నిరంతరం శ్రమించి..
మిర్యాలగూడ : దామరచర్ల మండలం దుబ్బతండాకు చెందిన తెజావత్ అశోక్ గ్రూప్– 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 124వ ర్యాంకు సాధించాడు. తెజావత్ లక్ష్మణ్, బూరి దంపతుల కుమారుడైన అశోక్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశాడు. ప్రభుత్వం హైదరాబాద్‌లోని రాజేందర్‌నగర్‌లో ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఐఏఎస్ కోచింగ్ సెంటర్‌లో శిక్షణ పొందాడు. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్ష రాయగా ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ప్రభుత్వ విడుదల చేసిన గ్రూప్– 1 పరీక్షలో ర్యాంక్ సాధించాడు. ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న తన తల్లిదండ్రుల కోరిక మేరకు కష్టపడి చదివానని తెలిపాడు.


