
ప్రత్యేక ప్రజావాణి వాయిదా
నల్లగొండ : కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించనున్న ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వృద్ధులు, దివ్యాంగులు గురువారం కలెక్టరేట్‌కు రావద్దని పేర్కొన్నారు.
సీపీఓగా మాన్యానాయక్
నల్లగొండ : నల్లగొండ ముఖ్య ప్రణాళిక అధి కారి (సీపీఓ)గా మాన్యానాయక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ఆయనకు జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రస్తుతం ఆయన ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి ఇవ్వడంతోపాటు నల్లగొండ సీపీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన గూడ వెంకటేశ్వర్లు వికారాబాద్‌కు బదిలీ అయ్యారు.