
రైతుభరోసా రూ.419.21 కోట్లు జమ
నల్లగొండ అగ్రికల్చర్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాసంగి రైతుభరోసా ఇప్పటి వరకు 4.33 లక్షల మంది రైతులకు అందింది. మొత్తం రూ.419.21 కోట్లు ఆయా రైతుల ఖాతాల్లో జమయింది. నాలుగు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకే ప్రభుత్వం రైతు భరోసా అందించింది. ఇంకా సుమారు రెండు లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు.
5,60,801 మంది రైతులు
జిల్లా వ్యాప్తంగా 5,60,801 మంది పట్టాదారు పాస్‌పుస్తకాలను కలిగిన రైతులు ఉన్నారు. ప్రభుత్వం యాసంగి రైతు భరోసాను జనవరి 26వ తేదీ నుంచి జమ చేస్తోంది. తొలి విడతలో ఎంపిక చేసిన 31 గ్రామాల్లోని రైతులకు ఎలాంటి కటాఫ్ లేకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు రూ.46,93,19,160 ఖాతాల్లో జమ చేసింది. ఆ తరువాత రెండవ, మూడవ దశలో, నాలుగవ దశలో నాలుగు విడుతలగా మొత్తం 4,33,543 మంది రైతుల ఖాతాల్లో రూ.419,11,54,632 జమ చేసింది. ఇంకా 1,13,218 మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సీజన్ ముగిసినందున మిగిలిన రైతులకు రైతుభరోసా అమలు చేస్తుందా లేదా అనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా అమలు చేస్తుంది అనే దానిపై కూడా ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో మిగిలిన రైతులలో ఆందోళన నెలకొంది.
దశల వారీగా విడుదల చేస్తుంది
రైతు భరోసా నిధులను ప్రభుత్వం దశల వారీగా జమ చేస్తుంది. ఇప్పటి వరకు 4 విడతల్లో రూ.419.21 కోట్లు జమ చేసింది. 4,33,543 మంది రైతులకు రైతు భరోసా అందింది.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏఓ
రైతు భరోసా రాలేదు
యాసంగి రైతు భరోసా ఇప్పటి వరకు నా ఖాతాలో జమ కాలేదు. నాకు ఐదెకరాల్లోపు వ్యవసాయ భూమి ఉంది. ఎప్పుడు పడుతుందో అధికారులు కూడా చెప్పడం లేదు. అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే జమ చేయాలి.
– కె.రాము, రామడుగు, హాలియా మండలం
ఫ 4.33 లక్షల మంది రైతులకు అందిన సొమ్ము
ఫ నాలుగు ఎకరాల్లోపు వారికి వర్తింపు
ఫ మిగతా రైతులకు తప్పని ఎదురుచూపు
రైతు భరోసా నిధులు జమ ఇలా..
దశ రైతులు రూపాయలు
మొదటి 35,568 46,93,19,160
రెండవ 1,55,232 88,42,80,319
మూడవ 85,894 67,02,72,632
నాల్గవ 1,56,849 216,72,82,521
మొత్తం 43,3543 419,11,54,632

రైతుభరోసా రూ.419.21 కోట్లు జమ