నేనూ సన్నబియ్యం అన్నం తింటా
ఎన్నో ఏళ్లుగా దొడ్డు బియ్యాన్నే తింటున్నా. మార్కెట్లో సన్నబియ్యం కొనలేక నెలకు నాకు వచ్చే ఆరు కిలోల దొడ్డు బియ్యాన్ని తినాల్సి వచ్చేది. దొడ్డు బియ్యంతో వండుకున్న అన్నం తిని పనులకు వెళ్లేదాన్ని. అక్కడ అంతా సన్నబియ్యంతో వండుకున్న అన్నం తినేవారు. నేను మాత్రం దొడ్డు అన్నం తినాలంటే కొంత ఇబ్బందిగా ఉండేది. ఈ రోజు రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ చేశారు. అందరిలాగే నేను ఈ రోజు నుంచి సన్నబియ్యంతో వండుకున్న అన్నం తింటాను. ఎంతో ఆనందంగా ఉంది.
– ఈద లక్ష్మమ్మ, పెద్దవూర


