అరుణాచలానికి ప్రత్యేక బస్సులు
రామగిరి (నల్లగొండ) : పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదర్శన కోసం ఏప్రిల్ 10 తేదీ సాయంత్రం 6 గంటలకు ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్‌ఎం కే.జానిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పౌర్ణమికి రద్దీ దష్ట్యా ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అరుణాచలం వెళ్లే భక్తులకు ఆంధ్రప్రదేశ్‌లోని కాణిపాకం, తమిళనాడులోని వేల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా ఉంటుందని తెలిపారు. వివరాలకు 9298008888 ఫోన్‌నంబర్‌ను లేదా అన్ని సమీప బస్‌స్టేషన్లలో సంప్రదించాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శాఖలో
అద్దె వాహనాలకు ఆహ్వానం
నల్లగొండ టౌన్ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు. ఆసక్తి గల ఏజెన్సీలు, వ్యక్తులు తమ టెండర్లను 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లపై
ఆర్డీఓ ఆరా..!
తిప్పర్తి : మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి సోమవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తాలు పట్టకపోవడంతో మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలేదని, ప్యాడీ క్లీనర్ ద్వారా ధాన్యం శుభ్రం చేసుకోవాలని సూచించారు. రైతులు తమ ధాన్యం ఒక క్వింటా శుభ్రం చేసుకుని ఎంత శాతం తాలు వచ్చిందో చూసి దాని ప్రకారం కోత విధించి మిల్లర్లు కొనుగోలు చేసేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీఓ పాత్యానాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, తహసీల్దార్ పరుశురాములు, ఏఓ సన్నిరాజు, ఆర్‌ఐ ద్రోణార్జున, రైతులు ఉన్నారు.
నాణ్యమైన ధాన్యాన్ని తెచ్చి మద్దతు ధర పొందాలి
మాడ్గులపల్లి : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి సూచించారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలోని గారకుంటపాలెం గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులు 17శాతం తేమ ఉండేలా చూసుకోని కేంద్రాలకు ధాన్యాన్ని తేవాలన్నారు. రైతులు తమ వెంట ఆధార్‌కార్డు, బ్యాంక్, పట్టా పాస్‌బుక్ జిరాక్స్‌లను తెచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్‌కుమార్, డీపీఎం బెనర్జీ, ఏపీఎం భాషపాక చంద్రశేఖర్, ఆర్‌ఐ నాగయ్య, ఏఈవో వేణుగోపాల్, సీసీ నాగయ్య, శివలీల, సోమయ్య, నాగలక్ష్మి రైతులు పాల్గొన్నారు.
అరుణాచలానికి ప్రత్యేక బస్సులు


