డ్రమ్ము నెట్టు.. నీరు పట్టు! | - | Sakshi
Sakshi News home page

డ్రమ్ము నెట్టు.. నీరు పట్టు!

Published Fri, Apr 4 2025 1:48 AM | Last Updated on Fri, Apr 4 2025 1:48 AM

డ్రమ్ము నెట్టు.. నీరు పట్టు!

డ్రమ్ము నెట్టు.. నీరు పట్టు!

చందంపేట : ఈ ఫొటో చూడగానే పిల్లలు, పెద్దలు ఆడుకుంటున్నారు అనుకుంటే పొరబడినట్లే. ఓ కుటుంబం వేసవిలో దాహార్తిని తీర్చుకోవడానికి నీటిని తెచ్చుకునేందుకు వెళ్తుందంటే నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజమే. మండుటెండలో నెత్తిన బిందె పెట్టుకొని మోసుకెళ్లాల్సిన పని లేకుండా ఆర్‌టీడీ సంస్థ వారు చెంచుల కోసం ప్రత్యేకంగా ఈ పరికరాన్ని తయారు చేయించారు. ఈ పరికరం ద్వారా ఓ డ్రమ్మును ముందుకు నెట్టుకుంటూ వెళ్లి నీటిని నింపుకొని తీసుకెళ్లొచ్చు. చందంపేట మండలంలోని పాత తెల్దేవర్‌పల్లిలో సుమారు పది కుటుంబాలకు ఆర్‌టీడీ సంస్థ నెట్టుకుంటూ వెళ్లే ఈ డ్రమ్ములను అందజేసింది. పాత తెల్దేవర్‌పల్లి గ్రామంలో ప్రస్తుతం వేసవి కావడంతో నీటి ఎద్దడి నెలకొంది. దీంతో డ్రమ్ముతో కూడిన ఈ పరికరాన్ని గ్రామస్తులు అర కిలోమీటర్‌ మేర ఇలా నెట్టుకుంటూ వెళ్లి గ్రామ సమీపంలోని బోరు వద్ద నీటిని తెచ్చుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement