పరిశోధనలతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : పరిశోధనలు చేసే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆమ్లికాన్ కంపెనీ డైరెక్టర్ కుషాల్ వాంగుడేల్ అన్నారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు పోటీన్ల అధ్యయనంలో ఎస్డిస్‌పేజ్, వెస్ట్రన్ బ్లాటింగ్ విధానంపై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా అనేక మెళకువలు తెలుస్తాయని, ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేసి తమ ప్రతిభ నిరూపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.ప్రేమ్‌సాగర్, విభాగ అధిపతి తిరుమల, కె.రామచందర్‌గౌడ్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.


