట్టేళ్లు) (రూ.లక్షల్లో..)500–25 50 400–40 40 300–15 30 200–10 20 100–05 10 -
90శాతం పన్ను వసూలు
నల్లగొండ: గ్రామ పంచాయతీల్లో గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2024–25) సంబంధించి ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో మొత్తం 868 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటి పరిధిలో ఏటా ఏప్రిల్ మొదటి తేదీ ఉంచి జూలై మాసం వరకు నూటికి నూరు శాతం ఆస్తిపన్ను వసూలు చేయాలి. అయితే అప్పటి వరకు రాష్ట్రంలో ఎక్కడా పూర్తిస్థాయిలో పన్నులు వసూలు కాకపోవడంతో ప్రభుత్వం గడవు పొడిగించింది. దీంతో మార్చి 31 వరకు మొత్తం 90 శాతం ఆస్తిపన్ను వసూలైంది. మార్చి 31 నాటికి.. మార్చి 31తో 2024–25 ఆర్ధిక సంవత్సర ముగిసింది. అప్పటి వరకు జిల్లాలో అన్ని పంచాయతీల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది ఇంటింటికీ తిరిగి 90 శాతం ఆస్తిపన్ను వసూలు చేశారు. జిల్లాలో మొత్తం రూ.22.28,24,101 వసూలు చేయాల్సి ఉంది. మార్చి 31 వరకు రూ.20,10,47,907 వసూలు చేశారు. ఇంకా 2,17,76,194 వసూలు చేయాల్సి ఉంది. అయితే ఆస్తిపన్నులు గతేడాది 60 శాతం వసూలైతే ప్రస్తుతం 30 శాతం వరకు అధికంగా వసూలైందని అధికారులు పేర్కొంటున్నారు. పన్ను వసూలుతో ఊరట గ్రామ పంచాయతీ పాలకవర్గాల కాల పరిమితి ముగిసి సంవత్సర కాలం గడిచింది. దీంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అయితే పాలవర్గాల గడువు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్ధిక సంఘం నిధులు నిలిచిపోయాయి. పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు జనాభా ఆధారంగా ప్రతినెలా కేంద్రం నిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చేది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడంతో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ఆస్తిపన్ను రూపంలో 90 శాతం వసూలు కావడం కొంత ఊరట లభించినట్టు అయ్యింది. వసూలైన పన్నును గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. అత్యవసర పనులకు ఖర్చు చేయొచ్చు ఆస్తి పన్ను వసూలు ద్వారా వచ్చిన డబ్బును గ్రామసభల తీర్మానం మేరకు అత్యవసర పనులకు వినియోగించుకోవచ్చు. గ్రామంలో తాగునీరు, ఇతర ఏ పని ప్రజలకు అవసరమని భావిస్తారో ఆ పనులకు సంబంధించి ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసి ఖర్చు చేయాల్సి ఉంటుంది. – వెంకయ్య, డీపీఓ, నల్లగొండగ్రామ పంచాయతీల్లో ముగిసిన ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ ఫ క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరిగి వసూలు చేసిన సిబ్బంది ఫ గతేడాది కంటే 30శాతం అధికంగా వసూలైందన్న అధికారులు -
నేత్రపర్వంగా ఊంజల్ సేవోత్సవం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి, ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం చేపట్టారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరం వినిపించారు. ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకుజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపిన అర్చకులు. గర్భాలయంలోని స్వయంభూలు, అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదల అర్చనతో కొలిచారు. అదే విధంగా ప్రాకార మండపం, ముఖ మండపంలో సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, జోడు సేవోత్సవం నిర్వహించారు. -
రైతులను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్
నల్లగొండ టూటౌన్: కేసీఆర్ హయాంలో రైతులకు స్వర్ణయుగంలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టిస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ముందు రాష్ట్రంలో దుర్భిక్షం ఉంటే కేసీఆర్ హయాంలో 2017 నాటికి ఉమ్మడి జిల్లాలో రైతులు 40 లక్షల టన్నుల ధాన్యం అందించారన్నారు. సాగర్ ఆయకట్టులో ఇప్పటికే వరికోతలు 60 శాతం పూర్తయ్యాయని, అయినా ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో అన్నదాతలు మిల్లుల్లో అడ్డగోలు ధరకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ, సివిల్ సప్లయ్ శాఖల మంత్రులు సమీక్షలు నిర్వహించిన పాపాన పోలేదన్నారు. ఇప్పటికై న మంత్రులు అధికారులతో సమీక్షించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. నల్లగొండ మంత్రి ఏనాడు రైతుల గురించి పట్టించుకున్నది లేదన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగడంలేదన్నారు. ఓ మంత్రి మైకంలో ఉంటూ రైతులను లెక్కేచేయడంలేదని, గాలి మోటార్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గత వానాకాలంలో రైతుల నుంచి సన్నధాన్యం ఎంత కొన్నారో, ఎంత బోనస్ ఇచ్చారో చెప్పే దమ్ము సీఎం, మంత్రులకు లేదన్నారు. జిల్లా కలెక్టర్ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తగా మాట్లాడవద్దని హితవు పలికారు. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లిఖార్జున్‌రెడ్డి, నిరంజన్‌వలీ, తండు సైదులు, కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాస్‌రెడ్డి, జమాల్‌ఖాద్రీ పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
అర్హులైన యువత దరఖాస్తు చేసుకోవాలి
కనగల్: అర్హులైన నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జి.యడవల్లి గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామమని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకుగాను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశాల మేరకు తాను దత్తత తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఈ పథకం కింద రూ.50వేల నుంచి రూ.4లక్షల వరకు ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తుతో పాటు, రేషన్ కార్డును జతచేయాలని, ఒకవేళ రేషన్ కార్డులు లేనట్లైతే ఆదాయం, కులం ధ్రువపత్రాలు సమర్పించాలన్నారు. మండల అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ జి.యడవల్లి చెరువు అలుగును పరిశీలించారు. అలుగు మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.మాన్యానాయక్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్‌కుమార్, బీసీ సంక్షేమ సహాయ అధికారి సంజీవయ్య, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అనూప్‌రెడ్డి, తహసీల్దార్ పద్మ ఎంపీడీఓ జయరాం తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కట్టా అనంతరెడ్డి
రామగిరి(నల్లగొండ): నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కట్టా అనంతరెడ్డి గెలుపొందారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 291 ఓట్లకు గాను 284 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. అనంతరెడ్డికి 149, ఏ.సతీష్‌కుమార్ 134 ఓట్లు వచ్చాయి. దీంతో సతీష్‌రెడ్డిపై 15 ఓట్ల మెజారిటీలో అనంతరెడ్డి విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా మందా నగేష్, ఉపాధ్యక్షులుగా ఎం.నాగిరెడ్డి, పెరుమాళ్ల శేఖర్, జాయింట్ సెక్రటరీగా ఎండీ.ఫిరోజ్, ట్రెజరర్‌గా బరిగెల నగేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన జడ్జి నాగరాజును కలవగా ఆయన అభినందించారు. -
నేడు పోలీస్ మెగా జాబ్‌మేళా
నల్లగొండ: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతేజం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో 100 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. మొత్తం 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఈ మేళాను ఎస్పీ శరత్ శంద్ర పవార్ ఈ జాబ్ మేళాను ప్రారంభించనున్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాని జిల్లా ఎస్పీ కోరారు. ఫ నల్లగొండ పోలీస్ మైదానంలో ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ -
సన్న బియ్యం పంపిణీ.. చరిత్రాత్మకం
నల్లగొండ: ఆహార భద్రత కల్పించడంలో భాగంగా నిరుపేదలందరికీ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం చరిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ పథకంలో 80 శాతానికి పైచిలుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు లబ్ధిపొందనున్నారని తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 99 శాతం మేర పూర్తి కాగా మరికొన్ని జిల్లాల్లో పంపిణీ వేగవంతమైందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఇన్చార్జి డీఎస్ఓ హరీష్ తదితరులు హాజరయ్యారు. ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
చి‘వరి’ దశలో నీరందేనా..!
వెంటనే స్పందించాలి డిండి ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేసిన పంట పొలాలు ఎండి పోకుండా చూడాలి. పంట చివరిదశ వరకు నీరందించే విషయంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి. – బద్దెల బచ్చలు, రైతు, డిండి నీటిని పొదుపుగా వాడుకోవాలి డిండి ప్రాజెక్టు నుంచి సాగుకు విడుదల చేసిన నీటిని రైతులు వృథా కాకుండా పొదుపుగా వాడాలి. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు 45 రోజుల వరకు సరిపోతుంది. – ఎలమందయ్య, ఈఈ, డిండి ప్రాజెక్టు డిండి : యాసంగి సీజన్లో సాగు చేసిన వ్యవసాయ పొలాలకు పంట చివరి దశ వరకు సాగు నీరు అందుతుందో లేదో అని డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులోని నీటి మట్టం రోజురోజుకు తగ్గుతుండటం, ఎగువ ప్రాంతమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీరురాకపోవడంతో సాగు ప్రశ్నార్థకౖంగా మారింది. గతేడాది వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టులో ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేశారు. కానీ 75 శాతం వరకు రైతులు వరి సాగు చేశారు. దీంతో నీటి వాడకం ఎక్కువ కావడంతో ప్రాజెక్టులో నీరు వేగంగా తగ్గిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు(2.5 టీఎంసీలు)కాగా.. ఎడమ కాలువ ద్వారా 12,500 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల్లో యాసంగి సాగుకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజక్టులో 22 అడుగుల(ఒక టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. పంటలు చేతికి రావాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న నీరు నెల రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని తరలించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఎకరం పొలం కూడా ఎండొద్దు : ఎమ్మెల్యే బాలునాయక్ డిండి ప్రాజెక్టు కింద సాగు చేసిన పొలాలకు నీరందించే విషయంపై గురువారం ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ స్థానిక నీటి పారుదల శాఖా అతిథి గృహంలో ఇరిగేషన్ శాఖా అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు వృథా కాకుండా పంట చివరిదశ వరకు అందించేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాలన్నారు. ఫ డిండి ప్రాజెక్టులో 22 అడుగులకు తగ్గిన నీటి మట్టం ఫ పంటలు చేతికి రావాలంటే రెండు నెలలపాటు నీటి అవసరం ఫ నెల రోజులకే సరిపోనున్న ప్రస్తుత నిల్వ ఫ ఆందోళన చెందుతున్న రైతులు -
వైద్య వృత్తికి ప్రత్యేక గుర్తింపు
నల్లగొండ టూటౌన్ : దేశంలో ఏ రంగంలో రాని గుర్తింపు కేవలం ఒక వైద్యవృత్తిలో మాత్రమే లభిస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఎస్ఎల్బీసీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఆవరణలో గురువారం రాత్రి నిర్వహించిన 2019–25 బ్యాచ్ గ్రాడ్యుయేషన్ డేలో ఆయన ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న యువ డాక్టర్లు.. పీజీ పూర్తి చేసిన తర్వాత నల్లగొండ గడ్డ మీద ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆకాక్షించారు. అత్యవసర సమయంలో ప్రజలు తలుచుకునేది వైద్యులను మాత్రమేని.. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందించి వారి మన్ననలు పొందాలని కోరారు. ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ సర్వీస్‌ల్లో చేరి రోగులకు వైద్యం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్య, విద్యా రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆరోగ్యశ్రీ కింద వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. వివిద రాష్ట్రాల నుంచి వచ్చి ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఎక్కడ వైద్యం అందించినా నల్లగొండ గడ్డకు పేరు తీసుకురావాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రోగులకు వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకుంటేనే వైద్యులకు కూడా తృప్తి ఉంటుందన్నారు. విదేశాల్లో పైచదువులు చదివినా తిరిగి దేశానికి, నల్లగొండ ప్రాంతానికి వచ్చి పని చేయాలని కోరారు. ఏ డిపార్టుమెంట్లో పని ఆలస్యం జరిగినా ఇబ్బంది అంతగా ఉండదని, వైద్యంలో మాత్రం అప్పటికప్పుడే స్పందించి వైద్యం అందిస్తేనే రోగులకు మేలు చేకూరుతుందన్నారు. అనంతరం ఎంబీబీఎస్, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న 142 మంది విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీవాణి, వైస్ ప్రిన్సిపాల్ రామచంద్ర, సూపరింటెండెంట్ అరుణకుమారి, ప్రొఫెసర్లు శివకుమార్, రాజేంద్రకుమార్, స్వరూపరాణి, బద్రీనారాయణ, రాధాకృష్ణ, పుష్ప, వందన, ఉషశ్రీ, యామిని, అయేషా పాల్గొన్నారు. ఫ యువ డాక్టర్లంతా పేదలకు సేవలందించాలి ఫ ఎవరైనా ఆపదలో తలుచుకునేది వైద్యులనే.. ఫ పీజీ పూర్తి చేసిన తర్వాత నల్లగొండ ప్రజలకు సేవ చేయాలి ఫ మెడికల్ కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలి
నల్లగొండ : నల్లగొండలో ఈ నెల 5న నిర్వహించనున్న బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఒక ప్రకటనలో కోరారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు నల్లగొండ ఎన్జీ కాలేజీ ఎదురుగా నిర్వహించనున్న జయంతి ఉత్సవాలకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఇతర అన్ని సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. ఒకేషనల్ పరీక్షకు 37 మంది గైర్హాజరునల్లగొండ : పదో తరగతి ఒకేషనల్ పరీక్షలు గురువారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 2,597 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 2,560 మంది హాజరయ్యారు. 37 మంది గైర్హాజరైనట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలిమాడుగులపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పి.శ్రవణ్‌కుమార్ అన్నారు. గురువారం మాడ్గులపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎ–గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2320, సాధారణ రకానికి రూ.2300 ఇస్తోందని.. సన్న రకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తుందని తెలిపారు. రైతులు 17శాతం తేమ ఉండేలా నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధరతోపాటు బోనస్ పొందాలన్నారు. కార్యక్రమంలో ఏఓ శివరాంకుమార్, ఏఈఓలు శిరీష, వేణుగోపాల్, పార్వతి, రైతులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
డ్రమ్ము నెట్టు.. నీరు పట్టు!
చందంపేట : ఈ ఫొటో చూడగానే పిల్లలు, పెద్దలు ఆడుకుంటున్నారు అనుకుంటే పొరబడినట్లే. ఓ కుటుంబం వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి నీటిని తెచ్చుకునేందుకు వెళ్తుందంటే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజమే. మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్లాల్సిన పని లేకుండా ఆర్టీడీ సంస్థ వారు చెంచుల కోసం ప్రత్యేకంగా ఈ పరికరాన్ని తయారు చేయించారు. ఈ పరికరం ద్వారా ఓ డ్రమ్మును ముందుకు నెట్టుకుంటూ వెళ్లి నీటిని నింపుకొని తీసుకెళ్లొచ్చు. చందంపేట మండలంలోని పాత తెల్దేవర్పల్లిలో సుమారు పది కుటుంబాలకు ఆర్టీడీ సంస్థ నెట్టుకుంటూ వెళ్లే ఈ డ్రమ్ములను అందజేసింది. పాత తెల్దేవర్పల్లి గ్రామంలో ప్రస్తుతం వేసవి కావడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో డ్రమ్ముతో కూడిన ఈ పరికరాన్ని గ్రామస్తులు అర కిలోమీటర్ మేర ఇలా నెట్టుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని బోరు వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు. -
‘కేంద్రం నిధులతో సన్న బియ్యం’
నల్లగొండ టూటౌన్ : సన్న బియ్యం ఇస్తున్నామని కాంగ్రెస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సన్న బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.మనోహర్‌రెడ్డి అన్నారు. ‘సొమ్ము కేంద్రానిది.. సోకు రాష్ట్రానిది’ పేరుతో రూపొందించిన పోస్టర్‌ను బుధవారం నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో వారు ఆవిష్కరించి మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నిజాలు తెలుసుకోకుండా సన్న బియ్యం తామే ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో పేదలందరికీ ఉచితంగా బియ్యం ఇస్తున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా అబద్ధాలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. సమావేశంలో నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, పల్లెబోయిన శ్యాంసుందర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, చింత ముత్యాలరావు, రావెళ్ల కాశమ్మ, జగ్జీవన్ పాల్గొన్నారు. -
ఉత్సవాలను విజయవంతం చేయాలి
నల్లగొండ : బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో వివిధ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 5న బాబు జగ్జీవన్‌రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా హాజరయ్యే వారికి వేసవి దృష్ట్యా తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు విస్తరణలోతొలగించిన జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, కోటేశ్వరరావు, పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి -
రాజీవ్ యువ వికాసానికి నేరుగా దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలోని 8 కార్పొరేషన్ల పరిధిలో రుణాలు పొందేందుకు ఇక నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకున్నారు. అయితే సర్వర్ ఇబ్బందులతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకునే విషయంలో ఇబ్బంది ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో.. గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను కూడా సిద్ధం చేశారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సాగనుంది. గతంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వారు ఆయా హార్డ్ కాపీలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది. ఫ ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు ఆయా శాఖల పరిధిలో వచ్చిన దరఖాస్తులు ఇలా..ఎస్సీ 7154ఎస్టీ 3823బీసీ 13,463మైనార్టీ 1194 ఎంబీసీ 49బీసీ ఫెడరేషన్ 118 క్రిిస్టియన్ మైనార్టీ 69ఈబీసీ 437 మొత్తం 26,357 -
పురోగతిలో రాష్ట్రంలో రెండోస్థానం
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)టర్నోవర్‌తో పాటు లాభాలను గడించడంలో పురోగతిని సాధించి రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలిచిందని చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. బుధవారం బ్యాంకులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత సంవత్సరంలో రూ.30 కోట్ల లాభాల్లో ఉండగా ప్రస్తుత ఏడాదిలో రూ.42.31 కోట్లకు పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు టర్నోవర్ రూ.2300 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.3వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకోగా రూ.2800 కోట్లకు చేరిందని, నెల రోజుల్లో లక్ష్యం చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీబీ పుట్టిన నాటి నుంచి ఎన్నడూ లేనివిధంగా పురోగతి సాధించిందన్నారు. రైతులకు రూ.115 కోట్ల పంటరుణాలు ఇచ్చామని. రూ.100 కోట్ల డిపాజిట్లను సేకరించామని తెలిపారు. బంగారు ఆభరణాలపైరూ. 623.91 కోట్ల రునాలు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఇళ్ల నిర్మాణం కోసం భూమి తనఖాను పెట్టుకుని రూ.35 లక్షల వరకు రుణాలను ఇవ్వడంతో పాటుగా రైతుల పిల్లల విదేశీ ఉన్నత చదువుల కోసం విరివిగా రుణాలను ఇస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా కోళ్లు, గొర్రెలు పెంపకానికి రుణాలు అందిస్తుమన్నారు. బ్యాంకు విస్తరణ కోసం ఉమ్మడి జిల్లాలో అదనంగా తిప్పర్తి, ఆత్మకూరు, గరిడేపల్లి, నారాయణపూర్, దామరచర్లలో నూతన బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంకా మరో ఆరు బ్రాంచీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయించడం ద్వారా వాటిని ఆర్ధికంగా బలోపేతం చేస్తున్నామన్నారు. బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తున్న ఉద్యోగులు, సహకరిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలను తెలియజేశారు. సమావేశంలో సీఈఓ కె.శశంకర్రావు, డీజీఎం నర్మద, ఉపేందర్‌రావు, ఏజీఎం కురవానాయక్, డైరెక్టర్లు పాశం సంపత్‌రెడ్డి, గుడిపాటి సైదులు పాల్గొన్నారు. డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి -
ముగిసిన పదో తరగతి పరీక్షలు
నల్లగొండ : పదో తరగతి పరీక్షలు బుధవారంతో ముగిసాయి. మార్చి 21న ప్రారంభమైన పరీక్షలు ఈ నెల 2న సాంఘిక శాస్త్రం పరీక్షతో పూర్తయ్యాయి. బుధవారం జరిగిన పరీక్షకు మొత్తం 18666 మంది విద్యార్థులు హాజరుకావల్సి ఉండగా.. 18,628 మంది హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. 99.79 శాతం హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. లిటిల్‌ఫ్లవర్ స్కూల్లో ఏర్పాట్లు.. పదో తరగతి పరీక్షలు ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం జరుగనుంది. ఇతర జిల్లాల నుంచి నల్లగొండకు 2 లక్షలకుపైగా పేపర్లు రానున్నాయి. ఏ జిల్లా నుంచి వచ్చే విషయం ఎవరికీ తెలియదు. నల్లగొండలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్లో మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. 7వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం -
డిగ్రీ ప్రాక్టికల్స్ బహిష్కరణ
రామగిరి(నల్లగొండ) : మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి ప్రారంభం కావాల్సిన ప్రాక్టికల్ పరీక్షలు ప్రైవేట్ కాలేజీల్లో నిలిచిపోయాయి. గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకు నిరసనగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యం, వేతనాలు ఇవ్వడం లేదని అధ్యాపకులు పరీక్షలను బహిష్కరించారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం ప్రాక్టికల్ పరీక్షలు యథావిధిగా జరిగాయి. యూనివర్సిటీ పరిధిలో 60 కళాశాలలు ఉండగా మొదటి దశలో 30 కళాశాలలో బుధవారం నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రభుత్వ, గురుకుల కాలేజీల్లో మినహా అన్ని ప్రైవేట్ కాలేజీల్లో పరీక్షలు బహిష్కరించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల అయ్యేంతవరకు పరీక్షలను బహిష్కరిస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం, లెక్చరర్లు అంటున్నారు. వైద్యులు ప్రజలకుఅందుబాటులో ఉండాలిచింతపల్లి : గ్రామీణ ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్ సూచించారు. బుధవారం చింతపల్లి మండల పరిధిలోని మాల్ వెంకటేశ్వర్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట డాక్టర్ వంశీకృష్ణ ఉన్నారు. యువజన కాంగ్రెస్ పటిష్టతకు కృషి చేయాలినల్లగొండ : జిల్లాలో యువజన కాంగ్రెస్ పటిష్టతకు ప్రతి కార్యకర్తా కృషి చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జి పొన్నం తరుణ్‌గౌడ్ అన్నారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో మేకల ప్రమోద్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన యువజన కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రజాక్షేత్రంలో ఉండే విధంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు. సమావేశంలో హరిప్రసాద్, కొర్రా రామ్‌సింగ్, తొర్పునూరి శ్రీకాంత్‌గౌడ్, మణిమద్దె పరమేష్, మామిడి కార్తీక్, అబ్బనబోయిన రాముయాదవ్ పాల్గొన్నారు. ఆస్తి పన్ను ముందస్తు చెల్లిస్తే రాయితీనల్లగొండ టూటౌన్ : ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తి పన్ను ముందస్తు చెల్లించి ఐదు శాతం రాయితీ సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీకి పాత బకాయిలేనివారు 2025–26 సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెల 30వ తేదీలోగా చెల్లించి ఐదు శాతం రాయితీ పొందాలని కోరారు. -
ప్రత్యేక ప్రజావాణి వాయిదా
నల్లగొండ : కలెక్టరేట్లో గురువారం నిర్వహించనున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వృద్ధులు, దివ్యాంగులు గురువారం కలెక్టరేట్‌కు రావద్దని పేర్కొన్నారు. సీపీఓగా మాన్యానాయక్నల్లగొండ : నల్లగొండ ముఖ్య ప్రణాళిక అధి కారి (సీపీఓ)గా మాన్యానాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఆయన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి ఇవ్వడంతోపాటు నల్లగొండ సీపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన గూడ వెంకటేశ్వర్లు వికారాబాద్‌కు బదిలీ అయ్యారు. -
మూసీకి పూడిక ముప్పు
0.74 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గుదల కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గతేడాది హైడ్రోగ్రాఫిక్, రిమోట్ సెన్సింగ్ సాంకేతికతతో నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. దేశ వ్యాప్తంగా 87 జలాశయాలు పూడిక కారణంగా వేగంగా నీటినిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయని సీడబ్ల్యూసీ పేర్కున్న సర్వేలో మూసీ జలాశయం ఉంది. మూసీ జలాశయంలో ఇప్పటికే 15.32 శాతం మేర పూడిక ఉందని, పరిరక్షణ చర్యలు తప్పవని ఈ సర్వే సూచించింది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రాజెక్టు నిర్మించిన నాటి నుంచి 2024 వరకు 0.74 టీఎంసీల సామర్థ్యం తగ్గిపోయింది. ఫలితంగా నీటినిల్వ సామర్థ్యం 3.72 టీఎంసీలకు, ఆయకట్టు 33 వేల ఎకరాలకు పడిపోయిందని సీడబ్ల్యూసీ సర్వే పేర్కుంది. ప్రాజెక్టులో పూడిక తొలగించి పూర్తిస్థాయిలో నీటి నిల్వకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మూసీ ఆయకట్టు రైతులు కోరుతున్నారు. కేతేపల్లి : ఉమ్మడి జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత అతిపెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్టు నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగునీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించారు. పూడిక పేరుకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికు చేరుకుంది. 1987లో స్కవర్ గేట్ల మూసివేత.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది హైదరాబాద్, యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా 240 కిలోమీటర్లు ప్రవహిస్తూ జిల్లాలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. మూసీనదిపై సూర్యాపేట మండలం సోలిపేట వద్ద రెండు గుట్టల మద్యన రూ.2.20 కోట్ల వ్యయంతో 30 గేట్లతో 1963లో ప్రాజెక్టు నిర్మించారు. 645 అడుగులు(4.83 టీఎంసీలు) నీటి నిల్వ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో చెత్తచెదారం, మట్టిని ఎప్పటికప్పుడు బైటకు విడుదల చేసేందుకు అప్పటి ఇంజనీర్లు ప్రాజెక్టు అడుగు భాగాన 10 స్కవర్‌గేట్లు, మధ్యలో 8 రెగ్యులేటర్ గేట్లు, పైభాగంలో 12 క్రస్ట్‌గేట్లతో ప్రాజెక్టును నిర్మించారు. ప్రాజెక్టుకు అడుగు భాగంలో ఉండే స్కవర్‌గేట్లు తరుచుగా మరమ్మతులకు గురవుతుండటంతో 1987లో కాంక్రీట్ వేసి వాటిని శాశ్వతంగా మూసివేశారు. దీంతో ప్రాజెక్టులో పేరుకపోయిన పూడికను వరదనీటితో పాటు బైటకు పంపించేందుకు ఉన్న ఏకై క మార్గం మూసుకుపోయింది. వరద నీటితో పూడిక చేరిక.. మూసీ నదికి వరదలు వచ్చినపుడు ఉప నదులు, వాగులు, వంకల ప్రవాహాలతో ఇసుక, ఒండ్రుమట్టి జలాశయంలో చేరుతున్నాయి. వరదలు అధికంగా వచ్చే సమయంలో నీటి ఉధృతితో తీరాలు కోతకు గురై చెట్లు, మట్టి కొట్టుకొచ్చి ఏటా జలాశయంలో చేరడం కూడా పూడికకు కారణమవుతోంది. ఫ తగ్గుతున్న నీటి నిల్వ సామర్థ్యం ఫ కేంద్ర జల సంఘం సర్వేలో వెల్లడి -
యువ తేజం
5వ తేదీన జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్‌మేళా సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉద్యోగ, ఉపాధి అవకాశల్లేక, పక్కదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేలా జిల్లా పోలీసు శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. యువత సమాజంలో గౌరవంగా బతికేలా చూసేందుకు ‘యువ తేజం’ పేరుతో జిల్లాలో పోలీసు శాఖ మొదటిసారిగా మెగా జాబ్‌మేళా నిర్వహిస్తోంది. యువతకు ఏదో ఒక ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వివిధ కంపెనీలతో మాట్లాడి, వారిని ఒప్పించి ఈనెల 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. యువత పక్కదారి పట్టకుండా.. జిల్లాలో పదో తరగతి, ఆపైన ఇంటర్, బీఏ, బీటెక్, బీబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర కోర్సులు చేసిన యువతలో కొందరు పక్కదారులు పడుతున్న వారు ఉన్నారు. మరికొందరు చదువుకున్నా అవకాశాలు లభించని వారు ఉన్నారు. తాగుడు, ఇతరత్రా మత్తు పదార్థాలకు బానిసైన వారు కూడా ఉన్నారు. యువత ఖాళీగా ఉండటం వల్ల వ్యససాలకు బానిసై పక్కదారులు పడుతోది. తద్వారా నేరాలు పెరిగిపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. యువత ఖాళీగా ఉండవద్దనే ఆలోచనలతో పాటు, నేరాలను అరికట్టేందుకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ నిర్ణయించారు. రూ.13 వేలకు తగ్గకుండా వేతనం.. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారంతా అర్హులే. వారికి వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించేలా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ సేల్స్, కాల్‌సెంటర్, ఇతరత్రా కంపెనీల్లో ఉపాధి అవకాశాలు లభించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఎంపికైన వారికి ఆయా కంపెనీలు కనీస వేతనం రూ.13 వేలకు తగ్గకుండా ఇవ్వనున్నాయి. ఈ జాబ్‌మేళాలో పాల్గొనాలనుకునే వారంతా సమీప పోలీస్స్టేషన్లలో వెంటనే పేరు నమోదు చేసుకొని, 5వ తేదీన జాబ్ మేళాకు హాజరు కావచ్చు. జాబ్‌మేళాకు వందకుపైగా కంపెనీలు.. డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, ఎంబీఏ తదితర సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా పెద్ద ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ జాబ్ మేళాలో విప్రో, ఫాక్స్‌కాన్, హెచ్‌సీఎల్, క్యూబ్ కన్సల్టింగ్, హెడ్ఎఫ్సీ, ఐసీఐసీఐ తదితర బ్యాంకులు, హెటిరో, అపోలో ఫార్మసీ తదితర ఫార్మా కంపెనీలు, సన్‌షైన్, ఏఐజీ హాస్పిటల్స్ తదితర ఐటీ, రిటైల్, హెల్త్కేర్రంగాలకు చెందిన వందకు పైగా కంపెనీలు పాల్గొననున్నాయి. వాటిల్లో యువతకు అవకాశాలు లభించనున్నాయి.ఫవందకు పైగా కంపెనీలు, 2500 మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యం ఫ టెన్త్ ఆపైన చదివినవారు అర్హులు.. డిగ్రీ, బీటెక్, పీజీ వారికి ప్రత్యేక అవకాశాలు ఫ యువత సన్మార్గంలో నడిచేలా ఎస్పీ శరత్చంద్ర పవార్ వినూత్న ఆలోచనగంజాయికి బానిసైన వారు పాల్గొనేలా.. జిల్లాలోని నిరుద్యోగ యువతతోపాటు నల్లగొండ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాతబస్తీ తదితర ప్రాంతాల్లో చదువుకున్న యువతతోపాటు జిల్లాలో గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతపై పోలీస్‌శాఖ ప్రత్యేక దృష్టి సారించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ముఖ్యంగా పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించిన దాదాపు 400 మంది జాబ్‌మేళాలో పాల్గొనేలా చేసి వారికి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక నల్లగొండ పాతబస్తీలో ప్రతి వార్డు నుంచి 20 మంది జాబ్‌మేళాకు హాజరయ్యేలా చూడనున్నారు. -
