
రాజీవ్ యువ వికాసానికి నేరుగా దరఖాస్తులు
నల్లగొండ : రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలోని 8 కార్పొరేషన్ల పరిధిలో రుణాలు పొందేందుకు ఇక నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. అయితే సర్వర్ ఇబ్బందులతో పాటు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకునే విషయంలో ఇబ్బంది ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం నేరుగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తు గడువును ఈ నెల 14 వరకు పొడిగించింది.
ఎంపీడీఓ, మున్సిపల్
కార్యాలయాల్లో..
గ్రామీణ ప్రాంతాల వారు ఎంపీడీఓ కార్యాలయాల్లోని ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పట్టణ ప్రాంతాల వారు మున్సిపల్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ల్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంటుంది. ఆయా కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను కూడా సిద్ధం చేశారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సాగనుంది. గతంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన వారు ఆయా హార్డ్ కాపీలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఫ ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
ఆయా శాఖల పరిధిలో
వచ్చిన దరఖాస్తులు ఇలా..
ఎస్సీ 7154
ఎస్టీ 3823
బీసీ 13,463
మైనార్టీ 1194
ఎంబీసీ 49
బీసీ ఫెడరేషన్ 118
క్రిిస్టియన్ మైనార్టీ 69
ఈబీసీ 437
మొత్తం 26,357