
నేడు పోలీస్ మెగా జాబ్‌మేళా
నల్లగొండ: నిరుద్యోగ యువతీయువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం నల్లగొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లను చేసింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువతేజం కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో 100 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. మొత్తం 2,500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఈ మేళాను ఎస్పీ శరత్ శంద్ర పవార్ ఈ జాబ్ మేళాను ప్రారంభించనున్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాని జిల్లా ఎస్పీ కోరారు.
ఫ నల్లగొండ పోలీస్ మైదానంలో ఏర్పాట్లు చేసిన పోలీస్ శాఖ