చి‘వరి’ దశలో నీరందేనా..!
వెంటనే స్పందించాలి
డిండి ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేసిన పంట పొలాలు ఎండి పోకుండా చూడాలి. పంట చివరిదశ వరకు నీరందించే విషయంపై ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలి.
– బద్దెల బచ్చలు, రైతు, డిండి
నీటిని పొదుపుగా వాడుకోవాలి
డిండి ప్రాజెక్టు నుంచి సాగుకు విడుదల చేసిన నీటిని రైతులు వృథా కాకుండా పొదుపుగా వాడాలి. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు 45 రోజుల వరకు సరిపోతుంది.
– ఎలమందయ్య, ఈఈ, డిండి ప్రాజెక్టు
డిండి : యాసంగి సీజన్‌లో సాగు చేసిన వ్యవసాయ పొలాలకు పంట చివరి దశ వరకు సాగు నీరు అందుతుందో లేదో అని డిండి ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టులోని నీటి మట్టం రోజురోజుకు తగ్గుతుండటం, ఎగువ ప్రాంతమైన కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి నీరురాకపోవడంతో సాగు ప్రశ్నార్థకౖంగా మారింది. గతేడాది వానాకాలంలో సమృద్ధిగా కురిసిన వర్షాలకు డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి అలుగుపోసింది. దీంతో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయకట్టులో ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేశారు. కానీ 75 శాతం వరకు రైతులు వరి సాగు చేశారు. దీంతో నీటి వాడకం ఎక్కువ కావడంతో ప్రాజెక్టులో నీరు వేగంగా తగ్గిపోయింది.
పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు
డిండి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 36 అడుగులు(2.5 టీఎంసీలు)కాగా.. ఎడమ కాలువ ద్వారా 12,500 ఎకరాలు, కుడి కాలువ ద్వారా 250 ఎకరాల్లో యాసంగి సాగుకు వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజక్టులో 22 అడుగుల(ఒక టీఎంసీలు) నీరు మాత్రమే నిల్వ ఉంది. పంటలు చేతికి రావాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న నీరు నెల రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా డిండి ప్రాజెక్టులోకి నీటిని తరలించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
ఎకరం పొలం కూడా ఎండొద్దు :
ఎమ్మెల్యే బాలునాయక్
డిండి ప్రాజెక్టు కింద సాగు చేసిన పొలాలకు నీరందించే విషయంపై గురువారం ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ స్థానిక నీటి పారుదల శాఖా అతిథి గృహంలో ఇరిగేషన్ శాఖా అధికారులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు వృథా కాకుండా పంట చివరిదశ వరకు అందించేలా పక్కా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఒక్క ఎకరం కూడా ఎండకుండా చూడాలన్నారు.
ఫ డిండి ప్రాజెక్టులో 22 అడుగులకు తగ్గిన నీటి మట్టం
ఫ పంటలు చేతికి రావాలంటే రెండు
నెలలపాటు నీటి అవసరం
ఫ నెల రోజులకే సరిపోనున్న ప్రస్తుత నిల్వ
ఫ ఆందోళన చెందుతున్న రైతులు
చి‘వరి’ దశలో నీరందేనా..!
చి‘వరి’ దశలో నీరందేనా..!


