సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం.. | - | Sakshi
Sakshi News home page

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..

Published Tue, Apr 8 2025 11:11 AM | Last Updated on Tue, Apr 8 2025 11:11 AM

సంపూర

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..

మిర్యాలగూడ టౌన్‌ : చిన్నారులు, గర్భిణులు, బాలింతలు పోషకాహారం లోపాన్ని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేలా.. ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ పక్షం(పోషణ పక్వాడీ) నిర్వహిస్తోంది. పోషక విలువలు, అదనపు ఆహార విశిష్టత, తల్లిపాల ప్రాముఖ్యత, రక్తహీనత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించే పోషణ పక్షం–2025 (పోషణ పక్వాడీ) కార్యక్రమం ఈనెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. తల్లులు, పిల్లల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. చిన్నారులు, కిశోర బాలికలు, బాలింతలు, గర్బిణీలను పోషకాహారం లోపం నుంచి విముక్తులను చేసేందుకు ఈ పోషణ పక్వాడీ కార్యక్రమం దోహదపడుతుంది.

పోషణపక్షం కార్యక్రమాలు ఇలా..

● గర్భిణుల బరువు చూడడం, వారి సంరక్షణపై భర్తలకు అవగాహన కల్పించడం, రెండేళ్ల కంటే తక్కువగా వయస్సు ఉన్న పిల్లలకు పెరుగుదలను పర్యవేక్షించడం.

● ప్రత్యేక గృహ సందర్శన ద్వారా తల్లిపాల అవశ్యకతపై అవగాహన కల్పించడం, వ్యాధి నిరోధక షెడ్యూల్‌ తనిఖీ చేయడం.

● మొదటి వెయ్యి రోజుల్లో పోషకాహారం ప్రాముఖ్యత, గర్భిణులు, పాలిచ్చే తల్లులతో పాటు సంరక్షులకు సమావేశాలు నిర్వహించడం.

● వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్డి ఉపయోగం, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం, సురక్షితమైన నీటిని తాగడంపై అవగాహన కల్పించడం. రక్త పరీక్ష శిబిరాలు నిర్వహించడం.

● ఆహార పదార్థాలు, చిరుధాన్యాల ఉపయోగంలో భాగంగా వంటకాల ప్రదర్శన.

● పోషణ ట్రాకర్‌ లబ్ధిదారుల మాడ్యూల్‌ను పరిచయం చేసేందుకు గర్భిణులు, బాలింతలు, కౌమర బాలికలకు సంరక్షులతో సమావేశాలు నిర్వహించడం.

● అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆకలి పరీక్షలు, ప్రొటోకాల్‌పై అవగాహన కల్పించడం.

● వ్యాయం ప్రాముఖ్యతను వివరించడం.

ఫ అంగన్‌వాడీల్లో నేటి నుంచి

22వ తేదీ వరకు పోషణ పక్షం

ఫ పోషకాహారంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

ప్రాజెక్టులు 09

కేంద్రాలు 2,093

6నెలలలోపు పిల్లలు 6,855

7 నెలల నుంచి 3 ఏళ్లలోపు.. 42,563

3 నుంచి 6 ఏళ్లలోపు.. 27,686

గర్భిణులు 7,555

బాలింతలు 6,855

అందరూ భాగస్వాములు కావాలి

చిన్నారులు, మహిళల్లో పౌష్టికాహార లోపం నిర్మూలనే ప్రధాన లక్ష్యం. పోషకాహారంపై పిల్లల తల్లి దండ్రులకు అవగాహన కల్పిస్తాం. స్కూల్‌ పిల్లలకు క్విజ్‌ పోటీలు కూడా నిర్వహిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి.

– కృష్ణవేణి, జిల్లా సంక్షేమ అధికారి, నల్లగొండ

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..1
1/1

సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement