
రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
దేవరకొండ : భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ సభ్యుడు సంజీవ్ ముదిరాజ్‌తో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అంబేద్కర్‌ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నాయిని మాధవరెడ్డి, దొంతం సంజీవరెడ్డి, ఎంఏ సిరాజ్‌ఖాన్, అలంపల్లి నర్సింహ, దేవేందర్‌నాయక్, ముక్కమళ్ల వెంకటయ్య, శిరందాసు కృష్ణయ్య, వేణుధర్‌రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే బాలునాయక్,
డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్