రైతుల ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం
నల్లగొండ టూటౌన్, తిప్పర్తి: ధాన్యాన్ని కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ, తిప్పర్తి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కిసాన్ మోర్చా, బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో జిల్లా మంత్రులు, సివిల్ సప్లయ్ అధికారుల తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇవాల్వల్సి వస్తదనే కారణంతోనే కొనుగోళ్లలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలు కురుస్తున్నాయని, రైతుల వడ్లు తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. తేమ, తాలు పేరుతో బస్తాకు రెండు కిలోల తరగు తీస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత గోలి మధుసూదన్‌రెడ్డి, పాపయ్యగౌడ్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, పోతెపాక లింగస్వామి, యాదగిరిచారి, మిర్యాల వెంకన్న, గడ్డం వెంకట్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, పకీరు మోహన్‌రెడ్డి, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, కన్మతరెడ్డి అశోక్‌రెడ్డి, గడ్డం వెంకట్‌రెడ్డి, సీతారాంరెడ్డి, పార్టీ తిప్పర్తి మండల అధ్యక్షుడు వంగూరి రవి తదితరులు పాల్గొన్నారు.
ఫ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి


