
ఏఎమ్మార్పీ కాల్వలో పడి వ్యక్తి గల్లంతు
పెద్దఅడిశర్లపల్లి : ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన గుడిపల్లి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహలు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలంలోని సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వట్టెపు అంజయ్య(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం సాయత్రం సమీప బంధువు అయిన ఎల్ల య్యతో కలిసి గ్రామ శివారులోని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో స్నానానికి వెళ్లగా ప్రమాదవశాత్తు కాలు జారి కాల్వలో పడిపోయాడు. అంజయ్యను వెంటనే ఎల్లయ్య రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే అంజయ్య గల్లంతయ్యాడు. దీంతో అంజయ్య కుటుంబ సభ్యులకు, గుడిపల్లి పోలీసులకు ఎల్లయ్య సమాచారం అందించాడు. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నీటి విడుదలను నిలిపివేయించారు. గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి వరకు మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు.