
ఆస్పత్రిలో కలుషిత నీరు!
ఈ ఫొటోలను గమనించారా.. ఇవి నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రోగులు తాగునీరు అందించే ఫ్రిడ్జ్, అందులోని నీరు. కలుషితంగా కనిపిస్తున్న ఈ నీటినే రోజూ రోగులు తాగుతున్నారు. సోమవారం ఒక వ్యక్తి గ్లాసులో నీళ్లు పట్టుకుని తాగుతుండగా పురుగుల వచ్చాయి. దీంతో ఫ్రిడ్జ్ పైన మూత తీసి చూడగా ఫ్రిడ్జ్ నీరు కలుషితంగా.. పురుగుల మయంగా కనిపించింది. అక్కడి సిబ్బంది ఆ నీరు చూపించాడు. వారు ఆ నీటిని పారబోశారు. మళ్లీ అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. రోగాలు నయం చేసుకోవాడానికి ఆస్పత్రికి వస్తుంటే.. ఈ నీరు తాగితే మళ్లీ రోగాల బారినపడే ప్రమాదం ఉంటుందని అక్కడి రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. – నాగార్జునసాగర్

ఆస్పత్రిలో కలుషిత నీరు!