సస్నబియ్యం పంపిణీకి నేడు మంత్రి రాక | - | Sakshi
Sakshi News home page

సస్నబియ్యం పంపిణీకి నేడు మంత్రి రాక

Apr 1 2025 11:21 AM | Updated on Apr 3 2025 2:02 PM

నల్లగొండ : కనగల్‌ మండలం జి.ఎడవెల్లి గ్రామంలో రేషన్‌ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. హెలికాప్టర్‌ ద్వారా మంగళవారం ఉదయం 11 గంటలకు కనగల్‌ మండలం జిఎడవల్లికి చేరుకుంటారు. ఆ గ్రామంలో రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తారు. అనంతరం మంత్రి అదే మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు యాదాద్రి భువనగిరి జిల్లాకు హెలికాప్టర్‌ ద్వారా బయల్దేరి వెళతారు.

నేడు చిత్రకళా నిలయం ప్రారంభం

నాగార్జునసాగర్‌ : నందికొండలోని హిల్‌కాలనీలో ‘దాసి సుదర్శన్‌’ చిత్రకళా నిలయాన్ని మంగళవారం ప్రారంభించనున్నట్లు సముహ సెక్యులర్‌ రైటర్స్‌ ఫోరం జిల్లా కన్వీనర్‌ కస్తూరి ప్రభాకర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ స్మారక చిత్రకళా నిలయాన్ని హైదరాబాద్‌ ఆర్టిస్ట్‌ సొసైటీ అధ్యక్షుడు ఎం.వీ రమణారెడ్డి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సుదర్శన్‌ పలు రంగాల్లో అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం జాతీయ అవార్డును ఇచ్చిందని తెలిపారు. చిత్రకళా నిలయం ప్రా రంభోత్సవానికి కవులు, కళాకారులు, ఆర్టిస్టులు, రచయితలు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తు న హాజరై విజయవంతం చేయాలని కోరారు.

ఖైదీలకు న్యాయ సహాయం అందిస్తాం

రామగిరి(నల్లగొండ) : లీగల్‌ సెల్‌ ద్వారా ఖైదీలకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. జిల్లా జైలును సోమవారం ఆయన సందర్శించి ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ సెక్రెటరీ మంజుల సూర్యవర్‌, జైల్‌ సూపరింటెండెంట్‌ జి.ప్రమోద్‌, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎన్‌.భీమార్జున్‌రెడ్డి, డిప్యూటీ జైలర్‌ ఎం.నరేష్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

ముందస్తు ఆస్తి పన్ను చెల్లింపుపై రాయితీ

నల్లగొండ టూటౌన్‌ : మున్సిపాలిటీల్లో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధిచిన ఆస్తి పన్ను మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తించనుంది. ఈ రాయితీ ద్వారా భవానానికి ఉన్న ఆస్తి పన్నులో ఐదు శాతం తగ్గనుంది. భవనాల యజమానులంలా రాయితీని సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌ శివరాంరెడ్డి కోరారు.

90 శాతం వడ్డీ రాయితీకి ముగిసిన గడువు

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ గడువు మార్చి 31 అర్ధరాత్రితో ముగిసింది. మార్చి చివరివారంలో వడ్డీ మాఫీ అవకాశం కల్పించడంతో చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. 15 రోజుల ముందే వడ్డీ మాఫీ అవకాశం కల్పిస్తే ఆస్తిపన్ను బకాయి ఉన్నవారు పూర్తిగా చెల్లించే అవకాశం ఉండేదని పలువురు పేర్కొంటున్నారు.

వక్ఫ్‌ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన

రామగిరి(నల్లగొండ) : కేంద్ర ప్రభుత్వం మైనార్టీల హక్కులను భంగం కలిగించేలా పార్లమెంట్‌లో వక్ఫ్‌ సవరణ బిల్లు– 2024ను వ్యతిరేకిస్తూ నల్లగొండ ఈద్గా వద్ద సీసీఎం మైనార్టీ నాయకులు నల్ల రిబ్బన్‌ ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సయ్యద్‌ హశం, జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.సలీం మాట్లాడుతూ ఈ సవరణ బిల్లు మతపరమైన హక్కులకు, వక్ఫ్‌ ఆస్తుల రక్షణకు విఘాతం కలిగిస్తుందన్నారు. 

కేంద్ర తెచ్చే ఈ చట్టం ఆస్తులను రక్షించడం కోసం కాదని, ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునే కుట్ర అని విమర్శించారు. ఈ నిరసనలో నాయకులు దండెంపల్లి సత్తయ్య ఊట్కూరి మధుసూదన్‌రెడ్డి ఎగ్బాల్‌ సాజిద్‌, అడ్వకేట్‌ నజీరుద్దీన్‌, కనగల్‌ మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ కౌన్సిలర్‌ ఇంతియాజ్‌, ఖలీల్‌, ఎగ్బాల్‌, అజీజ్‌, సోయబ్‌, అఖిల్‌, షకీల్‌ పాల్గొన్నారు.

సస్నబియ్యం పంపిణీకి నేడు మంత్రి రాక1
1/1

సస్నబియ్యం పంపిణీకి నేడు మంత్రి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement