గిరిపుత్రుల ప్రతిభ
విద్యార్థుల ప్రతిభను గుర్తించా
అఖిల్, తరుణ్‌ల ప్రతిభను గుర్తించాను. వారికి వచ్చిన ఆలోచనతో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను రైతుల కోసం రూపొందించాలని నిర్ణయించుకున్నాం. మినీ వాహనాన్ని తయారు చేసి బ్యాటరీని అమర్చి అంతర పంటలకు ఉపయోగపడే విధంగా రూపొందించాం. విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి నిరంతరం కృషి చేస్తా.
– కోట నవీన్‌కుమార్, ఉపాధ్యాయుడు
ఫ ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్
రూపొందించిన గిరిజన విద్యార్థులు
ఫ రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్
ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి ప్రశంసలు
అందుకున్న తరుణ్, అఖిల్
యాదగిరిగుట్ట: వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాన్ని రూపొందించి తమ ప్రతిభను చాటుకున్నారు ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి గిరిజన విద్యార్థులు బానోతు తరుణ్, లునావత్ అఖిల్. తమకు చదువు చెబుతున్న ఉపాధ్యాయుడు కోట నవీన్ కుమార్‌ను గైడ్‌గా చేసుకుని చోటా ప్యాకెట్ బడా ధమాకా పేరుతో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్ తయారు చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
మొదటి ప్రయత్నంలోనే..
లూనావత్ అఖిల్, బానోతు తరుణ్‌లు ఉపాధ్యాయుడు కోట నవీన్ కుమార్ సహకారంతో 2024 జనవరిలో ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను తయారు చేసేందుకు ప్రయత్నం ప్రారంభించారు. దీనిని పూర్తి చేసి అదే సంవత్సరం సెప్టెంబర్‌లో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించగా.. రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. అదేవిధంగా జనవరి 7న హైదరాబాద్‌లో జరిగిన నేషనల్ యూత్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా జాతీయ స్థాయికి ఎంపికై ంది. వికసిత్ భారత్‌లో భాగంగా జనవరి 10, 11, 12తేదీల్లో ఢిల్లీలో జరిగిన యంగ్ ఇండియా ఫెస్టివల్‌లో ఈ పరికరాన్ని ప్రదర్శించారు.
నానో ట్రాక్టర్ పనితీరు..
బ్యాటరీతో నడిచే మినీ ఎలక్ట్రికల్ నానో ట్రాక్టర్‌ను పాత పనిముట్లతో రూపొందించారు. అంతర పంటలు వేసుకునేందుకు ఉపయోగపడే విధంగా దీనిని రూపొందించారు. చిన్న, సన్నకారులు రైతులు అతి తక్కువ పెట్టుబడితో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఈ నానో ట్రాక్టర్‌ను వినియోగించవచ్చు.
గిరిపుత్రుల ప్రతిభ


