
నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్‌జీ కళాశాల వద్ద బాబుజగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆ తరువాత జిల్లా పోలీస్ కార్యాలయంలో నిరుద్యోగుల కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన యువతేజం జాబ్‌మేళాలో పాల్గొంటారు. 12 గంటలకు నల్లగొండ జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన క్రిటికల్‌కేర్ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్‌కు వెళతారు.
‘ఓపెన్ స్కూల్’ పరీక్షలు
పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలన నిర్వహణపై శుక్రవారం నల్లగొండలో డీఈఓ భిక్షపతితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే అభ్యాసకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సత్యమ్మ, అధికారులు పాల్గొన్నారు.
టీబీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి
నార్కట్‌పల్లి: అనుమానం ఉంటే జాప్యం చేయకుండా టీబీ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని జిల్లా టీబీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి అన్నారు. టీబీ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే అత్యాధునిక ట్రూనాట్ టెస్టింగ్ పరికరాన్ని శుక్రవారం నార్కట్‌పల్లి పరిధిలోని కామినేని మెడికల్ కళాశాలలో ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ తరహా ఆధునిక పరికరాలు గ్రామీణ ప్రాంత ప్రజలకు చికిత్స చేసేందుకు ఉపయోగపడతాయన్నారు. బాధితుల నుంచి ఇతరులకు కూడా టీబీ వ్యాపించే ప్రమాదం ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ పీవీ.రామమోహన్, సమీయుద్ధీన్, రవిప్రసాద్, అజయ్, సైదులు, అంజన్, నవనీత్ ఉన్నారు.
పేట మార్కెట్‌కు 33,457 బస్తాల ధాన్యం
భానుపురి: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం 33,457 బస్తాల వరి ధాన్యం వచ్చింది. అత్యధికంగా జైశ్రీరాం రకం 19,704 బస్తాలు, హెచ్‌ఎంటీలు 7,038 బస్తాలు, ఆర్‌ఐ(64) 6,632 బస్తాల చొప్పున వచ్చింది. అదేవిధంగా 333 బస్తాల పెసర, 84 బస్తాల కంది, అపరాలు మొత్తం 657 బస్తాలు వచ్చాయి. దీంతో మార్కెట్ ధాన్యం రాశులతో కళకళలాడింది.

నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక

నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక