
కొన్నిచోట్లే సన్నబియ్యం!
మొదటి రోజు అన్ని గ్రామాల్లో ప్రారంభం కాని పథకం
ఎమ్మెల్యేల సమయం తీసుకుని..
ఈనెల 2వ తేదీ తరువాత అన్ని గ్రామాల్లో పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేడుతున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఈనెల 4వ తేదీన ఎమ్మెల్యే బాలునాయక్ ప్రారంభించనున్నారు. నకిరేకల్ నియోజవకర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో 2వ తేదీన ప్రారంభించనున్నారు. భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్‌పోచంపల్లి తదితర మండలాల్లో ఈనెల 3వ తేదీన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి పంపిణీని ప్రారంభించాక ప్రజలకు బియ్యం పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రేషన్‌కార్డులు కలిగిన పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకం మొదటి రోజు కొన్ని గ్రామాల్లోనే ప్రారంభమైంది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇవ్వగా, ఇటీవల హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో వివిధ నియోజకవర్గాల పరిధిలో సన్న బియ్యం పంపిణీని మంగళవారం కొన్ని చోట్ల మంత్రి, ఎమ్మెల్యేలు, మరికొన్ని చోట్ల ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో పెద్దమొత్తంలో పంపిణీ కొనసాగగా, యాదాద్రి, నల్లగొండ జిల్లాలో మాత్రం పంపిణీ కొన్ని మండలాల్లోనే ప్రారంభంమైంది. అయితే.. ఆయా నియోజకవర్గాల్లో ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఎమ్మెల్యేల నేతృత్వంలో సన్నబియ్యం పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటి రోజు అంతంత మాత్రంగానే..
ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎమ్మెల్యేల సమయాన్ని బట్టి ప్రారంభించేలా చర్యలు చేపట్టడంతో మొదటి రోజు ఉమ్మడి జిల్లాలో అన్ని రేషన్ దుకాణాల్లో ఈ పథకం ప్రారంభం కాలేదు. నల్లగొండ జిల్లాలోని కనగల్ మండలం జి.ఎడవల్లిలో, యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి, మునుగోడు నియోజకవర్గంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ని అన్ని మండలాల్లో బియ్యం పంపిణీ ప్రారంభం కాలేదు. నల్లగొండ జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యేతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభించారు. ఇక సూర్యాపేట జిల్లాలో అన్ని నియోజవకర్గాల్లో పంపిణీ ప్రారంభమైంది. ఇప్పటికే హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, సూర్యాపేట, కోదాడలో ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. తుంగతర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో 610 రేషన్ షాపులకు గాను మంగళవారం 585 రేషన్ షాపుల్లో 51,000 మంది రేషన్ కార్డుదారులకు 1000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఇక యాదాద్రి జిల్లాలో 515 షాపులకు గాను 80 షాపుల్లోనే బియ్యం పంపిణీని ప్రారంభించారు.
ఫ సూర్యాపేట జిల్లాలో అత్యధిక రేషన్ దుకాణాల్లో పంపిణీ
ఫ నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో నామమాత్రంగానే..
ఫ ఎమ్మెల్యేలు ఇచ్చే సమయాన్ని బట్టి ప్రారంభిస్తామంటున్న అధికారులు
ఫ సన్న బియ్యం పంపిణీపై ప్రజల్లో సానుకూల స్పందన

కొన్నిచోట్లే సన్నబియ్యం!