ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలన్నారు. వేసవిలో తాగునీటికి సమస్య రాకుండా ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రజావాణికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ఈనెల 8 నుంచి 10 రోజులపాటు పోషణ పక్వాడా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో మహిళలు, గర్భిణులు, పిల్లలు, బాలింతలు తీసుకోవాల్సిన ఆహారంపై అవగాహన కల్పిస్తామన్నారు. టీఎస్ ఐ–పాస్ కింద వచ్చిన దరఖాస్తులను ఆమోదించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


