
కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అగ్నిప్రమాదం
కోదాడరూరల్ : కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఆనుకొని ఉన్న వీధిలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్టారు. ఆ నిప్పు గాలికి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పడడంతో రాలిన చెట్ల ఆకులకు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ ఆవరణలో ఉంచిన పలు కేసుల్లో సీజ్ చేసిన మూడు ఆటోలు, కారు, టాటా ఏస్ వాహనం, స్కార్పియో వాహనానికి మంటలు అంటుకొని దగ్ధమాయ్యయి. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఏమాత్రం ఆలస్యమైనా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కు నిప్పంటుకొని పెను ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు.
పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు దగ్ధం