
ఉత్సవాలను విజయవంతం చేయాలి
నల్లగొండ : బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో వివిధ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 5న బాబు జగ్జీవన్‌రామ్, 14న అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సహకరించాలని కోరారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా హాజరయ్యే వారికి వేసవి దృష్ట్యా తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని కోరారు. రోడ్డు విస్తరణలోతొలగించిన జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ విగ్రహాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, కోటేశ్వరరావు, పత్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి