అర్హులందరికీ పట్టాలు ఇస్తాం
తిరుమలగిరి(నాగార్జునసాగర్) : అర్హులైన రైతులందరికీ త్వరలోనే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పట్టాల పంపిణీపై స్థానిక ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పట్టాల పంపిణీకి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే.. కలెక్టర్‌ను కోరారు. త్వరలోనే అసైండ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేపడుతామని తెలిపారు. వివా దంలో లేని భూములకు సంబంధించిన పట్టాలు మొదటగా పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జెడ్పీ మాజీ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, తహసీల్దార్ అనిల్ ఉన్నారు.


