
బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి
–జటంగి నర్సమ్మ, కేతేపల్లి
అందరం కడుపునిండా తింటున్నాం..
ప్రభుత్వం పంపిణీ చేసిన సన్నబియ్యంలో నూకలు ఎక్కువగా ఉన్నాయి. నూకలు వేరు చేసి వండితే అన్నం చాలా బాగా ఉంటుంది. లేకపోతే ముద్దవుతోంది. దొడ్డు బియ్యం తినే బాధ తప్పింది. సన్నబియ్యాన్ని అందరం కడుపునిండా తింటున్నాం.
–కాటేపల్లి పూలమ్మ, పెద్దవూర
సన్న బియ్యం ఇవ్వడం సంతోషకరం
ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. సన్న బియ్యం బాగానే ఉన్నాయి. అన్నం వండితే కొంచెం మెత్తగా అవుతుంది. కొత్త బియ్యం కావడం, రెండు, మూడు రకాల బియ్యం కలవడం వల్ల అలా అయి ఉండవచ్చు. రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తుండడంతో పేదలకు బయట బియ్యం కొనుక్కునే ఖర్చు తగ్గింది.
– పున్నమ్మ, ఆగామోత్కూర్, మాడ్గులపల్లి మండలం
పేదల కడుపు నింపుతున్న సన్నబియ్యం
సన్న బియ్యం పేదల కడుపు నింపుతోంది. ఇంతకు ముందు పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినడానికి వీలుగా లేకుండా పోయేది. ఈ సన్న బియ్యం ఎల్లకాలం పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలి.
– కుడికిళ్ల నీలమ్మ, పెద్దఅడిశర్లపల్లి

బియ్యం బాగున్నాయి

బియ్యం బాగున్నాయి

బియ్యం బాగున్నాయి