అర్హులందరికీ పట్టాలు ఇస్తాం
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : అర్హులైన రైతులందరికీ త్వరలోనే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పట్టాల పంపిణీపై స్థానిక ఎమ్మెల్యే జైవీర్రెడ్డితో కలిసి సమీక్షించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే.. కలెక్టర్‌ను కోరారు. త్వరలోనే అసైండ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేపడుతామని తెలిపారు. వివా దంలో లేని భూములకు సంబంధించిన పట్టాలు మొదటగా పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పీ మాజీ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తహసీల్దార్ అనిల్ ఉన్నారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జి ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, ఇన్చార్జి డీఎస్ఓ హరీష్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీఓ పత్యానాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, భిక్షంయాదవ్, భారత వెంకటేశం, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేసాని వెంకట్‌రెడ్డి, కొరివి శంకర్, పోలె విజయ్, గౌని నరేష్, రామకృష్ణ పాల్గొన్నారు. -
రోడ్డుపై మార్కింగ్ పెయింట్
కనగల్ : నల్లగొండ నుంచి కనగల్ మండల కేంద్రం వరకు రోడ్డు మార్కింగ్ పెయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఈ రోడ్డుపై ఇప్పటి వరకు మార్కింగ్ లేకపోవడంతో వాహనదారులు అడ్డగోలుగా, అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడ్డారు. ప్రమాదాల నివారణకు అధికారులు మార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మార్కింగ్ పెయింట్ రోడ్డుపై సులభంగా కనిపిస్తుంది. దీంతో ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. కనగల్ వద్ద మార్కింగ్ పెయింట్ వేస్తున్న కూలీలు -
విద్యాశాఖలో పరస్పర బదిలీలు
నల్లగొండ : విద్యాశాఖలో పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి 24 మంది ఉపాధ్యాయులు ఇతర జిల్లాలకు బదిలీ అవుతుండగా.. వేరే జిల్లాల నుంచి నల్లగొండకు 24 మంది ఉపాధ్యాయులు రానున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల విభజన తర్వాత జోన్లను విభజించింది. ఆ సందర్భంలో జోన్ల వారీగా బదిలీలు చేయడంతో నల్లగొండ జిల్లాకు చెందినవారు నుంచి ఇతర జిల్లాలకు పెద్ద ఎత్తున బదిలీలు అయ్యారు. ఇతర జిల్లాల నుంచి కూడా నల్లగొండ జిల్లాకు పెద్ద ఎత్తున బదిలీపై వచ్చారు. దీంతో వారంతా కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలంటూ ఎన్నిమార్లు మొరపెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చింది. దీంతో ఇతర జిల్లాల్లో పని చేస్తున్న వారు నల్లగొండ జిల్లాకు బదిలీపై వస్తే వారి స్థానంలో నల్లగొండ జిల్లాలో పని చేస్తున్న వారు ఇతర జిల్లాలకు బదిలీ కానున్నారు. కలిసి దరఖాస్తు చేసుకున్న వారినే.. పరస్పర బదిలీలకు సంబంధించి ఇరువురు కలిసి దరఖాస్తు చేసుకున్న వారి బదిలీలను మాత్రమే ప్రభుత్వం ఆమోదించింది. దీంతో నల్లగొండ జిల్లా నుంచి భువనగిరి, సూర్యాపేట, మేడ్చల్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాలకు 24 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. వారి స్థానంలో నల్లగొండ జిల్లాకు 24 మంది ఇతర జిల్లాల నుంచి రానున్నారు. ఫ జిల్లా నుంచి వెళ్లనున్న 24 మంది ఫ అదే సంఖ్యలో నల్లగొండ జిల్లాకు రానున్న ఉపాధ్యాయులు -
చరిత్రలో నిలిచిపోయే పథకం
కనగల్ : సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామంలో రూ.4.63 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు కూడా పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు రూ.4000 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లిందని, ఎస్ఎల్బీసీని పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4,518 కోట్లు కేటాయించామని, దురదష్టవశాత్తు ప్రస్తుతం పనులు ఆగిపోయాయన్నారు. సంవత్సరంలోగా టన్నెల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎడవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 7న బక్కతాయికుంట, నర్సింగ్‌బట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలన్నారు. ఫ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
కొన్నిచోట్లే సన్నబియ్యం!
మొదటి రోజు అన్ని గ్రామాల్లో ప్రారంభం కాని పథకం ఎమ్మెల్యేల సమయం తీసుకుని.. ఈనెల 2వ తేదీ తరువాత అన్ని గ్రామాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఈనెల 4వ తేదీన ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించనున్నారు. నకిరేకల్ నియోజవకర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో 2వ తేదీన ప్రారంభించనున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్‌పోచంపల్లి తదితర మండలాల్లో ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి పంపిణీని ప్రారంభించాక ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రేషన్‌కార్డులు కలిగిన పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం మొదటి రోజు కొన్ని గ్రామాల్లోనే ప్రారంభమైంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇవ్వగా, ఇటీవల హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల పరిధిలో సన్న బియ్యం పంపిణీని మంగళవారం కొన్ని చోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, మరికొన్ని చోట్ల ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో పెద్దమొత్తంలో పంపిణీ కొనసాగగా, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో మాత్రం పంపిణీ కొన్ని మండలాల్లోనే ప్రారంభంమైంది. అయితే.. ఆయా నియోజకవర్గాల్లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి రోజు అంతంత మాత్రంగానే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల సమయాన్ని బట్టి ప్రారంభించేలా చర్యలు చేపట్టడంతో మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పథకం ప్రారంభం కాలేదు. నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలం జి.ఎడవల్లిలో, యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, మునుగోడు నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ని అన్ని మండలాల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. నల్లగొండ జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభించారు. ఇక సూర్యాపేట జిల్లాలో అన్ని నియోజవకర్గాల్లో పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, సూర్యాపేట, కోదాడలో ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. తుంగతర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో 610 రేషన్ షాపులకు గాను మంగళవారం 585 రేషన్ షాపుల్లో 51,000 మంది రేషన్ కార్డుదారులకు 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇక యాదాద్రి జిల్లాలో 515 షాపులకు గాను 80 షాపుల్లోనే బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఫ సూర్యాపేట జిల్లాలో అత్యధిక రేషన్ దుకాణాల్లో పంపిణీ ఫ నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో నామమాత్రంగానే.. ఫ ఎమ్మెల్యేలు ఇచ్చే సమయాన్ని బట్టి ప్రారంభిస్తామంటున్న అధికారులు ఫ సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లో సానుకూల స్పందన -
నేనూ సన్నబియ్యం అన్నం తింటా
ఎన్నో ఏళ్లుగా దొడ్డు బియ్యాన్నే తింటున్నా. మార్కెట్లో సన్నబియ్యం కొనలేక నెలకు నాకు వచ్చే ఆరు కిలోల దొడ్డు బియ్యాన్ని తినాల్సి వచ్చేది. దొడ్డు బియ్యంతో వండుకున్న అన్నం తిని పనులకు వెళ్లేదాన్ని. అక్కడ అంతా సన్నబియ్యంతో వండుకున్న అన్నం తినేవారు. నేను మాత్రం దొడ్డు అన్నం తినాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ రోజు రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. అందరిలాగే నేను ఈ రోజు నుంచి సన్నబియ్యంతో వండుకున్న అన్నం తింటాను. ఎంతో ఆనందంగా ఉంది. – ఈద లక్ష్మమ్మ, పెద్దవూర -
క్రికెట్లో ఉచిత శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ నుంచి ఔట్‌డోర్ స్టేడియంలో క్రికెట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ అమీనుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నుంచి 19 సంవత్సరాలలోపు బాల బాలికలకు శిక్షణ ఇస్తామని, ఇతర వివరాలకు 9885717996 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణనల్లగొండ : నల్లగొండలోని కేంద్రియ విద్యాలయంలో 2వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 2 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలని తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు వెబ్సైట్ www.nalgonda.kvs.gov.inలో చూడవచ్చని పేర్కొన్నారు. సమాజ సేవలో భాగస్వాములు కావాలిరాజాపేట: విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఎన్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కోఆర్డిరేటర్ ప్రొఫెసర్ డాక్టర్ నర్సింహగౌడ్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎన్‌స్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దిలేటి అన్నారు. మంగళవారం రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఆర్ కళాశాల విద్యార్థుల ఎన్ఎస్ఎస్ శిక్షణ శిబిరంలో భాగంగా ఏడవ రోజు గ్రామంలో మొక్కలు నాటడం, ప్రయాణికుల షెల్టర్‌కు రంగులు వేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కమటం రమేష్, ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. హనుమంతుడికి ఆకుపూజ యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి, భక్తులకు ప్రసాదంగా అందజేశారు. ఇక ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా కొనసాగాయి. శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు నిర్వహించారు. -
ఫ ట్యాంకర్లకు గిరాకీ..
