డిగ్రీ పరీక్షలు నిర్వహించలేం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో తాము డిగ్రీ పరీక్షలు నిర్వహించే పరిస్థితిలో లేమని తెలంగాణ అఫిలేటెడ్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎంజీయూ వీసీ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు రాక యాజమాన్యాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. 9 నెలలుగా వివిధ రూపంలో నిరసన తెలియజేసినా ఫీజు బకాయిలు విడుదల చేయలేదన్నారు. కొన్ని జిల్లాలకు విడుదల చేసి నల్లగొండ జిల్లాపై వివక్ష చూపడం సరికాదన్నారు. అంతకుముందు ఎంజీయూ ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ మారం నాగేందర్‌రెడ్డి, ఎం.సైదారావు, ప్రవీణ్, మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


