జగదీష్‌రెడ్డి జిల్లాకు చేసిందేమీ లేదు
నల్లగొండ : మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను విమర్శిస్తున్న సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి తాను మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ అన్నారు. శనివారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల పథకం సూర్యాపేటలో ప్రారంభిచారని.. ఏ ఊరిలో కూడా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వలేదన్నారు. పదేళ్లలో జిల్లాలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లెంల, ఇతర ఏ ప్రాజెక్టులను కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. సన్న బియ్యం పథకాన్ని అమలు చేస్తూ పేదల కడుపు నింపుతున్నామన్నారు. జిల్లాలో కలెక్టర్, ఎస్పీ డైనమిక్ అధికారులని.. వారిని కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని అనడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శమన్నారు. ఇప్పటికై నా ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. సమావేశంలో కాంగ్రెస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ సంపత్‌రెడ్డి, దుబ్బ అశోక్‌సుందర్, ముంతాజ్ అలీ, మామిడి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్


