
ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని ఒకరు మృతి
మాడ్గులపల్లి: రోడ్డు వెంట నిలిపిన ట్రాక్టర్‌ను బైక్ వెనుక నుంచి ఢీకొట్టడంతో వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ సంఘటన మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం, గోప్యానాయక్‌తండా గ్రామానికి చెందిన ముడావత్ ిపీర్యా(36) చిట్యాల మండలం నుంచి పనినిమిత్తం తన ద్విచక్ర వాహనంపై హాలియా మండలం సూరేపల్లి గ్రామానికి వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ శివారుకు చేరుకోగానే అదే గ్రామానికి చెందిన రేకా గోవింద్ అనే వ్యక్తి తన ట్రాక్టర్‌ను నార్కట్‌పల్లి– అద్దంకి రహదారిపై నిర్లక్ష్యంగా నిలిపి ఉంచాడు. ఈక్రమంలో బైక్‌పై వస్తున్న పీర్యా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.