వాటర్ ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది.వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అండుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1000 తీసుకుంటున్నారు. రోజుకు 8 నుంచి 10 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి పంట పండిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. – మునుగోడు -
కందుల కొనుగోలుకు కొర్రీలు
కొండమల్లేపల్లి : కందులు సాగు చేసిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట సాగు.. పంట విస్తీర్ణం వంటి వివరాలు నమోదు చేసుకున్న రైతుల కందులు మాత్రమే కొనుగోలు కేంద్రంలో కొంటామంటూ కొర్రీలు పెడుతుండడంతో కందిసాగు చేసిన రైతుల పరిస్థితి అయోమయంగా మారింది. వ్యవసాయ అధికారుల జాబితాలో పేర్లున్న రైతులు.. దళారులకు సహకరిస్తుండడంతో అసలు రైతులు నష్టపోతున్నారు. మార్చి 7న కేంద్రాలు ప్రారంభం జిల్లాలో 10 వ్యవసాయ మార్కెట్ కేంద్రాలు ఉండగా కొండమల్లేపల్లి, హాలియాలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుల్లో మార్చి 7వ తేదీన కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో కొండమల్లేపల్లి, గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి, చింతపల్లి, తిరుమలగిరిసాగర్, హాలియా, పెద్దవూర తదితర ప్రాంతాల నుంచి రైతులు కందులు విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే ఈసారి వ్యవసాయ అధికారుల జాబితాలో పేర్లు ఉన్న రైతుల కందులు మాత్రమే కొనుగోలు చేస్తామంటూ కేంద్రం నిర్వాహకులు చెబుతుండడంతో ఆరుగాలం కష్టించి కంది సాగు చేసిన రైతులు తమ కందులు కూడా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. అదనంగా కేజీ తూకం.. సాధారణంగా రైతులు తమ వద్ద ఉన్న కందులను ఎండబెట్టి కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తారు. కానీ కేంద్రం నిర్వాహకులు కందులను నిల్వ చేయాల్సి ఉంటుదని చెప్తూ 50 కేజీలకు బదులు 51 కేజీల తూకం వేస్తున్నారు. వ్యవసాయ అధికారుల తీరుపై విమర్శలు.. రైతులు వారి భూ విస్తీర్ణంతోపాటు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేశారన్న వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద నమోదు చేయించుకోవాలి. ఇందుకు గాను ఏఓ స్థాయి అధికారి లేదా ఏఈఓ క్షేత్రస్థాయిలో పంటలను స్వయంగా పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. కానీ అప్పట్లో రైతులే తమ వద్దకు వచ్చి వివరాలు నమోదు చేయించుకోవాని వ్యవసాయ అధికారులు సూచించారు. చాలా మంది రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై వివరాలను నమోదు చేయించుకోలేదు. ఇప్పుడు జాబితాలో పేరు లేకపోవడంతో ప్రభుత్వ కేంద్రంలో కందులు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు.ఫ రైతులకు శాపంగా వ్యవసాయ అధికారుల నిబంధనలు ఫ కొత్త దందాకు తెరలేపిన దళారులు ఫ గతంలో నిల్వ చేసిన కందులు సైతం కేంద్రంలో విక్రయాలు ఫ నష్టపోతున్న రైతులు కందులు కొనడం లేదు నా కున్న ఏడెకరాల్లో కంది సాగు చేశాను. వ్యవసాయ అధికారులు ఆరు ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నట్లు నమోదు చేయడంతో.. ఆ ఆరు ఎకరాల కందులు మాత్రమే కొంటున్నారు. మిగతా ఎకరం భూమిలో పండిన కందులు కొనడం లేదు. దీంతో 8 క్వింటాళ్ల కందులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. – అంజన్‌రావు, రైతు జిన్నాయిచింత, గుర్రంపోడు మండలం రైతుల కందులనే కొనుగోలు చేస్తున్నాం కొండమల్లేపల్లి, హాలియాలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 481 మంది రైతుల నుంచి 11,323 బ్యాగుల్లో 5631.50 క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశాం. వ్యవసాయ అధికారులు చేపట్టిన సర్వేకు సంబంధించి లిస్టులో పేరున్న రైతుల నుంచి మాత్రమే కందులను కొనుగోలు చేస్తున్నాం. దళారులకు తావివ్వకుండా రైతులకు మేలు చేసే విధంగా కొనుగోళ్లు చేపడుతున్నాం. – జ్యోతి, మార్కెట్ డీఎం, నల్లగొండ నిల్వ ఉంచిన కందుల విక్రయం వ్యవసాయ అధికారుల జాబితాలో పేరు లేని రైతుల వద్ద నుంచి దళారులు కందులను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. వారు వ్యవసాయ అధికారుల జాబితాలో పేరున్న రైతులతో ఒప్పందం చేసుకొని వారికి కొంత ముట్టజెప్పి వారి ద్వారా ప్రభుత్వ కేంద్రంలో కందులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడ్డ రైతులు నష్టపోతున్నారు. ఇక, గతంలో తమ వద్ద నిల్వ ఉంచిన కందులను సైతం దళారులు ప్రభుత్వ కేంద్రంలో అమ్ముతున్నారు. కానీ వ్యవసాయ అధికారులు మాత్రమ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
ఆఖరి రోజు 110 రిజిస్ట్రేషన్లు
రంజాన్ రోజున కూడా పనిచేసిన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులునల్లగొండ : ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు సోమవారం కాస్త పెరిగాయి. అనుమతి లేని లేఅవుట్లలో ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) కింద మార్చి 31వ తేదీవరకు ఫీజు చెల్లించేవారికి 25 శాతం రాయితీ ఇచ్చింది. ఆ అవకాశాన్ని పలువురు సద్వినియోగం చేసుకున్నారు. రంజాన్ పండుగ సెలువు దినం అయినా.. సోమవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పని చేశాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మార్చి 29వ తేదీవరకు 1,418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్కాగా.. సోమవారం మాత్రం 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాకపోవడం గమనార్హం. ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు.. అనుమతి లేని వెంచర్లు, వ్యవసాయ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఆయా ప్రాంతాల విలువను బట్టి ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ ఇచ్చింది. మార్చి 31వ తేదీ వరకు గడువు విధించింది. దీంతో గడిచిన నెల రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు మున్సిపాలిటీ, పంచాయతీల్లో ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోనివారు.. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించడంతోపాటు రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం.. ఎల్ఆర్ఎస్ ఫీజుపై రాయితీ గడువు మార్చి 31వ తేదీతో ముగుస్తుండడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకుంటారని భావించిన ప్రభుత్వం రంజాన్ సెలవు దినం రోజున కూడా కార్యాలయాలను తెరిచి ఉంచింది. దీంతో సోమవారం ఉమ్మడి జిల్లా పరిధిలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 110 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. గడిచిన నెల రోజుల్లో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించి రెగ్యులరైజ్ చేసుకున్న రిజిస్ట్రేషన్ల కంటే చివరి రోజు కాస్త పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి ఒక పక్క ఎల్ఆర్ఎస్ ఫీజు ద్వారా, రిజిస్ట్రేషన్ రూపంలో ఆదాయం సమకూరింది.ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ వివరాలు సబ్ రిజిస్ట్రార్ మార్చి 3వ మొత్తం కార్యాలయం 29వరకు తేదీన రిజిస్ట్రేషన్లు భువనగిరి 114 8 152బీబీనగర్ 132 8 140 చౌటుప్పల్ 25 5 30 మోత్కూర్ 30 0 30 రామన్నపేట 38 6 44 యాదగిరిగుట్ట 225 8 233 చండూరు 23 0 23దేవరకొండ 72 0 72 మిర్యాలగూడ 81 0 81నల్లగొండ 68 0 68నకిరేకల్ 65 48 113నిడమనూరు 81 4 85హుజూర్నగర్ 26 1 27కోదాడ 159 1 160సూర్యాపేట 249 21 270మొత్తం 1,418 110 1,528ఫ మార్చి 29వ తేదీ వరకు 1,418 ఎల్ఆర్ఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ ఫ సాధారణ రోజులతో పోలిస్తే సోమవారం కాస్త ఎక్కువగా.. ఫ నల్లగొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిల్ఐదు కార్యాలయాల్లో నిల్.. అయితే సోమవారం ఐదు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. వాటిలో మోత్కూర్, చండూరు, దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. చివరి రోజు అధికంగా నకిరేకల్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో 48 డాక్యుమెంట్లు, సూర్యాపేటలో 21 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. -
మత సామరస్యానికి నల్లగొండ ప్రతీక
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ఆయన సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఈద్గా వద్ద ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అంతా కలిసిమెలిసి ఉండాలన్నారు. పట్టణంలోని దర్గాలు, ఈద్గాల అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నానని తెలిపారు. ఇటీవల నల్లగొండ పట్టణంలో నిర్వహించిన ఇస్తేమాలో సుమారు 40 నుంచి 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. లతీఫ్ సాబ్ దర్గాకు రూ.100 కోట్లతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని చెప్పారు. లతీఫ్ షాప్ గుట్ట నుంచి బ్రహ్మంగారి గుట్ట వరకు రోప్ వే, బ్రహ్మంగారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వేయిస్తున్నామని తెలిపారు. రూ.500 కోట్లతో నల్లగొండకు కొత్త బైపాస్ రోడ్డు నిర్మిస్తున్నామని.. వారం రోజుల్లో పనులు మొదలవుతాయన్నారు. ఎంజీయూ, మెడికల్ కళాశాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థల్లో అవుట్సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై చేపట్టే నియామకాల్లో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా కలెక్టర్‌ను ఆదేశించామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతం మీద ధ్వేషంతో వక్ఫ్ బోర్డు చట్టాన్ని సవరించాలని చూస్తోందని విమర్శించారు. అనంతరం ముస్లిం మత పెద్ద మౌలానా ఎహసనొద్దీన్ను మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, ఈద్గా కమిటీ చైర్మన్ డాక్టర్ హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు. ఫ వక్ఫ్ బోర్డ్డు చట్టాలను మార్చాలని చూస్తున్న కేంద్రం ఫ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
సస్నబియ్యం పంపిణీకి నేడు మంత్రి రాక
నల్లగొండ : కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. హెలికాప్టర్ ద్వారా మంగళవారం ఉదయం 11 గంటలకు కనగల్ మండలం జిఎడవల్లికి చేరుకుంటారు. ఆ గ్రామంలో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తారు. అనంతరం మంత్రి అదే మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు యాదాద్రి భువనగిరి జిల్లాకు హెలికాప్టర్ ద్వారా బయల్దేరి వెళతారు.నేడు చిత్రకళా నిలయం ప్రారంభంనాగార్జునసాగర్ : నందికొండలోని హిల్‌కాలనీలో ‘దాసి సుదర్శన్’ చిత్రకళా నిలయాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు సముహ సెక్యులర్ రైటర్స్ ఫోరం జిల్లా కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ స్మారక చిత్రకళా నిలయాన్ని హైదరాబాద్ ఆర్టిస్ట్ సొసైటీ అధ్యక్షుడు ఎం.వీ రమణారెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సుదర్శన్ పలు రంగాల్లో అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం జాతీయ అవార్డును ఇచ్చిందని తెలిపారు. చిత్రకళా నిలయం ప్రా రంభోత్సవానికి కవులు, కళాకారులు, ఆర్టిస్టులు, రచయితలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తు న హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తాంరామగిరి(నల్లగొండ) : లీగల్ సెల్ ద్వారా ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా జైలును సోమవారం ఆయన సందర్శించి ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో లీగల్ సెల్ సెక్రెటరీ మంజుల సూర్యవర్, జైల్ సూపరింటెండెంట్ జి.ప్రమోద్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యుడు ఎన్.భీమార్జున్‌రెడ్డి, డిప్యూటీ జైలర్ ఎం.నరేష్, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై రాయితీనల్లగొండ టూటౌన్ : మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచిన ఆస్తి పన్ను మొత్తం ఏప్రిల్ నెలాఖరులోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. ఈ రాయితీ ద్వారా భవానానికి ఉన్న ఆస్తి పన్నులో ఐదు శాతం తగ్గనుంది. భవనాల యజమానులంలా రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ శివరాంరెడ్డి కోరారు.90 శాతం వడ్డీ రాయితీకి ముగిసిన గడువుమున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ గడువు మార్చి 31 అర్ధరాత్రితో ముగిసింది. మార్చి చివరివారంలో వడ్డీ మాఫీ అవకాశం కల్పించడంతో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. 15 రోజుల ముందే వడ్డీ మాఫీ అవకాశం కల్పిస్తే ఆస్తిపన్ను బకాయి ఉన్నవారు పూర్తిగా చెల్లించే అవకాశం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనరామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను భంగం కలిగించేలా పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు– 2024ను వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా వద్ద సీసీఎం మైనార్టీ నాయకులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్ హశం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.సలీం మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మతపరమైన హక్కులకు, వక్ఫ్ ఆస్తుల రక్షణకు విఘాతం కలిగిస్తుందన్నారు. కేంద్ర తెచ్చే ఈ చట్టం ఆస్తులను రక్షించడం కోసం కాదని, ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే కుట్ర అని విమర్శించారు. ఈ నిరసనలో నాయకులు దండెంపల్లి సత్తయ్య ఊట్కూరి మధుసూదన్‌రెడ్డి ఎగ్బాల్ సాజిద్, అడ్వకేట్ నజీరుద్దీన్, కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, ఖలీల్, ఎగ్బాల్, అజీజ్, సోయబ్, అఖిల్, షకీల్ పాల్గొన్నారు. -
రేవంత్ భాషలో మార్పు లేదు
సూర్యాపేటటౌన్ : సీఎం రేవంత్‌రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని, సీఎం అనే సోయి లేకుండా హుజూర్నగర్ సభలో దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా.. కేసీఆర్ మాట లేకుండా సీఎం సభ సాగట్లేదన్నారు. సోనియాగాంధీ ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు ఓటేశారు తప్ప రేవంత్‌రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదన్నారు. కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా ఎలాంటి స్పందన లేదన్నారు. మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పంట పొలాల వద్ద కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్‌కు శాపనార్ధాలు పెడుతున్నారని అన్నారు. హుజూర్నగర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించారన్నారు. సీఎం పద్ధతి, భాష మార్చుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదని, అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదన్నారు. ఫ హుజూర్నగర్ సభలో అజ్ఞానాన్ని ప్రదర్శించారు ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విమర్శ -
డీజిల్ ట్యాంక్ లీకై రేంజ్ రోవర్ కారు దగ్ధం
నార్కట్‌పల్లి : రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంకు లీకేజీ కావడంతో మంటలు ఎగిసిపడి కారు దగ్ధమైంది. ఈ ఘటన సోమవారం నార్కట్‌పల్లి– అద్దంకి హైవేపై నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు వద్ద జరిగింది. హైదరాబాద్‌కు చెందిన శివప్రసాద్, శివకుమార్, గోవర్ధన్‌లు ముగ్గురు స్నేహితులు కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సోమవారం అద్దంకి వద్ద పెట్రోల్ బంక్‌లో రేంజ్ రోవర్ కారుకు పెట్రోల్ పోయించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు సమీపంలోకి రాగానే రేంజ్ రోవర్ కారు డీజిల్ ట్యాంక్ లీకై చిన్నచిన్న మంటలు రావడంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు గుర్తించారు. అప్రమత్తమైన ఆ యువకులు కారును రోడ్డు పక్కన నిలిపి కారులో నుంచి బయటకు వచ్చారు. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో సంఘటన స్థలం వద్దకు చేరుకున్న ఆగ్ని మాపక సిబ్బంది ఎగిసిన పడుతున్న మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాలా వరకు కాలిపోయింది. నార్కట్‌పల్లి ఎస్ఐ క్రాంతికుమార్ ఘటనా స్థలం వద్దకు చేరుకుని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారులో నుంచి సురక్షితంగా బయటపడిన యువకులు -
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ బస్సు కండక్టర్
చౌటుప్పల్ : ప్రయాణికురాలు మరిచి పోయి బ్యాగును గుర్తించిన కండక్టర్ కంట్రోలర్‌కు అప్పగించి నిజాయితీని చాటుకుంది. వివరాలు.. దిల్సుఖ్నగర్ బస్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ప్రయాణికులతో చౌటుప్పల్‌కు వస్తోంది. ఓ ప్రయాణికురాలు దిల్‌సుఖ్‌నగర్‌లో బస్సు ఎక్కి కండక్టర్ ప్రవీణ వద్ద చౌటుప్పల్‌కు టికెట్ తీసుకుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చౌటుప్పల్‌లో బస్సు దిగి వెళ్లిపోయింది. అయితే బస్సులో బ్యాగు ఉండడాన్ని కండక్టర్ గుర్తించి దాన్ని చౌటుప్పల్ బస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన కంట్రోలర్ నాగేష్కు అప్పగించింది. సాయంత్రం తిరిగి వచ్చిన ఆ ప్రయాణికురాలు కంట్రోలర్‌ను సంప్రదించింది. తన బ్యాగు, అందులోని వివరాలను తెలియజేసింది. కంట్రోలర్ విచారించి బ్యాగు ఆమెదే అని నిర్దారించుకున్నాడు. అదే బస్సు సాయంత్రం బస్‌స్టేషన్‌కు వచ్చిన సమయంలో కండక్టర్ ప్రవీణతో కలిసి బ్యాగును అప్పగించాడు. అందులో 15 తులాల వెండి ఆభరణాలు, నడుము వడ్డాణంతోపాటు నగదు ఉన్నాయి. కాగా ప్రయాణికురాలి బ్యాగును నిజాయితీగా అప్పగించిన కండక్టర్ ప్రవీణతోపాటు కంట్రోలర్ నాగష్ను పలువురు అభినందించారు. -
మూసీ.. అడుగంటుతోంది!
కేతేపల్లి: మండల పరిధిలోని మూసీ రిజర్వాయర్ వేగంగా అడుగంటుతోంది. దాదాపు ఆరు నెలల నుంచి వర్షాలు లేకపోవడం.. ప్రస్తుతం ఎండలు ముదరడానికితోడు ప్రాజెక్టు ఆయకట్టులోని పంటలకు రెండు కాల్వల ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ రిజర్వాయర్‌లో రోజు రోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. 645 అడుగుల గరిష్ట నీటిమట్టం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం నీటిమట్టం 623.50 అడుగులకు పడిపోయింది. 33 వేల ఎకరాలకు సాగునీరు.. మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టులో పరిధిలోని నకిరేకల్, సూర్యాపేట, మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42 గ్రామాల్లో 33 వేల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. గత ఏడాది జూన్‌లో మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో వానాకాలం, యాసంగి సీజన్లో రెండు పంటలకు నీటిని విడుదల చేశారు. గత డిసెంబర్ 20నుంచి యాసంగి పంట సాగుకు మూసీ కుడి, ఎడమ కాల్వలకు అధికారులు మొదటి విడత నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ఆయా కాల్వలకు చివరిదైన నాలుగవ విడత నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాల్వకు 201 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 147 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రోజూ 20 క్యూసెక్కుల నీటివృథా! ఆవిరి, స్పీకేజీ, లీకేజీ రూపంలో ప్రతిరోజూ 20 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. ఆయకట్టులో ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి వరిపంట కోతకు రావడంతో ఒకట్రెండు రోజుల్లో కాల్వలకు నీటి విడుదలను నిలిపి వేయనున్నారు. 4.46టీఎంసీల నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌లో ప్రస్తుతం 0.75 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. మరో ఎనిమిది అడుగుల నీరు తగ్గితే నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకుంటుంది. 615(0.5 టీఎంసీలు) అడుగులకు నీటిమట్టం చేరితే దుర్వాసన, ఒండ్రుతో కూడిన నీరు మాత్రమే రిజర్వాయర్‌లో ఉంటుంది. కనీసం పశువులు తాగేందుకు కూడా వీలుండదు. మరో రెండు నెలలు గడిస్తే గాని వర్షాలు కురిసి రిజర్వాయర్‌లోకి నీరు వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటే ప్రమాదముందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్ వరిపంట చేతికొచ్చే వరకు నీరందిస్తారోలేదోనని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు ప్రస్తుతం 623.50 అడుగులకు పడిపోయిన నీళ్లు ఫ నీటిమట్టం తగ్గితే డెడ్ స్టోరేజీకి.. -
ఇరువర్గాల మధ్య ఘర్షణ, కేసులు నమోదు
హుజూర్నగర్ (చింతలపాలెం) : ఇద్దరు యువకులు మధ్య క్రికెట్ విషయంలో మొదలైన తగువు ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. గృహోపకరణాలు, మోటారు సైకిళ్లనుఽ ధ్వంసం చేసుకున్నారు. ఈ సంఘటన చింతలపాలెం మండలం కిష్టాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిష్టాపురం గ్రామానికి చెందిన యువకులు సుల్తాన్, జమాల్సైదా ఇద్దరు స్నేహితులు. క్రికెట్ విషయంలో ఇరువురి మధ్య తగవు జరిగింది. ఇది పెద్దలకు చేరడంతో వారు సర్దిచెప్పి పంపే క్రమంలో ఓ పార్టీకి చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణలో గ్రామస్తుడు చప్రాసి సైదాకు గాయాలు కావడంతో ఇరువర్గాల వారు ఒకరి ఇళ్లపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురి ఇళ్లలోని ఫ్రిజ్‌లు, టీవీలు, మంచాలు ధ్వంసమయ్యాయి. రెండు బైకులు పూర్తిగా.. మరో 3 బైకులు ఽస్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో ఇరువురికి బలంగా, మరో నలుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి. గాయాలైనవారిని కోదాడ, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి ఆధ్వర్యంలో ఇరువర్గాలకు చెందిన దాదాపు 20 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. -
నల్లగొండ
గిరిపుత్రుల ప్రతిభ గిరిజన విద్యార్థులు ఎలక్ట్రిక్ నానో ట్రాక్టర్ తయారు చేసి పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు.కష్టానికి ఫలితం గ్రూప్–1 ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కష్టపడి చదివి ప్రతిభ చూపారు. 7ఆంధ్రాలో అమ్మకం తెలంగాణలో చోరీ చేసిన వస్తువులను ఆంధ్రప్రదేశ్‌లో విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025- 8లో -
గిరిపుత్రుల ప్రతిభ
విద్యార్థుల ప్రతిభను గుర్తించా అఖిల్, తరుణ్‌ల ప్రతిభను గుర్తించాను. వారికి వచ్చిన ఆలోచనతో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను రైతుల కోసం రూపొందించాలని నిర్ణయించుకున్నాం. మినీ వాహనాన్ని తయారు చేసి బ్యాటరీని అమర్చి అంతర పంటలకు ఉపయోగపడే విధంగా రూపొందించాం. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి నిరంతరం కృషి చేస్తా. – కోట నవీన్‌కుమార్, ఉపాధ్యాయుడు ఫ ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్ రూపొందించిన గిరిజన విద్యార్థులు ఫ రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న తరుణ్, అఖిల్యాదగిరిగుట్ట: వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాన్ని రూపొందించి తమ ప్రతిభను చాటుకున్నారు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి గిరిజన విద్యార్థులు బానోతు తరుణ్, లునావత్ అఖిల్. తమకు చదువు చెబుతున్న ఉపాధ్యాయుడు కోట నవీన్ కుమార్‌ను గైడ్‌గా చేసుకుని చోటా ప్యాకెట్ బడా ధమాకా పేరుతో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్ తయారు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు. మొదటి ప్రయత్నంలోనే.. లూనావత్ అఖిల్, బానోతు తరుణ్‌లు ఉపాధ్యాయుడు కోట నవీన్ కుమార్ సహకారంతో 2024 జనవరిలో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను తయారు చేసేందుకు ప్రయత్నం ప్రారంభించారు. దీనిని పూర్తి చేసి అదే సంవత్సరం సెప్టెంబర్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. అదేవిధంగా జనవరి 7న హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్లో ప్రదర్శించగా జాతీయ స్థాయికి ఎంపికై ంది. వికసిత్ భారత్‌లో భాగంగా జనవరి 10, 11, 12తేదీల్లో ఢిల్లీలో జరిగిన యంగ్ ఇండియా ఫెస్టివల్లో ఈ పరికరాన్ని ప్రదర్శించారు. నానో ట్రాక్టర్ పనితీరు.. బ్యాటరీతో నడిచే మినీ ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను పాత పనిముట్లతో రూపొందించారు. అంతర పంటలు వేసుకునేందుకు ఉపయోగపడే విధంగా దీనిని రూపొందించారు. చిన్న, సన్నకారులు రైతులు అతి తక్కువ పెట్టుబడితో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఈ నానో ట్రాక్టర్‌ను వినియోగించవచ్చు. -
మద్యం మత్తులో ఎలుకల మందు తాగిన వ్యక్తి మృతి
హుజూర్నగర్ : మద్యం మత్తులో ఎలుకల మందు తాగిన వ్యక్తి మృతి చెందిన సంఘటన హుజూర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్నగర్ పట్టణంలోని సీతారాంనగర్ కాలానికి చెందిన అలకుంట్ల భిక్షం (39) కొద్ది రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 29 బాగా మద్యం సేవించిన భిక్షం.. భార్యను భయపెట్టాలనే ఉద్దేశంతో ఎలుకల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే తాను ఎలాంటి మందు తాగలేదని చెప్పడంతో భిక్షంను ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం భిక్షం ఇంటి వద్ద వాంతులు చేసుకున్నాడు. దీంతో అతడిని స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆదివారం మెరుగైన చికిత్స నిమిత్తం అతడిని ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భిక్షంకు భార్య నిరోషా, ఇద్దరు కూతుళ్లు స్రవంతి, మనీషా ఉన్నారు. సోమవారం పెద్ద కుమార్తె డేరంగుల స్రవంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
తెలంగాణలో చోరీ.. ఆంధ్రాలో అమ్మకం
త్రిపురారం : పగలు గ్రామాల్లో రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, వీల్స్ దొంగిలించి తెలంగాణ రాష్ట్రం దాటించి ఆంధ్రప్రదేశ్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్న నలుగురు దొంగల ముఠాను త్రిపురారం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం త్రిపురారం పోలీస్ స్టేషన్లో హాలియా సీఐ జనార్దన్‌గౌడ్, ఎస్ఐ వై.ప్రసాద్‌తో కలిసి మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు వివరాలు వెల్లడించారు. నిడమనూరు, త్రిపురారం మండలాల్లో ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పరికరాల దొంగతనాలు పెరగడంతో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. ఆదివారం త్రిపురారం మండలంలోని అంజనపల్లి గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వేముల నాగరాజు తన స్వరాజ్ ట్రాక్టర్‌పై కల్టివేటర్, ఆఫ్ వీల్స్, ట్రాక్టర్ గొర్రు వేసుకుని వస్తున్నాడు. ట్రాక్టర్ ముందు పల్సర్ బైక్‌పై పాల్తి తండాకు చెందిన డేగావత్ బాబునాయక్, ట్రాక్టర్ వెనకాల తిప్పర్తి మండలంలోని రామారం గ్రామానికి చెందిన ఎరకల శివ, బొర్రాయిపాలెం గ్రామానికి చెందిన గద్దల రాజీవ్ పల్సర్ బైక్‌పై వెళ్తున్నారు. త్రిపురారం ఎస్ఐ ప్రసాద్‌కు అనుమానం వచ్చి వారిని ఆపి విచారించడంతో వ్యవసాయ పరికరాలు దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. అంజనపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు పాల్తితండాకు చెందిన డేగావత్ బాబునాయక్, ఎరకల శివ, గద్దల రాజీవ్, బొంత శంకర్, ఓగ్గు నవీన్‌ల సహకారంతో దొంగతనాలకు పాల్పడుతున్నామని ఒప్పుకున్నారు. దొంగిలించిన వాహనాలు, వస్తువులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మి వచ్చిన డబ్బులు నలుగురు పంచుకున్నట్లు ఒప్పుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. దొంగతనానికి గురైన ట్రాక్టర్లు, ట్రాలీలు, వ్యవసాయ పనిముట్లను కొనుగోలు చేసిన వారిని నుంచి స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. దొంగతనానికి గురైన సమయలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు ప్రకారం వారి వస్తువులను వారికి అప్పజెప్పనున్నారు. నిందితులను పట్టుకున్న హాలియా సీఐ జనార్దన్ గౌడ్ టీం త్రిపురారం ఎస్ఐ వై ప్రసాద్, పీసీఆర్ శ్రీనివాస్, పీసీఎస్ శ్రీను, హెచ్‌జీ చాంద్ పాష, హెచ్‌జీ నర్సింహ, పీసీలు నవీన్‌రెడ్డి, రాము, రాంబాబు, మణిరత్నం పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ‘సాక్షి’కి బాధితులు అభినందనలుత్రిపురారం మండల వ్యాప్తంగా దొంగతనాలు పెరగడంతో ఈ నెల 19వ తేదీన సాక్షి దినపత్రికలో త్రిపురారంలో దొంగల భయం అనే కథనం ప్రచురితమైంది. స్పందించిన ఎస్పీ మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు పర్యవేక్షణలో హాలియా సీఐ జనార్దన్ గౌడ్‌తో త్రిపురారం ఎస్ఐ వై ప్రసాద్ సిబ్బందితో ఓ టీం ఏర్పాటు చేశారు. వారు నలుగురు దొంగలను అరెస్ట్ చేసి దొంగతానికి గురైన వాహనాలు, పని ముట్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. త్రిపురారం మండలంలో జరుగుతున్న దొంగతనాలపై సాక్షి దినపత్రిక వెలుగులోకి తేవడంతో బాధితులు సాక్షి కి అభినందనలు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ట్రాక్టర్లు, ట్రాలీలు, కల్టివేటర్లు, వ్యవసాయ పరికరాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు -
ఏఎమ్మార్పీ కాల్వలో పడి వ్యక్తి గల్లంతు
పెద్దఅడిశర్లపల్లి : ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన గుడిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహలు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలంలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వట్టెపు అంజయ్య(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయత్రం సమీప బంధువు అయిన ఎల్ల య్యతో కలిసి గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయాడు. అంజయ్యను వెంటనే ఎల్లయ్య రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే అంజయ్య గల్లంతయ్యాడు. దీంతో అంజయ్య కుటుంబ సభ్యులకు, గుడిపల్లి పోలీసులకు ఎల్లయ్య సమాచారం అందించాడు. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలను నిలిపివేయించారు. గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి వరకు మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. -
కష్టానికి ఫలితం.. ర్యాంకులు సొంతం
పేదింట మెరిసిన విద్యాకుసుమంమునగాల: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో మునగాల మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన మేడం సుజాత–వెంకన్న దంపతుల కుమార్తె శ్రావ్య 516.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. శ్రావ్య ప్రాథమిక, హైస్కూల్ విద్య మఠంపల్లి మండలంలోని గురుకుల విద్యాలయం, కోదాడ పట్టణంలోని వైష్ణవి పాఠశాలలో చదివింది. ఇంటర్ కోదాడలోని లక్ష్య జూనియర్ కళాశాలలో, బీటెక్ జేఎన్టీయూ సుల్తాన్‌పూర్‌లో చదివింది. అనంతరం హైదరాబాద్‌లో ఉండి సొంతంగా గ్రూప్–1కు ప్రిపేర్ అయి పరీక్షలకు హాజరైంది. రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు సాధించిన శ్రావ్యకు డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయని పలువురు విద్యావేత్తలు తెలిపారు. రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించిన శ్రావ్యను గ్రామస్తులు అభినందించారు.ఎన్ని ఉద్యోగాలు వచ్చినా వదిలేసి..భానుపురి (సూర్యాపేట) : ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కొత్తపల్లి ఖుషీల్వంశీ సత్తాచాటాడు. 496 మార్కులతో జనరల్ ర్యాంక్‌లో 63వ స్ధానంలో, రిజర్వేషన్లో రాష్ట్రంలో మూడో స్ధానంలో నిలిచాడు. సీపీఐ మాస్‌లైన్ పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్–రేణుక సంతానమైన ఖుషీల్వంశీ ఇప్పటికే ఎస్ఐతోపాటు యూపీఎస్సీలో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్, మిలటరీ ఆఫీసర్‌గా ఎంపికయ్యాడు. కానీ ఏ ఉద్యోగంలో జాయిన్ కాలేదు. ఎలాగైనా కలెక్టర్‌గా ప్రజలకు సేవలందించాలనే తపనతో తన చదువును కొనసాగించాడు. గతేడాది జరిగిన యూపీఎస్సీలో సెంట్రల్ పోలీస్ అసిస్టెంట్ కమాండో (డీఎస్పీ)గా ఎంపికయ్యాడు. ఏప్రిల్ 19న జాయిన్ కావాల్సి ఉండగా ఇంతలోనే గ్రూప్–1 ఫలితాలు వచ్చాయి.రాష్ట్రస్థాయిలో 257వ ర్యాంక్ సాధించిన సందీప్తిరుమలగిరి : మండల కేంద్రానికి చెందిన పత్తి సందీప్‌కుమార్ గ్రూప్–1 ఫలితాల్లో 468.5 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలో 257వ ర్యాంక్, మల్టీజోన్–2 లో (ఎస్సీ) రిజర్వేషన్లో 15వ ర్యాంకు సాధించాడు. సందీప్‌కుమార్ 2020వ సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి సివిల్స్‌కు శిక్షణ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరం ఢిల్లీలో శిక్షణ తీసుకున్న అనంతరం హైదరాబాదులో ప్రిపేర్ అవుతున్నాడు. తండ్రి వెంకటాద్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, తల్లి లలిత హెల్త్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు. భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని సందీప్ తెలిపాడు. ఈ విజయం తన అమ్మానాన్నలదే అని పేర్కొన్నారు. ప్రస్తుతం వచ్చిన ర్యాంకు ప్రకారం డీఎస్పీ కానీ సీటీఓ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ గ్రూప్–1 కు ఎంపిక ● గ్రూప్ –1లో 384 ర్యాంక్ సాధించిన వట్టె రాజశేఖర్‌రెడ్డి మేళ్లచెరువు : ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన వట్టె రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 384 వ ర్యాంక్ సాధించినట్లు పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రి మృతిచెందగా తల్లి విద్యావలంటీర్‌గా విధులు నిర్వహిస్తూ ఇద్దరు కుమారులను కష్టపడి చదివించింది. మొదటి కుమారుడైన రాజశేఖర్‌రెడ్డి ముందునుంచి చదువులో ప్రతిభ కనబరిచేవాడు. పదో తరగతి వరకు మేళ్లచెరువు మండల కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలో చదివి మంచి మార్కులు సాధించాడు. బాసర ట్రిపుల్‌ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. సొంతంగా చదువుతూ పది సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలు రాశాడు. ఇటీవల గ్రూప్–4 లో ర్యాంకు సాధించి కోదాడ మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాజశేఖర్‌రెడ్డి గ్రూప్–1 సాధించడంపై గ్రామస్తులు అభినందించారు. -
సొంతంగా సన్నద్ధమై..
కొండమల్లేపల్లి: రోజుకు 14 గంటల ప్రిపరేషన్, తల్లిదండ్రుల ప్రోత్సాహం గ్రూప్ –1లో సెలెక్ట్ అయ్యేలా చేసింది. కొండమల్లేపల్లికి చెందిన ఎల్లెబోయిన రుచిత టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన ఎల్లెబోయిన రవి, శోభ దంపతుల కుమార్తె రుచిత తన ప్రాథమిక విద్యాభ్యాసం కొండమల్లేపల్లిలోనే కొనసాగింది. డిగ్రీ అనంతరం ఢిల్లీలో ఆరు నెలల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తరువాత హైదరాబాద్‌లో ఉంటూ సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఉద్యోగ నియామకంలో రుచిత జనరల్ ర్యాంకింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. ప్రజలకు సేవ చేస్తా..చిన్ననాటి నుంచి కలెక్టర్ కావాలనే ఆశయంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో ఒక అవగాహన వచ్చింది. స్వతహాగా గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తాజాగా వెలువడిన గ్రూప్–1 జనరల్ ర్యాంకింగ్స్‌లో 47వ ర్యాంక్ సాధించడం పట్ల సంతోషంగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నాను. ఏదేమైనా ఉద్యోగంలో చేరాక నావంతుగా పేదలకు సేవ చేస్తా. – ఎల్లెబోయిన రుచిత -
నిరంతరం శ్రమించి..
మిర్యాలగూడ : దామరచర్ల మండలం దుబ్బతండాకు చెందిన తెజావత్ అశోక్ గ్రూప్– 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 124వ ర్యాంకు సాధించాడు. తెజావత్ లక్ష్మణ్, బూరి దంపతుల కుమారుడైన అశోక్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌లో ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష రాయగా ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ విడుదల చేసిన గ్రూప్– 1 పరీక్షలో ర్యాంక్ సాధించాడు. ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తన తల్లిదండ్రుల కోరిక మేరకు కష్టపడి చదివానని తెలిపాడు. -
ఇంటి వద్దే ఉండి ప్రిపేర్ అయి..
అర్వపల్లి: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన మాండ్ర నరేష్ గ్రూప్– 1 ఫలితాల్లో 466 మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో 290 ర్యాంక్ సాధించాడు. నరేష్ సోదరుడు రమేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా నరేష్ చిన్నతనంలోనే గ్రూప్– 1లో రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన అన్నాదమ్ముళ్లు తాత, నానమ్మల దగ్గర ఉంటూ పెరిగారు. నరేష్ 10వ తరగతి వరకు తిమ్మాపురం జెడ్పీహెచ్ఎస్లో చదవుకొని ఇంటర్ సూర్యాపేటలో పూర్తిచేశాడు. హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తిచేసి ఇంటివద్ద ఉంటూ గ్రూప్స్‌కు సన్నద్ధమయ్యాడు. ర్యాంక్‌ను బట్టి గ్రూప్ –1 అధికారిగా ఎంపికకానున్నారు. -
ఓ పక్క విధులు నిర్వహిస్తూనే.. గ్రూప్స్‌కు సన్నద్ధమై..
నల్లగొండ: నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం బోయగూడ గ్రామానికి చెందిన భగవంత్‌రెడ్డి, జయమ్మల కుమారుడు నాగాార్జున్రెడ్డి. టెన్త్ వరకు రాజవరం ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఇంటర్, డిగ్రీ హాలియాలోని ప్రైవేట్ కాలేజీల్లో పూర్తి చేశారు. చదువులో ఎప్పుడూ మొదటి స్థానంలో ఉండే నాగార్జునరెడ్డి వ్యవసాయంలో తల్లిదండ్రులు చేసే కష్టం చూసి కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరుకున్నాడు. ఇంటర్ తర్వాత టీటీసీ పూర్తి చేసిన ఆయన 2006 డీఎస్సీలో 7వ ర్యాంకు సాధించాడు. 2011లో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగంలో 6వ జోన్ పరిధిలో మొదటి రాంకర్గా నిలిచాడు. 2012లో గ్రూప్–2కు ఎంపికయ్యాడు. నిడమనూరు, నల్లగొండ, హుజూర్నగర్ తహసీల్దార్‌గా పనిచేశాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్ –1 ఫలితాల్లో 900 మార్కులకు గాను 488 మార్కులు సాధించాడు. ఓ పక్క విధులు నిర్వహిస్తూనే మరోపక్క ఉద్యోగాలు సాధిస్తూ వచ్చాడు. -
సొంతంగా సన్నద్ధమై..
కొండమల్లేపల్లి: రోజుకు 14 గంటల ప్రిపరేషన్, తల్లిదండ్రుల ప్రోత్సాహం గ్రూప్ –1లో సెలెక్ట్ అయ్యేలా చేసింది. కొండమల్లేపల్లికి చెందిన ఎల్లెబోయిన రుచిత టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన ఎల్లెబోయిన రవి, శోభ దంపతుల కుమార్తె రుచిత తన ప్రాథమిక విద్యాభ్యాసం కొండమల్లేపల్లిలోనే కొనసాగింది. డిగ్రీ అనంతరం ఢిల్లీలో ఆరు నెలల పాటు సివిల్స్ కోచింగ్ తీసుకుంది. తరువాత హైదరాబాద్‌లో ఉంటూ సొంతంగా సివిల్స్‌కు సన్నద్ధమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్–1 ఉద్యోగ నియామకంలో రుచిత జనరల్ ర్యాంకింగ్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 47వ ర్యాంక్ సాధించింది. ప్రజలకు సేవ చేస్తా..చిన్ననాటి నుంచి కలెక్టర్ కావాలనే ఆశయంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యా. ఢిల్లీలో తీసుకున్న కోచింగ్‌తో పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలో ఒక అవగాహన వచ్చింది. స్వతహాగా గ్రూప్స్‌కు సిద్ధమయ్యా. తాజాగా వెలువడిన గ్రూప్–1 జనరల్ ర్యాంకింగ్స్‌లో 47వ ర్యాంక్ సాధించడం పట్ల సంతోషంగా ఉంది. డిప్యూటీ కలెక్టర్ లేదా డీఎస్సీ వచ్చే అవకాశాలు ఉండొచ్చని భావిస్తున్నాను. ఏదేమైనా ఉద్యోగంలో చేరాక నావంతుగా పేదలకు సేవ చేస్తా. – ఎల్లెబోయిన రుచిత