
చరిత్రలో నిలిచిపోయే పథకం
కనగల్ : సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవమని, ఇది చరిత్రలో నిలిచిపోయే పథకమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం కనగల్ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రామంలో రూ.4.63 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు కూడా పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, రైతు భరోసా, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం కోసం ఇప్పటివరకు రూ.4000 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వం దక్షిణ తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రకు నీళ్లు తీసుకెళ్లిందని, ఎస్‌ఎల్‌బీసీని పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రూ.4,518 కోట్లు కేటాయించామని, దురదష్టవశాత్తు ప్రస్తుతం పనులు ఆగిపోయాయన్నారు. సంవత్సరంలోగా టన్నెల్ పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకానికి ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎడవెల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 7న బక్కతాయికుంట, నర్సింగ్‌బట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలన్నారు.
ఫ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి